AP 7th Class Science Notes Chapter 3 జీవులలో పోషణ

Students can go through AP Board 7th Class Science Notes 3rd Lesson జీవులలో పోషణ to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 3rd Lesson జీవులలో పోషణ

→ జీవులు ఆహారాన్ని తీసుకునే విధానం మరియు వినియోగాన్ని “పోషణ” అంటారు.

→ జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే పోషణ విధానాన్ని స్వయం పోషణ అని అంటారు.

→ ఇతర జీవులపై ఆహారం కోసం ఆధారపడే పోషణ విధానాన్ని పరపోషణ అంటారు.

→ ఆకుపచ్చటి మొక్కలు సూర్యకాంతి సమక్షంలో పత్రహరితంను ఉపయోగించుకొని కార్బన్ డై ఆక్సైడ్, నీటి నుండి స్వయంగా ఆహారాన్ని తయారుచేసుకునే విధానాన్ని “కిరణజన్య సంయోగ క్రియ” అంటారు.

→ చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాల నుండి జీవులు ద్రవ స్థితిలో పోషకాలను సేకరించే పోషణ విధానాన్ని “పూతికాహార పోషణ” అంటారు.
ఉదా : పుట్టగొడుగులు

AP 7th Class Science Notes Chapter 3 జీవులలో పోషణ

→ రెండు జీవుల మధ్య ఆహారం కోసం గల సంబంధంలో ఒక దానికి మేలు జరిగి వేరొక దానికి హాని కల్గించేపోషణ విధానాన్ని పరాన్న జీవనం (పరాన్న జీవ పోషణ) అంటారు.
ఉదా : డాడరు, పేలు

→ జాంతవ భక్షణ అనగా శరీరం వెలుపల నుండి ద్రవ లేదా ఘన రూపంలో ఆహారాన్ని తీసుకొని శరీరం లోపల జీర్ణం చేసుకునే విధానం.

→ జాంతవ భక్షణలోని దశలు అంతర గ్రహణం, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణం, మల విసర్జన – జీర్ణం కాని. పదార్థాలు, వ్యర్థ పదార్థాలు శరీరం నుండి బయటకు పోవడం.

→ అమీబా మిద్యాపాదాల సహాయంతో ఆహారాన్ని గ్రహించి, ఆహార రిక్తికలో జీర్ణం చేస్తుంది.

→ మానవ జీర్ణ వ్యవస్థ ఆహారనాళం మరియు జీర్ణ గ్రంధులు కలిగి ఉంటుంది.

→ ఇతర యంత్రాల మాదిరిగానే విసిరే యంత్రం లాంటి మన జీర్ణవ్యవస్థకు కూడా సక్రమ నిర్వహణ అవసరం.

→ స్వయంపోషణ : జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారుచేసుకొనే పోషణ విధానాన్ని స్వయంపోషణ అంటారు.
ఉదా : మొక్కలు.

→ పత్రహరితం : మొక్కల కణాలలో హరితరేణువులు ఉంటాయి. వీటిలో పత్రహరితం అనే వర్ణక పదార్థం ఉంటుంది. దీని వలన మొక్కలు ఆకుపచ్చగా ఉంటాయి.

→ పరపోషణ : కొన్ని జంతువులు స్వయంగా ఆహారం తయారు చేసుకోలేవు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే పోషణ విధానాన్ని పరపోషణ అంటారు.
ఉదా : జంతువులు.

AP 7th Class Science Notes Chapter 3 జీవులలో పోషణ

→ అతిథేయి : పరాన్నజీవికి ఆహారం ఆశ్రయం అందించే జీవిని అతిథేయి అంటారు.

→ కీటకాహార మొక్క : నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరిగే మొక్కలు కీటకాలను ఆహారంగా తీసుకొంటాయి. వీటిని కీటకాహార మొక్కలు అంటారు.
ఉదా : నెపంథిస్.

→ పోషణ : జీవులు ఆహారాన్ని తీసుకొనే విధానం మరియు వినియోగాన్ని పోషణ అంటారు. పోషణ విధానం వేరు వేరు జంతువులలో వేరు వేరుగా ఉంటుంది.

→ పరాన్నజీవనం : రెండు జీవుల మధ్య ఆహార సంబంధాలలో ఒకదానికి మేలు జరిగి వేరొకదానికి హాని కలిగించే పోషణ విధానాన్ని పరాన్నజీవనం అంటారు.

→ జాంతవ భక్షణ : ద్రవ లేదా ఘన రూప ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని జీర్ణం చేసుకొనే ప్రక్రియను జాంతవ భక్షణ అంటారు.

→ పూతికాహార పోషణ : చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాల నుండి జీవులు ద్రవస్థితిలో పోషకాలను సేకరించే విధానాన్ని పూతికాహార పోషణ అంటారు.
ఉదా : పుట్టగొడుగులు.

→ పత్రరంధ్రము : గాలిలో ఉండే కార్బన్ డై ఆక్సెడ్ పత్రాలపై ఉండే చిన్న రంధ్రాల ద్వారా పత్రంలోనికి ప్రవేశిస్తుంది. ఈ రంధ్రాలనే పత్రరంధ్రాలు అంటారు. వీటి ద్వారా మొక్కల నుండి ఆక్సిజన్ వెలుపలికి వస్తుంది.

AP 7th Class Science Notes Chapter 3 జీవులలో పోషణ

→ అంతరగ్రహణం : జీవి ఆహారాన్ని శరీరంలోనికి తీసుకోవటాన్ని అంతర గ్రహణం అంటారు.

→ జీర్ణక్రియ : జీర్ణ రసాల వలన సంక్లిష్ట ఆహారాన్ని సరళ పదార్ధముగా మార్చే ప్రక్రియ.

→ శోషణ : జీర్ణమైన ఆహారం రక్తంలో చేరటం.

→ స్వాంగీకరణ : శోషించుకొన్న ఆహారం శరీరంలో కలిసిపోవటం.

→ విసర్జన : జీర్ణంకాని వ్యర్థ పదార్థాలు శరీరం నుండి బయటకు పంపటం.

→ ఆహారనాళం : మానవ జీర్ణవ్యవస్థలోని కండరయుతమైన పొడవాటి గొట్టాన్ని ఆహారనాళం అంటారు. దీని పొడవు 9 మీటర్లు.

→ మిధ్యా పాదం : అమీబా కణం నుండి బయటకు పొడుచుకొని వచ్చే వ్రేళ్ళ వంటి నిర్మాణాలను మిధ్యా పాదాలు అంటారు. ఇవి చలనానికి ఆహార సంపాదనకు తోడ్పడతాయి.

→ నెమరువేయటం : కొన్ని శాఖాహార జంతువులు విరామ సమయంలో జీర్ణాశయం నుండి ఆహారాన్ని నోటిలోనికి తెచ్చుకొని తీరుబడిగా నమలుతాయి. ఈ ప్రక్రియను నెమరువేయటం అంటారు.

→ నెమరువేసే జీవులు : తిన్న ఆహారాన్ని విరామ సమయంలో తిరిగి నోటిలోనికి తెచ్చుకొని నమిలే జంతువులను నెమరువేసే జీవులు అంటారు.
ఉదా : ఆవు, గేదె.

→ ఆంత్ర చూషకాలు : చిన్నప్రేగు లోపలి పొరలలో వందల సంఖ్యలో వ్రేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్ర చూషకాలు అంటారు.

→ పంటి ఎనామిల్ : దంతాలపై పొర మెరిసే లక్షణం కల్గి ఉంటుంది ఈ పొరను ఎనామిల్ అంటారు. ఇది శరీరంలోకెల్లా దృఢమైన పదార్థం.

→ ఎసిడిటి : జీర్ణాశయంలో అధిక ఆమ్లాల ఉత్పత్తి వలన ఏర్పడే అసౌకర్యాన్ని ఎసిడిటి అంటారు. దీనిలో గొంతులో మంట పుల్లని త్రేన్పులు ఉంటాయి.

→ కుంతకాలు : మానవునిలోని ముందువరుస దంతాలను కుంతకాలు అంటారు. వీటి సంఖ్య 4. ఇవి కొరకటానికి తోడ్పడతాయి.

AP 7th Class Science Notes Chapter 3 జీవులలో పోషణ

→ రదనికలు : జంతువులలోని కోర పళ్ళను రదనికలు అంటారు. ఇవి ఆహారాన్ని చీల్చటానికి తోడ్పడతాయి. వీటి సంఖ్య 4.

→ అగ్రచర్వణకాలు : వీటినే విసురు దంతాలు అంటారు. ఇవి దవడ చివరలో వెడల్పుగా ఉంటాయి. వీటి సంఖ్య 12.

→ చర్వణకాలు : వీటినే నములు దంతాలు అంటారు. రదనికలకు ప్రక్కన ఉంటాయి. వీటి సంఖ్య 8.

→ మలబద్దకం : మల విసర్జనలోని అసౌకర్యం. ఆహారంలో పీచుపదార్థం లోపించటం వలన మలవిసర్జన ఆలస్యంగా ఇబ్బందికరంగా మారుతుంది.

AP 7th Class Science Notes Chapter 3 జీవులలో పోషణ 1