AP 7th Class Telugu Important Questions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

These AP 7th Class Telugu Important Questions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 12th Lesson Important Questions and Answers స్ఫూర్తి ప్రదాతలు

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. వార్థక్యం సమీపించినా సీతమ్మగారు ఓర్పు, సహనం, అసహనాన్ని చెంత చేరనీయలేదు. దాసదాసీల సహకారం తీసుకోమని భర్త చెప్పినా స్వయంగా సేవ చేయడంలో ఉన్న తృప్తిని, మధురానుభూతిని గురించి మృదుమధురంగా విన్నవించేది. కేన్సర్‌తో బాధపడుతున్నా అన్నదానం చేయడం మానలేదు. సీతమ్మ అమూల్య సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం 1903వ సంవత్సరంలో ‘ప్రశంసా పత్రం’ ఇచ్చి సత్కరించింది.
ప్రశ్నలు – జవాబులు:
అ) ‘వార్థక్యం’ అంటే ఏమిటి?
జవాబు:
ముసలితనం / వృద్ధాప్యం

ఆ) సీతమ్మ గారు ఏ వ్యాధితో బాధపడ్డారు?
జవాబు:
సీతమ్మ కేన్సర్ వ్యాధితో బాధపడ్డారు.

ఇ) సీతమ్మ గారి సేవలను గుర్తించినదెవరు?
జవాబు:
సీతమ్మగారి అమూల్య సేవలను బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించింది.

ఈ) సీతమ్మగారు స్వయంగా సేవ చేయడానికి గల కారణాలేవి?
జవాబు:
సీతమ్మగారు స్వయంగా సేవ చేయడానికి కారణాలు తృప్తి, మధురానుభూతి.

2. పాతికేళ్ళ వయస్సులో భారతదేశంలో వయోజన విద్యా సమస్య గాడిచర్లవారిని ఆలోచింపజేసింది. వయోజనులు అక్షరాస్యులయితేనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడగలదని విశ్వసించారు. ఈ కలను సాకారం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. పగటిపూట గ్రంథాలయాలను దర్శించేవారు. రాత్రిపూట వయోజన విద్యా కేంద్రాల పనితీరును సమీక్షించేవారు. ‘ఆంధ్రపత్రిక’ తొలిసంపాదకులు శ్రీ గాడిచర్ల. మహిళల సమస్యల పరిష్కారం కోసం ‘సౌందర్యవల్లి’ అనే పత్రికను నడిపారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడాలంటే ఏం జరగాలని గాడిచర్ల వారు విశ్వసించారు?
జవాబు:
వయోజనులు అక్షరాస్యులు కావాలి.

ఆ) ఏ పత్రికకు తొలి సంపాదకులు గాడిచర్ల వారు?
జవాబు:
ఆంధ్ర పత్రికకు తొలి సంపాదకులు గాడిచర్ల.

ఇ) ‘సౌందర్య వల్లి’ ఏ సమస్యల పరిష్కారానికి నడుపబడింది?
జవాబు:
మహిళల సమస్యల పరిష్కారం కోసం ‘సౌందర్య వల్లి’ పత్రిక నడుపబడింది.

ఈ) గాడిచర్లవారు ఏ ఉద్యమాన్ని నడిపారు?
జవాబు:
గ్రంథాలయోద్యమాన్ని గాడిచర్ల చేపట్టారు.

AP 7th Class Telugu Important Questions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

3. వైస్రాయి లార్డ్ మింటో కోడి రామమూర్తి బలాన్ని గురించి విని ఉన్నాడు. స్వయంగా తానే పరీక్షించదలచాడు. అతని కాలికి ఇనుప గొలుసులు కట్టాడు. మరోవైపు ఆ గొలుసులను తన కారుకి తగిలించాడు. స్వయంగా కారును వేగంగా నడపడం కోసం గేర్లు మార్చాడు. ఒక్క అంగుళం కూడా కారు కదల్లేదు. వైస్రాయ్ ఆశ్చర్యపోయాడు. ఇంతటి బలానికి కారణాన్ని అడిగాడు. మీరు తినే మాంసాహారం గురించి చెప్పమన్నాడు. అప్పుడు రామమూర్తి నాయుడు గారు “నా పేరు లోనే కోడి ఉంది. కాని నేను పూర్తి శాకాహారిని” అన్నాడు.
ప్రశ్నలు – జవాబులు:
అ) రామమూర్తిగారి బలాన్ని పరీక్షించినదెవరు?
జవాబు:
రామమూర్తి బలాన్ని వైస్రాయ్ లార్డ్ మింటో పరీక్షించారు.

ఆ) పరీక్షించదలచిన ఆయన ఏం చేశాడు?
జవాబు:
మింటో రామమూర్తి కాలికి ఇనుప గొలుసు కట్టి, మరో వైపు ఆ గొలుసును తన కారుకి తగిలించి ముందుకు నడిపారు.

ఇ) ఆయన రామమూర్తిని ఏం ఆహారం తింటారు అని అడిగినపుడు ఏం చెప్పాడు?
జవాబు:
‘నా పేరులో కోడి ఉంది కాని, నేను శాకాహారిని’ అని రామమూర్తి చెప్పారు.

ఈ) కారు వేగంగా నడపడం కోసం ఆయన ఏం చేశాడు?
జవాబు:
కారు వేగంగా నడపడం కోసం మింటో గేర్లు మార్చారు.

4. ఇరాక్ దేశ రాజధాని బాగ్దాదు నుండి క్రీస్తుశకం 1472లో ఒక మహమ్మదీయ కుటుంబం ఢిల్లీకి వచ్చారు. ఆ మహ్మదీయులు సూఫీ మతానికి చెందిన వారు. ఏకేశ్వరోపాసన, మతములన్ని ఒక్కటే, స్వీయసాధన లేకుంటే మోక్షం రాదు మొదలైన సిద్ధాంతాలను తూ.చ. తప్పకుండా పాటించేవారు. మొఘల్ రాజు దారాసుఖోవ్ మరణా నంతరం ఢిల్లీ నుండి పిఠాపురం చేరి స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారు. ఆ కుటుంబంలో 1885 ఫిబ్రవరి 28వ తేదీన మౌల్వీ మోహియుద్దీన్ బాదా, చాంద్ బీబీ దంపతులకు డాక్టర్ ఉమర్ అలీషా జన్మించారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) డాక్టర్ ఉమర్ అలీషా తల్లిదండ్రులు ఎవరు?
జవాబు:
డా|| ఉమర్ అలీషా తల్లిదండ్రులు – మౌల్వీ మోహియుద్దీన్ బాషా, చాంద్ బీబీ.

ఆ) అలీషా పూర్వీకులు ఏ సిద్ధాంతాలను పాటించేవారు?
జవాబు:
అలీషా వారి పూర్వీకులు ఏకేశ్వరోపాసన, మతములన్నీ ఒక్కటే, స్వీయసాధన లేకుంటే మోక్షం రాదు మొదలైన సిద్ధాంతాలు పాటించేవారు.

ఇ) ఈ మహ్మదీయ కుటుంబం ఎప్పుడు ఢిల్లీ నుండి పిఠాపురం చేరారు?
జవాబు:
అలీషా పూర్వీకులు మొఘల్ రాజు దారాసుఖోవ్ మరణానంతరం ఢిల్లీ నుండి పిఠాపురం చేరారు.

ఈ) డా|| అలీషా పూర్వీకులు ఏ ప్రాంతం నుండి ఢిల్లీ వచ్చారు?
జవాబు:
డా|| అలీషా పూర్వీకులు ఇరాక్ రాజధాని బాగ్దాదు నుండి ఢిల్లీ వచ్చారు.

AP 7th Class Telugu Important Questions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

5. శ్రీపతిపండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ. దంపతులకు 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేట గ్రామంలో బాలు జన్మించారు. సాంబమూర్తి గారు హరికథా గేయగాయకులు కావడంతో బాలు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. 1966లో ఎస్.పి. కోదండపాణి అండదండలతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన బాలు తన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40వేల పాటలతో శ్రోతలను, ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1969లో ‘పెళ్ళంటే నూరేళ్ళ పంట’ చిత్రం ద్వారా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు బాలు.
ప్రశ్నలు – జవాబులు:
అ) బాలు తల్లిదండ్రుల పేర్లు రాయండి.
జవాబు:
బాలు తల్లిదండ్రులు – శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ.

ఆ) బాలు ఎవరి సహకారంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు?
జవాబు:
బాలు ఎస్.పి. కోదండపాణి సహకారంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.

ఇ) బాలు ఎన్ని పాటలు పాడారు?
జవాబు:
బాలు 40వేల పాటలు పాడారు.

ఈ) ఏ చిత్రం ద్వారా బాలు తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు?
జవాబు:
‘పెళ్ళంటే నూరేళ్ళ పంట’ అనే చిత్రం ద్వారా బాలు తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు.

6. ఆరు నుండి పది సంవత్సరాల వయస్సు గల బాలురను ‘కబ్స్’ అంటారు. బాలికలను ‘బుల్ బుల్’లు అంటారు. పదకొండు నుండి పదహారు సంవత్సరాల వయస్సు గల బాలురను ‘స్కౌట్స్’ అంటారు. బాలికలను ‘గైడ్స్’ అంటారు. పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవైఐదు సంవత్సరాల వయస్సు గల యువకులను ‘రోవర్స్’ అంటారు. యువతులను ‘రేంజర్స్’ అంటారు. ఇది అంతర్జాతీయ సేవా సంస్థ. దీనినే 1907లో రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బెడన్ పవెల్ స్థాపించారు.
ప్రశ్నలు – జవాబులు:
అ) 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలను ఏమని పిలుస్తారు?
జవాబు:
6-10 సం|| బాలురను ‘కబ్స్’ అని, బాలికలను ‘బుల్ బుల్’ అని అంటారు.

ఆ) 11 నుండి 16 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలను ఏమని పిలుస్తారు?
జవాబు:
11-16 సం|| బాలురను ‘స్కౌట్స్’ అని, బాలికలను ‘గైడ్స్’ అని అంటారు.

ఇ) 17 నుండి 25 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలను ఏమని పిలుస్తారు?
జవాబు:
17-25 సం|| యువకులను ‘రోవర్స్’ అని, యువతులను ‘రేంజర్స్’ అని అంటారు.

ఈ) ఈ అంతర్జాతీయ సేవాసంస్థ స్థాపించినదెవరు?
జవాబు:
ఈ అంతర్జాతీయ సేవా సంస్థను స్థాపించినది – రాబర్ట్ స్టీఫెన్ స్మిత్ బెడన్ పవెల్.

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
డొక్కా సీతమ్మ దంపతులు అతిథిమర్యాదలు ఎలా చేసేవారు?
జవాబు:
డొక్కా సీతమ్మ 1841 లో తూర్పు గోదావరి జిల్లా మండపేటలో భవాని శంకరం, నరసమ్మలకు జన్మించారు. ఈమెకు లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు, వేదపండితుడు అయిన డొక్కా జోగయ్యతో వివాహం జరిగింది. ఈ పుణ్యదంపతుల ఇంట పాడి పంటలకు కొరత లేదు. అతిథులను దేవుళ్ళగా భావించేవారు. బాటసారులకు ప్రతినిత్యం విసుగు, విరామం లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు. ఆ ఇల్లు నిత్యం అతిథి సత్కారాలతో, అన్న సంతర్పణలతో కన్నుల పండువగా కళకళలాడేది. గోదావరి వరదల సమయంలో రేవుకు ఆవలి లంక గ్రామాలకు భర్తతో కలిసి వెళ్ళి, వారికి ఆహారాన్ని అందించారు సీతమ్మ. సీతమ్మగారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథిమర్యాదలతో విలసిల్లేది.

AP 7th Class Telugu Important Questions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 2.
డొక్కా సీతమ్మగారికి తెలుగువారిచ్చిన గౌరవం ఏమిటి?
జవాబు:
సీతమ్మ అమూల్య సేవలను గుర్తించి బ్రిటీష్ ప్రభుత్వం 1903లో ‘ప్రశంసా పత్రం’ ఇచ్చి సత్కరించింది. డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర గురించి. పలుభాషలలో అనేక గ్రంథాలు వెలువడ్డాయి. పాత గన్నవరం దగ్గర వైనతేయ నదిపై నిర్మించిన నూతన ఆనకట్టకు “డొక్కా సీతమ్మ వారధి” అని నామకరణం చేశారు. ఈ వారధికి వారి పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు.

ప్రశ్న 3.
గాడిచర్ల వారు గాంధీజీ చేత ‘ద బ్రేవ్ హరి సర్వోత్తమరావు’ అని అనిపించుకున్నారు కదా ! ఆయన వ్యక్తిత్వం గురించి రాయండి.
జవాబు:
రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో గాడిచర్ల చదివే రోజుల్లో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసంతో ప్రభావితులై – ‘వందేమాతరం’ బ్యాడ్జీలతో క్లాసుకు వెళ్ళారు. ప్రిన్సిపల్ ఆ బ్యాడ్జీలను తొలగించమన్నారు. గానికి విద్యార్థి నాయకుడిగా ఉన్న గాడిచర్ల అంగీకరించలేదు. దానికి ప్రతిగా గాడిచర్లను డిస్మిస్ చేశారు. 30 సం||పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు. అయినా దేశ సేవలో వెనుకడుగు వేయని అకుంఠిత దేశభక్తుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. జీవితంలో కడు బీదరికం అనుభవించినా, ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదు. ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు. బ్రిటీష్ వారి అన్యాయాలను, మోసాలను స్వరాజ్య పత్రికలో వ్యాసాలు ధైర్యంగా రాసేవారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జాతీయ నాయకులైన గాంధీజీని కూడా విమర్శించడానికి వెనుకాడలేదు. గాంధీజీ “ద బ్రేవ్ హరి సర్వోత్తమరావు” అని మెచ్చుకున్నారంటే గాడిచర్ల వారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది.

ప్రశ్న 4.
గాడిచర్ల చేపట్టిన పదవులు, సేవలు రాయండి.
జవాబు:
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ కు గాడిచర్లవారు పోటీచేసి అధిక మెజార్టీతో గెలుపొందారు. 1939లో ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకు, ఆంధ్రరాష్ట్రీయ సహకార సభలకు, ఆంధ్రరాష్ట్ర వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారుల సంఘం, అఖిలభారత వయోజన విద్యా మహాసభలకు శ్రీ గాడిచర్ల అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందజేసారు. కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్ర ప్రాంతాన్ని, వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు శ్రీ గాడిచర్ల కృషిచేశారు. ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అవిరళ కృషి చేశారు.

ప్రశ్న 5.
కోడి రామమూర్తిగారి యోగ విద్యను గురించి రాయండి.
జవాబు:
కోడి రామమూర్తినాయుడు యోగ విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించారు. చివరిదశలో వీరి కాలికి రాచపుండు ఏర్పడి, కాలు తీసివేసే శస్త్రచికిత్స జరుగుతోంది. నొప్పి లేకుండా ఉండడానికి మత్తు ఇవ్వడానికి వైద్యులు ప్రయత్నించారు. దానికి రామమూర్తిగారు అంగీకరించక ప్రాణాయామం చేసి నొప్పి భరించారు.

AP 7th Class Telugu Important Questions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 6.
కోడి రామమూర్తిగారి పరాక్రమాన్ని తెలిపే రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
రామమూర్తిగారు ఊపిరి బిగపట్టి ఒంటినిండా ఇనుపగొలుసులు కట్టించుకొని, ఒక్కసారి ఊపిరి వదిలేసరికి గొలుసులు ముక్కలు ముక్కలుగా తెగిపోయేవి. ఛాతిమీద ఏనుగును ఎక్కించుకునేవారు. రొమ్ము పై భాగంలో పెద్ద బండ్లను ఉంచుకొని సుత్తితో పగలగొట్టమనేవాడు. ఇవి వారి పరాక్రమానికి ఉదాహరణలు.

ప్రశ్న 7.
డాక్టర్ ఉమర్ అలీషా చేపట్టిన పదవులు, పొందిన బిరుదులు రాయండి.
జవాబు:
పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన పీఠానికి 6వ పీఠాధిపతిగా పదవి చేపట్టారు. ఉత్తర మద్రాసు రిజర్వ్డ్ స్థానం నుండి అఖిలభారత శాసన సభ్యులుగా (పార్లమెంట్) దాదాపు 10 సంవత్సరాలు బ్రిటీష్ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారు. 1924లో అఖిలభారత ఖిలాఫత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాసు కార్యదర్శిగా సేవలందించారు.

బిరుదులు :
1924లో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్సవారు ‘పండిట్’ బిరుదును, అలీఘడ్ యూనివర్సిటీ వారు ‘మౌల్వీ’ బిరుదును ఇచ్చింది. 1936లో అమెరికా దేశం ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ అనే గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు.

ప్రశ్న 8.
స్వాతంత్ర్య సమరయోధులుగా – సంఘ సంస్కర్తగా – డాక్టర్ ఉమర్ అలీషా గురించి రాయండి.
జవాబు:
స్వాతంత్ర్య సమరయోధులుగా :
గాంధీగారిచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణల పిలుపును అందుకున్నారు ఉమర్ అలీషా. స్వరాజ్య సాధనకు త్యాగం అవసరం అని, ధర్మ సంస్థాపనకు స్వరాజ్యం అవసరం అని భావించాడు. జాతీయ నాయకులైన చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్ తో కలసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.

సంఘసంస్కర్తగా :
విజయవాడలో “ఆంధ్ర అంటుదోష నివారణ మహాసభ” జరిపి ముఖ్యవక్తగా అంటరానితనంపై పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్నివేలమందితో విశాఖపట్నం, ఏలూరులలో బహిరంగ సభలు జరిపి ప్రజలలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఉమర్ అలీషా.

ప్రశ్న 9.
“జానకి మాటలే బాలూ గుండెలో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి” ఏమిటా మాటలు రాయండి.
జవాబు:
1964లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ నేపథ్యగాయని. ఎస్. జానకి ముఖ్య అతిథిగా వచ్చారు. పోటీలలో గెలుపొందిన గాయనీ గాయకుల పాటలు శ్రద్ధగా విన్నారు. అద్భుతంగా పాడిన బాలుకు ద్వితీయ బహుమతి ప్రకటించడంపై ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వేదిక మీద నుంచే మైకు తీసుకున్నారు. “ప్రథమ బహుమతి గెల్చుకున్న గాయకుణ్ణి కించపరచడం కాదు. కానీ, నా ఉద్దేశంలో ఆ బహుమతి బాలసుబ్రహ్మణ్యానికే రావాలి. వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ళ భవిష్యత్తు అంధకారమౌతుంది” – అంటూ ఆవేశంతో నిర్మొహమాటంగా తన అభిప్రాయం తెలియజేశారు. అలా వ్యక్తపరిచిన జానకి మాటలే బాలు గుండెలో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. ఆమె బాలుతో మాట్లాడుతూ, “మీ గాత్రం చాలా వైవిధ్యంగా ఉంది. సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించండి” అంటూ సలహా ఇచ్చారు.

AP 7th Class Telugu Important Questions 12th Lesson స్ఫూర్తి ప్రదాతలు

ప్రశ్న 10.
స్కౌట్స్ శిక్షణలో నేర్చుకొనే అంశాలు ఏమిటి?
జవాబు:

  1. జాతీయ పతాకాన్ని, స్కౌటు పతాకాన్ని ఎగురవేయడం. వాటిపట్ల మర్యాదగా మసలుకోవడం.
  2. జాతీయ గీతాలను పాడడం.
  3. ప్రథమ చికిత్స చేయడంలో శిక్షణ పొందడం.
  4. తాళ్ళతో రకరకాల ముడులు వేయడంతో పాటుగా, ముడుల ఉపయోగాలను తెలుసుకోవడం.
  5. రకరకాల వస్తువులతో, రంగు రంగుల కాగితాలతో అందమైన వస్తువులను తయారుచేయడం మొదలైనవి. స్కౌట్స్ శిక్షణలో పై అంశాలను నేర్చుకొంటారు.