Students can go through AP Board 8th Class Physical Science Notes 6th Lesson ధ్వని to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 6th Lesson ధ్వని
→ కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.
→ మానవులు స్వరతంత్రుల సహాయంతో ధ్వనులను ఉత్పత్తి చేయగలుగుతారు.
→ ధ్వని ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుంది. ధ్వని శూన్యం గుండా ప్రయాణించలేదు.
→ చెవిలో మూడు భాగాలుంటాయి. అవి : 1. బయటి, చెవి భాగం 2. మధ్యచెవి భాగం 3. లోపలి చెవి భాగం.
→ కంపించే వస్తువుల నుండి ఉత్పత్తి అయిన ధ్వని కంపనాలు కర్ణభేరిని కంపింపజేయడం వల్ల మనకు శ్రవణ జ్ఞానం కలుగుతుంది.
→ ధ్వని తీవ్రత, మృదుత్వం మరియు కంపన పరిమితులు ధ్వని యొక్క లక్షణాలు.
→ కంపన పరిమితి ద్వారా ధ్వని యొక్క తీవ్రతను కనుగొనవచ్చును. ఆ ధ్వని తీవ్రతను డెసిబెల్ లలో కొలుస్తారు.
→ ఒక ధ్వని యొక్క పిచ్ దాని పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది.
→ మనం ధ్వనులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడే అవయవాలు : స్వరతంత్రులు, పెదవులు, పళ్లు, నాలుక, ముక్కు, గొంతు మొదలగునవి.
→ ఒక సెకనులో వస్తువు చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.
→ సాధారణ ధ్వనులు మిశ్రమ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటాయి.
→ ఒక క్రమపద్ధతిలో వినసొంపుగా ఉండే ధ్వనుల కలయికను సంగీతం అంటారు.
→ వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు.
→ మన పరిసరాలలో అనవసరమైన ధ్వనులు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి.
→ కంపనం : ఒక వస్తువు విరామస్థానం నుండి ముందుకు వెనుకకు లేదా పైకి క్రిందకు కదులుటను కంపనం అంటారు.
→ స్వరతంత్రులు : స్వరపేటికలో అడ్డంగా ఉండే రెండు కండర నిర్మాణాలను స్వరతంత్రులు అంటారు.
→ వెంట్రిలాక్విస్టులు : పెదవులు కదపకుండా మాట్లాడే వారిని వెంట్రిలాక్విస్టులు అంటారు.
→ కర్ణభేరి : చెవి లోపల చివరన సున్నితమైన అతి పలుచని పొరను కర్ణభేరి అంటారు.
→ యానకం : ఏ పదార్థం గుండా ధ్వని ప్రయాణించునో ఆ పదార్థాన్ని యానకం అంటారు.
→ శూన్యం : ఏ పదార్థమూ ఆవరించి లేనటువంటి ప్రదేశాన్ని శూన్య ప్రదేశం అంటారు.
→ కంపన పరిమితి : ఒక వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ఠ స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటారు.
→ డెసిబెల్ : ధ్వని తీవ్రతను కొలుచుటకు ప్రమాణం డెసిబెల్.
→ పిచ్ లేదా కీచుదనము : ఒక ధ్వని యొక్క పిచ్ దాని పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. ధ్వని యొక్క పౌనఃపున్యము పెరిగితే ధ్వని పిచ్ పెరుగును.
→ పౌనఃపున్యము : ఒక సెకను కాలములో వస్తువు చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.
→ సంగీత ధ్వని : వినడానికి ఇంపుగా ఉండే లేదా మనోల్లాసం కలిగించే ధ్వనిని సంగీత ధ్వని అని అంటారు.
→ కఠారధ్వని : వినుటకు ఇబ్బంది కలిగించే లేదా క్రమరహితంగా ఉండే ధ్వనిని కఠోరధ్వని అంటారు.
→ శ్రవ్యధ్వనులు : మానవుడు వినగలిగే ధ్వనులను శ్రవ్యధ్వనులు అంటారు. వీటి పౌనఃపున్య అవధి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది.
→ పరశ్రవ్య ధ్వనులు : 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను పరశ్రవ్య ధ్వనులు అంటారు.
→ అతిధ్వనులు : 20,000 హెర్ట్జ్ ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను అతిధ్వనులు అంటారు.