AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

These AP 7th Class Science Important Questions 7th Lesson మొక్కలలో ప్రత్యుత్పత్తి will help students prepare well for the exams.

AP Board 7th Class Science 7th Lesson Important Questions and Answers మొక్కలలో ప్రత్యుత్పత్తి

7th Class Science 7th Lesson 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
జీవులు తమను పోలిన కొత్త జీవులను ఉత్పత్తి చేయగలగటాన్ని ప్రత్యుత్పత్తి అంటారు.

ప్రశ్న 2.
ప్రత్యుత్పత్తి ప్రయోజనం ఏమిటి?
జవాబు:
జీవులు తమ మనుగడను కొనసాగించటానికి ప్రత్యుత్పత్తి తోడ్పడుతుంది.

ప్రశ్న 3.
ప్రత్యుత్పత్తిలోని రకాలు తెలుపండి.
జవాబు:
ప్రత్యుత్పత్తి రెండు రకాలు. అవి :

  1. లైంగిక ప్రత్యుత్పత్తి,
  2. అలైంగిక ప్రత్యుత్పత్తి

ప్రశ్న 4.
లైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
మొక్కలలో విత్తనాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 5.
అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి?
జవాబు:
విత్తనాలు లేకుండా మొక్కలలో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.

ప్రశ్న 6.
విత్తనాల ద్వారా ఏ మొక్కలు ప్రత్యుత్పత్తి చేస్తాయి?
జవాబు:
వేప, మామిడి, నేరేడు వంటి మొక్కలు విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 7.
ఏమొక్కలు విత్తనాలు లేకుండా ప్రత్యుత్పత్తి చేస్తాయి?
జవాబు:
అరటి, మల్లె, గులాబి వంటి మొక్కలు విత్తనాలు లేకుండా ప్రత్యుత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 8.
ఏ మొక్కలు లైంగిక మరియు అలైంగిక పద్ధతుల ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తాయి?
జవాబు:
అరటి, గులాబి వంటి మొక్కలలో లైంగిక మరియు అలైంగిక పద్ధతుల ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తాయి.

ప్రశ్న 9.
కొన్ని అలైంగిక విధానాలు తెలపండి.
జవాబు:
ద్విదావిచ్ఛిత్తి, మొగ్గ తొడగటం, సిద్ధ బీజాలు వంటివి కొన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు.

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 10.
తులసి మొక్కలను ఎలా పెంచుతారు?
జవాబు:
తులసి మొక్కలను విత్తనాలు నాటటం ద్వారా పెంచుతారు.

ప్రశ్న 11.
అసంపూర్ణ పుష్పాలు అనగానేమి?
జవాబు:
నాలుగు వలయాలు లేని పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు.

ప్రశ్న 12.
సంపూర్ణ పుష్పాలు అనగానేమి?
జవాబు:
నాలుగు వలయాలు ఉన్న పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు.

ప్రశ్న 13.
ఏకలింగ పుష్పాలు అనగానేమి?
జవాబు:
కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటి కలిగిన పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు.

ప్రశ్న 14.
ద్విలింగ పుష్పాలు అనగానేమి?
జవాబు:
అండకోశము మరియు కేసరావళి రెండూ కలిగిన పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.

ప్రశ్న 15.
మగ పుష్పాలు అనగానేమి?
జవాబు:
కేసరావళి మాత్రమే కలిగి ఉన్న పుష్పాలను మగ పుష్పాలు అంటారు.

ప్రశ్న 16.
స్త్రీ పుష్పాలు అనగానేమి?
జవాబు:
అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను స్త్రీ పుష్పాలు అంటారు.

ప్రశ్న 17.
పుష్పంలోని ఏ భాగం ఫలంగా అభివృద్ధి చెందుతుంది?
జవాబు:
అండాశయం ఫలదీకరణ తర్వాత ఫలంగా అభివృద్ధి చెందుతుంది.

ప్రశ్న 18.
పరాగ సంపర్కం అనగానేమి?
జవాబు:
పరాగ రేణువులు పరాగ కోశం నుండి కీలాగ్రం చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు.

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 19.
విత్తన వ్యాప్తి అనగానేమి?
జవాబు:
విత్తనాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి విస్తరించడాన్ని విత్తన వ్యాప్తి అంటారు.

7th Class Science 7th Lesson 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి భేదాలు తెలపండి.
జవాబు:

లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి
1. విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. 1. విత్తనాలు ఏర్పడవు.
2. పరాగ సంపర్కం జరుగుతుంది. 2. పరాగ సంపర్కం జరగదు.
3. ఫలదీకరణ జరుగును. 3. ఫలదీకరణ జరగదు.
4. అధిక శాతం జీవులలో కనిపిస్తుంది.
ఉదా : మామిడి, కొబ్బరి
4. తక్కువ శాతం జీవులలో ఉంటుంది.
ఉదా : రణపాల, అరటి

ప్రశ్న 2.
వివిధ శాఖీయ వ్యాప్తి విధానాలను ఉదాహరణలతో వివరించండి.
జవాబు:

శాఖీయ వ్యాప్తి భాగము ఉదాహరణ
1. పిలకలు కాండము అరటి
2. కణుపులు కాండము చెరకు
3. పిలక మొక్కలు (సక్కర్స్) కాండము చామంతి
4. కన్నులు కాండము బంగాళదుంప
5. ఛేదనాలు వేర్లు క్యారెట్, చిలకడ దుంప
6. పత్రమొగ్గలు ఆకు రణపాల
7. అంట్లు కాండము మల్లె, జాజి
8. అంటుకట్టటం కాండము మామిడి, గులాబి

ప్రశ్న 3.
నేల అంట్లు అనగానేమి? వాటిని ఎలా ఉత్పత్తి చేస్తారు?
జవాబు:
నేల అంటు :
ఈ పద్దతి మల్లె, జాజి, బౌగైన్విలియా, స్ట్రాబెర్రి మొదలైన పాకే కాండంతో ఉండే మొక్కలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది.

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 1
నేల అంట్లు :

  1. నేలకు దగ్గరగా పెరిగే కొమ్మలతో నేల అంట్లు కడతారు.
  2. కాండంపై ఒక చోట బెరడు తొలగిస్తారు.
  3. బెరడు తొలగించిన భాగాన్ని మట్టిలోకి ఉంచి మట్టి కప్పి పైన బరువు ఉంచుతారు.
  4. నెలరోజుల్లో నేలలో ఉన్న కొమ్మ నుండి వేర్లు వస్తాయి.
  5. తరువాత తల్లిమొక్క నుండి వేరు చేసి పాతుకోవాలి.

ప్రశ్న 4.
పుష్పంలో ప్రత్యుత్పత్తి భాగాలు గురించి రాయండి.
జవాబు:
పుష్పంలో ప్రత్యుత్పత్తి భాగాలు : ఒక పువ్వులోని నాలుగు వలయాలలో లోపలి రెండు వలయాలు విత్తనాలు ఏర్పడటంలో పాల్గొంటాయి. కాబట్టి, మనం కేసరావళి మరియు అండకోశాలను పుష్పం యొక్క ప్రత్యుత్పత్తి భాగాలుగా గుర్తించగలం. కేసరావళి పురుష ప్రత్యుత్పత్తి భాగం మరియు అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం.

కేసరాలు యొక్క ఉబ్బిన తలలు పరాగకోశాలు. వీటిలో పుప్పొడి రేణువులు ఉంటాయి. అవి పరాగ కోశంలో ఏర్పడినవి. పుష్పాల నుండే పండ్లు అభివృద్ధి చెందుతాయి.

ప్రశ్న 5.
స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం మధ్య గల భేదాలు తెలపండి.
జవాబు:

స్వపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం
1. కేసరావళి నుండి ఉత్పత్తి అయిన పరాగ రేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరతాయి. 1. పరాగ రేణువులు మరొక పువ్వులోని కీలాగ్రాన్ని చేరతాయి.
2. పువ్వు వికసించకుండానే స్వపరాగ సంపర్కం జరగవచ్చు. 2. పరపరాగ సంపర్కానికి పుష్పం తప్పనిసరిగా వికసించాలి.
3. పరాగ సంపర్క కారకాలు ఉండవచ్చు లేకపోవచ్చు. 3. పరాగ సంపర్క కారకాలు తప్పనిసరిగా ఉండాలి.
4. కొత్త లక్షణాలకు అవకాశాలు తక్కువ. 4. కొత్త లక్షణాలకు అవకాశాలు ఎక్కువ.

ప్రశ్న 6.
మొక్కల్లోని పరాగ సంపర్కం కారకాలు గురించి వివరించండి.
జవాబు:
పుప్పొడి రేణువులు కీటకాలు, పక్షులు, జంతువులు, గాలి మరియు నీటి ద్వారా పుష్పాలకు చేరుకుంటాయి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు వంటి కీటకాలు, తేనె పిట్టలు, గబ్బిలాలు, చీమలు మకరందాన్ని వెతుక్కుంటూ పువ్వులను సందర్శిస్తాయి. కీటకాలు పువ్వుల వద్దకు వచ్చినప్పుడు పుప్పొడి రేణువులు వాటి కాళ్ళకు అతుక్కుని ఉంటాయి. ఈ కీటకాలు మరో పువ్వును చేరగానే పుప్పొడి దాని కీలాగ్రంపై పడుతుంది.

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 7.
మొక్కల్లోని ఫలదీకరణ విధానం వివరించండి.
జవాబు:
కీలాగ్రంపైన పడిన పుప్పొడి రేణువులు మొలకెత్తుతాయి. పుప్పొడి రేణువుల నుండి పరాగ నాళం ఏర్పడుతుంది. పుప్పొడి నాళం కీలాగ్రం నుండి అండాశయంలోని అండాల వరకు ప్రయాణిస్తుంది. అండకోశంలో ఫలదీకరణం మరియు సంయుక్తబీజం ఏర్పడటం జరుగుతుంది. ఈ సంయుక్తబీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది.

ప్రశ్న 8.
విత్తన వ్యాప్తి అనగానేమి? అందలి రకాలు ఏమిటి?
జవాబు:
విత్తనాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి విస్తరించటాన్ని విత్తన వ్యాప్తి అంటారు. సాధారణంగా విత్తన వ్యాప్తి:

  1. గాలి ద్వారా,
  2. నీటి ద్వారా,
  3. జంతువుల ద్వారా,
  4. పక్షుల ద్వారా,
  5. మనుష్యుల ద్వారా,
  6. పేలటం ద్వారా జరుగుతుంది.

ప్రశ్న 9.
విత్తన వ్యాప్తి ప్రయోజనం ఏమిటి?
జవాబు:

  1. విత్తన వ్యాప్తి వలన మొక్కలు అనువైన ప్రదేశాలలో తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి.
  2. విత్తన వ్యాప్తి వలన వాటి మధ్య నేల, నీరు కొరకు పోటీ తగ్గుతుంది.

ప్రశ్న 10.
ద్విలింగ, ఏకలింగ పుష్పాల భేదాలు తెలపండి.
జవాబు:

ద్విలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలు
1. పుష్పంలో నాలుగు వలయాలు ఉంటాయి. 1. పుష్పంలో మూడు వలయాలు ఉంటాయి.
2. సంపూర్ణ పుష్పాలు. 2. అసంపూర్ణ పుష్పాలు.
3. రెండు రకాల ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. 3. పురుష లేదా స్త్రీ ఏదో ఒక ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి.
4. ఉదా : మందార, ఉమ్మెత్త. 4. ఉదా : బీర, కాకర

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 11.
స్త్రీ, పురుష పుష్పాల మధ్య భేదాలు తెలపండి.
జవాబు:

పురుష పుష్పం స్త్రీ పుష్పం
1. కేసరావళి ఉంటుంది. 1. కేసరావళి ఉండదు.
2. అండకోశం ఉండదు. 2. అండకోశం ఉంటుంది.
3. అధిక సంఖ్యలో ఉంటాయి. 3. పురుష పుష్పాలతో పోల్చితే తక్కువ.
4. ఒకే మొక్క మీద స్త్రీ, పురుష పుష్పాలు ఉండవచ్చు. ఉదా : బీర, కాకర 4. స్త్రీ, పురుష పుష్పాలు వేరువేరు మొక్కలపై ఉండవచ్చు.

7th Class Science 7th Lesson 8 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
అంటుకట్టడం అనగానేమి? అంటుకట్టే విధానం వివరించండి.
జవాబు:
అంటుకట్టుట :
కోరుకున్న లక్షణాలు ఉన్న మొక్క భాగాలను వేరొక మొక్కకు జోడించి పెంచడాన్ని అంటుకట్టుట అంటారు. ఈ పద్ధతిలో పైన పెంచే మొక్కను ‘సయాన్’ అని క్రింది ఉన్న మొక్కను స్టాక్ అంటారు.

విధానం :

  1. స్టాక్, సయాన్లుగా వాడే రెండు మొక్కలకు కాండంపై ఎదురెదురుగా బెరడు తొలగించాలి.
    AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 2
  2. బెరడు తొలగించిన భాగాలను కలుపుతూ పురికొసతో తగినంత బిగుతుగా కట్టాలి. పైన పాలిథీన్ పేపర్ తో కప్పి కట్టాలి.
  3. ఒక నెల తరువాత బొమ్మలో చూపిన విధంగా స్టాక్ మొక్కలో పైభాగం, సయాన్ మొక్కలో క్రింది భాగాలను కత్తిరించాలి.
  4. మరొక నెలరోజుల్లో స్టాక్ మొక్కకు సయాన్ అతుక్కొని పెరుగుతుంది. స్టాక్ పైన కొత్తగా వచ్చే కొమ్మలు తొలగిస్తే సయాన్ పెరుగుతుంది.

ప్రశ్న 2.
పుష్పం యొక్క నిర్మాణం వర్ణించండి.
జవాబు:
పుష్పం అనేది మొక్క యొక్క లైంగిక భాగం.

పువ్వును కాండానికి కలిపే ఆకుపచ్చని భాగాన్ని “కాడ” అంటారు. ఈ కాడ కొద్దిగా ఉబ్బిన తలలాంటి భాగమైన పుష్పాసనాన్ని కలిగి ఉంటుంది.

రక్షక పత్రాలు :
ఆకుపచ్చని గిన్నెలా కనిపిస్తున్న నిర్మాణంలో ఒకదానితో ఒకటి కలిసిపోయి అంతర్గత భాగాలను కప్పుతూ ఉన్న ఆకు వంటి భాగాలు రక్షకపత్రాలు. వీటిని సమిష్టిగా రక్షకపత్రావళి అని పిలుస్తారు. (మొదటి వలయం)

ఆకర్షక పత్రాలు :
తెలుపు లేక ఆకర్షణీయ రంగులు ఉన్న రేకలను ఆకర్షక పత్రాలు అని అంటారు. వీటిని సమిష్టిగా ఆకర్షక పత్రావళి అని పిలుస్తారు. (రెండవ వలయం)

కేసరాలు :
రేకలకు జతచేయబడిన మృదువైన పొడవైన నిర్మాణాలను కేసరాలు అంటారు. కేసరాలన్నింటిని కలిపి కేసరావళి అని పిలుస్తారు (మూడవ వలయం). ఇది పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగం (0). ప్రతి కేసరం పైన ఉబ్బినట్టుగా ఉండే నిర్మాణాన్ని పరాగకోశం అని అంటారు.

అండకోశం :
పుష్పాసనంపై ఉన్న ఉబ్బిన నిర్మాణాన్ని అండాశయం అంటారు. ఇది ఒక సన్నని నాళంలాంటి నిర్మాణమైన కీలముగా కొనసాగుతుంది. దాని చివర జిగటగా ఉండే పూసలాంటి నిర్మాణం కీలాగ్రం ఉంటుంది. వీటన్నింటిని కలిపి అండకోశం (0) అంటారు. ఇది పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం.
AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 3

ప్రశ్న 3.
పుష్పంలోని వలయాలను పటం రూపంలో చూపించండి.
జవాబు:
AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 4

ప్రశ్న 4.
విత్తన వ్యాప్తి కారకాలు, వాటి ఉదాహరణలు, లక్షణాలు తెలపండి.
జవాబు:

వ్యాప్తి కారకాలు ఉదాహరణలు లక్షణాలు
1. గాలి ద్వారా గడ్డి చామంతి, జిల్లేడు తేలికగా ఉంటాయి. ఈనెలు కలిగి ఉంటాయి.
2. నీటి ద్వారా తామర, కొబ్బరి గట్టిగా, గుండ్రని విత్తనాలు ఉంటాయి.
3. జంతువుల ద్వారా తేలుకొండి కాయ, వేప ముళ్ళు కలిగి ఉంటాయి. తినదగిన రుచి కలిగి ఉంటాయి.
4. పక్షుల ద్వారా ఆముదం, మర్రి పురుగులను పోలి ఉంటాయి. తినతగిన విధంగా రుచిగా ఉంటాయి.
5. మనుషుల ద్వారా టమోటా, చెరకు ఆహారంగా ఉపయోగపడతాయి. రుచిగా ఉంటాయి.
6. పేలటం ద్వారా బెండ, మినుము కాయ పగిలి దూరంగా విత్తనాలు వెదజల్లపడతాయి.

ప్రశ్న 5.
ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి మధ్య భేదాలు రాయండి.
జవాబు:

రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి
1. పుష్పంలోని మొదటి వలయం. 1. పుష్పంలోని రెండవ వలయం.
2. ఆకుపచ్చ రంగులో ఉంటాయి. 2. ఆకర్షవంతమైన రంగులలో ఉంటాయి.
3. పుష్పాన్ని మొగ్గ దశలో రక్షిస్తుంది. 3. కీటకాలను ఆకర్షిస్తుంది.
4. పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. 4. పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

ప్రశ్న 6.
కేసరావళి మరియు అండకోశము మధ్య భేదాలు రాయండి.
జవాబు:

కేసరావళి అండకోశము
1. పుష్పంలోని మూడవ వలయం. 1. ఇది పుష్పంలోని నాల్గవ వలయం.
2. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. 2. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు.
3. వీటి సంఖ్య ఎక్కువ. 3. సాధారణంగా ఒక్కటే ఉంటుంది.
4. పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తుంది. 4. అండాలను ఉత్పత్తి చేస్తుంది.
5. కేసర దండం, పరాగకోశం అనే భాగాలు ఉంటాయి. 5. అండాశయం, కీలం, కీలాగ్రం అనే భాగాలు ఉంటాయి.
6. పరాగ రేణువులు పరాగ సంపర్కంనకు తోడ్పడతాయి. 6. ఫలదీకరణ తరువాత అండాశయం ఫలంగా మారుతుంది.

AP Board 7th Class Science 7th Lesson 1 Mark Bits Questions and Answers మొక్కలలో ప్రత్యుత్పత్తి

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

సరియైన జవాబు సూచించు అక్షరమును బ్రాకెట్లో రాయండి.

1. క్రింది వానిలో ప్రత్యేకమైనది
A) విచ్ఛిత్తి
B) మొగ్గ తొడగటం
C) సిద్ధ బీజాలు
D) విత్తనాలు
జవాబు:
D) విత్తనాలు

2. కిందివానిలో శాఖీయ భాగం కానిది
A) ఆకు
B) పువ్వు
C) కాండం
D) వేరు
జవాబు:
B) పువ్వు

3. అరటిలో శాఖీయ వ్యాప్తి విధానం
A) పిలకలు
B) కణుపులు
C) కన్నులు
D) దుంపలు
జవాబు:
A) పిలకలు

4. మల్లె, జాజి, స్ట్రాబెర్రీలలో శాఖీయ విధానం
A) నేల అంట్లు
B) నేల కణుపులు
C) అంటు తొక్కటం
D) కొమ్మ అంట్లు
జవాబు:
A) నేల అంట్లు

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

5. ఒకే మొక్కపై వేరు వేరు రకాలు పండించటానికి తోడ్పడే విధానం
A) నేల అంట్లు
B) అంటు కట్టుట
C) కణుపులు
D) సంకరణం
జవాబు:
B) అంటు కట్టుట

6. సంపూర్ణ పుష్పంలోని మొత్తం వలయాల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
C) 4

7. పుష్పంలోని వెలుపలి వలయం
A) ఆకర్షక పత్రాలు
B) రక్షక పత్రాలు
C) కేసరావళి
D) అండకోశము
జవాబు:
B) రక్షక పత్రాలు

8. క్రింది వానిలో పుష్ప వలయం కానిది
A) అండాశయం
B) కేసరావళి
C) ఆకర్షక పత్రావళి
D) రక్షక పత్రావళి
జవాబు:
A) అండాశయం

9. అండకోశంలో భాగము కానిది
A) అండాశయం
B) కీలం
C) కీలాగ్రం
D) కేసరావళి
జవాబు:
D) కేసరావళి

10. అసంపూర్ణ పుష్పాలలో వలయాల సంఖ్య
A) 2
B) 3
C) 4
D) 1
జవాబు:
B) 3

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

11. అసంపూర్ణ పుష్పాలు ఏకలింగ పుష్పాలు
A) సత్యం
B) అసత్యం
C) నిర్ధారించలేము
D) నిర్ధారించగలము
జవాబు:
A) సత్యం

12. అసంపూర్ణ పుష్పాలలో లోపించునవి
A) కేసరావళి
B) అండకోశము
C) కేసరావళి మరియు అండకోశము
D) కేసరావళి లేదా అండకోశము
జవాబు:
D) కేసరావళి లేదా అండకోశము

13. స్త్రీ, పురుష పుష్పాలు వేరువేరు మొక్కలపై ఉండటానికి ఉదాహరణ
A) బొప్పాయి
B) బీర
C) కాకర
D) సొర
జవాబు:
A) బొప్పాయి

14. ద్విలింగ పుష్పాలన్ని సంపూర్ణ పుష్పాలు
A) సత్యం
B) అసత్యం
C) నిర్ధారించలేము
D) అన్నివేళలా కాదు.
జవాబు:
A) సత్యం

15. పుష్పాలలో ప్రత్యుత్పత్తి వలయాలు
A) 3 మరియు 5
B) 3 మరియు 4
C) 1 మరియు 2
D) 1 మరియు 3
జవాబు:
B) 3 మరియు 4

16. విత్తనాలు దేనికోసం పోటీ పడతాయి?
A) స్థలం
B) నీరు
C) ఎండ
D) అన్ని
జవాబు:
D) అన్ని

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

17. పరాగనాళం దేని నుండి ఏర్పడుతుంది?
A) పరాగ రేణువు
B) అండాశయం
C) కీలం
D) కీలాగ్రం
జవాబు:
A) పరాగ రేణువు

18. పరాగ సంపర్క కారకాలు
A) గాలి
B) నీరు
C) జంతువులు
D) అన్ని
జవాబు:
D) అన్ని

19. ఫలదీకరణ తరువాత అభివృద్ధి చెందే నిర్మాణం
A) కేసరావళి
B) కీలం
C) అండాశయం
D) కీలాగ్రం
జవాబు:
C) అండాశయం

20. స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడునది
A) సంయుక్త బీజం
B) అండాశయం
C) కేసరావళి
D) ఆకర్షక పత్రాలు
జవాబు:
A) సంయుక్త బీజం

21. ముళ్ళు కలిగిన విత్తనాలు దేని ద్వారా వ్యాపిస్తాయి?
A) గాలి
B) నీరు
C) జంతువులు
D) వర్షము
జవాబు:
C) జంతువులు

22. తేలికగా, చిన్నవిగా ఉండే విత్తనాలు దేనిద్వారా వ్యాపిస్తాయి?
A) గాలి
B) నీరు
C) మనుషులు
D) జంతువులు
జవాబు:
A) గాలి

23. పుష్పంలో పుష్పభాగాలన్నిటికి ఆధారాన్నిచ్చేది
A) పుష్పవృంతం
B) పుష్పాసనం
C) అండాశయం
D) రక్షకపత్రావళి
జవాబు:
B) పుష్పాసనం

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

24. క్రింది వానిలో పుష్పభాగాలు 3 వలయాలలో ఉండే పుష్పం
A) మందార
B) ఉమ్మెత్త
C) లిల్లీ
D) దోస
జవాబు:
C) లిల్లీ

25. దోస పుష్పం
A) అసంపూర్ణ పుష్పం
B) ఏకలింగ పుష్పం
C) A మరియు B
D) సంపూర్ణ పుష్పం
జవాబు:
C) A మరియు B

26. ఉమ్మెత్త పుష్పం
A) సంపూర్ణ పుష్పం
B) ద్విలింగ పుష్పం
C) A మరియు B
D) ఏకలింగ పుష్పం
జవాబు:
B) ద్విలింగ పుష్పం

27. క్రింది వానిలో ఏకలింగ పుష్పం ఏది?
A)దోస
B) సౌర
C) కాకర
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

28. పుష్పంలో పురుష బీజాలను ఉత్పత్తి చేసేది
A) అండాశయం
B) పరాగకోశం
C) పరాగరేణువులు
D) అండాలు
జవాబు:
C) పరాగరేణువులు

29. పుష్పంలో ఫలంగా మారే భాగం
A) అండాశయం
B) అండం
C) పరాగకోశం
D) మొత్తం పుష్పం
జవాబు:
A) అండాశయం

30. పరాగ సంపర్కం అనగా
A) పరాగరేణువులు కీలాన్ని చేరటం
B) పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటం
C) పరాగరేణువులు అండాశయాన్ని చేరటం
D) పరాగరేణువులు అండాన్ని చేరటం
జవాబు:
B) పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటం

31. ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక మొక్కలోని వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరటాన్ని ఏమంటారు?
A) ఆత్మపరాగ సంపర్కం
B) పరపరాగ సంపర్కం
C) స్వపరాగ సంపర్కం
D) భిన్న పరాగ సంపర్కం
జవాబు:
B) పరపరాగ సంపర్కం

32. కన్ను ఉండేది
A) బంగాళదుంప
B) చిలకడదుంప
C) క్యా రెట్
D) బీట్ రూట్
జవాబు:
A) బంగాళదుంప

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

33. మొక్కలలోని లైంగిక భాగం
A) పత్రం
B) పుష్పం
C) కాండం
D) వేరు
జవాబు:
B) పుష్పం

34. పుష్పంలోని 3వ వలయంలో ఉండే భాగం
A) రక్షక పత్రాలు
B) ఆకర్షక పత్రాలు
C) అండకోశం
D) కేసరావళి
జవాబు:
D) కేసరావళి

35. బంగాళదుంపపై గల గుంటలను పరిశీలించమని రమేష్ ని వాళ్ళ టీచర్ అడిగారు. ఈ పరిశీలనలోని ఉద్దేశ్యం
A) బంగాళదుంపలో రూపాంతరాన్ని చదువడం
B) బంగాళదుంప కొలతలు కొలవడం
C) బంగాళదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి
D) బంగాళదుంపలను నిల్వచేయు విధానం తెలుసుకొనడం
జవాబు:
C) బంగాళదుంపలో శాఖీయ ప్రత్యుత్పత్తి

36. AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 5 ఈ పటం పుష్పంలోని ఏవలయాన్ని సూచిస్తుంది?
A) మొదటి వలయం
B) రెండవ వలయం
C) మూడవ వలయం
D) నాల్గవ వలయం
జవాబు:
B) రెండవ వలయం

37. AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 6 ఈ పటం సూచించునది
A) రక్షక పత్రావళి
B) ఆకర్షక పత్రావళి
C) అండ కోశం
D) కేసరావళి
జవాబు:
B) ఆకర్షక పత్రావళి

38. AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 7 ఈ విత్తనం ఈ క్రింది వానిలో దేని ద్వారా వ్యాపిస్తుంది?
A) గాలి
B) నీరు
C) జంతువులు
D) పక్షులు
జవాబు:
A) గాలి

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

39. AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి 8 ప్రక్క పటంలో X, Y లు సూచించునవి
A) X : సయాన్ Y : స్టాక్
B) X : స్టాక్ Y : సయాన్
C) X : నేలంటు Y : గాలి అంటు
D) పైవేవీకాదు
జవాబు:
A) X : సయాన్ Y : స్టాక్

II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.

1. కొత్త జీవులను ఉత్పత్తి చేయు ప్రక్రియ …………………
2. విత్తనాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తి ………….
3. చెరకులో శాఖీయవ్యాప్తి విధానం …………….
4. అంటుకట్టే పద్ధతిలో పైన పెరిగే భాగం ………….
5. సయాను ఆధారాన్ని ఇచ్చే మొక్క ………………
6. పువ్వును కాండానికి కలిపే నిర్మాణం ……………
7. కాడ మీద ఉబ్బిన తలం ……………..
8. పుష్పాసనంపై ఉబ్బిన నిర్మాణం ………………
9. పుష్పంలోని నాల్గవ వలయం ………………….
10. సంపూర్ణ పుష్పంలో వలయాల సంఖ్య ………….
11. కేసరావళి మాత్రమే కలిగిన అసంపూర్ణ పుష్పం …………
12. అండకోశం మాత్రమే కలిగిన అసంపూర్ణ పుష్పం ………………….
13. …………….. వంటి మొక్కలలో స్త్రీ, పురుష పుష్పాలు ఒకే మొక్క మీద ఉంటాయి.
14. పరాగ రేణువులు కీలాగ్రం చేరడాన్ని …………..
15. ………….. సంపర్కంలో క్రొత్త లక్షణాలు ఏర్పడతాయి.
16. రెండు వేరు వేరు మొక్కల మధ్య జరిగే పరాగ సంపర్కం …………….
17. స్త్రీ, పురుష సంయోగబీజాల కలయిక ……………
18. పరాగ సంపర్కంలో పుప్పొడి రేణువులు ………… పై పడతాయి.
19. మొలకెత్తిన పుప్పొడి రేణువులు ………………. ఏర్పరుస్తాయి.
20. ఫలదీకరణ తర్వాత ………. ఫలంగా మారుతుంది.
21. సంయుక్త బీజం ………….. వలన ఏర్పడును.
22. సంయుక్త బీజం అభివృద్ధి చెంది …………… గా మారుతుంది.
23. విత్తనాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి విస్తరించడాన్ని ……………. అంటారు.
జవాబు:

  1. ప్రత్యుత్పత్తి
  2. లైంగిక ప్రత్యుత్పత్తి
  3. కణుపులు
  4. సయాన్
  5. స్టాక్
  6. కాడ
  7. పుష్పాసనం
  8. అండాశయం
  9. అండకోశం
  10. నాలుగు
  11. పురుష పుష్పం
  12. స్త్రీ పుష్పం
  13. బీర, కాకర
  14. పరాగ సంపర్కం
  15. పరపరాగ
  16. పరపరాగ సంపర్కం
  17. ఫలదీకరణం
  18. కీలం
  19. పరాగ నాళం
  20. అండాశయం
  21. ఫలదీకరణ
  22. పిండము
  23. విత్తన వ్యాప్తి

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

గ్రూపు – A గ్రూపు – B
A) సంపూర్ణ పుష్పాలు 1) కేసరావళి
B) అసంపూర్ణ పుష్పాలు 2) అండకోశము
C) పురుష పుష్పాలు 3) కేసరావళి మరియు అండకోశం
D) స్త్రీ పుష్పాలు 4) మూడు వలయాలు
E) ద్విలింగ పుష్పాలు 5) నాలుగు వలయాలు
6) పుష్పాసనం

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) సంపూర్ణ పుష్పాలు 5) నాలుగు వలయాలు
B) అసంపూర్ణ పుష్పాలు 4) మూడు వలయాలు
C) పురుష పుష్పాలు 1) కేసరావళి
D) స్త్రీ పుష్పాలు 2) అండకోశము
E) ద్విలింగ పుష్పాలు 3) కేసరావళి మరియు అండకోశం

2.

గ్రూపు – A గ్రూపు – B
A) గాలి 1) బెండ, గురివింద
B) నీరు 2) వ్యవసాయం
C) జంతువులు 3) తేలికపాటి విత్తనాలు
D) మనుషులు 4) గుండ్రంగా, బరువైన
E) పేలటం 5) కండ కలిగి రుచిగా
6) మొలకెత్తటం

జవాబు:

గ్రూపు – A గ్రూపు – B
A) గాలి 3) తేలికపాటి విత్తనాలు
B) నీరు 4) గుండ్రంగా, బరువైన
C) జంతువులు 5) కండ కలిగి రుచిగా
D) మనుషులు 2) వ్యవసాయం
E) పేలటం 1) బెండ, గురివింద

మీకు తెలుసా?

అరటిపండులో విత్తనాలు చూశారా? అరటిపండులో విత్తనాలు ఉంటాయని గులాబీ మొక్కలలో ఎర్రటి పండ్లు ఉంటాయని, నందివర్తనం, మందారాలలో కూడా విత్తనాలు ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా! మానవ ప్రమేయం లేకుండా అడవులలో పెరిగే అరటి, గులాబి మొక్కలకు విత్తనాలు ఉంటాయి. మనచుట్టూ పెరుగుతున్న అరటి, గులాబి మొక్కలకు విత్తనాలు ఉండవు. కారణం ఏమిటో తెలుసా ? మన పూర్వీకులు అడవిలో పెరుగుతున్న ఈ మొక్కల విత్తనాలతోనే మొక్కలను పెంచారు. చాలా తరాల పాటు అనుకూలమైన లక్షణాలు గల మొక్కలుగా వీటిని పెంచేందుకు చేసిన ప్రయత్స ఫలితంగా ఇవి విత్తనాలు లేని మొక్కలుగా మారిపోయాయి.

AP 7th Class Science Important Questions Chapter 7 మొక్కలలో ప్రత్యుత్పత్తి

ఒకే మొక్కకు పీచెస్, ఆఫ్రికాట్, ప్లము, చెర్రీలు, నెహ్రిన్లు వంటి 40 రకాల పండ్లు కాయటం గురించి మీరు ఊహించగలరా? ఈ రకమైన మొక్కలు గ్రాఫ్టింగ్ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు.