These AP 7th Class Telugu Important Questions 11th Lesson బాలచంద్రుని ప్రతిజ్ఞ will help students prepare well for the exams.
AP Board 7th Class Telugu 11th Lesson Important Questions and Answers బాలచంద్రుని ప్రతిజ్ఞ
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత పద్యాలు
కింది పరిచిత పద్యాల్ని చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. నలగాము డెరుగును నాదుశౌర్యంబు
ప్రళయకాలమునాటి భైరవురీతి
సైంధవవధ వేళ సాహసస్పూర్తి
విజయుడు రణములో విహరించునట్లు
కౌరవ సేనలో గదబట్టిదూరి
వడముడిరణమున వ్రాలినయట్లు
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘విజయుడు’ అంటే ఎవరు?
జవాబు:
అర్జునుడు
ఆ) కౌరవుల మీద గద పట్టి యుద్ధం చేసినదెవరు?
జవాబు:
భీముడు
ఇ) ‘నాదు శౌర్యంబు’లో ‘నాదు’ అంటే ఎవరు?
జవాబు:
బాలచంద్రుడు
ఈ) ‘ప్రళయకాలం’ అంటే ఏమిటి?
జవాబు:
భూమిపై ప్రాణులు నశించే కాలం.
2. వాయుపుత్రుడు లంక వడితోడఁడొచ్చి
భస్మంబుగావించి ప్రబలినభంగి
రాక్షసరణములో రామచంద్రుండు
వీరపరాక్రమవిధి జెందినట్లు
జలధిమధ్యంబున సారెకుదిరుగు
మందర శైలంబుమాడ్కిఁ దోఁపంగ
ఫాలాక్షుఁడతి రౌద్రపటిమ మీఱంగ
త్రిపురముల్ గాలిచి తీర్చినయట్లు
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘వాయుపుత్రుడు’ ఎవరు?
జవాబు:
ఆంజనేయుడు
ఆ) మంథర శైలము ఏ సముద్రంలో ఆధారంగా నిలిచింది?
జవాబు:
పాలసముద్రంలో
ఇ) ‘ఫాలాక్షుడు’ అంటే ఎవరు?
జవాబు:
శివుడు
ఈ) ‘భస్మము’ అంటే ఏమిటి?
జవాబు:
బూడిద
3. దహనునికడ్డంబె దట్టమౌ వనము
బడబాగ్ని నార్చునే పాదౌథిమించి
భయదమౌపులికిని పశుగణం బెదురె
స్వాతికొక్కెరగుంపు సాళ్వంబు కెదురె
జింకలకదుపులు సివ్వంగికీడె
చిన్న మిర్యమునం చెడునె కారంబు
ప్రశ్నలు:
అ) ‘పాథోథి’ అంటే ఏమిటి?
జవాబు:
సముద్రం
ఆ) భయంకరమైన పులిని ఏవి ఎదిరించలేవు?
జవాబు:
పశు సమూహం
ఇ) సాళ్వము అంటే ఏమిటి?
జవాబు:
డేగ
ఈ) వేగంలో సివంగికి ఏవి సాటి కావు?
జవాబు:
జింకల సమూహం
అపరిచిత పద్యాలు
కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. భూగోళం పుట్టుకకోసం
కూలిన సురగోళా లెన్నో?
ఈ మానవరూపంకోసం
జరిగిన పరిణామాలెన్నో?
ప్రశ్నలు – జవాబులు:
అ) దేని పుట్టుక జరిగింది?
జవాబు:
భూగోళం పుట్టుక జరిగింది.
ఆ) ఏ గోళాలు కూలినవి?
జవాబు:
సురగోళాలు కూలినవి.
ఇ) ఎవరి రూపం జరిగింది?
జవాబు:
మానవరూపం జరిగింది.
ఈ) మానవరూపం కోసం ఏం జరిగింది?
జవాబు:
మానవరూపం కోసం పరిణామం జరిగింది.
2. పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో?
గాయపడిన కవిగుండెల్లో
రాయబడని కావ్యాలెన్నో?
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎవరు నిదురపోతున్నారు?
జవాబు:
పసిపాపలు నిదురపోతున్నారు.
ఆ) పసిపాపల కనులలో ఏం మురిసింది?
జవాబు:
పసిపాపల కనులలో భవితవ్యం మురిసింది.
ఇ) ఎవరి గుండె గాయపడింది?
జవాబు:
కవి గుండె గాయపడింది.
ఈ) రాయబడనివి ఏవి?
జవాబు:
కావ్యాలు రాయబడలేదు.
3. ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరులెందరో?
భూగోళం పుట్టుక కోసం
కూలిన సుర గోళాలెన్నో?
ఈ మానవ రూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో?
ప్రశ్నలు:
అ) సముద్రం తన గర్భంలో దాచినది ఏమిటి?
జవాబు:
బడబానలం
ఆ) కనిపించని భాస్కరులు అంటే ఎవరు?
జవాబు:
ప్రతిభ ఉన్నా పైకి రాక మరుగున పడినవారు.
ఇ) ఈ మానవ రూపం కోసం ఏం జరిగాయని గేయ భాగం తెలుపుతుంది?
జవాబు:
ఎన్నోమార్పులు (పరిణామం)
ఈ) పై గేయ భాగం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
ఈ గేయం ఎవరి రచన?
4. కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములులేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ !
ప్రశ్నలు – జవాబులు:
అ) కలహపడే ఇంట్లో ఏం నిలువదు?
జవాబు:
కలహపడే ఇంట్లో లక్ష్మి (సంపద) నిలువదు.
ఆ) కలకాలం ఎలా మెలగాలి?
జవాబు:
కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి.
ఇ) ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది?
జవాబు:
ఈ పద్యం కుమారిని సంబోధిస్తూ అంటే ఆడ పిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘కలహం-నష్టం’
5. తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత ?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత ?
విడిచిరే యత్న మమృతంబు వొడుముదనుక ?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఉదధి రత్నముల చేత తృప్తి చెందని వారెవరు?
జవాబు:
వేల్పులు, ఉదధి రత్నములచేత తృప్తి చెందలేరు.
ఆ) నిపుణమతులు ఎటువంటివారు?
జవాబు:
నిపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు.
ఇ) వేల్పులు దేన్ని చూసి భయపడలేదు?
జవాబు:
వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక “నిపుణమతుల పట్టుదల”.
6. అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ అద్దమందు కొంచెమై ఉండదా
విశ్వదాభిరామ వినుర వేమ.
ప్రశ్నలు – జవాబులు:
అ) ఎక్కడ అధికుల మనకూడదు?
జవాబు:
అనువుగాని చోట అధికులమనరాదు.
ఆ) కొండ ఎక్కడ చిన్నదిగా కనిపిస్తుంది?
జవాబు:
కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది.
ఇ) ‘కొదువ’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కొదువ అంటే లోటు అని అర్థం.
ఈ) పై పద్యంలో ఎవరిని సంబోధించారు?
జవాబు:
పై పద్యంలో వేమనను సంబోధించారు.
II. వ్యక్తీకరణ -సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
శ్రీనాథుని గురించి వ్రాయండి.
జవాబు:
కవిపేరు : శ్రీనాథుడు
ఉద్యోగం . : పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు.
బిరుదులు : కవిసార్వభౌముడు.
రచనలు : మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధం, కాశీఖండం, హరవిలాసం, పల్నాటి వీరచరిత్ర, క్రీడాభిరామం మొదలైనవి.
ప్రత్యేకతలు : ఆయన రచించిన చాటు పద్యాలు చాలా ప్రఖ్యాతిని పొందాయి.
ప్రశ్న 2.
బాలచంద్రుని ప్రతిజ్ఞకు నేపథ్యం వ్రాయండి.
జవాబు:
పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా “నీ పౌరుషం బొంగరాలాటలో కాదు. యుద్ధభూమిలో చూపించు. పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు” అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనిది.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఈ పాఠంలో బాలచంద్రుని మాటల ద్వారా అతను భారతం చదివాడని ఎలా చెప్పగలవు?
జవాబు:
ఈ పాఠంలో బాలచంద్రుడు సైంథవ వధ వేళ అర్జునుని వలె యుద్ధరంగంలో విహరిస్తానని అన్నాడు.
దీనిని బట్టి అతను మహాభారతం చదివాడు. మహాభారతంలో కౌరవులు పన్నిన పద్మవ్యూహం గురించి చదివాడు. అభిమన్యుని మరణానికి ప్రధాన కారకుడు సైంధవుడని అతనికి తెలుసు. సూర్యాస్తమయంలోగా సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం గురించి బాలచంద్రుడు బాగా తెలుసుకొన్నాడని అర్థమౌతుంది.
భీముడు చేసిన గదాయుద్ధం, అతను కౌరవ సైన్యాన్ని అల్లకల్లోలం చేసిన తీరు బాలచంద్రుడు భారతం చదివి లేదా విని తెలుసుకొన్నాడని కచ్చితంగా చెప్పవచ్చును.
ప్రశ్న 2.
బాలచంద్రుని లోకజ్ఞానం గురించి వ్రాయండి.
జవాబు:
బాలచంద్రుడు లోకజ్ఞానం ఎక్కువగా కలవాడు. ఈ విషయం అతను చెప్పిన ఉదాహరణల ద్వారా తెలుస్తోంది.
ఉరుమని పిడుగు, కంటిలో నలుసు మొదలైన జాతీయాలు చక్కగా ప్రయోగించాడు. సముద్రం బడబానలను ఆర్పలేదన్నాడు. అగ్నికి వనం అడ్డం కాదన్నాడు. పులిని చిన్న చిన్న జంతువులు ఏమీ చేయలేవన్నాడు. డేగను కొంగలు ఎదిరించలేవన్నాడు. జింకల గుంపులు సివంగినేమీ చేయలేవు అన్నాడు. మిరియపు గింజ చిన్నదైనా ఘాటెక్కువని చెప్పాడు. వీటిని బట్టి బాలచంద్రునకు లోకజ్ఞానం ఎక్కువని తెలుస్తోంది.
II. భాషాంశాలు
పర్యాయపదాలు
తల్లి = అమ్మ, మాత
పలుకు = మాట, వాణి
భామ = స్త్రీ, పడతి
శౌర్యం = పరాక్రమం, విక్రమం
కాలము = సమయము, ప్రొద్దు
భైరవుడు = కాలభైరవుడు, శివుడు
వధ = చంపడం, హత్య
సాహసం = ధైర్యం, నిర్భయం
విజయుడు = అర్జునుడు, నరుడు
రణము = యుద్ధం, పోరు
సేన = సైన్యం, దళము
వడముడి = భీముడు, కోదరుడు
వాయుపుత్రుడు= హనుమంతుడు, ఆంజనేయుడు
భస్మము = బూడిద, బూది
భంగి = వలె, విధము, మాడ్కి
జలధి = సముద్రం, ఉదధి, అభి, పాదోధి
శైలము = పర్వతం, గిరి
ఫాలాక్షుడు = శివుడు, పరమేశ్వరుడు
గాలి = వాయువు, గాడ్పు
శక్తి = బలము, సత్తువ
పృథ్వి = భూమి, పుడమి
పీనుగు = శవము, పార్థివ శరీరం
మది = మనస్సు, మతి
ఉర్వీశుడు = రాజు, ప్రభువు
పిడుగు = కులిశము, అశని
పగవారు = శత్రువులు, అరులు
నెత్తురు = రుధిరం, రక్తం
దహనుడు = వహ్ని, అగ్ని
వనము = అడవి, విపినం
పులి = వ్యాఘ్రము, పుండరీకం
పశువు = జంతువు, పసరము
కొంగ = కొక్కెర, బకము
సాళ్వము = డేగ, సాళువము
జింక = మృగము, లేడి
కదుపు = సమూహం, గుంపు
సివ్వంగి = సింగము, సివంగి
బాలుడు = బాలకుడు, పిల్లవాడు
ప్రకృతి – వికృతులు
చంద్రుడు – చందురుడు
ప్రతిజ్ఞ – ప్రతిన
భస్మము – బసుమము
పుత్రుడు – బొట్టెడు
రాక్షసులు – రక్కసులు
లంక – లంకె పశువు
పశువు – పసలము
స్థావరము – తావరము
శక్తి – సత్తువ మది
పృథ్వి – పుడమి
దళము – దణా
గర్వము – గరువము
అగ్ని – అగ్గి
శక్తి – సత్తువ
మరీచము – మిరియము
వ్యతిరేక పదాలు
బాలుడు × వృద్ధుడు
భయము × నిర్భయము
ఎరుగును × ఎరుగడు
నాటి × నేటి
సాహసం × పిరికితనం
చొచ్చి × విరమించి
రాక్షసులు × దేవతలు
అతి × మితి
సకలం × శకలం
శక్తి × అశక్తి
గర్వము × నిగర్వము
దట్టము × పలుచన
చిన్న × పెద్ద
సంధులు (ఉత్వసంధి)
భయమేల = భయము + ఏల
నీవిపుడు = నీవు + ఇపుడు
నలగాముడెరుగును= నలగాముడు + ఎరుగును
ఫాలాక్షుడతి = ఫాలాక్షుడు + అతి
దళములకురుమని= దళములకు + ఉరుమని
ఎదురెవ్వరే = ఎదురు + ఎవ్వరు + ఏ
దట్టమౌ = దట్టము + ఔ
పశుగణం బెదురె = పశుగణంబు + ఎదురు+ఎ
సాళ్వంబుకెదురె = సాళ్వంబుకు + ఎదురు+ఎ
బాలుడనని = బాలుడను + అని .
అత్వసంధి
చెందినట్లు = చెందిన + అట్లు
ఇత్వసంధి
దహనునికడ్డంబె = దహనునికి + అడ్డంటే
సివ్వంగికీడె = సివ్వంగికి + ఈడె
యడాగమం
వ్రాలినయట్లు = వ్రాలిన + అట్లు
తీర్చినయట్లు = తీర్చిన + అట్లు
సరళాదేశ సంధి
వడితోడఁజొచ్చి = వడితోడన్ + చొచ్చి
మాడ్కిందోపంగ = మాడ్కిన్ + తోపంగ
ముంచంగఁబరగిన= ముంచంగన్ + పరగిన
నిండంగఁజేతు = నిండంగన్ + చేతు
గసడదవాదేశ సంధి
త్రిపురముల్ గాలిచి= త్రిపురముల్ + కాలిచి
పెంటలుగాగ = పెంటలు + కాగ
భస్మంబుగావించి = భస్మంబు + కావించి
సవర్ణదీర్ఘ సంధి
ఫాలాక్షుడు = ఫాల + అక్షుడు
ప్రళయాబ్ది = ప్రళయ + అబ్ది
ఉర్వీశుడు = ఉర్వి + ఈశుడు
బడబాగ్ని = బడబ + అగ్ని
సమాసములు (షష్ఠీ తత్పురుష సమాసం)
బాలచంద్రుని ప్రతిజ్ఞ = బాలచంద్రుని యొక్క ప్రతిజ్ఞ
నాదుశౌర్యంబు = నా యొక్క శౌర్యంబు
సైంధవ వధ = సైంధవుని యొక్క వధ
వాయుపుత్రుడు = వాయువు యొక్క పుత్రుడు
జలధి మధ్యంబు = జలధి యొక్క మధ్యంబు
ఉర్వీశు దళము = ఉర్వీశుని యొక్క దళము
ఉర్వీశుడు = ఉర్వికి ఈశుడు
నలగాము బలములు = నలగాముని యొక్క బలములు
పశుగణంబు = పశువుల యొక్క గణంబు
కొక్కెరగుంపు = కొక్కెరల యొక్క గుంపు
జింకల కదుపులు = జింకల యొక్క కదుపులు
ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.
1. పిరికితనం పనికిరాదు. …………… చేయరా డింభకా ! (సాహసం)
2. తెలుగు చాలామంది ఎరుగును కాని ఆంగ్లం …………… (ఎరుగరు)
3. నాటి సినిమాలు ………….. సినిమాలు వేర్వేరు. (నేటి)
4. అంతఃపురం చొచ్చి ……………… (విరమించాడు)
5. రాక్షసులు దుర్మార్గులు, ……………. సన్మార్గులు. (దేవతలు)
6. అతి అన్ని చోట్లా పనికిరాదు ……………… గా ఉండాలి. (మితి)
7. సకలం పరమాత్మే …………… లేదు. (శకలం)
8. గర్వము పనికిరాదు ………………. తో జీవించాలి. (నిగర్వము)
9. చిన్న అగ్ని కణం కూడా ……………….. ప్రమాదం తెస్తుంది. (పెద్ద)
10. బాలురు, ……………. సమానమే. (బాలికలు)
సంధులు
1. భయమేల = భయము + ఏల – ఉత్వ సంధి
2. ముంచంగఁ బరగిన = ముంచంగన్ + పరగిన – సరళాదేశ సంధి
3. చెందినట్లు చెందిన + అట్లు – అత్వ సంధి
4. దహనుని కథంబె = దహనునికి + అడ్డంబె – ఇత్వ సంధి
5. త్రిపురముల్ గాలిచి = త్రిపురముల్ + కాలిచి – గసడదవాదేశ సంధి
6. ఉర్వీశుడు ఉర్వి + ఈశుడు – సవర్ణదీర్ఘ సంధి
7. వ్రాలినయట్లు = వ్రాలిన + అట్లు – యడాగమం
8. సివ్వంగికీడె = సివ్వంగికి + ఈడె – ఇత్వ సంధి
IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భాషాంశాలు
అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.
1. వీరులకు శౌర్యం సహజం.
a) పరాక్రమం
b) ధైర్యం
c) సాహసం
d) శక్తి
జవాబు:
a) పరాక్రమం
2. రణములో పిరికితనం పనికిరాదు.
a) కత్తి
b) యుద్ధం
c) విజయం
d) ధైర్యం
జవాబు:
b) యుద్ధం
3. పాండవ మధ్యముడు విజయుడు.
a) భీముడు
b) నకులుడు
c) సహదేవుడు
d) అర్జునుడు
జవాబు:
d) అర్జునుడు
4. వడముడి చాలా బలవంతుడు.
a) అర్జునుడు
b) రావణుడు
c) భీముడు
d) వాలి
జవాబు:
c) భీముడు
5. జలధిలో కెరటాలెక్కువ ఉంటాయి.
a) సముద్రం
b) కాల్వ
c) సెలయేరు
d) గోదావరి
జవాబు:
a) సముద్రం
6. భస్మమును శివుడు శరీరానికి పూసుకొంటాడు.
a) గంధం
b) పన్నీరు
c) అమృతం
d) బూడిద
జవాబు:
d) బూడిద
7. శైలము యొక్క పుత్రిక పార్వతి. .
a) హిమాలయం
b) కొండ
c) బండ
d) శివుడు
జవాబు:
b) కొండ
8. పగవారిని కూడా క్షమించాలి.
a) శత్రువులను
b) మిత్రులను
c) బంధువులను
d) చుట్టాలను
జవాబు:
a) శత్రువులను
9. కొక్కెరకు చేపలంటే ఇష్టం.
a) నక్క
b) కొంగ
c) పక్షి
d) ఖగము
జవాబు:
b) కొంగ
10. సివంగి అంటే అన్ని జంతువులకూ భయమే.
a) ఏనుగు
b) తోడేలు
c) ఆడసింహం
d) నక్క
జవాబు:
c) ఆడసింహం
పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
11. తల్లిదండ్రుల మాట వినాలి.
a) మాత, అమ్మ
b) జనని, జనకుడు
c) చెలి, సఖి
d) దేవత, దైవం
జవాబు:
a) మాత, అమ్మ
12. భామలను గౌరవించాలి.
a) స్త్రీ, అమ్మ
b) అంబ, అమ్మ
c) పడతి, స్త్రీ
d) వనిత, వనజ
జవాబు:
c) పడతి, స్త్రీ
13. కాలము కలిసి రావాలి.
a) సమయం, యుద్ధం
b) సమయం, ప్రొద్దు
c) ప్రొద్దు, నలుపు
d) ప్రొద్దు, సాయంత్రం
జవాబు:
b) సమయం, ప్రొద్దు
14. భైరవుడు పూజ్యనీయుడు.
a) శివుడు, బ్రహ్మ
b) బ్రహ్మ, విష్ణువు
c) విష్ణువు, లక్ష్మి
d) శివుడు, కాలభైరవుడు
జవాబు:
d) శివుడు, కాలభైరవుడు
15. విజయుడు విజయం పొందనిదే శాంతించడు.
a) అర్జునుడు, భీముడు
b) భీముడు, వడముడి
c) అర్జునుడు, నరుడు
d) ధర్మరాజు, భీముడు
జవాబు:
c) అర్జునుడు, నరుడు
16. రణములో వెన్నుచూపకూడదు.
a) యుద్ధం, పోరు
b) రాజ్యం, యుద్ధం
c) శత్రువు, వైరి
d) వీధి, వాడ
జవాబు:
a) యుద్ధం, పోరు
17. గాలి చల్లగా లేదు.
a) వాయువు, అగ్ని
b) వాయువు, ఆకాశం
c) వాయువు, గాడ్పు
d) చలి, శీతువు
జవాబు:
c) వాయువు, గాడ్పు
18. జలధిలో నిధి నిక్షేపాలుంటాయి.
a) సముద్రం, ఉదధి
b) గిరి, గిరిజ
c) జలజం, జలజాక్షి
d) నది, నదము
జవాబు:
a) సముద్రం, ఉదధి
19. పృథ్విపై సింహం బలమైన జంతువు.
a) నేల, నింగి
b) లోకం, జగం
c) భూమి, పుడమి
d) గగనం, నింగి
జవాబు:
c) భూమి, పుడమి
20. నెత్తురు చిమ్మేలా కొట్టుకోకూడదు.
a) రక్తం, రుధిరం
b) రక్తం, మాంసం
c) కన్నీరు, అశ్రువులు
d) బాధ, దుఃఖం
జవాబు:
a) రక్తం, రుధిరం
ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.
21. బాలచంద్రుడు ప్రతిజ్ఞ చేశాడు.
a) ప్రజ్ఞ
b) ప్రతిన
c) ప్రతిజ్ఞము
d) ప్రజ్ఞానం
జవాబు:
b) ప్రతిన
22. అగ్నితో చెలగాటమాడకూడదు.
a) అగిని
b) అగ్గిని
c) అగ్గి
d) అగ్నము
జవాబు:
c) అగ్గి
23. మిరియము చిన్నదైనా ఘాటెక్కువ.
a) మరియము
b) మరీచము
c) మారీచము
d) మరీచిక
జవాబు:
b) మరీచము
24. బసుమముతో ఆటలాడకు.
a) భస్మము
b) బాసుమతి
c) బసమ
d) బసవడు
జవాబు:
a) భస్మము
25. రక్కసులు ప్రమాదకారులు.
a) రక్షస్సు
b) రక్కసం
c) రక్కిస
d) రాక్షసులు
జవాబు:
d) రాక్షసులు
26. పశువుకు జ్ఞానం ఉండదు.
a) పసలము
b) పసము
c) పసి
d) పసికూన
జవాబు:
a) పసలము
27. మతిలేని పనులు చేయకు.
a) మతము
b) సమ్మతము
c) మది
d) పదిలం
జవాబు:
c) మది
28. పుడమిపై జాగ్రత్తగా ధర్మం కాపాడాలి.
a) భూమి
b) భువి
c) నేల
d) పృధ్వి
జవాబు:
d) పృధ్వి
29. గర్వము పనికిరాదు.
a) గరువము
b) గరవము
c) గౌరవం
d) గరగర
జవాబు:
a) గరువము
30. చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.
a) చంద్రిక
b) చందమామ
c) చందురుడు
d) జాబిలి
జవాబు:
c) చందురుడు
2. వ్యాకరణాంశాలు
ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
31. వనము దిరిగి – ఇది ఏ సంధి?
a) సరళాదేశ సంధి
b) గసడదవాదేశ సంధి
c) త్రిక సంధి
d) ఉత్వ సంధి
జవాబు:
b) గసడదవాదేశ సంధి
32. వనముఁ దిరిగి – ఇది ఏ సంధి?
a) సరళాదేశ సంధి
b) గసడదవాదేశ సంధి
c) త్రికసంధి
d) ఉత్వసంధి
జవాబు:
a) సరళాదేశ సంధి
33. కాలుసేతులు – సంధి విడదీయండి.
a) కాలు + సేతులు
b) కాలున్ + చేతులు
c) కాలులు + చేయి
d) కాలు + చేతులు
జవాబు:
d) కాలు + చేతులు
34. తల్లిదండ్రులు – సంధి విడదీయండి.
a) తల్లి + తండ్రులు
b) తల్లిన్ + తండ్రి
c) తల్లి + తండ్రి
d) తల్లిన్ + దండ్రి
జవాబు:
c) తల్లి + తండ్రి
35. నేనేమిటి – సంధి విడదీసినది గుర్తించండి.
a) నేను + ఏమిటి
b) నేనే + ఏమిటి
c) నేనేమి + టి
d) నేన + ఏమిటి
జవాబు:
a) నేను + ఏమిటి
36. విమానమందుకో – సంధి పేరేమి?
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) ఉత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
c) ఉత్వసంధి
37. వేంకటాద్రి – సంధి పేరేమిటి?
a) గుణసంధి
b) అత్వసంధి
c) ఉత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
d) సవర్ణదీర్ఘ సంధి
38. మన ఊరు – సమాసం పేరు గుర్తించండి.
a) సప్తమీ తత్పురుష
b) షష్ఠీ తత్పురుష
c) ద్వితీయా తత్పురుష
d) తృతీయా తత్పురుష
జవాబు:
b) షష్ఠీ తత్పురుష
39. తల్లితండ్రి – విగ్రహవాక్యం గుర్తించండి.
a) తల్లి యొక్క తండ్రి
b) తల్లియును తండ్రియును
c) తల్లి వంటి తండ్రి
d) తల్లి యైన తండ్రి
జవాబు:
a) తల్లి యొక్క తండ్రి
40. నర్మదానది – విగ్రహవాక్యం గుర్తించండి.
a) నర్మద యొక్క నది
b) నర్మద అను పేరు గల నది
c) నదియైన నర్మద
d) నర్మదైన నది
జవాబు:
b) నర్మద అను పేరు గల నది
నేనివి చేయగలనా?
1. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వీరుల గురించి మాట్లాడగలను. [ ఔను / కాదు ]
2. గేయాన్ని ధారాళంగా చదవగలను. భావాన్ని సొంతమాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదాలను, వాక్యాలను, వాక్య నిర్మాణంలో వినియోగించగలను. [ ఔను / కాదు ]
4. పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంతమాటల్లో రాయగలను. [ ఔను / కాదు ]
చదవండి – ఆనందించండి
ఏకాగ్రత అది హస్తినాపురం. విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిలుచున్నారు. దూరంగా చెట్టు. దాని మీద పక్షి బొమ్మ ఉంది. ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో “రాకుమారా ! చెట్టును గమనించు. నీకేం కనపడుతున్నాయి” అని అన్నాడు. పక్షితో పాటు చెట్టు, కొమ్మలు, ఆకులు కూడా కనపడుతున్నాయని ధర్మరాజు సమాధానం చెప్పాడు. తర్వాత దుర్యోధనుడు, భీముడు మొదలైన శిష్యులందరినీ అదే విధంగా ద్రోణుడు అడిగాడు. వారు కూడా తమకు అన్నీ కనబడుతున్నాయని చెప్పారు.
తరువాత ద్రోణుడు అర్జునుడితో, నీకు చెట్టు కనబడుతున్నదా ! అని ప్రశ్నించాడు. లేదని సమాధానం చెప్పాడు. మరి కొమ్మలు, ఆకులు కనబడుతున్నాయా? అని ద్రోణుడు అన్నాడు. లేదని సమాధానమిచ్చాడు. మరి పక్షి కనిపిస్తున్నదా ? మరలా లేదనే సమాధానం వచ్చింది. మరినీకేం కనిపిస్తున్నది ? పక్షి కన్ను అని సమాధానం వచ్చింది. ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుని నోటి నుంచి మాట వచ్చేలోపే అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నును తాకింది. ఆ ప్రాంగణమంతా కరతాళధ్వనులు మారుమ్రోగాయి. ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురు ద్రోణుడు ఆశీర్వదించాడు.
భారతంలోని ఈ ఇతివృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకేచోట కదలకుండా వుంచితే అది చెక్కను క్షణాలలో కాల్చగలుగుతుంది. కానీ నేరుగా తాకే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చలేదు. అదే విధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచనా శక్తి చెల్లాచెదురై ఉంటుంది. అదే ఆలోచనా శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినపుడు త్వరగా నేర్చుకోగలుగుతాం.
ఇది మనస్సుకు సంబంధించినది. మనస్సు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండటాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలలోనూ రాణించగలుగుతారు. ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు.
సాహితీ తరంగ సంగీత రసముని – తెలుగుభాష – నండూరి రామాకృష్ణమాచార్యులు