AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు

Students can go through AP Board 7th Class Science Notes 11th Lesson దారాలు – దుస్తులు to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 11th Lesson దారాలు – దుస్తులు

→ మేరీనో జాతి గొర్రెలు ఉన్ని కోసం పెంచే గొర్రెలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి.

→ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రములలో డెక్కనీ జాతి గొర్రెలు మాంసం మరియు ఉన్ని కోసం పెంచే జాతులలో ముఖ్యమైనవి.

→ ప్రధానంగా గొర్రెల ద్వారా మన రాష్ట్రంలో ఉన్నిని పొందుతున్నాము.

→ ‘అంగోరా’ జాతి మేక ఉన్నిని ఇచ్చే మేకలలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనవి.

→ ‘అంగోరా’ మేక నుండి లభించే ఉన్నిని మొహయిర్ అంటారు.

→ ఫ్లీస్‌తో ఊలు దారం తయారు చేస్తారు.

AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు

→ జంతువుల నుండి ఊలును దాని క్రింద ఉన్న పలుచని చర్మపు పొరతో పాటుగా పదునైన బ్లేడ్ లేదా కత్తెర వంటి పరికరాలతో తొలగించే పద్ధతిని ఉన్ని కత్తిరించుట లేదా షీరింగ్ అంటారు.

→ జంతువుల ఉన్ని నుండి ఊలు దారాలు తయారు చేసే ప్రక్రియలో ఉన్నిని శుభ్రపరచడం లేదా స్కోరింగ్, నాణ్యమైన ఉన్నిని వేరు చేయడం లేదా సార్టింగ్, రంగు వేయడం, కార్డింగ్, దువ్వడం, స్పిన్నింగ్ దశలు ఉంటాయి.

→ ఉన్నిని మెలిపెడుతూ పొడవైన దారంగా చేయడాన్ని స్పిన్నింగ్ అంటారు.

→ ఊలు దుస్తులను అల్లడం లేదా నేయడం ద్వారా తయారు చేస్తారు.

→ పట్టు మోత్ జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. అవి- గ్రుడ్డు, డింభకం, ప్యూపా లేదా కకూన్ మరియు ప్రాఢదశ.

→ డింభకాలు లేదా గొంగళి పురుగులను పట్టు పురుగులు అని అంటారు.

→ పట్టు దారంతో ఏర్పడిన గుళిక వంటి నిర్మాణమును కకూన్ లేదా పట్టు కాయ అంటారు.

→ పట్టు దారం పొందటం కోసం పట్టు పురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం లేదా సెరీ కల్చర్ అంటారు.

→ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టు సంవర్ధనంలో రెండవ స్థానంలో ఉన్నది.

→ మల్బరీ మాత్రమే కాకుండా టసర్, ఈరీ, మూగా అనేవి భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో లభ్యమయ్యే వివిధ పట్టు రకాలు.

→ సిప్లింగ్ ప్రక్రియలలో కకూన్లను ఆవిరిలో ఉంచడం ద్వారా దానిలో ఉన్న డింభకమును చంపుతారు.

AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు

→ కకూన్ల నుండి పట్టు దారం తీయడాన్ని రీలింగ్ అంటారు.

→ ఒక కకూన్ నుండి 500-1500 మీటర్ల దారం వస్తుంది.

→ పట్టును అందించే మోత్ యొక్క శాస్త్రీయ నామం ‘బొంబిక్స్ మోరీ’.

→ జంతు దారాలను వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాల ద్వారా కనుగొనవచ్చు.

→ జంతు దారాలు ప్రోటీన్లతో తయారవుతాయి.

→ ఊలు దారాలలో కెరాటిన్ ప్రోటీన్ ఉండగా పట్టు దారాలు ఫైబ్రాయిన్ ప్రోటీతో తయారవుతాయి.

→ ఆక్రిలిక్, రేయాన్, నైలాన్, పాలిస్టర్ కొన్ని రకములైన కృత్రిమ దారాలు.

→ పట్టు వలే ఉండే ఆకృతి కారణంగా రేయానను కృత్రిమ పట్టు అని కూడా పిలుస్తారు.

→ కృత్రిమ దారాలతో తయారైన దుస్తులు తక్కువ ధరకు లభిస్తాయి. మరియు వాటిని నిర్వహించడం సులభం.

→ జంతు దారాలతో తయారైన దుస్తులను కీటకాల దాడి నుండి కాపాడుకునే విధంగా భద్రపరుచుకోవాలి.

→ జంతు దారాలు కెరాటిన్, ఫైబ్రాయిన్ అనే ప్రోటీన్లతో తయారవుతాయి.

→ కృత్రిమ దారాలు తేలికగా ఉండి, సహజదారాలతో పోల్చితే ఎక్కువ కాలం మన్నుతాయి.

→ పారాచూట్ తాళ్లను పట్టుతో తయారు చేస్తారు. వీటికున్న బలము, సాగేగుణం వలన వీటిని పారాచూటకు వాడతారు.

→ గంజి పెట్టి ఇస్త్రీ చేయటం ద్వారా నూలువస్త్రాలు, రోలింగ్ చేయటం ద్వారా పట్టువస్త్రాలలోని ముడుతలను పోగొట్టవచ్చు.

AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు

→ కీటకాల నుండి దుస్తులను రక్షించటానికి ఫినాఫిలిన్, బోరిక్ ఆమ్లం, గంధం నూనె, లావెండర్ నూనె వంటివి వాడతారు.

→ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం మూడు పొరలతో తయారైన వస్త్రంతో చేసిన మాస్కులు కోవిడ్ – 19 బారి నుండి రక్షిస్తాయి.

→ సహజ దారాలతో తయారైన దుస్తులు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించటమే కాకుండా పర్యావరణ హితము మరియు చేనేత రంగానికి చేయూత కూడ.

→ మొహయిర్ : అంగోరా మేక నుండి వచ్చే ఉన్నిని మొహయిర్ అంటారు. ఇది నాణ్యమైన ఉన్ని, దీని నుండి శాలువాలు, కోటులు తయారుచేస్తారు.

→ షీరింగ్ : జంతువుల చర్మం నుండి ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. దీనికోసం పదునైన కత్తెర వంటి సాధనం వాడతారు. ప్రస్తుతం గన్ వంటి ఆధునిక పరికరాలను షీరింగ్ కోసం వాడుతున్నారు.

→ స్కోరింగ్ : ఉన్నిని శుభ్రం చేసే ప్రక్రియను స్కోరింగ్ అంటారు. ఈ ప్రక్రియలో ఉన్నికి ఉన్న నూనె, గ్రీజు వంటి పదార్థాలను తొలగించటానికి ఉన్నిని వేడినీటి ట్యాంక్ లో ఉంచి డిటర్జెంట్లతో శుభ్రం చేస్తారు.

→ డైయింగ్ : జంతువుల ఉన్ని బ్లీచింగ్ చేయటం వలన తెల్లగా మార్చుతారు. తరువాత వివిధ రంగులు వేసి అందంగా తయారుచేస్తారు. ఉన్నికి రంగులు వేసే ప్రక్రియను డైయింగ్ అంటారు.

→ కార్డింగ్ : ఉన్నిని దువ్వెన వంటి పరికరంతో దువ్వి మెత్తని కుచ్చులతో కూడిన చుట్టలుగా చేయడాన్ని కార్డింగ్ అంటారు. దీని వలన షీలో ఉన్న ముళ్ళ పుల్లలు వంటివి తొలగిపోతాయి.

→ కూంబింగ్ : దువ్వెన పండ్ల వంటి లోహపు యంత్రాల మధ్య నుండి ప్లీసను లాగుతారు. వెంట్రుకలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా కూంబింగ్ ప్రక్రియ చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది జుట్టు చిక్కు తీయటం వంటిది.

→ స్పిన్నింగ్ : ఉన్నిని మెలిపెడుతూ పొడవైన దారంగా చేయడాన్ని స్పిన్నింగ్ అంటారు.

→ నిట్టింగ్ : ఉన్ని దారాలను అల్లి దుస్తులు తయారుచేసే ప్రక్రియను నిట్టింగ్ అంటారు. కొన్ని సార్లు ఈ ప్రక్రియలో యంత్రాలను మరికొన్నిసార్లు చేతితోను ఈ పని చేస్తారు.

→ కకూన్ : పట్టుపురుగు అభివృద్ధి దశలో తన చుట్టూ గుళిక వంటి నిర్మాణమును ఏర్పర్చుకొంటుంది. దీనినే కకూన్ లేదా పట్టుకాయ అంటారు. దీనిలోపల పట్టుపురుగు తదుపరి మార్పులు పొందుతుంది.

AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు

→ సెరీకల్చర్ : పట్టు గుడ్లు ఉత్పత్తి, పట్టుపురుగుల పెంపకాన్ని సెరీకల్చర్ అంటారు.

→ రీలింగ్ : కకూన్ల నుండి పట్టుదారం తీయడాన్ని రీలింగ్ అంటారు. రీలింగ్ చేయటానికి ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తారు.

→ బ్లీచ్ : పట్టు దారాలను వివర్ణం చేయటానికి వాటికి బ్లీచింగ్ కలుపుతారు. ఈ ప్రక్రియలో అవి రంగును కోల్పోయి తెల్లగా మారతాయి. ఈ ప్రక్రియనే ‘బ్లీచ్’ అంటారు.

→ స్టిప్లింగ్ : కకూన్ల నుంచి దారాలను తీసే ప్రక్రియలో వాటిని వేడినీటిలో వేసి కకూన్ లోపలి గొంగళి పురుగులను చంపేస్తారు. ఈ ప్రక్రియను స్టింగ్ అంటారు. సిప్లింగ్ చేయకపోతే లోపలి మోత్ కకూనను పగులగొట్టుకొని బయటకు వస్తుంది.

→ కెరాటిన్ : ఊలు దారాలలో ఉండే ప్రోటీన్ పదార్థాన్ని ‘కెరాటిన్’ అంటారు. ఈ పదార్థం చర్మకణాల నుండి ఉత్పత్తి, రోమాలు, గోర్లలో చేరుతుంది.

→ ఫైబ్రాయిన్ : పట్టుదారాలలోని ప్రోటీన్ పదార్థాన్ని ఫైబ్రాయిన్ అంటారు. ఇది సులువుగా కరిగే లక్షణాన్ని కల్గి ఉంటుంది.

→ ఆక్రిలిక్, నైలాన్, రేయాన్ పాలిస్టర్ : ఇవన్నీ కృత్రిమ దారాలు. వీటిని పెట్రోలియం నుండి తీసిన రసాయనాలతో తయారు చేస్తారు. వీటి నుండి తయారైన దుస్తులు దృఢంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నుతాయి. అయితే సహజ దారాల వంటి మృదుత్వం ఉండదు.

AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు

→ కృత్రిమ వస్త్రాలు : ఆక్రిలిక్, రేయాన్, నైలాన్, పాలిస్టర్ వంటి కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన బట్టలను కృత్రిమ వస్త్రాలు అంటారు. ఇవి మన్నిక కల్గి ఉన్నప్పటికీ మృదుత్వాన్ని కల్గి ఉండవు.

→ రోలింగ్ : పట్టువస్త్రాల ముడుతలను పోగొట్టే ప్రక్రియను రోలింగ్ అంటారు.

→ పునఃచక్రీయం : వస్తువులను, వాటి రూపం మార్చి తిరిగి వాడుకొనే ప్రక్రియ. ఇది భూమిపై వ్యర్థాలను తగ్గిస్తుంది.

1.
AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు 1
AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు 2

2.
AP 7th Class Science Notes Chapter 11 దారాలు – దుస్తులు 3