AP 7th Class Science Notes Chapter 2 పదార్థాల స్వభావం

Students can go through AP Board 7th Class Science Notes 2nd Lesson పదార్థాల స్వభావం to understand and remember the concept easily.

AP Board 7th Class Science Notes 2nd Lesson పదార్థాల స్వభావం

→ పదార్థాలను ఆమ్లాలు, క్షారాలు మరియు తటస్థాలుగా వర్గీకరించవచ్చును.

→ ఆమ్లాలు రుచికి పుల్లగా వుంటాయి. ఉదాహరణ : హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లంమొదలైనవి.

→ క్షారాలు రుచికి చేదుగాను, జారుడు స్వభావాన్ని కలిగియుంటాయి. ఉదాహరణ : సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ మొదలైనవి.

→ ఆమ్లాలు, క్షారాలు కాని పదార్థాలను తటస్థ పదార్థాలని అంటారు.

→ నీరు, టేబుల్ ఉప్పు తటస్థ పదార్థాలకు ఉదాహరణ.

→ పదార్థాల స్వభావాన్ని పరీక్షించడానికి సూచికలను వినియోగిస్తారు.

→ పసుపు, మందారం, లిట్మస్ మొదలగువాటిని సహజ సూచికలు అంటారు.

AP 7th Class Science Notes Chapter 2 పదార్థాల స్వభావం

→ మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్తలీన్ మొదలగు వాటిని కృత్రిమ సూచికలని అంటారు.

→ ఆమ్లం మరియు క్షారం మధ్య జరిగే చర్యను తటస్థీకరణ చర్య అని అంటారు.

→ తటస్థీకరణ చర్య …… ఆమ్లం + క్షారం → నీరు + లవణం

→ బ్యాటరీలు, ఎరువులు తయారీలో ఆమ్లాలను వినియోగిస్తారు.

→ ఆహారాన్ని నిల్వ చేయడానికి ఆమ్లాన్ని వినియోగిస్తారు.
ఉదా : వెనిగర్

→ సబ్బులు, డిటర్జెంట్లు, పరిశుభ్రం చేసే పదార్థాల తయారీలో క్షారాలను వినియోగిస్తారు.

→ ఫాటీ ఆమ్లాలను ఆల్కలీలకు కలిపి సబ్బును తయారుచేస్తారు.

→ ఆమ్ల క్షార బలాలను తెలుసుకొనుటకు pH స్కేలును ఉపయోగిస్తారు.

AP 7th Class Science Notes Chapter 2 పదార్థాల స్వభావం

→ ఆమ్లం : రుచికి పుల్లగా ఉండే పదార్థాలను ఆమ్లాలు అని అంటారు. ‘ఏసిర్’ అనే లాటిన్ పదానికి అర్థం పులుపు. దీని నుండి యాసిడ్ అనే పదం ఏర్పడింది.
ఉదా : నిమ్మరసం.

→ క్షారం : రుచికి చేదుగా ఉండే పదార్థాలను క్షారాలు అంటారు. ఇవి జారుడు గుణం కలిగి ఉంటాయి.
ఉదా : సబ్బు, టూత్ పేస్ట్.

→ తటస్థ పదార్ధం : ఆమ్లము మరియు క్షారం కాని పదార్థాన్ని తటస్థ పదార్థం అంటారు.
ఉదా : స్వచ్ఛమైన నీరు, ఉప్పు ద్రావణం, చక్కెర ద్రావణం,

→ సూచికలు : ఆమ్ల, క్షారాలను గుర్తించటానికి ఉపయోగపడే పదార్థాలను సూచికలు అంటారు.

→ సహజ సూచికలు : ప్రకృతిలో సహజంగా లభించే సూచికలను సహజ సూచికలు అంటారు.
ఉదా : మందార, పసుపు.

→ కృత్రిమ సూచికలు : ఖనిజ లవణాలను ఉపయోగించి తయారుచేసిన సూచికలను కృత్రిమ సూచికలు అంటారు.
ఉదా : మిథైల్ ఆరంజ్ మరియు ఫినాఫ్తలీన్.

→ ఘ్రాణ సూచికలు : కొన్ని పదార్థాలను ఆమ్లం లేదా క్షారంతో కలిపినపుడు వాటి వాసనలో మార్పు వస్తుంది. ఇటువంటి పదార్థాలను ఝణ సూచికలు అంటారు. ఉదా: ఉల్లిరసం, వెనిల్లా మరియు లవంగనూనె.

→ సార్వత్రిక సూచికలు : వీటినే యూనివర్సల్ సూచికలు అంటారు. ఇవి వివిధ సూచికల మిశ్రమం. వివిధ పదార్థాలతో వేరు వేరు రంగులను ఇస్తాయి.

→ లిట్మస్ : ప్రయోగశాలలో విరివిగా ఉపయోగించే ఆమ్ల క్షార సూచిక. ఇది ఎరుపు మరియు నీలం రంగులలో ఉంటుంది. ఆమ్లాలు ఎరుపు లిట్మసు నీలి రంగుకు, క్షారాలు నీలి లిట్మసు ఎరుపు రంగుకు మార్చుతాయి.

→ pH స్కేలు : ఆమ్ల, క్షార పదార్థాల బలాన్ని తెలుసుకోవటానికి pH స్కేలు వాడతాము. దీనిని ‘సొరెన్ సేన్’ అను శాస్త్రవేత్త రూపొందించాడు. దీని విలువ 0 నుండి 14 వరకు ఉంటుంది.

→ తటస్థీకరణ చర్య : ఆమ్ల క్షారాలు ఒకదానితో ఒకటి చర్య పొందినపుడు వాటి లక్షణాలను కోల్పోతాయి. ఈ ప్రక్రియనే తటస్థీకరణ చర్య అంటారు. దీనిలో లవణం మరియు నీరు ఏర్పడతాయి.

→ లవణం : ఆముక్షారాల తటస్థీకరణ చర్య వలన లవణాలు ఏర్పడతాయి. లవణాలు, రసాయనికంగా తటస్థంగా ఉంటాయి.
ఉదా : ఉప్పు.

→ సబ్బు : సబ్బు అనేది క్షార స్వభావం గల లవణం. దీనిని కొబ్బరినూనే వంటి ఫ్యాటీ ఆమ్లాలను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలు కలిపి తయారుచేస్తారు.

AP 7th Class Science Notes Chapter 2 పదార్థాల స్వభావం

→ యాంటాసిడ్ : యాంటాసిడ్లు క్షార పదార్థాలు. ఇవి తీసుకొన్నప్పుడు జీర్ణాశయంలోని ఆమ్లం తటస్థీకరణ చెంది ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియాను యాంటాసిడ్ గా వాడతారు.

→ ఆమ్లవర్షం : ఆమ్ల లక్షణాలు కలిగిన వర్షపు నీటిని ఆమ్లవర్షం అంటారు. వాయుకాలుష్యం దీనికి ప్రధాన కారణం. దీని వలన పంట నష్టం మరియు చారిత్రాత్మక కట్టడాల నాశనం జరుగుతున్నది.

AP 7th Class Science Notes Chapter 2 పదార్థాల స్వభావం 1