AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

These AP 7th Class Social Important Questions 4th Lesson ఢిల్లీ సుల్తానులు will help students prepare well for the exams.

AP Board 7th Class Social 4th Lesson Important Questions and Answers ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 1.
చరిత్ర అనగానేమి? చరిత్ర ఎందుకు చదవాలి?
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 1

  1. గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర.
  2. వివిధ ప్రదేశాలలోని మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను చరిత్ర తెలియచేస్తుంది.
  3. చరిత్ర వివిధ కాలాలలోని ప్రజలు, వారి సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలియచేస్తుంది.
  4. గతానికి చెందిన వివిధ అంశాలను ఋజువులుగా అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర అందజేస్తుంది.
  5. మెరుగైన పద్దతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రను అధ్యయనం చేస్తాం.
  6. చరిత్ర, నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తదాత్మైకితకు దోహదం చేస్తుంది.
  7. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం.

ప్రశ్న 2.
చారిత్రక ఆధారాలు ఎన్ని? అవి ఏవి? ఉదాహరణలతో వివరించుము.
జవాబు:
చారిత్రక ఆధారాలు :
ఎ) ఒక కాలానికి చెందిన చరిత్ర అధ్యయనం కొరకు కొన్ని ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి.
బి) ఈ చారిత్రక ఆధారాలను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి :

  1. పురావస్తు ఆధారాలు
  2. వాజ్మయ ఆధారాలు (లిఖిత ఆధారాలు)

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 2

ప్రశ్న 3.
భారతదేశ చరిత్ర కాలాలను ఏ విధంగా విభజించారు?
జవాబు:
భారతదేశ చరిత్ర కాలాలు :

  1. ప్రాచీన యుగం : 8వ శతాబ్దం వరకు
  2. మధ్య యుగం : 8 నుండి 18వ శతాబ్దం వరకు
  3. ఆధునిక యుగం : 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 4.
భారతదేశంపై తొలినాటి దండయాత్రలు ఏవి? భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్య స్థాపన ఎలా జరిగింది?
జవాబు:
భారతదేశంపై తొలినాటి దండయాత్రలు:

  1. తోమార వంశానికి చెందిన రాజపుత్రులు ధిల్లిక లేదా ధిల్లికాపుర (ప్రస్తుత ఢిల్లీ) నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలించారు.
  2. వీరు 12వ శతాబ్దపు మధ్య కాలంలో అజ్మీర్ కు చెందిన చౌహానుల (చహమనులు) చేత ఓడింపబడ్డారు.
  3. తోమర్, చౌహాన్ వంశస్తుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది.
  4. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశాలు సమర్థంగా ఎదుర్కొన్నారు.
  5. క్రీ.శ. 1192వ సంవత్సరంలో మహమ్మద్ ఘోరి రెండవ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు.
  6. దీనిలో క్రమంగా గంగా – యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్ళిపోయింది.
  7. మహమ్మద్ ఘోరి హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని క్రీ.శ. 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించారు.
  8. భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తానుల పాలన క్రింద కొనసాగింది.

ప్రశ్న 5.
బానిస వంశం గురించి నీకేమి తెలుసు?
జవాబు:
బానిస వంశం : (మామ్లుక్ వంశం)

  1. కుతుబుద్దీన్ ఐబక్ క్రీ.శ. 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించాడు.
  2. లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.
  3. తరువాత ఇల్ టుట్ మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడినది.
  4. అలా అతను ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడినాడు.
  5. ఇల్ టుట్ మిష్ తరువాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్టించారు.
  6. ఘియాజుద్దీన్ బాల్బన్ తన పాలనాకాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్దరించి అధికారాన్ని కొనసాగించాడు.
  7. బానిస వంశపరిపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది.

ప్రశ్న 6.
మంగోలులు ఎవరు? వారి గురించి నీకేమి తెలియును?
జవాబు:
మంగోలులు :
ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించాయి. చంగీజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీ.శ. 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పాలనాకాలంలో మంగోలులు క్రీ. శ. 1221-1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసారు.

ప్రశ్న 7.
సయ్యద్ వంశం గురించి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
సయ్యద్ వంశం :
ఢిల్లీ సుల్తానులలో నాలుగవది అయిన సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. జర్ ఖాన్, ముబారఖ్ షా, మహ్మద్ షా, ఆలమ్ షా ఈ వంశములోని ఇతర పాలకులు. ముబారఖ్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కాని విఫలమయ్యాడు. చివరి పాలకుడు ఆలమ్ షా బహలాల్ చేతిలో ఓడిపోవటంతో లోడీ వంశస్తులకు పాలన సంక్రమించింది.

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 8.
లోడి వంశము గూర్చి నీకు తెలిసినది తెల్పుము.
జవాబు:
లోడి వంశము :
బహలాల్ లోడి తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తి పరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. రెండవ సుల్తాన్ సికిందర్ లోడి రాజ్యాన్ని సుస్థిరపరచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడి పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమయ్యింది.

ప్రశ్న 9.
తైమూరు యొక్క దండయాత్రల గూర్చి, వాని ఫలితాలను తెల్పండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 3

  1. తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీ.శ. 1398వ సంవత్సరంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరచుకున్నాడు.
  2. ఆటవిక పద్దతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయభ్రాంతులకు లోనగుటయే గాక తీవ్రంగా దోచుకోబడింది.
  3. అనేక నిర్మాణాలు కూల్చి వేయబడ్డాయి.
  4. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది.
  5. తరువాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారి తీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమయ్యింది.

ప్రశ్న 10.
‘చిహల్గని’ అనగానేమి?
జవాబు:
చిహల్గని :
పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్ టుట్ మిష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ. దీనినే తుర్కాన్ – ఇ – చిహల్గని లేదా చాలీసా అనేవారు. సుల్తానులకు వ్యతిరేకముగా ఉన్న ప్రభువులను అణచి వేయటానికి ఇది ఉపయోగపడింది.

ప్రశ్న 11.
ఢిల్లీ సుల్తానుల కాలంలో స్వదేశీ నిర్మాణాలలోని పద్ధతులను పట సహాయంతో వివరించండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 4

ప్రశ్న 12.
ఢిల్లీ సుల్తానుల పతనం ఏ విధంగా జరిగింది?
జవాబు:
పతనం :

  1. లోడి వంశస్తుల పాలన కాలంలో ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసింది. అయితే తుగ్లక్ కాలం నుండే పతనం ఆరంభం అయిందని చెప్పవచ్చు.
  2. 1398 తైమూరు దండయాత్రలలో దేశ సంపదని తరలించి వేశారు. తైమూరు సాధించిన మారణ హోమం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి 100 సం||లు పట్టింది.
  3. బలహీన సుల్తానుల పాలనలో అనేక ప్రాంతీయ రాజ్యా లు ఏర్పడ్డాయి. ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలు జరిగేవి.
  4. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమనీ రాజ్యాలు ఢిల్లీ సుల్తానుల పాలన నుండి స్వతంత్రమయ్యాయి. సయ్యద్, లోడి వంశంలోని అసమర్థత, అసహనంతో కూడిన పాలన పతనానికి దారి తీసింది.
  5. క్రీ.శ. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడిని ఓడించాడు. దీనితో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం ప్రారంభమైనది.

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

ప్రశ్న 13.
ఢిల్లీ సుల్తానుల పాలన కాలంలో సాహిత్యాభివృద్ధి గూర్చి తెల్పుతూ, అల్ బెరూని, అమీర్ ఖుస్రూల గూర్చి క్లుప్తంగా వివరించండి.
జవాబు:
ఢిల్లీ సుల్తానుల పాలన కాలంలో సాహిత్యాభివృద్ధి:

  1. ఈ కాలంలో అనేక మంది పండితులకు ఆశ్రయం ఇచ్చి పోషించారు.
  2. పర్షియా, సంస్కృతం మరియు ప్రాంతీయ భాషలలో సాహిత్యం వికసించింది.
  3. వచనం, కవిత్వం, నాటక రూపాలలో సాహిత్యం ఉండేది.
  4. అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి.
  5. అల్ బెరూనీ, అమీర్ ఖుస్రూ, జియా-ఉద్దీన్-బరూని ఈ కాలంలోని ప్రముఖ పండితులు.

అల్ బెరూని :

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 5
అల్ బెరూనీ మహమ్మద్ ఘజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకుని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు. తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) అనే గ్రంథాన్ని రచించాడు.

అమీర్ ఖుస్రూ :
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 6
ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకు (టుటి-ఐ-హింద్) భారతదేశపు చిలుక (The Parrot of India) అని బిరుదు ఉండేది.

ప్రశ్న 14.
‘సుల్తానా రజియా’ గురించి నీకేమి తెలియును?
జవాబు:

  1. సుల్తానా రజియా క్రీ.శ. 1236-1239 పాలనా కాలం.
  2. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ.
  3. ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేసింది.
  4. టర్కీ ప్రభువుల నుండి (చిహల్గని) స్వంత అన్నదమ్ముల నుండి ఆమెకు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది.

ప్రశ్న 15.
ఢిల్లీ సుల్తానత్ పాలించిన వంశములు, వాని స్థాపకులు, కాలము ఆ వంశంలో ప్రముఖ పాలకులతో కూడిన జాబితా తయారుచేయండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 7

ప్రశ్న 16.
క్రింది పటంను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సరియైన సమాధానములు ఇవ్వండి.
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 8
ప్రశ్నలు:
ఎ) పై పటము దేని గురించి తెలియజేస్తుంది?
జవాబు:
తుగ్లక్ వంశ కాలంలో భారతదేశం

బి) దౌలతాబాద్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు:
మహారాష్ట్ర

సి) ఢిల్లీ ఏ నది ఒడ్డున కలదు?
జవాబు:
యమునా

డి) నాటి దక్షిణ భారత రాజ్యా నికి ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
మధురై

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No. 101

భారతదేశ చరిత్ర కాలాలు

  1. ప్రాచీన యుగం : క్రీ.శ. 8వ శతాబ్దం వరకు
  2. మధ్య యుగం : క్రీ.శ. 8 నుండి 18వ శతాబ్దం వరకు
  3. ఆధునిక యుగం : క్రీ.శ. 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం

7th Class Social Textbook Page No. 105

మామ్లుక్ అనగా బానిస అని అర్ధం.

7th Class Social Textbook Page No. 107

మంగోలులు : ప్రాచీనకాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించాయి. చంగీ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీ.శ. 1206వ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పాలనాకాలంలో మంగోలులు క్రీ.శ. 1221-1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసారు.

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు

7th Class Social Textbook Page No. 111

తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీ.శ. 1398 సంవత్సరంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీన పరచుకున్నాడు. ఆటవిక పధతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయభ్రాంతులకులోనగుటయే గాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చి వేయబడ్డాయి. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది. తరువాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారి తీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమయ్యింది.

చిహల్గవి :
పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్ టుట్ మిష్ చే ప్రారంభించబడిన వ్యవస్థ. దీనినే తుర్కాన్-ఇ-చిహల్గవి లేదా చాలీసా అనేవారు. సుల్తానులకు వ్యతిరేకముగా ఉన్న ప్రభువులను అణచి వేయటానికి ఇది ఉపయోగపడింది.

7th Class Social Textbook Page No. 115

AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 4

7th Class Social Textbook Page No. 117

ఆల్ బెరూని :
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 5
ఆల్ బెరూనీ మహమ్మద్ ఘజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ * పర్షియన్ పండితుడు. ఈయన సంస్కృత భాషను నేర్చుకుని ఆ భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు. తారిక్-అల్-హింద్ (భారతదేశ చరిత్ర) అనే గ్రంథాన్ని రచించాడు.

అమీర్ ఖుస్రూ :
AP 7th Class Social Important Questions Chapter 4 ఢిల్లీ సుల్తానులు 6
ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకు (టుటి-ఐ-హింద్) భారతదేశపు చిలుక (The Parrot of India) అని బిరుదు ఉండేది.