These AP 7th Class Social Important Questions 3rd Lesson పటాల ద్వారా అధ్యయనం will help students prepare well for the exams.
AP Board 7th Class Social 3rd Lesson Important Questions and Answers పటాల ద్వారా అధ్యయనం
ప్రశ్న 1.
పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎలాంటిది?
జవాబు:
- పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎంతో విలువైనది.
- పటాల తయారీదారులు (కార్టోగ్రాఫర్స్) వీరి నుండి సమాచారాన్ని తీసుకొని పటాలను తయారుచేసేవారు.
- గుహలలోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు తెలుసుకోవచ్చు.
- సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు.
- తర్వాత గ్రీకు పట తయారీదారులైన అనాక్సిమాండర్, హెకేటియస్, హెరడోటస్ పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండునట్టుగా పటాలను రూపొందించారు.
- అక్షాంశ రేఖాంశ భావనలను గ్రీకులు పటాల తయారీకి అన్వయించారు.
ప్రశ్న 2.
పట శీర్షిక అనగానేమి?
జవాబు:
శీర్షిక :
పటంలోని అంశాలను లేదా విషయాన్ని పట శీర్షిక తెలియజేస్తుంది. ఇది పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుంది. సాధారణంగా శీర్షిక పటంపై భాగంలో అమరి ఉంటుంది.
ప్రశ్న 3.
సాంప్రదాయిక చిహ్నాలు అనగానేమి? ఉదాహరణలతో వివరించుము.
జవాబు:
సాంప్రదాయిక చిహ్నాలు:
వాస్తవ అంశాలను పటంలో యథాతథంగా చూపించడం కష్టం. పటాల తయారీదారులు చిహ్నాలను ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల ఉనికిని చూపుతారు. భారత సర్వేక్షణ శాఖ (సర్వే ఆఫ్ ఇండియా) టోపోషీట్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుంది. కొన్ని సాంప్రదాయక చిహ్నాలు క్రింద ఇవ్వబడ్డాయి.
ప్రశ్న 4.
MSL (సముద్రమట్టం నుండి ఎత్తు) గురించి నీకేమి తెలియును?
జవాబు:
సముద్రమట్టం నుండి ఎత్తు: సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ఎం.ఎస్.ఎల్ (సముద్రమట్టం నుండి ఎత్తు) ను ప్రామాణికంగా స్వీకరిస్తారు.
ప్రశ్న 5.
‘గ్రిడ్’ అనగానేమి? దీని ఉపయోగమేమి?
జవాబు:
గ్రిడ్ :
అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా కచ్చితంగా తెలుసుకోవచ్చు. మొదట అక్షాంశాలను, తరువాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిలోని సమాచారాన్ని పొందవచ్చు.
ప్రశ్న 6.
పటాల తయారీలో రంగుల యొక్క ఆవశ్యకత తెలుపుతూ, వివిధ రంగులను ఏ విధంగా ఉపయోగిస్తారో తెల్పండి.
జవాబు:
రంగులు :
భౌతిక పటాలలోనూ, విషయ నిర్దేశిత పటాలలోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేక అంశాలను తెలియచేస్తాయి. సాధారణంగా క్రింద ఇవ్వబడిన రంగులను పటాల తయారీలో ఉపయోగిస్తారు.
ప్రశ్న 7.
నమూనా చిత్రాలను పటాల తయారీలో ఏ విధంగా ఉపయోగిస్తారు?
జవాబు:
నమూనా చిత్రాలు (Patterns): ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో వీటిని ప్రత్యేకాంశాలుగా భావిస్తారు. గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక విశ్లేషణలుగా, (జనసాంద్రత, జనాభా విస్తరణ) వివిధ రకాల ప్రత్యేక భావనలుగా (నేలలు, అడవులు) పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు.
ప్రశ్న 8.
రాజకీయ పటాల గురించి వివరింపుము.
జవాబు:
రాజకీయ పటాలు:
- రాజకీయ పటాలు ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియచేస్తాయి.
- ఆ ప్రదేశపు ఉనికి కూడా తెలుసుకోవచ్చు. సరిహద్దు రేఖల మందం, రంగు, సరిహద్దు రేఖ తీరును బట్టి ఆ ప్రదేశం జిల్లా లేదా రాష్ట్రం అన్నది తెలుసుకోవచ్చు.
- రాజకీయ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు.
- రాజకీయ పటాల అధ్యయనంలో అక్షాంశ రేఖాంశాలకు సంబంధించిన పరిజ్ఞానం ఒక ప్రదేశం లేదా దేశాలను ప్రపంచ పటంలో సులువుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
- భారతదేశ రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి పొరుగు దేశాలతో భూభాగ సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు, తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రాలు, అంతర్గత రాష్ట్రాలుగా పరిశీలించడం అనేది ఓ పద్ధతిగా పాటించవచ్చు.
- ఒక ప్రదేశపు ఉనికిని గుర్తించడానికి గ్రిడ్, మూలలు, సరిహద్దు రేఖ నుండి దూరం మొ.వాటిని కొండగుర్తులుగా ఉపయోగించవచ్చు.
ప్రశ్న 9.
‘లెజెండ్’ అనగానేమి?
జవాబు:
లెజెండ్ :
పటములోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక, ఇది పటంలో ఏదేని ఒక మూలన అమరి ఉంటుంది.
లెజెండ్ రాష్ట్ర సరిహద్దు జిల్లా సరిహద్దు రైలు మార్గము బంగారు నడవ ఉత్తర-దక్షిణ నడవ జాతీయ రహదారి తీరప్రాంత మార్గము రాష్ట్ర ప్రధాన కేంద్రం జిల్లా ప్రధాన కేంద్రం ఇతర ప్రదేశాలు
ప్రశ్న 10.
కాంటూరు రేఖలు అనగానేమి? వాని లక్షణాలను తెల్పండి.
జవాబు:
- సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూరు రేఖలు అంటారు.
- ఒక ప్రదేశమునకు సంబంధించిన భౌతిక స్వరూపాలని (టోపోగ్రఫీ) తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
- రెండు కాంటూరు రేఖల మధ్య గల దూరం, ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. కాంటూరు రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుంది.
- రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాలు ఎక్కువగా వుంటుంది.
ప్రశ్న 11.
విషయ నిర్దేశిత పటాల గురించి నీకేమి తెలియును?
జవాబు:
విషయ నిర్దేశిత పటాలు :
- ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారుచేయబడిన పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు.
- ఉదాహరణకు ఉద్భిజ్జ పటాలు (అడవులను తెలిపే పటాలు), నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణస్థితి పటాలు మొదలగునవి.
- సాంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని టోపోట్లుగా వివరించడానికి ఈ పటాలు తయారు చేయబడతాయి.
- వీటి సహాయంతో జనాభా వివరాలను, ఖనిజ వనరులను, వలసలు వంటి గణాంక వివరాలను తెలియచేయవచ్చు.
ప్రశ్న 12.
చారిత్రక పటాల గురించి సోదాహరణంగా వివరించండి.
జవాబు:
చారిత్రక పటాలు :
- చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందిన రాజ్య విస్తృతి, శాసనాలు, వాస్తు, శిల్పకళ, వాణిజ్య సంబంధాలు మొదలగు అంశాల అధ్యయనంలో ఈ పటాలను కీలక వనరులుగా వినియోగిస్తారు.
- గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలను ‘చారిత్రక పటాలు’ అంటారు.
- అవి ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ప్రాంతం, ముఖ్యమైన ప్రదేశాలు, వాణిజ్య మార్గాలు, వివిధ ప్రాంతాల మధ్య సామాజిక, సాంస్కృతిక సంబంధాలు మొదలైన ప్రాదేశిక సమాచారాన్ని అందిస్తాయి.
- చరిత్రకారులు ఒక రాజవంశము యొక్క పరిపాలనా ప్రాంతాన్ని అధ్యయనం చేయటానికి పటాలను ముఖ్య ఆధారంగా ఉపయోగిస్తారు.
- శాసనాలు, వాస్తు శిల్పం, వాణిజ్య సంబంధాలు మొదలైన సమాచారాన్ని పట అధ్యయనంతో తెలుసుకోవచ్చును.
ప్రశ్న 13.
ప్రక్షేపణం అనగానేమి?
జవాబు:
ప్రక్షేపణం: గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టినవారు డచ్ కార్టో గ్రాఫర్ (పటాలను తయారు చేసేవారు) గెరార్డస్ మెర్కేటర్.
ప్రశ్న 14.
టోపోగ్రాఫిక్ పటాలు అనగానేమి?
జవాబు:
టోపోగ్రాఫిక్ పటాలు:
ఈ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి. సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు.
ప్రశ్న 15.
భారతదేశ భౌతిక పటమును గీయండి.
జవాబు:
ప్రశ్న 16.
భారతదేశంలోని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి రాజధానులను అవుట్ లైన్ పటం నందు గుర్తించండి.
జవాబు:
ప్రశ్న 17.
క్రింది ప్రపంచ పటమును పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సరియైన సమాధానములు రాయండి.
ప్రపంచ రాజకీయ పటం
ప్రశ్నలు:
i) భారతదేశం ఏ ఖండంలో ఉంది?
జవాబు:
ఆసియా ఖండం
ii) కర్కట, భూమధ్య, మకర (మూడు) రేఖలు ఏ ఖండంగా పోవుచున్నవి?
జవాబు:
ఆఫ్రికా ఖండం
iii) భారతదేశం మధ్య గుండా పోవుచున్న రేఖ ఏది?
జవాబు:
కర్కట రేఖ
iv) హిందూ మహాసముద్రం భారతదేశంకు ఏ దిక్కున కలదు?
జవాబు:
దక్షిణ దిక్కులో
v) ఆసియాను ఉత్తర అమెరికాను వేరుచేస్తున్న జలసంధి ఏది?
జవాబు:
బేరింగు జలసంధి
మీకు తెలుసా?
7th Class Social Textbook Page No. 75
సముద్రమట్టం నుండి ఎత్తు : సముద్ర ఉపరితలం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో ఎం.ఎస్.ఎల్ (సముద్రమట్టం నుండి ఎత్తు)ను ప్రామాణికంగా స్వీకరిస్తారు.
7th Class Social Textbook Page No. 81
గ్రిడ్ :
అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గడుల వంటి అమరికను గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మొదట అక్షాంశాలను, తరువాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిడ్ లోని సమాచారాన్ని పొందవచ్చు.
7th Class Social Textbook Page No. 91
టోపోగ్రాఫిక్ పటాలు :
ఈ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి. సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటిని రూపొందిస్తారు.
7th Class Social Textbook Page No. 93
ప్రక్షేపణం :
గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టినవారు డచ్ కార్టో గ్రాఫర్ (పటాలను తయారు చేసేవారు) గెరార్డస్ మెర్కేటర్.