Students can go through AP Board 7th Class Social Notes 5th Lesson కాకతీయ రాజ్యం to understand and remember the concept easily.
AP Board 7th Class Social Notes 5th Lesson కాకతీయ రాజ్యం
→ మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఐదు ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి :
→ కల్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హోయసల మరియు పాండ్య రాజ్యాలు.
→ కల్యాణి చాళుక్య వంశ స్థాపకుడు రెండవ తైలపుడు. వీరి రాజధాని బీదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి.
→ వీరు సంస్కృత, కన్నడ భాషలను ప్రోత్సహించారు.
→ బిల్హణుడు విక్రమాంకదేవ చరిత్రను రాశాడు.
→ రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవాడు.
→ కల్యాణి చాళుక్యులు ఘటికులు అనే విద్యా సంస్థలను స్థాపించారు.
→ యాదవులు మొదట కళ్యాణి చాళుక్యుల సామంతులుగా పనిచేశారు.
→ యాదవుల రాజధాని దేవగిరి.
→ బిల్లమ యాదవ రాజవంశం స్థాపకుడు.
→ సింఘన యాదవ రాజులలో సుప్రసిద్ధుడు.
→ హోయసాలుల ద్వారా సముద్రంనకు చెందినవారు.
→ బిత్తుగ విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు.
→ ద్వైత సిద్ధాంతం – మధ్వాచార్యులు, విశిష్టాద్వైతము – రామానుజాచార్యులు అనుసరించారు.
→ పాండ్యులు ‘మదురై’ ను రాజధానిగా చేసుకుని పాలించారు.
→ పాండ్య రాజైన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేసాడు.
→ మార్కోపోలో అను వెన్నీసు యాత్రికుడు కులశేఖరుని పాలనా కాలములో సందర్శించి అతని పాలనను ప్రశంసించాడు.
→ కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు.
→ ‘కాకతి’ అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అను పేరు వచ్చింది.
→ ‘కాకతి’ దుర్గా దేవి యొక్క మరొక రూపం.
→ కాకతీయ రాజవంశం ‘గుంద్యెన’ చేత స్థాపించబడింది.
→ కాకతీయులు తమ మొదటి రాజధానిగా ‘హనుమకొండ’ నుండి పాలన ప్రారంభించారు.
→ కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించటముతో తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు.
→ వీరిని ఆంధ్ర రాజులు అని కూడా పిలుస్తారు.
→ మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడుతున్న ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ రచించిన ‘తిక్కన’ ఈ కాలమునకు చెందినవాడు.
→ కాళేశ్వరము (తెలంగాణ), శ్రీశైలము (రాయలసీమ), ద్రాక్షారామం (తీర ఆంధ్ర ప్రాంతము)లను కలిపి త్రిలింగ దేశం అంటారు.
→ ఓరుగల్లు ప్రస్తుత పేరు వరంగల్, ప్రాచీన నామం – ఏకశిలా నగరం.
→ రెండవ ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157) పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి.
→ రుద్రదేవుని (క్రీ.శ. 1158-1195) విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి.
→ రుద్రదేవుడు సంస్కృత భాషలో ‘నీతి సారము’ అనే గ్రంథం రాశాడు.
→ రుద్రదేవుడు హనుమకొండలో వెయ్యి స్తంభాల గుడిని నిర్మించాడు.
→ రుద్రదేవుడు స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారింది.
→ గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1162)కు “మహా మండలేశ్వర” అనే బిరుదు కలదు.
→ కాకతీయ పాలకులలో గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైనవాడు.
→ గోదావరి ప్రాంతం నుండి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు ఎలగందల నుండి సముద్రం వరకు తన సామ్రాజ్యాన్ని (గణపతి దేవుడు) నిర్మించాడు.
→ ‘మోటుపల్లి’ శాసనాన్ని గణపతి దేవుడు జారీ చేశాడు.
→ గణపతి దేవుడు ఓరుగల్లు కోట నిర్మాణమును పూర్తి చేసాడు.
→ ‘అన్నపక్షి’ అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది.
→ హంస కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా ఉంచబడింది.
→ క్రీ.శ. 1262లో రుద్రమదేవి పాలన ప్రారంభమైంది.
→ రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించినాడు.
→ ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు పాలకుడు ‘చాళుక్య వీరభద్రుడు’ని వివాహం చేసుకుంది.
→ రుద్రమదేవి తన మనవడు ప్రతాపరుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించింది.
→ రుద్రమదేవికి గల ఇతర పేర్లు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు.
→ కాకతీయుల రాజ్యపాలన సైనిక ప్రాతిపదికగా నిర్వహించబడింది.
→ తమ రాజ్య భాగాలను చిన్న విభాగాలుగా విభజించి నాయంకరులు అనే సైనిక నాయకులను వాటి పరిపాలకులుగా నియమించారు.
→ ప్రతాపరుద్రుని కాలం నాటికి దాదాపు 172’ మంది నాయంకరులు వుండేవారు.
→ గ్రామ పరిపాలన విభాగాలను ‘స్థల’ మరియు ‘నాడు’ అనే రెండు ప్రధాన తరగతులుగా విభజించారు.
→ పది నుండి అరవై వరకు గ్రామాల సమూహాన్ని ‘స్థల’ అంటారు.
→ కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని ‘నాడు’ అంటారు.
→ ‘ఆయగార్లు’ అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవారు.
→ గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగము.
→ గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారి ‘కరణం’.
→ గ్రామ రక్షక భటుడు ‘తలారి’.
→ రాజుకి చెందిన ప్రభుత్వ భూమిని ‘రాచ పొలం’ అంటారు.
→ నీటి వసతి గలిగిన భూమిని వెలిపొలం (వెలిచేను) అనేవారు.
→ వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి – తోట పొలం (తోట భూమి).
→ ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులు ‘అర్ధశిరి’ అని పిలువబడ్డారు.
→ ‘ఇల్లరి’ అనేది కాకతీయుల నాటి గృహ పన్ను.
→ ‘పుల్లరి’ అనేది కాకతీయుల నాటి అటవీ ఉత్పత్తులపై పన్ను.
→ ‘అడ్డపట్టు సుంకం’ అనేది కాకతీయుల నాటి గొర్రెల మందపై విధించిన పన్ను.
→ పన్ను వసూలు కోసం కాకతీయులు ‘సుంకాధికారి’ అనే వారిని నియమించారు.
→ విదేశీ వాణిజ్యం అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ‘మోటుపల్లి’ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు.
→ నేరుగా చక్రవర్తికి చెల్లించవలసిన పన్నులు. దరిశనం, అప్పనం, ఉపకృతి అను పన్నులు.
→ కాకతీయుల కాలంలో శైవ మతం బాగా ప్రసిద్ది చెందింది.
→ మల్లికార్జున పండితారాధ్యుడు ‘శివతత్వసారము’ అనే గ్రంథాన్ని రచించాడు.
→ కాకతీయుల కాలంలో ‘పేరిణి’ ప్రసిద్ధ నాట్యం. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతిగాంచారు.
→ పాల్కురికి సోమనాథుడు ‘బసవ పురాణం’ అనే గ్రంథాన్ని రచించాడు.
→ నన్నెచోడుడు ‘కుమారసంభవం’ అనే గ్రంథాన్ని రచించాడు.
→ విద్యానాథుడు సంస్కృతంలో ‘ప్రతాపరుద్రీయము’ అనే గ్రంథాన్ని రచించాడు.
→ జయాపసేనాని సంస్కృతంలో ‘గీత రత్నావళి’ ‘నృత్య రత్నావళి’ అనే గ్రంథాలు రచించాడు.
→ వల్లభరాయుడు తెలుగులో ‘క్రీడాభిరామం’ అనే గ్రంథాన్ని రచించాడు.
→ వెయ్యి స్తంభాల ఆలయాన్ని ‘రుద్రేశ్వర’ ఆలయం అంటారు. ఇది హనుమకొండలో ఉంది.
→ వెయ్యి స్తంభాల ఆలయాన్ని రుద్రదేవుడు నిర్మించాడు. ‘ఏకశిలా’ నంది ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ.
→ వరంగల్ ప్రాంతంలోని ‘పాలంపేట’ గ్రామానికి సమీపంలో రామప్ప ఆలయం కలదు.
→ రేచర్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నిర్మించాడు.
→ ఈ ఆలయంలో విష్ణువు మరియు శివుడులను ఒకే చోట ఆరాధించటం ప్రసిద్ది.
→ ఈ ఆలయంలో నల్ల గ్రానైట్ రాయితో నిర్మించిన విగ్రహాలు కలవు.
→ స్తంభాల పైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించారు. ఈ శైలిని ‘త్రికూట పద్ధతి’ అని కూడా అంటారు.
→ క్రీ.శ. 1323లో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ప్రతాపరుద్రుని ఖైదు చేశారు.
→ ‘విలస’ శాసనము ఢిల్లీ సుల్తానులు, కాకతీయులపై చేసిన దండయాత్రల గురించి, ‘ముసునూరి నాయకుల’ గురించి తెల్పుతుంది.
→ ముసునూరి నాయకుల్లో ఒకరైన ప్రోలయ నాయకుడు ‘రేకపల్లె’ రాజధానిగా అధికారంలోకి వచ్చాడు.
→ ముసునూరి కాపయ నాయకుడు క్రీ.శ. 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమికొట్టడానికి తిరుగుబాటును నడిపించాడు.
→ ఘటికలు : మధ్యయుగం నాటి విద్యా సంస్థలు / కళాశాలలు.
→ సామంతులు : చక్రవర్తికి కప్పం చెల్లించే రాజులు.
→ ద్వైతము : రెండుగా ఉన్నవి (ఆత్మ, పరమాత్మ).
→ అద్వైతము : ఒక్కటి మాతమ్రే (పరమాత్మ).
→ చరిత్రకారుడు : మానవులకి సంబంధించిన గడచిన సంఘటనల గురించి అధ్యయనం చేసి వ్రాసే వ్యక్తి.
→ పురావస్తు శాస్త్రవేత్త : పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పం, శాసనాలు మరియు పురావస్తు త్రవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తి.
→ కాకతీయులు : ‘కాకతి’ అనే దేవతను ఆరాధించిన వారు కాకతీయులు.
→ త్రిలింగ దేశం : కాళేశ్వరము (తెలంగాణ), శ్రీశైలము (రాయలసీమ), ద్రాక్షారామం (కోస్తా ఆంధ్రలను) కలిపి త్రిలింగ దేశం అంటారు.
→ దివిసీమ : కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ముందు రెండు పాయలుగా విడిపోతుంది. ఈ రెండు పాయల మధ్య ప్రాంతమే దివిసీమ.
→ అన్నపక్షి : పౌరాణిక పక్షి ‘హంస’
→ మార్కోపోలో : ఇటాలియన్ యాత్రికుడు రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించాడు.
→ నాయంకరులు : కాకతీయుల చిన్న విభాగాలకు పరిపాలకులుగా నియమించబడిన సైనిక నాయకులు.
→ స్థల : పది నుండి అరవై వరకు గ్రామాల సమూహం.
→ నాడు : కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతం నాడు.
→ ఆయగార్లు : గ్రామ పాలనను పర్యవేక్షించే గ్రామ అధికారులు.
→ కరణం : గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారి.
→ రెడ్డి : గ్రామ పెద్ద.
→ తలారి : గ్రామ రక్షక భటుడు.
→ రాచపొలం : రాజుకి చెందిన ప్రభుత్వ భూమి.
→ వెలిపొలం (వెలిచేను) : నీటి వసతి గలిగిన భూమి.
→ తోట పొలం (తోట భూమి) : వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి.
→ ‘అర్ధశిరి’ : ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగుచేసిన రైతులు.
→ ‘ఇల్లరి’ : గృహపన్ను.
→ పుల్లరి : అటవీ ఉత్పత్తులపై పన్ను.
→ అడ్డపట్టు సుంకం : గొర్రెల మందపై విధించిన పన్ను.
→ సుంకాధికారి : పన్నులు వసూలు చేయటం కోసం నియమించిన అధికారి.
→ పేరిణి నాట్యం : యుద్ధ సమయంలో ప్రదర్శించే కాకతీయుల నాటి ప్రసిద్ధ నాట్యం.
→ ఏకశిలా నంది : ఒకే రాయిపై చెక్కిన నంది విగ్రహము.
→ సప్త స్వరాలు : ఏడు స్వరములు (స,రి,గ,మ,ప,ద,ని).
→ విలాస శాసనము : ముసునూరి నాయకుల గూర్చి తెలుపు శాసనము.
→ ఇతిహాసాలు : రామాయణం, మహాభారతం భారతదేశ ఇతిహాసాలు.
→ త్రికూట పద్దతి : మండపము, అంతరాలయము మరియు గర్భగుడి ఇలాంటి మూడు నిర్మాణ నమూనాలతో నిర్మితమైన శైలిని త్రికూట పద్ధతి అంటారు.
→ వారసత్వం : పూర్వీకుల నుండి అందించబడినది.
→ రేకపల్లె : పాపికొండల సమీపంలో శబరి నది లోయలో కల్గిన ప్రాంతం.
→ సామంత ప్రభువులు : చక్రవర్తి ఆదేశాలు లేదా సూచనలను విధేయతతో అనుసరిస్తూ అతని అధీనంలో ఉన్నవారు.
→ పోషకులు : సంస్కృతిని మరియు వారసత్వంను పెంపొందించడానికి తమ సహాయాన్ని మద్దతును ఇచ్చిన పాలకులు.
→ వీర శైవం : హిందూ మతం నుండి మధ్య యుగములో నూతనముగా ఆవిర్భవించిన ఒక శాఖ.
→ శాసనం : లిఖించబడిన ఒక చారిత్రక సంఘటన లేదా ఆదేశము.
→ శోభ : ప్రకాశవంతమైన శిల్పకళా ప్రదర్శన.
→ రాజవంశం : ఒకే సంతతికి చెందిన పాలకులు వారసత్వ పాలన చేయుట.
→ సయోధ్య కుదరని సామంత ప్రభువులు : చక్రవర్తికి అవిధేయులుగా ఉన్నవారు.
→ శాంతి ఒప్పందము : యుద్ధము. ముగింపు తరువాత కొనసాగడానికి మరియు అనుసరించడానికి కుదుర్చుకున్న అంగీకారము.
→ వారసుడు : వంశ పారంపర్యంగా బాధ్యతలు చేపట్టే అర్హత కలిగిన వ్యక్తి.
→ తెగ : ఒక సాధారణ పూర్వీకుల నుండి వచ్చిన వారి సమూహం.
1.
2.
3.
4.