AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

These AP 7th Class Social Important Questions 1st Lesson విశ్వం మరియు భూమి will help students prepare well for the exams.

AP Board 7th Class Social 1st Lesson Important Questions and Answers విశ్వం మరియు భూమి

ప్రశ్న 1.
విశ్వం ఆవిర్భావం గురించిన సిద్ధాంతమును వివరించండి.
జవాబు:
విశ్వం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒక సిద్ధాంతం మహా విస్ఫోటన సిద్ధాంతం (బిగ్ బ్యాంగ్).

మహా విస్ఫోటన సిద్ధాంతం :
విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహా విస్పోటన (బిగ్ బ్యాంగ్) సిద్ధాంతాన్ని మొదట జార్జి లెమైటర్ అనే ఒక బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికీ విస్తరిస్తోందని అతను గట్టిగా నమ్మాడు. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది.

అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా, అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికీ జరుగుతూనే ఉంది.
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 1

ప్రశ్న 2.
సౌర కుటుంబ ఆవిర్భావం గురించిన సిద్ధాంతాలను తెల్పండి.
జవాబు:
సౌర కుటుంబం ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు.
1) భూ కేంద్రక సిద్ధాంతం :
ఈ సిద్ధాంతాన్ని టాలెమి అనే ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది.

2) సూర్య కేంద్రక సిద్ధాంతం :
ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం, సూర్యుడు కేంద్రస్థానంలో ఉండి, గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి.
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 2

3) గ్రహాలు మరియు ఉపగ్రహాలు :
నీహారిక (నెబ్యులర్) పరికల్పన ప్రకారం, గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలున్నాయి. వాటిలో భూమి ఒకటి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 3.
సౌర కుటుంబం గురించి మీకేమి తెలుసో వ్రాయండి.
జవాబు:

  1. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు ఎనిమిది గ్రహాలతో రూపొందించబడింది.
  2. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు (అంగారకుడు), బృహస్పతి (గురుడు), శని, వరుణుడు మరియు ఇంద్రుడు.
    AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 3
  3. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి.
  4. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 మిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌరకుటుంబం ఆవిర్భవించింది.

ప్రశ్న 4.
పర్యావరణం అంటే ఏమిటో విపులంగా తెలియజేయండి.
జవాబు:

  1. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అని అంటారు.
  2. ఇది సహజ మరియు మానవ నిర్మిత అంశాల రెండింటి కలయిక.
  3. ఇది మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. ఇది, మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి వాటిని మనకు అందిస్తుంది.
  4. ఇది కంటికి కనిపించని ఎన్నో రకాల సూక్ష్మజీవులు, జంతువులు, మొక్కలు మరియు మానవులను కలిగి ఉంటుంది.

ప్రశ్న 5.
శిలావరణము అనగానేమి? శిలావరణము గురించి వివరించండి.
జవాబు:

  1. భూమి యొక్క రాతి పొరను శిలావరణము అంటారు.
  2. శిలావరణము (లిథోస్పియర్) అనే పదం “లిథో” మరియు “స్పెరా” అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది.
  3. లిథో అంటే “రాయి” మరియు “స్పెరా” అంటే “గోళం” లేదా “బంతి” అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న “ప్రపంచ ధరిత్రీ దినోత్సవం”.
  4. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది, మట్టి యొక్క పలుచని పొరతో కప్పబడి ఉంటుంది.
  5. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన వివిధ భూభాగాలతో కూడిన క్రమరహిత ఉపరితలం.
  6. ఈ భూస్వరూపాలను మూడు శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి మరియు మూడవ శ్రేణి.

ప్రశ్న 6.
పర్యావరణం యొక్క అంశాలను తెలుపు ఫ్లో చార్టును గీయండి.
జవాబు:
పర్యావరణం యొక్క అంశాలను సహజ, మానవ మరియు మానవ నిర్మిత అంశాలు అని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 4

ప్రశ్న 7.
భూమి యొక్క అంతర్భాగంను విశదీకరించండి.
జవాబు:

  1. మనం గమనిస్తే భూమి నిర్మాణం కోడి గ్రుడ్డుకి ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది.
  2. ఈ పొరలు ఒకదానికొకటి మందంలో మరియు వాటి భౌతిక మరియు రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి.
    AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 5
  3. భూమి మూడు పొరలను కలిగి ఉంటుంది. వాటికి ఈ క్రింది విధంగా పేర్లు పెట్టారు.
    1) భూ పటలము,
    2) భూ ప్రావారము,
    3) భూ కేంద్రము.

ప్రశ్న 8.
జలావరణము అనగానేమి? వివరంగా తెలియజేయండి.
జవాబు:

  1. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణము అంటారు.
  2. “హైడ్రోస్పియర్” (జలావరణము) అనే పదం ‘హైడర్’ మరియు ‘స్పెరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘హైడర్’ అంటే నీరు మరియు ‘స్పెరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం.
  3. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని “జలయుత గ్రహం” అని పిలుస్తారు.
  4. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలి పైన ఆధారపడి ఉంది.
  5. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వ వంతు (71%) నీటితో ఆవరించి ఉంది.
  6. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది.
  7. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలగు రూపంలో ఉంటుంది.
  8. జలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది.
  9. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ళ పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భ జలం అంటారు.
  10. జలావరణము అన్ని జీవులకు నీటిని అందిస్తుంది.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 9.
వాతావరణంలోని వాయువులు మరియు పొరలను (ఆవరణాలను) గూర్చి తెల్పండి.
జవాబు:
AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి 6

  1. వాతావరణం అనేక వాయువుల మిశ్రమం.
  2. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు.
  3. ఆక్సిజన్ “ప్రాణ వాయువు”గా పరిగణించబడుతుంది. ఆక్సిజన్ లేకుండా ప్రాణం లేదు.
  4. వృత్త రేఖా చిత్రం (వాతావరణంలోని వాయువులు) మీకు వాతావరణం యొక్క వివిధ వాయువుల శాతాన్ని తెలుపుతుంది.
  5. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి ఐదు పొరలుగా విభజించబడింది.
  6. అవి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, ధర్మో ఆవరణము మరియు ఎక్సో ఆవరణము.
  7. వీటి మధ్య కచ్చితమైన సరిహద్దు లేదు.

ప్రశ్న 10.
మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణంల గురించి వివరించండి.
జవాబు:

  1. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. ఇది వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది.
  2. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తరువాత, మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ప్రారంభించారు.
  3. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది.
  4. మానవ నిర్మిత పర్యావరణం : మానవులు తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు.
  5. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

ప్రశ్న 11.
కాలుష్యం అనగానేమి? వాయు కాలుష్య కారకాలను పేర్కొని, వాయు కాలుష్య ప్రాధాన్యతను తెల్పండి.
జవాబు:

  1. పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు.
  2. ఇది గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలలో అవాంఛనీయ మార్పు తెస్తుంది.
  3. ఇది అన్ని జీవులలో ఆరోగ్య సమస్యలకు కారణమౌతుంది.
  4. వాయు కాలుష్యం యొక్క కారకాలు : బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరో ఫ్లోరో కార్బన్లు మొదలైనవి.
  5. వాయు కాలుష్యం ప్రభావం : గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతు జాతులు అంతరించిపోవడం మరియు శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు వంటివి సంభవిస్తాయి.

ప్రశ్న 12.
నీటి కాలుష్యం అనగా నేమి? దీనికి కారణాలేవి?
జవాబు:
1) నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడి నట్లయితే దానిని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు.

2) నీటి కాలుష్యానికి కారణాలు :
వివిధ వ్యర్థాల కారణంగా నీరు కలుషితమవుతుంది. అవి, ఎ) పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రీయ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. ఉదా : కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు. 2) ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్యం సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి.

ప్రశ్న 13.
గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు తెల్పుము.
జవాబు:
గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు:

  1. పర్యావరణ విద్యను పాఠ్యాంశాల్లో తప్పనిసరిగా చేర్చాలి.
  2. పునర్వినియోగం చేయడం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం.
  3. మన అటవీ సంపదను కాపాడటానికి ఎక్కువ మొక్కలను నాటడం.
  4. పునరుత్పాదకతకు వీలు కాని వనరులకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం.
  5. బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం.
  6. పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపడం మానుకోవాలి. విలువైన సముద్ర జీవులను కాపాడుకోవడానికి ఇది అవసరమైన చర్య.

ప్రశ్న 14.
విపత్తు అనగానేమి? విపత్తు రకాలు ఏవి? వాటి నివారణ పద్దతులేవి?
జవాబు:
విపత్తు:

  1. విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం.
  2. దీనివలన విస్తృతమైన మానవ, శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది.
  3. ఇది సమాజానికి దాని స్వంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది.

విపత్తుల రకాలు :
ఎ) ప్రకృతి విపతులు : ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం . దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు – సేవను కోల్పోవడం, సామాజిక మరియు ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టం సంభవిస్తాయి.
ఉదా :
కరువు : ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి.

బి) మానవకారక విపత్తులు :
ఇవి సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలు.

నివారణ పద్దతులు :
సంసిద్ధత, ప్రమాదాల నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం ద్వారా గాయాలు కాకుండా నివారించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, విపత్తుల గురించి సమాచారం కలిగి ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లడానికి ప్రణాళికను కలిగి ఉండటం, అత్యవసర వస్తు సామగ్రి అందుబాటులో ఉండటం, ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంటిలో సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం వంటివి ప్రమాద సమయంలో నష్టాలను తగ్గిస్తాయి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

ప్రశ్న 15.
విపత్తు నిర్వహణ అనగానేమి ? విపత్తు నిర్వహణ ఎలా చేపడతారు?
జవాబు:

  1. ఏదైనా (విపత్తు) ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు.
  2. విపత్తు తీవ్రత లేదా పరిణామాలను తగ్గించడం, ఏదైనా విపత్తును ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు.
  3. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు సంబంధించినది.
  4. పదవ ప్రణాళిక : పదవ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ “అభివృద్ధి అంశం”గా నిర్ణయించబడింది. పదవ ప్రణాళిక విపత్తుల నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించినది.

మీకు తెలుసా?

7th Class Social Textbook Page No.7

విశ్వం అనే పదం లాటిన్ పదమైన “యూనివర్సమ్” నుండి ఉద్భవించింది. దీని అర్థం “మొత్తం పదార్థం” మరియు “మొత్తం అంతరిక్షం”. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. ఖగోళ శాస్త్రవేత్త అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తియే ఖగోళ శాస్త్రవేత్త.

7th Class Social Textbook Page No.9

కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

7th Class Social Textbook Page No.11

“పర్యావరణం” (ఎన్విరాన్మెంట్) అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్నిరోనర్ అంటే ‘పొరుగు’ అనే అర్థం నుంచి ఉత్పన్నమైంది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

7th Class Social Textbook Page No. 17

శిలావరణము (లిథోస్పియర్) అనే పదం ‘లిథో’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘లిథో’ అంటే ‘రాయి’ మరియు ‘స్పైరా’ అంటే “గోళం” లేదా “బంతి” అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22 ను “ప్రపంచ ధరిత్రీ దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 19

హైడ్రోస్పియర్ (జలావరణము) అనే పదం ‘హైడర్’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘హైడర్’ అంటే నీరు మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం మార్చి 22ను “ప్రపంచ జల దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 21

వాతావరణం (అట్మాస్ఫియర్) అనే పదం ‘అట్మోస్’ మరియు ‘స్పైరా’ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. ‘అట్మోస్’ అంటే ఆవిరి అని మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను “ప్రపంచ ఓజోన్ దినోత్సవం”గా జరుపుకుంటాము.

7th Class Social Textbook Page No. 23

జీవావరణం (బయోస్పియర్) అనే పదం గ్రీకు పదాలైన ‘బయోస్’ మరియు ‘స్పైరా’ నుండి ఉద్భవించింది. ‘బయోస్’ అంటే జీవం మరియు ‘స్పైరా’ అంటే గోళం లేదా బంతి.

AP 7th Class Social Important Questions Chapter 1 విశ్వం మరియు భూమి

7th Class Social Textbook Page No. 29

  1. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం.
  2. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో ఆకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం.