AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

These AP 7th Class Science Important Questions 5th Lesson చలనం – కాలం will help students prepare well for the exams.

AP Board 7th Class Science 5th Lesson Important Questions and Answers చలనం – కాలం

7th Class Science 5th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
విరామస్థితి అనగానేమి?
జవాబు:
ఒక వస్తువు తన పరిసరాలకు సంబంధించి తన స్థానాన్ని మార్చుకోకపోతే ఆ స్థితిని విరామస్థితి అంటారు.

ప్రశ్న 2.
చలనం అనగానేమి?
జవాబు:
ఒక వస్తువు తన పరిసరాలకు సంబంధించి తన స్థానాన్ని మార్చుకుంటూ ఉన్నట్లయితే దానిని చలనం అంటారు.

ప్రశ్న 3.
బలం అనగానేమి?
జవాబు:
వస్తువును కదిలించేది లేదా కదిలించటానికి ప్రయత్నించే దానిని బలం అంటారు.

ప్రశ్న 4.
దూరము అనగానేమి?
జవాబు:
రెండు స్థానాల మధ్య వస్తువు ప్రయాణించే మార్గం మొత్తాన్ని దూరం అంటారు.

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

ప్రశ్న 5.
దూరానికి ప్రమాణం ఏమిటి?
జవాబు:
దూరానికి ప్రాథమిక ప్రమాణం : సెం.మీ.
S.I ప్రమాణం : మీటర్

ప్రశ్న 6.
స్థానభ్రంశం అనగానేమి?
జవాబు:
రెండు ప్రదేశాల మధ్య గల అతి తక్కువ దూరాన్ని స్థానభ్రంశం అంటారు.

ప్రశ్న 7.
కాలం అనగానేమి?
జవాబు:
రెండు సంఘటనల మధ్య కొలవగలిగిన వ్యవధిని ‘కాలం’ అంటారు.

ప్రశ్న 8.
వక్రీయ చలనం అనగానేమి?
జవాబు:
స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్ర రేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటారు.

ప్రశ్న 9.
భ్రమణ అక్షము అనగానేమి?
జవాబు:
భ్రమణం చేస్తున్న వస్తువు స్థిర కేంద్రం గుండా పోయే ఊహారేఖను భ్రమణ అక్షము అంటారు.

ప్రశ్న 10.
వడికి ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
మీటర్/సె లేదా కిలోమీటర్/గంట.

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

ప్రశ్న 11.
రాకెట్ ఎలా ప్రయాణిస్తుంది?
జవాబు:
రాకెట్ చర్యా – ప్రతిచర్య సూత్రముపై ప్రయాణిస్తుంది.

7th Class Science 5th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
కాలానికి ప్రమాణాలు తెలపండి.
జవాబు:
కాలానికి ప్రాథమిక ప్రమాణం : సెకన్
AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం 1
60 సెకనులు : 1 నిమిషం
60 నిమిషాలు : 1 గంట
24 గంటలు : 1 రోజు
365 రోజులు : 1 సంవత్సరం
10 సంవత్సరాలు : 1 దశాబ్దం
10 దశాబ్దాలు : 1 శతాబ్దం
10 శతాబ్దాలు : 1 సహశాబ్దం
10 సహశ్రాభాలు : 1మిలీనియం

ప్రశ్న 2.
దూరము, స్థానభ్రంశము మధ్యగల భేదము తెలపండి.
జవాబు:

దూరము స్థానభ్రంశము
1) ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం మార్గము దూరము అవుతుంది. 1) వస్తువు ప్రయాణించగలిగిన కనిష్ట దూరము స్థానభ్రంశము
2) దీని విలువ ఎప్పుడూ సున్నా కాదు. 2) దీని విలువ సున్నా కావచ్చు.
3) దీని విలువ స్థానభ్రంశమునకు సమానం లేదా ఎక్కువ కావచ్చు. 3) దీని విలువ దూరానికి సమానం లేదా తక్కువ కావచ్చు.
4) అదిశరాశి 4) సదిశరాశి
15) ప్రమాణం : మీటరు 5) ప్రమాణాలు : మీటరు

ప్రశ్న 3.
పూర్వ కాలంలో కాలాన్ని ఎలా కొలిచేవారు?
జవాబు:
కాలాన్ని నిమిషాలలో, గంటలలో, కొలిచినట్లుగానే రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఆయనాలలో కూడా కొలుస్తూ ఉంటారు. సన్ డయల్, ఇసుక గడియారం, నీటి గడియారం మొదలైన వాటితో పూర్వపు రోజుల్లో కాలాన్ని కొలిచేవారు. మన పూర్వీకులు ప్రకృతిలో పునరావృతంగా జరిగే సంఘటనలను గుర్తించి వాటి ఆధారంగా కాలాన్ని కొలిచేవారు.

వరుసగా సంభవించే రెండు సూర్యోదయాల మధ్య కాలాన్ని ఒక రోజుగా పిలిచారు. అదేవిధంగా ఒక అమావాస్య నుంచి తరువాత అమావాస్య వరకు మధ్య గల కాలాన్ని ఒక నెలగా కొలిచారు. సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేయుటకు పట్టిన కాలాన్ని ఒక సంవత్సరంగా నిర్ణయించారు. ఒక సగటు సౌర దినం 24 గంటలు కలిగి ఉంటుంది.

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

ప్రశ్న 4.
చలనాలు ఎన్ని రకాలు అవి ఏవి?
జవాబు:
చలనాలు మూడు రకాలు అవి :

  1. స్థానాంతర చలనం
  2. భ్రమణ చలనం
  3. డోలన చలనం

ప్రశ్న 5.
స్థానాంతర చలనం అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
స్థానాంతర చలనం :
చలించే వస్తువు యొక్క అన్ని భాగాలు వస్తువుతో పాటుగా ఒక దిశలో కదులుతూ ఉన్నట్లయితే అటువంటి చలనాన్ని స్థానాంతర చలనం అంటారు.
ఉదా :
సరళరేఖ మార్గంలో కదులుతున్న బస్సు

ప్రశ్న 6.
భ్రమణ చలనం అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
చలిస్తున్న ఒక వస్తువు యొక్క అన్ని బిందువులు ఒక స్థిరకేంద్రం లేదా అక్షం చుట్టూ వక్రరేఖా మార్గంలో చరిస్తూ ఉంటే, ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు.
ఉదా : బొంగరం, ఫ్యాన్ చలనాలు

ప్రశ్న 7.
డోలన చలనం అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
ఒక స్థిరబిందువు ఆధారంగా ముందుకు వెనుకకు ఎల్లప్పుడూ ఒకే మార్గంలో ఉండే చలనాన్ని డోలన లేదా కంపన చలనం అంటారు.
ఉదా : ఊయల చలనం

ప్రశ్న 8.
సమ, అసమ చలనాల మధ్య భేదం తెలపండి.
జవాబు:

సమ చలనం అసమ చలనం
1) వస్తువు సమాన కాలవ్యవధులలో సమాన దూరంలో ప్రయాణిస్తుంది. 1) సమాన కాలవ్యవధులలో సమాన దూరం ప్రయాణించదు.
2) సమవేగం కల్గి ఉంటుంది. 2) వేగం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
3) ఉదా : గడియార ముల్లు చలనం. 3) తోటలోని సీతాకోక చిలుక చలనం.

ప్రశ్న 9.
వడి అనగానేమి? దాని ప్రమాణాలు ఏమిటి?
జవాబు:
వడి : ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని దాని వడిగా పేర్కొనవచ్చు.
వడి = ప్రయాణించిన దూరం / కాలం

ప్రమాణాలు : మీటర్/సె లేదా కిలోమీటర్ / గంట
1 కిలోమీటరు / గంట = 5/18 మీటర్/ సెకను

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

ప్రశ్న 10.
ISRO గురించి రాయండి.
జవాబు:
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC-SHAR) ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలో ఉంది. ఇది భారత అంతరిక్ష నౌకాశ్రయం . ఇది భారత ప్రభుత్వ ప్రధాన కేంద్రాలైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ (DOS)లలో ఒకటి.

రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు శాస్త్రీయ ప్రయోజనాల కొరకు విభిన్న వాహక నౌకలు/ శాటిలైట్ల కొరకు ఈ సెంటర్ కావలసిన మౌళిక సదుపాయాలను అందిస్తుంది. నేడు ప్రపంచంలోని అత్యుత్తమ అంతరిక్ష నౌకాశ్రయాలలో ఇది ఒకటి.

ప్రశ్న 11.
రాకెట్లు అనగానేమి? వాటిని ఎందుకు ప్రయోగిస్తారు?
జవాబు:
“ఒక వస్తువును ముందుకు నెట్టడానికి అవసరమైన బలాన్ని అందించే పరికరాలు రాకెట్లు, అంతరిక్ష నౌకలను, ఉపగ్రహాలను ప్రయోగించడానికి రాకెట్లను ఉపయోగిస్తారు. క్షిపణులను కూల్చడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు.”

ప్రశ్న 12.
కృత్రిమ ఉపగ్రహాల అనువర్తనాలు తెలపండి.
జవాబు:
కృత్రిమ ఉపగ్రహాల యొక్క అనువర్తనాలు: మన నిత్య జీవితంలో కృత్రిమ ఉపగ్రహాల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి,

  1. సమాచార ప్రసారం -సుదూర టెలిఫోన్ కాల్స్, ఇంటర్నెట్, టీవీ ప్రసారం వంటి కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం జియో స్టేషనరీ ఉపగ్రహాలను ఉపయోగిస్తారు.
  2. గ్రహాలు మరియు అంతరిక్షం గురించి సమాచారాన్ని సేకరించడం.
  3. భూమి యొక్క సహజ వనరుల గురించి సమాచార సేకరణ.
  4. వాతావరణ అంచనా.
  5. GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)లో.
  6. ప్రయోగాలు చేయడానికి పరికరాలను, ప్రయాణీకులను అంతరిక్షంలోకి రవాణా చేయడానికి ఉపయోగిస్తారు.

7th Class Science 5th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
రాకెట్ పనిచేయు విధానం అర్థం చేసుకోవటానికి నీవు ఏ కృత్యం నిర్వహిస్తావు?
జవాబు:

  1. రాకెట్లు ఒక వస్తువును ముందుకు నెట్టటానికి బలాన్ని అందించే పరికరాలు.
  2. వీటిని ఉపగ్రహాలు ప్రయోగించటానికి, క్షిపణులను కూల్చటానికి వాడతారు.
  3. ఇవి చర్యా – ప్రతిచర్య సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి.

కృత్యం :

  1. ఒక బెలూన్ తీసుకొని గాలితో నింపి దానికి ఒక స్ట్రా కట్టి తలక్రిందులుగా వదలండి.
  2. బెలూన్లోని గాలి స్ట్రా ద్వారా క్రిందకు వస్తుంటే ప్రతిచర్యగా బెలూన్ పైకి కదులుతుంది.
  3. అదే విధంగా రాకెట్ లోని ఇంధనాలు నుండి పొగను క్రిందకు నెడుతుంటే రాకెట్ పైకి కదులుతుంది.

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం 2

ప్రశ్న 2.
రాకెట్లలోని రకాలు తెలపండి.
జవాబు:
అవసరాలను బట్టి శాస్త్రవేత్తలు వివిధ రకాల రాకెట్లను రూపొందిస్తారు. అవి :
1) S.L.V :
శాటిలైట్ లాంచ్ వెహికల్ – ఉపగ్రహాలు ప్రయోగించటానికి

2) A.S.L.V :
ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ – తక్కువ ఖర్చుతో ఉపగ్రహాల ప్రయోగం

3) P.S.L.V :
పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ – భూ అంతర్భాగ పరిశీలన శాటిలైట్స్ కోసం

4) G.S.L.V :
జియో సినస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ – కమ్యూనికేషన్ ఉపగ్రహాల కోసం

ప్రశ్న 3.
సమచలనం, అసమచలనాలను ఉదాహరణతో వివరించండి.
జవాబు:
గోడ గడియారంలోని నిమిషాల ముల్లు యొక్క రెండు వరుస స్థానాల మధ్య కోణాన్ని కొలవండి. దాని ద్వారా ప్రతి నిమిషానికి దాని స్థానంలో వచ్చే మార్పు ఒకే విధముగా ఉంటుందని మనము పరిశీలిస్తాము. కానీ, తోటలో విహరించే సీతాకోకచిలుక సందర్భంలో అది తోటలోని ఒక పువ్వు నుంచి మరొక పువ్వు మీదకి ఎగిరేటప్పుడు దాని స్థానంలోని మార్పు స్థిరముగా ఉండదు.

గోడ గడియారంలోని నిమిషాల ముల్లు సమాన కాలవ్యవధులలో సమాన దూరాలకు కదులుతుందని, కాని సీతాకోకచిలుక సమాన కాలవ్యవధులలో అసమాన దూరాలకు కదులుతుందని మనకు అర్థమవుతుంది. కనుక గోడ గడియారంలోని నిమిషాల ముల్లు సమ చలనంలోనూ, మరియు సీతాకోకచిలుక అసమ చలనంలోనూ ఉన్నాయని మనం చెప్పవచ్చు.

AP Board 7th Class Science 5th Lesson 1 Mark Bits Questions and Answers చలనం – కాలం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. కృత్రిమ ఉపగ్రహాల ఉపయోగం
A) వాతావరణ అంచనా
B) సహజ వనరుల సమాచారం
C) సమాచార ప్రసారం
D) అన్ని
జవాబు:
D) అన్ని

2. రాకెట్ పనిచేయు సూత్రం
A) చర్య, ప్రతిచర్య
B) చలనము, కాలము
C) ఘర్షణ, బలము
D) సమచలనం
జవాబు:
A) చర్య, ప్రతిచర్య

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

3. ఒకే రాకెట్లో భారతదేశం ప్రయోగించిన అత్యధిక ఉపగ్రహాల సంఖ్య
A) 8
B) 104
C) 506
D) 12
జవాబు:
B) 104

4. SHAR ఏ జిల్లాలో ఉన్నది?
A) శ్రీహరికోట
B) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
C) అనంతపురం
D) గుంటూరు
జవాబు:
B) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు

5. ఓడోమీటరు పని
A) ప్రయాణించిన దూరం
B) వాహనవేగం
C) వాహన ఎత్తు
D) వాహన నాణ్యత
జవాబు:
A) ప్రయాణించిన దూరం

6. స్పీడోమీటరు ప్రమాణం
A) మీటర్/సె
B) కి.మీ/గం.
C) బలం/వైశాల్యం
D) సెకన్
జవాబు:
B) కి.మీ/గం.

7. తూనీగలోని చలనం
A) క్రమ చలనం
B) డోలన చలనం
C) అసమ చలనం
D) భ్రమణ చలనం
జవాబు:
C) అసమ చలనం

8. వృత్తాకార చలనం ఏ చలన రకానికి చెందుతుంది?
A) భ్రమణ చలనం
B) డోలన చలనం
C) క్రమరహిత చలనం
D) స్థానాంతర చలనం
జవాబు:
A) భ్రమణ చలనం

9. జారుడు బల్ల నుండి క్రిందకు జారుతున్న బాలుని చలనం
A) డోలన చలనం
B) క్రమ చలనం
C) స్థానాంతర చలనం
D) భ్రమణ చలనం
జవాబు:
C) స్థానాంతర చలనం

10. ఏ చలనంలో వస్తువు అక్షాన్ని ఊహించగలము?
A) భ్రమణ చలనం
B) డోలన చలనం
C) స్థానాంతర చలనం
D) అసమ చలనం
జవాబు:
A) భ్రమణ చలనం

11. కాలాన్ని కొలవటానికి ఉపయోగించునది
A) గడియారం
B) ఓడోమీటరు
C) స్కేలు
D) త్రాసు
జవాబు:
A) గడియారం

12. రెండు ప్రదేశాల మధ్యగల కనిష్ట దూరం
A) దూరము
B) స్థానభ్రంశం
C)త్వరణం
D) వేగం
జవాబు:
B) స్థానభ్రంశం

13. గూగుల్ మ్యాన్లు దేని ఆధారంగా పనిచేస్తాయి?
A) GPS
B) ISRO
C) SHAR
D) IRS
జవాబు:
A) GPS

14. హెలికాప్టర్ రెక్క భ్రమణ చలనం కల్గి ఉంటే హెలికాప్టర్ ……. కలిగి ఉంటుంది.
A) స్థానాంతర చలనం
B) డోలన చలనం
C) భ్రమణ చలనం
D) కంపన చలనం
జవాబు:
A) స్థానాంతర చలనం

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

15. వస్తువు ప్రయాణించిన దూరం దాని స్థానభ్రంశము కంటే
A) సమానం లేదా తక్కువ
B) సమానం లేదా ఎక్కువ
C) ఎల్లప్పుడూ సమానం
D) ఎల్లప్పుడూ సమానం కాదు
జవాబు:
B) సమానం లేదా ఎక్కువ

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. SHAR …………….. లో ఉన్నది.
2. దూరము – కాలము గ్రాఫ్ సరళరేఖగా ఉంటే అది …………….. సూచిస్తుంది.
3. వాహనం ప్రయాణించిన దూరం ……………. ద్వారా తెలుస్తుంది.
4. 1 కిలోమీటర్ / గంట = …………..
5. గడియారం ముల్లు ………….. ఉదాహరణ.
6. రెండు బిందువుల మధ్యగల కనిష్ట దూరం ………….
7. వీణలోని తీగ చలనాలు ………………..
8. నడుస్తున్న చక్రం …………. మరియు ………………… చలనం కల్గి ఉంటుంది.
9. తన చుట్టు తాను తిరిగే చలనం ……………
10. ఊగుడు కుర్చీలోని చలనం ……………..
11. రెండు సంఘటనల మధ్య తక్కువ సమయాన్ని ఖచ్చితంగా కొలవటం కోసం …………. వాడతారు.
12. కాలము యొక్క ప్రమాణం …………..
13. వస్తువు స్థితిని మార్చేది లేదా మార్చటానికి ప్రయత్నించేది ………..
14. GPS విశదీకరించగా ………………..
జవాబు:

  1. శ్రీహరికోట
  2. సమవడిని
  3. ఓడోమీటరు
  4. 5/18 మీటర్/సెకన్
  5. సమచలనానికి
  6. స్థానభ్రంశము
  7. కంపన చలనాలు
  8. భ్రమణ, స్థానాంతర
  9. భ్రమణ చలనం
  10. డోలన చలనం
  11. స్టాప్ వాచ్
  12. సెకన్
  13. బలం
  14. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group – B
A) బలం 1) సూర్యుని ఆధారంగా కాలం
B) స్థానభ్రంశం 2) దిశను మార్చేది
C) దూరము 3) కనిష్ట దూరం
D) గడియారం 4) స్థానాంతర చలనం
E) సడయల్ 5) ప్రయాణించిన మొత్తం మార్గం
6) కాలం

జవాబు:

Group – A Group – B
A) బలం 2) దిశను మార్చేది
B) స్థానభ్రంశం 3) కనిష్ట దూరం
C) దూరము 5) ప్రయాణించిన మొత్తం మార్గం
D) గడియారం 6) కాలం
E) సడయల్ 1) సూర్యుని ఆధారంగా కాలం

2.

Group – A Group – B
A) రంగులరాట్నం 1) కి.మీ/గంట
B) ఊయల 2) కి.మీ.
C) గడియారం 3) ఫ్యాన్
D) స్పీడోమీటరు 4) వీణలోని తీగెల కంపనం
E) ఓడోమీటరు 5) సయల్
6) కదులుతున్న సైకిల్

జవాబు:

Group – A Group – B
A) రంగులరాట్నం 3) ఫ్యాన్
B) ఊయల 4) వీణలోని తీగెల కంపనం
C) గడియారం 5) సయల్
D) స్పీడోమీటరు 2) కి.మీ.
E) ఓడోమీటరు 1) కి.మీ/గంట

మీకు తెలుసా?

→ కాలాన్ని నిమిషాలలో, గంటలలో, కొలిచినట్లుగానే రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఆయనాలలో కూడా కొలుస్తూ ఉంటారు. సన్ డయల్, ఇసుక గడియారం, నీటి గడియారం మొదలైన వాటితో పూర్వపు రోజుల్లో కాలాన్ని కొలిచేవారు. మన పూర్వీకులు ప్రకృతిలో పునరావృతంగా జరిగే సంఘటనలను గుర్తించి వాటి ఆధారంగా కాలాన్ని కొలిచేవారు. వరుసగా సంభవించే రెండు సూర్యోదయాల మధ్య కాలాన్ని ఒక రోజుగా పిలిచారు. అదేవిధంగా ఒక అమావాస్య నుంచి తరువాత అమావాస్య వరకు మధ్య గల కాలాన్ని ఒక నెలగా కొలిచారు. సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేయుటకు పట్టిన కాలాన్ని ఒక సంవత్సరంగా నిర్ణయించారు. ఒక సగటు సౌర దినం 24 గంటలు కలిగి ఉంటుంది.

AP 7th Class Science Important Questions Chapter 5 చలనం – కాలం

→ వృత్తాకార చలనం, భ్రమణ చలనంలో ఒక ప్రత్యేక తరహా కలది. ఈ చలనంలో వస్తువుకు, భ్రమణ అక్షానికి మధ్య దూరము స్థిరముగా ఉంటుంది.