AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

These AP 7th Class Science Important Questions 6th Lesson విద్యుత్ will help students prepare well for the exams.

AP Board 7th Class Science 6th Lesson Important Questions and Answers విద్యుత్

7th Class Science 6th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
విద్యుత్ వలయంలో ప్రధానంగా ఉండవలసినవి ఏమిటి?
జవాబు:
విద్యుత్ వలయంలో విద్యుత్ జనకం, విద్యుత్ పరికరము, తీగెలు ఉంటాయి.

ప్రశ్న 2.
ఘటం అనగానేమి?
జవాబు:
విద్యుత్ ను ఉత్పత్తి చేయు పరికరం ఘటము. ఇది రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది.

ప్రశ్న 3.
విద్యుత్ ఘటంలో ఏమేమి ఉంటాయి?
జవాబు:
విద్యుత్ ఘటంలో 1) విద్యుత్ విశ్లేష్యం 2) ఎలక్ట్రోడ్ లు ఉంటాయి.

ప్రశ్న 4.
బ్యాటరీ ఎలా ఏర్పడుతుంది?
జవాబు:
అనేక ఘటాల కలయిక వలన బ్యాటరీ ఏర్పడుతుంది.

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

ప్రశ్న 5.
నిర్జల ఘటము యొక్క సౌలభ్యం ఏమిటి?
జవాబు:
నిర్జల ఘటములో ద్రవాలు ఉండవు. కావున వీటిని సులభంగా మరొక చోటుకు తీసుకొని పోగలము.

ప్రశ్న 6.
విద్యుత్ బల్బులను పగలగొట్టరాదు. ఎందుకు?
జవాబు:
విద్యుత్ బల్బులు వాయువులతో నింపబడి ఉంటాయి. వాటిని పగలగొట్టినపుడు పేలిపోయి ప్రమాదం కల్గిస్తాయి.

ప్రశ్న 7.
M.C.B అనగానేమి?
జవాబు:
మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్‌ను M.C.B అంటారు.

ప్రశ్న 8.
M.C.Bల పని ఏమిటి?
జవాబు:
M.C.B లు విద్యుత్ వలయంలో ఫ్యూజ్ లా పని చేస్తాయి.

ప్రశ్న 9.
విద్యుత్ వలయంలో పరికరాలను ఎలా కలుపుతారు?
జవాబు:
విద్యుత్ వలయంలో పరికరాలను విద్యుత్ తీగెలతో కలుపుతారు.

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

ప్రశ్న 10.
విద్యుత్ వలయాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్ పరికరాల అమరికను విద్యుత్ వలయం అంటారు.

ప్రశ్న 11.
వలయ పటాలు అనగానేమి?
జవాబు:
విద్యుత్ వలయంలోని విద్యుత్ పరికరాల అమరికను చూపే పటాలను వలయ పటాలు అంటారు.

ప్రశ్న 12.
స్విచ్ ఉపయోగం ఏమిటి?
జవాబు:
వలయాన్ని మూయటానికి, తెరవటానికి స్విచ్ ఉపయోగపడును.

ప్రశ్న 13.
విద్యుత్ వలయంలో పరికరాల అమరిక తెలపండి.
జవాబు:
ఘటం → ధనధృవం → తీగ → బల్బు → తీగ → స్విచ్ → తీగ → ఋణధృవం

ప్రశ్న 14.
వలయంలో స్విచ్ ను ఎక్కడ కలపాలి?
జవాబు:
వలయంలో స్విచ్ ను ఏ ప్రదేశంలోనైనా ఘటములో ఏ దిశలోనైనా కలపవచ్చు.

ప్రశ్న 15.
వలయంలో పరికరాలను ఎన్ని రకాలుగా కలపవచ్చు?
జవాబు:
వలయంలో పరికరాలను రెండు రకాలుగా కలపవచ్చు. అవి :

  1. శ్రేణి సంధానం
  2. సమాంతర సంధానం.

ప్రశ్న 16.
అలంకరణ కోసం బల్బులను ఏ పద్ధతిలో కలుపుతారు?
జవాబు:
అలంకరణ కోసం బల్బులను శ్రేణి పద్దతిలో కలుపుతారు.

ప్రశ్న 17.
ఫిలమెంట్ కలిగిన విద్యుత్ పరికరాలు ఏమిటి?
జవాబు:
విద్యుత్ కుక్కర్లు, హీటర్లు, గీజర్లు, డ్రయర్లలలో ఫిలమెంట్స్ ఉంటాయి.

ప్రశ్న 18.
విద్యుత్ ఫిలమెంట్లను దేనితో తయారు చేస్తారు?
జవాబు:
విద్యుత్ ఫిలమెంట్లను నిక్రోమ్ తో తయారు చేస్తారు.

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

ప్రశ్న 19.
ఫ్యాన్ ఎలా పని చేస్తుంది?
జవాబు:
విద్యుదయస్కాంత ఫలితం వలన ఫ్యాన్ తిరుగుతుంది.

7th Class Science 6th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
విద్యుత్ ఘటంలో విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది?
జవాబు:
ఘటం అనేది విద్యుత్తును ఉత్పత్తి చేయడం కొరకు ఉపయోగించే పరికరం. దీనిలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి.

  1. విద్యుత్ విశ్లేష్యం – ఇది విద్యుత్తును ప్రవహింప చేస్తుంది.
  2. ఎలక్ట్రోడులు – ఒక ఘటంలో రెండు ఎలక్ట్రోడులు ఉంటాయి.

ఒకటి ధన ఎలక్ట్రోడ్, దీనిని ఆనోడ్ అని మరియు రెండోది రుణ ఎలక్ట్రోడ్ దీనిని కాథోడ్ అని పిలుస్తారు. ” విద్యుత్ విశ్లేష్యంను ఎలక్ట్రోడ్లు తాకినప్పుడు, ఘటం లోపల రసాయనిక చర్య జరిగి విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా ఇది రసాయనిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. విద్యుత్ వలయాల్లో విద్యుత్ తీగలను ఎలక్ట్రోతో సంధానం చేసినప్పుడు వాటి గుండా విద్యుత్ ప్రవహిస్తుంది.

ప్రశ్న 2.
విద్యుత్ ఘటాలలోని రకాలను తెలపండి.
జవాబు:
విద్యుత్ ఘటాలలో రకాలు కలవు. అవి :

  1. నిర్ణల ఘటం
  2. లిథియం ఘటము
  3. బటన్ సెల్స్
  4. క్షార ఘటము

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 1

ప్రశ్న 3.
వివిధ ఘటాలను అవి ఉపయోగించే పరికరాలను తెలపండి.
జవాబు:

ఘటము ఉపయోగించే పరికరము
1. నిర్జల ఘటము టార్చిలైట్, గోడ గడియారం, రేడియో
2. లిథియం ఘటము మొబైల్ ఫోన్స్, లాప్ టాప్లు
3. బటన్ సెల్స్ రిస్ట్ వాచ్, లేజర్ లైట్
4. క్షార ఘటము విద్యుత్ వలయాలు, ప్రయోగశాలనందు

ప్రశ్న 4.
బల్బులలోని రకాలు తెలపండి.
జవాబు:
బల్బులలో చాలా రకాలు కలవు అవి :

  1. సాధారణ బల్బు
  2. ఫ్లోరసెంట్ బల్బు
  3. CFL బల్పు
  4. LED బల్బు

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 2

ప్రశ్న 5.
సాధారణ బల్బు ఎలా పనిచేస్తుంది?
జవాబు:
సాధారణ బల్బులను ఉపయోగించినప్పుడు అది కాంతి మరియు ఉష్ణము ఇస్తుంది. దీని వల్ల విద్యుత్ దుర్వినియోగం అవుతుంది. దీనిని అరికట్టుటకు సాధారణ బల్బుకు బదులుగా ట్యూబ్ లైట్, CFL, LED లను ఉపయోగించవచ్చు. కారణం ఇవి సాధారణ బల్బు కంటే తక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తాయి.

ప్రశ్న 6.
LED బల్బులు గురించి రాయండి.
జవాబు:
LED లో రెండు కొనలు ఉంటాయి. పొడవైనది ధనధృవంగానూ, పొట్టి కొన ఋణ ధృవంగానూ పని చేస్తుంది. మొదటితరం LEDలు ఎరుపు రంగు కాంతిని మాత్రమే ఉత్పత్తి చేసేవి, అయితే నేటి LEDలు ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగు వంటి వివిధ కాంతులను వెలువరించగలవు. వీటిని మోబైల్ ఫోన్లు, లాప్టాప్లు , టి.విలు, రిమోట్లలో ఉపయోగిస్తారు.

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

ప్రశ్న 7.
బెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి తెలపండి.
జవాబు:
1752లో ఫ్రాంక్లిన్ మెరుపుల వలన విద్యుత్ ఏర్పడుతుందని చూపించుటకు గాలిపట ప్రయోగాన్ని చేశారు. మెరుపులతో కూడిన తుఫాన్లో ఈ ప్రయోగాన్ని చేశారు. విద్యుత్ ప్రవహించుట కొరకు ఒక తాళం చెవిని గాలి పటం దారానికి కట్టి ప్రయోగం నిర్వహించారు.

ప్రశ్న 8.
విద్యుత్ పరికరాలపై ఉండే నక్షత్రాల గుర్తులు దేనిని సూచిస్తాయి?
జవాబు:
వివిధ విద్యుత్ పరికరాలపై నక్షత్రపు గుర్తులు ఉంటాయి. ఈ నక్షత్రాల సంఖ్య విద్యుత్ పరికరం ఆదాచేసే విద్యుత్ సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఎక్కువ నక్షత్రాలు కలిగిన విద్యుత్ పరికరాలు తక్కువ విద్యుత్ ని వినియోగించుకుంటాయి. కావున ఎక్కువ నక్షత్రాలు కలిగిన విద్యుత్ పరికరాలను ఎంచుకోవడం మంచిది.

ప్రశ్న 9.
విద్యుత్ ఫ్యూజ్ గురించి రాయండి.
జవాబు:
విద్యుత్ పరికరాలగుండా అధిక పరిమాణంలో విద్యుత్ ప్రవహించినప్పుడు అవి ఎక్కువగా వేడెక్కి, కాలిపోయే ప్రమాదం ఉన్నది. ఇలాంటి ప్రమాదాల నుండి విద్యుత్ పరికరాలను కాపాడడం కోసం విద్యుత్ ఫ్యూజ్ ను ఉపయోగిస్తారు.

విద్యుత్ ఫ్యూజ్ ను పింగాణి (సిరామిక్)తో తయారు చేస్తారు. ఫ్యూజ్ తీగను కలుపుతూ ఫ్యూజ్ లో రెండు బిందువులు ఉంటాయి. ఇది అధికంగా ఉష్టాన్ని గ్రహించినప్పుడు కరిగిపోతుంది. కావున ఓవర్ లోడ్ అయినప్పుడు ఫ్యూజ్ కరిగి పోవుట వలన వలయము తెరవబడి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. ఈ విధంగా ఫ్యూజు విద్యుత్ పరికరాలను రక్షిస్తుంది.
AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 3 AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 4

ప్రశ్న 10.
వలయ పటాల ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:

  1. విద్యుత్ వలయాన్ని రేఖాత్మకంగా చూపే పటాన్ని వలయపటం అంటారు.
  2. విద్యుత్ పరికరాలు ఏ విధంగా కలపబడ్డాయో వలయ పటం తెలుపును.
  3. ఎలక్ట్రిషియన్లు, ఇంజనీర్లు వాస్తవ వలయాలను రూపొందించుకొనటంలో వలయ పటాలు సహాయపడతాయి.

ప్రశ్న 11.
సాధారణ విద్యుత్ వలయం పటం గీయండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 5

ప్రశ్న 12.
తెరిచి ఉన్న, మూసి ఉన్న విద్యుత్ వలయాల పటాలు గీయండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 6

ప్రశ్న 13.
శ్రేణి సంధానము గురించి రాయండి.
జవాబు:

  1. మొదటి పరికరం యొక్క రెండవ కొనను, రెండవ పరికరం యొక్క మొదటి కొనకు కలిపినట్లయితే అటువంటి సంధానమును శ్రేణి సంధానం అంటారు.
  2. శ్రేణి సంధానంలో విద్యుత్ ప్రవాహమార్గం ఒకటి ఉంటుంది.
  3. ఈ సంధానంలో ఒక పరికరాన్ని తొలగించినా లేదా అది పనిచేయటం ఆగినా వలయం తెరువబడుతుంది.

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 7

ప్రశ్న 14.
సమాంతర సంధానం గురించి రాయండి.
జవాబు:

  1. పరికరాలన్నింటి మొదటి కొనను ఒక బిందువుకు రెండవ కొనలన్నింటిని మరొక బిందువుకు కలిపినట్లయితే దానిని సమాంతర సంధానం అంటారు.
  2. ఈ పద్దతిలో విద్యుత్ ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో ప్రయాణిస్తుంది.
  3. వలయం నుండి ఒక పరికరం తొలగించినా మిగిలిన వలయాలు పని చేస్తుంటాయి.

ప్రశ్న 15.
శ్రేణి, సమాంతర సంధానాల మధ్య భేదాలు తెలపండి.
జవాబు:

శ్రేణి సంధానం సమాంతర సంధానం
1. పరికరాలన్నీ ఒకే వరుసలో కలుపుతారు. 1. పరికరాలను ఎక్కువ వలయాలలో కలుపుతారు.
2. ఒకే వలయం ఉంటుంది. 2. ఒకటి కంటే ఎక్కువ వలయాలు ఉంటాయి.
3. ధన ధృవాన్ని మరో పరికరం ఋణ ధృవానికి కలుపుతారు. 3. ధన ధృవాన్ని ఒక బిందువుకు, ఋణ ధృవాలన్నీ ఒక బిందువుకు కలుపుతారు.
4. ఒక పరికరం పనిచేయకపోయినా వలయం తెరుచుకుంటుంది. 4. ఒక పరికరం పనిచేయకపోయినా మిగిలిన వలయాలు పని చేస్తాయి.
5. ఉదా : అలంకరణ కొరకు ఈ పద్ధతి వాడతారు. 5. గృహాలలో విద్యుత్ పరికరాలకు ఈ పద్ధతి వాడతారు.

ప్రశ్న 16.
విద్యుదయస్కాంత ఫలితం అనగానేమి?
జవాబు:
తీగ గుండా ప్రవహించే విద్యుత్ వలన తీగ చుట్టూ ఏర్పడే అయస్కాంత బలాన్ని విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ఫలితాలు అని అంటారు. వాటి ద్వారా విద్యుత్ ప్రసారం జరగటం వల్ల అయస్కాంతంలాగా ప్రవర్తించే పరికరాలను విద్యుదయస్కాంతాలు అంటారు.

ప్రశ్న 17.
విద్యుదయస్కాంత ఫలితంగా పనిచేసే పరికరాలు ఏమిటి?
జవాబు:
ఫ్యాన్, విద్యుత్ గంట, విద్యుత్ మోటారు, స్పీకర్లు, మిక్సర్లు, గ్రైండర్లు, మొబైల్ ఫోన్లు, మెటల్ డిటెక్టర్లు, విద్యుదయస్కాంత ఫలితంగా పని చేస్తాయి.

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

ప్రశ్న 18.
విద్యుత్ ఘాతము సంభవించు సందర్భాలు ఏమిటి?
జవాబు:

  1. తడి చేతులతో స్విచ్ వేయటం.
  2. ప్లగ్ పిన్నులను స్విచ్ ఆన్లో ఉంచి తొలగించటం.
  3. విద్యుత్ బంధకాలు లేకుండా తీగలతో పనిచేయటం.
  4. స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు బల్బు మార్చటం.

ప్రశ్న 19.
ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వ్యక్తిని రక్షించుటకు తక్షణమే ఏమి చేయాలి?
జవాబు:

  1. ఎలక్ట్రిక్ షాక్ తగిలిన వెంటనే విద్యుత్ సరఫరా ఆపాలి.
  2. సరఫరా నిలపటం సాధ్యం కానప్పుడు, ఎండిన కర్రతో దూరంగా నెట్టాలి.
  3. శ్వాస ఆడకుంటే కృత్రిమ శ్వాస అందించాలి.
  4. హృదయ స్పందన ఆగితే కార్డియో పల్మనరీ రిసు స్టేషన్ (CPR) చేయాలి.

ప్రశ్న 20.
ISI మార్కు అంటే ఏమిటి?
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 8

  1. ఇండియన్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూషన్ మార్కును ISI మార్కు అంటారు.
  2. ఇది వస్తువుల నాణ్యతను, భద్రతను సూచిస్తుంది.
  3. విద్యుత్ పరికరాల విషయంలో ISI మార్కు ఉన్న వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

7th Class Science 6th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
విద్యుత్ పరికరాల సంకేతాల అవసరం ఏమిటి? కొన్ని విద్యుత్ పరికరాల సంకేతాలు తెలపండి.
జవాబు:
పటంగా గీయవలసిన విద్యుత్ వలయం పెద్దదిగా ఉండి అనేక విద్యుత్ పరికరాలను కలిగి ఉన్నప్పుడు వాటి వాస్తవ చిత్రాలలో వలయ పటాలు గీయడం కష్టమవుతుంది. కావున విద్యుత్ పరికరాల యొక్క ప్రామాణికమైన సంకేతాలను ఉపయోగించి వలయ పటాలను గీస్తారు. ఇక్కడ కొన్ని విద్యుత్ పరికరాల సంకేతాలు ఇవ్వబడ్డాయి. AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 9

AP Board 7th Class Science 6th Lesson 1 Mark Bits Questions and Answers విద్యుత్

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. ఘటము అనునది
A) విద్యుత్ వాహకం
B) విద్యుత్ ఉష్ణఫలితం
C) విద్యుత్ జనకం
D) విద్యుత్ కాంతిఫలితం
జవాబు:
C) విద్యుత్ జనకం

2. నిర్జల ఘటములో ధన ధృవము
A) జింక్ రేకు
B) కార్బన్ పొడి
C) కార్బన్ కడ్డీ
D) అమ్మోనియం
జవాబు:
C) కార్బన్ కడ్డీ

3. లా ట్లలో వాడే బ్యాటరీ
A) నిర్జల ఘటము
B) లిథియం ఘటము
C) బటన్ సెల్స్
D) క్షారఘటం
జవాబు:
B) లిథియం ఘటము

4. విద్యుత్ పరికరాలను రక్షించునది.
AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 10
జవాబు:
C

5.AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 11
ఈ పటంలోని సంధానము
A) శ్రేణి
B) సమాంతర
C) మిశ్రమ
D) ఏదీకాదు
జవాబు:
A) శ్రేణి

6. వలయంలో ఏ పరికరాన్ని ఘటమునకు ఏ దిశలో నైనా కలపవచ్చు?
A) బ్యాటరీ
B) బల్బు
C) స్విచ్
D) స్పీకర్
జవాబు:
C) స్విచ్

7. క్రిందివానిలో భిన్నమైనది?
A) రూమ్ హీటర్
B) ఇస్త్రీ పెట్టె
C) ఫ్యాన్
D) కాఫీ కెటిల్
జవాబు:
C) ఫ్యాన్

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

8. బులెట్ ట్రైన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
A) ఉష్ణఫలితం
B) అయస్కాంత ఫలితం
C) వాహకత్వం
D) నిరోధము
జవాబు:
B) అయస్కాంత ఫలితం

9. ఒక యూనిట్ విద్యుత్ అనగా
A) 1 KTH
B) 1 GW
C) 1 MWH
D) 1 NWH
జవాబు:
A) 1 KTH

10. నాణ్యతకు సింబల్
A) IAS
B) IPS
C) ISI
D) IBA
జవాబు:
C) ISI

11. 1.50 కల్గిన మూడు ఘటాలను సమాంతర పద్దతిలో కలిపిన వలయంలో ఫలిత విద్యుత్ విలువ
A) 1.5M
B) 3.V
C) 4.5V
D) 5.5V
జవాబు:
A) 1.5M

12. 1.5V కల్గిన మూడు ఘటాలను సమాంతర పద్దతిలో కలిపిన వలయంలో బల్బు ప్రకాశవంతం
A) పెరుగుతుంది
B) తగ్గుతుంది
C) మారదు
D) చెప్పలేము.
జవాబు:
C) మారదు

13. 1.5 V ఘటాలు రెండింటిని శ్రేణి పద్ధతిలో కలిపిన బల్పు ప్రకాశవంతం
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
A) పెరుగును

14. 1.5 Vఘటానికి 5 బల్బులను శ్రేణి పద్ధతిలో కలిపిన బల్బు ప్రకాశవంతం
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
B) తగ్గును

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

15. 1.5 Vఘటానికి 5 బల్బులను సమాంతర పద్దతిలో కలిపిన బల్బు ప్రకాశవంతం
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
C) మారదు

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. ఘటంలో విద్యుత్ను ఉత్పత్తి చేయు రసాయనం ………………..
2. ఘటంలో ఎలక్ట్రోడ్ల సంఖ్య …………….
3. నిర్జల ఘటంలోని విద్యుత్ విశ్లేష్యం ………….
4. నిర్జల ఘటంలోని ఋణధృవం ……………
5. రీచార్జ్ చేయు ఘటము …………………
6. ఎక్కువ నక్షత్రాలు కలిగిన విద్యుత్ పరికరాలు ………………… విద్యుత్ను వినియోగించుకొంటాయి.
7. ప్రమాదాల నుండి విద్యుత్ పరికరాలను కాపాడునది ……………………
8. ఫ్యూజ్ కాలిపోయినపుడు విద్యుత్ వలయం ……………
9. ఆధునిక ఫ్యూజ్ లు ………….
10. విద్యుత్ పరికరాల అమరికను చూపే పటాలను ………….. అంటారు.
11. అలంకరణ దీపాలను ………… సంధానంలో కలుపుతారు.
12. ఇంటిలోని విద్యుత్ పరికరాలను ……………. సంధానంలో కలుపుతారు.
13. ఒకటి కంటే ఎక్కువ ఘటాలను శ్రేణి పద్దతిలో కలిపి నపుడు బల్బు ప్రకాశవంతం ……………..
14. బ్యాటరీ దీర్ఘకాలం పనిచేయటం కోసం ఘటాలను …………… పద్ధతిలో కలుపుతారు.
15. విద్యుత్ ఉష్ణ ఫలితము కోసం ………… తీగను వాడతారు.
16. విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంతంగా మారే పరికరాలు ……………………
17. ఎలక్ట్రో మాగ్నెటిక్ రైలు ………….. సూత్రం
ఆధారంగా పని చేస్తుంది. …………..
18. CPRను విపులీకరించండి …………………..
19. ISIను విపులీకరించండి ………………….
20. 1 కిలోవాట్ = ………..
21. ……………… సంధానంలో విద్యుత్ ఒకటి కన్నా
ఎక్కువ వలయాలలో ప్రవహిస్తుంది.
22. ఘటం …………. ని విద్యుత్ శక్తిగా మార్చుతుంది.
23. క్రేన్ …………….. ఫలితంగా పనిచేస్తుంది.
24. వలయం తెరవటానికి, మూయటానికి ……………… తోడ్పడుతుంది.
25. విద్యుత్ తీగెలను ముట్టుకొనేటప్పుడు చేతికి ………. ధరించాలి.
జవాబు:

  1. విద్యుత్ విశ్లేష్యం
  2. 2
  3. అమ్మోనియం క్లోరైడ్
  4. జింక్ పాత్ర
  5. లిథియం ఘటము
  6. తక్కువ
  7. ఫ్యూజ్
  8. తెరవబడుతుంది
  9. MCB
  10. వలయపటాలు
  11. శ్రేణి
  12. సమాంతర
  13. పెరుగుతుంది
  14. సమాంతర
  15. నిక్రోమ్
  16. విద్యుదయస్కాంతం
  17. విద్యుదయస్కాంత
  18. కార్డియో పల్మనరీ రిసు స్టేషన్
  19. ఇండియన్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూట్
  20. 1000 వాట్లు
  21. సమాంతర
  22. రసాయనశక్తి
  23. విద్యుదయస్కాంత
  24. స్విచ్
  25. గ్లోవ్స్

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1. AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్ 12
జవాబు:
3, 1, 2, 5, 4

2.

Group – A Group – B
A) మైకేల్ ఫారడే 1) విద్యుత్ ఉష్ణ ఫలితం
B) ఆయిస్టడ్ 2) ట్రాన్స్ఫ ర్మర్
C) కాఫీ కెటిల్ 3) విద్యుదయస్కాంతాలు
D) విద్యుత్ గంట 4) రిస్ట్ వాచ్
E) బటన్ సెల్స్ 5) విద్యుత్ అయస్కాంత ఫలితం
6) విద్యుత్ వలయం

జవాబు:

Group – A Group – B
A) మైకేల్ ఫారడే 2) ట్రాన్స్ఫ ర్మర్
B) ఆయిస్టడ్ 3) విద్యుదయస్కాంతాలు
C) కాఫీ కెటిల్ 1) విద్యుత్ ఉష్ణ ఫలితం
D) విద్యుత్ గంట 5) విద్యుత్ అయస్కాంత ఫలితం
E) బటన్ సెల్స్ 4) రిస్ట్ వాచ్

మీకు తెలుసా?

1752లో ఫ్రాంక్లిన్ మెరుపుల వలన విద్యుత్ ఏర్పడుతుందని చూపించుటకు గాలిపట ప్రయోగాన్ని చేశారు. మెరుపులతో కూడిన తుఫాన్లో ఈ ప్రయోగాన్ని చేశారు. విద్యుత్ ప్రవహించుట కొరకు ఒక తాళం చెవిని గాలి పటం దారానికి కట్టి ప్రయోగం నిర్వహించారు.

LED లో రెండు కొనలు ఉంటాయి. పొడవైనది ధనధృవంగానూ, పొట్టి కొన ఋణ ధృవంగానూ పని చేస్తుంది. మొదటితరం LEDలు ఎరుపు రంగు కాంతిని మాత్రమే ఉత్పత్తి చేసేవి, అయితే నేటి LEDలు ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగు వంటి వివిధ కాంతులను వెలువరించగలవు. వీటిని మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, టి.విలు, రిమోట్లలో ఉపయోగిస్తారు.

AP 7th Class Science Important Questions Chapter 6 విద్యుత్

వలయంలో స్విచ్ ను ఏ ప్రదేశంలోనైనా అమర్చవచ్చు అలాగే ఘటమునకు ఏ దిశలోనైనా కలుపవచ్చు.

ఆయిర్ స్టడ్ అనే శాస్త్రవేత్త విద్యుత్తు ప్రవహిస్తున్న తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని కనుగొన్నారు. విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకుని విద్యుదయస్కాంతాలు తయారుచేయబడ్డాయి.

మైకేల్ ఫారడే శాస్త్రవేత్త ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటూ ఇటూ కదిలించినపుడు తీగచుట్ట యందు విద్యుత్ జన్మిస్తుందని గుర్తించాడు. దీని ఆధారంగా డైనమో / జనరేటర్ మరియు ట్రాన్స్ఫర్మరను కనుగొన్నాడు.