Students can go through AP Board 7th Class Science Notes 12th Lesson నేల మరియు నీరు to understand and remember the concept easily.
AP Board 7th Class Science Notes 12th Lesson నేల మరియు నీరు
→ భూమిపై ఉపరితలమును మట్టి లేదా మృత్తిక అంటారు.
→ మృత్తికను గూర్చిన శాస్త్రీయ అధ్యయనాన్ని పెడాలజీ అంటారు.
→ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నేలపై ఆధారపడి ఉంటుంది.
→ సహజ వాతావరణ ప్రక్రియ అయిన శైథిల్యం ద్వారా నేల ఏర్పడుతుంది.
→ మాతృశిల నుండి ‘శైథిల్య ప్రక్రియ’ ద్వారా మృత్తిక ఏర్పడడాన్ని ‘పీడోజెనెసిస్’ అని అంటారు.
→ నేలను నిలువుగా త్రవ్వగా కనిపించే అడ్డు పొరలుగా ఏర్పడిన అంశాలన్నింటిని నేల స్వరూపం అంటారు.
→ మృత్తికలోని ప్రతి పొర ఒక నిర్దిష్టమైన వర్ణం, ఆకృతి, లోతు, రసాయన నిర్మాణంలో తేడాను కలిగి ఉంటుంది. వీటినే క్షితిజాలు అంటారు.
→ నేలను ప్రధానంగా ఇసుక, బంకమట్టి, తేమ నేలలుగా వర్గీకరించవచ్చును.
→ మట్టి రేణువుల పరిమాణం, మట్టిలోని నిల్వ సామర్థ్యం మరియు నీరు ఇంకే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
→ మట్టిలో చేరగలిగిన నీటి ద్రవ్యరాశికి పొడి మట్టి ద్రవ్యరాశికి, మధ్యనున్న నిష్పత్తిని నేలలోని తేమ శాతం అంటారు.
→ నేల నీటిని పీల్చుకోవడం, ఆ నీరు నేల పొరల ద్వారా కిందికి కదలటాన్ని పెర్కొలేషన్ అంటారు.
→ రైతులు వారి పంట దిగుబడులను పెంచుకోవడానికి ‘భూసార పరీక్షలు’ ఉపయోగపడతాయి.
→ నేలపై సారవంతమైన పొర కొట్టుకొని పోవడాన్ని ‘మృత్తిక క్రమక్షయం ‘ లేదా ‘నేలకోత’ అంటారు.
→ అన్ని జీవులకు నీరు అత్యంత అవసరం. అది లేకుంటే జీవితం లేదు.
→ మనకు అందుబాటులో ఉన్న జల వనరులు కేవలం 1% మాత్రమే ఉపయోగించదగిన మంచి నీరు.
→ భూమిలోనికి నీరు ఇంకే ప్రక్రియను ఇన్ ఫిల్టరేషన్ అంటారు.
→ భూగర్భ జల ఉపరితలాన్ని భూగర్భ జల మట్టం అంటారు.
→ నీటి మట్టానికి కింద గట్టి రాతి పొరల మధ్య భూగర్భ జలాలు నిలవ చేయబడి ఉంటాయి. వీటిని ఆక్విఫర్లు అంటారు.
→ గృహాల నుండి మరియు పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ జలాలను మురుగు నీరు అంటారు.
→ మురుగు నీటిని ‘మురుగు శుద్ధి కేంద్రాలలో’ శుద్ధి చేస్తారు.
→ మురుగు నీటి శుద్ధి ప్రక్రియలో మూడు దశలు కలవు. అవి భౌతిక, జీవ సంబంధ మరియు రసాయన ప్రక్రియలు.
→ నీటిని భవిష్యత్తు తరాల కొరకు సంరక్షించుకోవలెను.
→ నియమాలను పాటించడం ద్వారా నీటిని సంరక్షించవచ్చు. అవి పునఃవృద్ధి (Recharge) పునర్వినియోగం (Reuse) పునరుద్ధరించడం (Revive) మరియు తగ్గించటం (Reduce).
→ నేల స్వరూపం : నేలను నిలువుగా తవ్వగా కనిపించే అడ్డుపొరలుగా ఏర్పడిన అంశాలన్నింటిని నేల స్వరూపం అంటారు.
→ బంకమట్టి నేలలు : నల్లని నేలలను బంకమట్టి నేలలు అంటారు. ఇవి అధిక నీటి సామర్థ్యం కల్గి గాలి చొరబడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
→ మృత్తిక తేమ : నేలలో ఉన్న నీటి పరిమాణాన్ని మృత్తిక తేమ అంటారు.
→ నేల కోత : నేలపై పొర కొట్టుకొని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం లేదా నేలకోత అంటారు.
→ పంట మార్పిడి : ఒక పంట తరువాత, అదే పంటను కాకుండా ఇతర పంటలను పండించే పద్ధతిని పంట మార్పిడి అంటారు. ఇది నేల సారాన్ని పరిరక్షిస్తుంది.
→ నేల సంరక్షణ : నేలపై పొర కొట్టుకొని పోకుండా కాపాడుకొనే విధానాన్ని నేల సంరక్షణ అంటారు.
→ జల సంరక్షణ : నీటి వనరుల వినియోగం శ్రద్ధ తీసుకొని పరిరక్షించుకోవడాన్ని జల సంరక్షణ అంటారు.
→ మురుగు నీరు : గృహ, పరిశ్రమలలో అవసరాలకు వాడుకొని వదిలిన నీటిని మురుగు నీరు అంటారు.
→ కలుషితాలు : పరిసరాలలో చేరే హానికర పదార్థాలను కలుషితాలు అంటారు.
→ ద్రవ వ్యర్థాలు : ద్రవస్థితిలో చేరే హానికర పదార్థాలను ద్రవ వ్యర్థాలు అంటారు. ఇవి జల కాలుష్యానికి దారి తీస్తాయి.
→ ఘన వ్యర్థాలు : ఘన స్థితిలో ఉండే వ్యర్థాలు, భూమిని, నీటిని కలుషితం చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తూంటాయి.
→ చెక్ డ్యాము : వాలు ప్రాంతాలలో నీటి ప్రవాహానికి అడ్డుగా కట్టే గోడలను చెక్ డ్యామ్ లు అంటారు. ఇవి నీటిని ఇంకింప చేయటంతో పాటు నేలకోతను నివారిస్తాయి.
→ వాయు బ్యాక్టీరియాలు : నీటిలోని వ్యర్థాలను కుళ్ళబెట్టే బ్యాక్టీరియా. ఇవి సేంద్రియ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి నీటిని శుద్ధి చేయటంలో తోడ్పడతాయి.
→ బార్ స్క్రీన్లు : నీటిలోని పెద్ద పరిమాణంలోని ఘన వ్యర్థాలను నిరోధించటానికి బార్ స్క్రీన్లు వాడతారు. ఇవి వడపోత పరికరంలా పనిచేస్తాయి.
→ భూగర్భజలం : భూమి లోపలి పొరలలో ఉన్న నీటిని భూగర్భజలం అంటారు. దీనినే మనం బోర్ బావులు, బావులు ద్వారా వాడుకొంటూ ఉంటాము.
→ నీటి మట్టం : భూగర్భజలం పరిమాణం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారిపోతూ ఉంటుంది. ఒక ప్రాంతంలోని నీటి పరిమాణాన్ని నీటి మట్టంగా వ్యవహరిస్తారు.
→ ఆక్విఫర్ : సాధారణంగా భూగర్భజలాలు నీటిమట్టానికి క్రింద గట్టి రాతి పొరల మధ్య నిల్వ చేయబడతాయి. వాటిని ఆక్విఫర్లు అంటారు. బావులు, బోరు బావులు, చేతి పంపులు ఈ ఆక్విఫర్ నుండే నీటిని పొందుతారు.