These AP 7th Class Telugu Important Questions 1st Lesson అక్షరం will help students prepare well for the exams.
AP Board 7th Class Telugu 1st Lesson Important Questions and Answers అక్షరం
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గేయాలు
కింది గేయాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. నా గుండె గవాక్షాల్లోనే కాదు
మూసిన నా కనురెప్పలపై కూడా
అక్షరాలు కవాతు చేస్తుంటాయ్
నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయ్
ప్రశ్నలు – జవాబులు :
అ) గవాక్షం అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కిటికి
ఆ) కవాతు అంటే అర్థం ఏమిటి?
జవాబు:
కసరత్తు
ఇ) నిద్రాభంగం చేసేవి ఏవి?
జవాబు:
అక్షరాలు
ఈ) నిరంతరం అంటే ఏమిటి?
జవాబు:
ఎల్లప్పుడు
2. ఇప్పుడు
ప్రతి అక్షరంలోనూ అమ్మే కన్పిస్తుంది
నన్నో అక్షరాల పుట్టని చేసిన
అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా
మరేమివ్వగలను?
ప్రశ్నలు – జవాబులు :
అ) అమ్మ ఎక్కడ కన్పిస్తోంది?
జవాబు:
ప్రతి అక్షరంలోను
ఆ) పై గేయంలో ‘నన్ను’ అంటే ఎవరు?
జవాబు:
కవిని
ఇ) అమ్మకు ఏమి ఇవ్వగలను అని చెప్పాడు?
జవాబు:
అమ్మ చెప్పినట్లు బాగా చదవడమే
ఈ) అక్షరాల పుట్ట అంటే ఏమిటి అర్థం?
జవాబు:
జ్ఞాని
అపరిచిత గేయాలు
1. క్రింది గేయ కవిత చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
కంచి రాజధానిగా పాలించాడు.
మంచి రేవు పట్నంగా కట్టించాడు
తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు
పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) మహాబలిపురం ఎవరు కట్టించారు?
జవాబు:
మహాబలిపురంను పల్లవరాజు కట్టించాడు.
ఆ) పల్లవుల రాజధాని ఏది?
జవాబు:
పల్లవుల రాజధాని కంచి.
ఇ) అక్కడి శిల్పులెవరు?
జవాబు:
అక్కడి శిల్పులు తెలుగువారు.
ఈ) శిల్పాలుగా వేటిని చెక్కేరు?
జవాబు:
శిలలను శిల్పాలుగా చెక్కేరు.
2. క్రింది పద్యం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండ పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ !
ప్రశ్నలు – జవాబులు:
అ) ఆడంబరంగా ఎవరు పలుకుతారు?
జవాబు:
ఆడంబరంగా అల్పుడు పలుకుతాడు.
ఆ) చల్లగా పలికేదెవరు?
జవాబు:
సజ్జనుడు చల్లగా పలుకుతాడు.
ఇ) బాగా మ్రోగేదేది?
జవాబు:
కంచు బాగా మ్రోగుతుంది.
ఈ) సరిగ్గా మ్రోగనిదేది?
జవాబు:
కనకం సరిగా ఛాగదు.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
కవికి నిద్రాభంగం ఎందుకు కలుగుతోంది?
జవాబు:
కవి హృదయంలో అక్షరాల గురించిన ఆలోచనే ఉంది. నిద్రించే సమయానికి ఆయన కనురెప్పలపై అక్షరాలు కవాతు చేస్తున్నాయి. అందుచేతనే ఆయనకు నిద్రాభంగం కలుగుతోంది.
ప్రశ్న 2.
పంతులమ్మ గారి బుజోణి, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
జవాబు:
పంతులమ్మ గారంటే ఉపాధ్యాయురాలు. సాధారణంగా తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. వారిని అనుకరిస్తారు. కవిగారి తల్లి ఉపాధ్యాయురాలు. కనుక ఆమె నిరంతరం పిల్లలకు చదువు చెబుతూనే గడుపుతారు. తల్లి కూడా ఉండే పిల్లవాడికి (కవికి) కూడా అక్షరాలతో అంటే చదువుతో అనుబంధం ఏర్పడిందని చెప్పడాన్నే అలా అన్నారు.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
అమ్మకు అక్షరాన్నవ్వడం అంటే మీకేమి అర్థమయిందో వివరించండి.
జవాబు:
కవిగారి తల్లి ఉపాధ్యాయురాలు. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. అందుకే బాల్యంలో అన్నప్రాశననాడు కవి కలం పట్టుకొంటే ఆమె చాలా ఆనందించింది. బిడ్డను ముద్దులు పెట్టుకొంది. కవికి నిరంతరం చదువు పై ధ్యాస నిలబడేలా చేసింది. చదువుపై ఇష్టం పెంచింది. చదువుకుంటే దేనినైనా సాధించగలం అనే భావం కలిగించింది. ఆమెకు అన్నిటికంటే అక్షరం విలువైనదని తెలుసు. అందుకే కవి తన తల్లికి అక్షరాన్ని ఇవ్వాలనుకొన్నాడు. అంటే తనొక జ్ఞానమూర్తిగా తయారై తనను తాను తల్లికి సమర్పించుకోవాలనుకున్నాడు.
ప్రశ్న 2.
అమ్మ లచ్చరాల కంబళి కప్పిందేమో అంటే మీకేమీ అర్థమయింది?
జవాబు:
అమ్మ ఒక ఉపాధ్యాయురాలు. చదువు చెప్పడమంటే ఆమెకు చాలా ఇష్టం. తన బిడ్డకు తానే చదువు చెప్పుకొనేది. విద్య యొక్క విలువను తెలియజేసే ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పేది. నిద్రపోయే ముందు పిల్లలకు తల్లులు జోలపాటలు పాడతారు. కథలు చెబుతారు. కవి గారి బాల్యంలో ఆయనను నిద్రపుచ్చడానికి వాళ్లమ్మగారు చదువు విలువను తెలియజేసే జోలపాటలనే పాడి ఉంటారు. చదువుకుంటే లభించే గౌరవం, జ్ఞానం, బ్రతుకు తెరువు మొదలైన వాటి గురించి కథలు చెప్పేవారు. అందుచేతనే తన తల్లి అచ్చరాల కంబళి కప్పిందన్నారు.
III. భాషాంశాలు
సొంతవాక్యాలు:
1. గుండె = హృదయం
సొంతవాక్యం : తల్లి గుండె నిండా పిల్లలపై ప్రేమే ఉంటుంది.
2. కవాతు = కసరత్తు
సొంతవాక్యం : సరిహద్దు గ్రామాలలో సైన్యం కవాతు చేసింది.
3. కలలు = స్వప్నాలు
సొంతవాక్యం : భవిష్యత్తు గురించి కలలు కనాలి. కృషి చేయాలి.
4. అన్నప్రాశన = తొలిసారి అన్నం తినిపించడం.
సొంతవాక్యం : అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం తినిపిస్తే ఎలా?
5. పుట్ట = నిలయం
సొంతవాక్యం : వాడొక అబద్దాల పుట్ట.
పర్యాయపదాలు
గుండె = గుండియ, హృదయం
అక్షరము = అక్కరము, వర్ణము
నిరంతరం = ఎల్లప్పుడు, ఎప్పుడు
తావు = ప్రదేశం, చోటు
రాత్రి = రాతిరి, రేయి
పంతులమ్మ = ఉపాధ్యాయిని, ఉపాధ్యాయురాలు
ఇల = భూమి, పుడమి
ముద్దు = చుంబ, చుంబనము
పుట్ట = వల్మీకము, వామలూరము
గవాక్షం = కిటికి, వాతాయనము
కనురెప్ప = కందెర, రెప్ప
నిద్ర = కునుకు, శయనము
కల = స్వప్నము, స్వపము
ఒళ్లు = శరీరం, దేహం
కలం = గంటము, పెన్ను
ఆనందం = సంతోషం, ఆహ్లాదం
ముద్దర = గుర్తు, ఆనవాలు
ప్రకృతి – వికృతి
భంగము – బన్నము
సంధులు
చేస్తుంటాయ్ = చేస్తు + ఉంటాయ్
అక్షరాలంటని = అక్షరాలు + అంటని
ఎంతైనా = ఎంత + ఐనా
పంతులమ్మ = పంతులు + అమ్మ
అక్షరానుబంధం = అక్షర + అనుబంధం
ఉండదా = ఉండదు + ఆ
చిన్నప్పుడు = చిన్న + అప్పుడు
బాగుందని = బాగ + ఉంది + అని
ఒళ్ళంతా = ఒళ్లు + అంతా
నింపిందట = నింపింది + అట
ముద్దర్లున్నట్లుంది = ముద్దర్లు + ఉన్న + అట్లు + ఉంది
అమ్మే = అమ్మ + ఏ
కన్పిస్తుంది = కన్పిస్తు + ఉంది
రానన్నావు = రాను + అన్నావు
నేనెప్పుడు = నేను + ఎప్పుడూ
రావద్దని = రావద్దు + అని
ఊరూరు = ఊరు + ఊరు
అమ్మమ్మ = అమ్మ + అమ్మ
IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భాషాంశాలు
అర్థాలు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.
1. జగమునకు మేలు చేయాలి.
a) లోకము
b) తల్లి
c) తండ్రి
d) స్నేహితుడు
జవాబు:
a) లోకము
2. మాతను ఎదిరించకూడదు.
a) తండ్రి
b) గురువు
c) తల్లి
d) పెద్ద
జవాబు:
c) తల్లి
3. భారతదేశం ధర్మానికి నిలయం.
a) రక్షణ
b) శ్రమ
c) ఆశ్రయం
d) స్థానం
జవాబు:
d) స్థానం
4. మునులు జ్ఞానమూర్తులు.
a) ఋషులు
b) గురువులు
c) రాజులు
d) మిత్రులు
జవాబు:
a) ఋషులు
5. పామరులుగా ఉండకూడదు.
a) పండితులు
b) తెలివి తక్కువవారు
c) విద్యార్థులు
d) పిల్లలు
జవాబు:
b) తెలివి తక్కువవారు
6. గుండెను పదిలంగా కాపాడుకోవాలి.
a) గుండు
b) పొట్ట
c) హృదయం
d) కాలేయం
జవాబు:
c) హృదయం
7. గదికి గవాక్షం చాలా అవసరం.
a) కిటికి
b) గోడ
c) తలుపు
d) ఫ్యాను
జవాబు:
a) కిటికి
8. మంచి పనిని భంగం చేయకూడదు.
a) ఆలస్యం
b) ఆటంకం
c) పూర్తి
d) తొందరగా
జవాబు:
b) ఆటంకం
9. మన తావును మనం శుభ్రం చేసుకోవాలి.
a) ఇల్లు
b) బడి
c) ఆస్తి
d) ప్రదేశం
జవాబు:
d) ప్రదేశం
10. మంచి వారితో అనుబంధం పెంచుకోవాలి.
a) ఎడతెగని సంబంధం
b) స్నేహం
c) విరోధం
d) కోపం
జవాబు:
a) ఎడతెగని సంబంధం
11. పంతులమ్మ గారు చెప్పినట్లు వినాలి.
a) అమ్మ
b) బ్రాహ్మణ స్త్రీ
c) ఉపాధ్యాయురాలు
d) దేవత
జవాబు:
c) ఉపాధ్యాయురాలు
12. శీతాకాలం కంబళి అవసరం.
a) చొక్కా
b) వెచ్చదనం
c) బొంత
d) రగ్గు
జవాబు:
d) రగ్గు
13. అన్నప్రాశన నాడే ఆవకాయ పెడితే ఎలా?
a) అన్నం తినడం
b) శిశువుకు తొలిసారి అన్నం తినిపించడం
c) బువ్వ
d) చంటి పిల్లల భోజనం
జవాబు:
b) శిశువుకు తొలిసారి అన్నం తినిపించడం
14. ఇలలో అన్నీ ఉన్నాయి.
a) భూమి
b) ఆకాశం
c) సముద్రం
d) భారతదేశం
జవాబు:
a) భూమి
15. ఒళ్లు రోజూ తోముకోవాలి.
a) కాళ్లు
b) శరీరం
c) పళ్లు
d) ముఖం
జవాబు:
b) శరీరం
పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
16. పర్వతముపై క్రూరమృగాలుంటాయి.
a) గిరి, కొండ
b) అడవి, కోన
c) కొండ, కోన
d) ఏరు, కాల్వ
జవాబు:
a) గిరి, కొండ
17. అరణ్యములో చాలా చెట్లు ఉంటాయి.
a) పర్వతం, కొండ
b) అడవి, కాన
c) చెట్టు, తరువు
d) కలప, జిగురు
జవాబు:
b) అడవి, కాన
18. చదువుతో జ్ఞానం పెరుగుతుంది.
a) డబ్బు, సంపద
b) తెలివి, మేధ
c) అజ్ఞానం, వివేకం
d) పదవి, హోదా
జవాబు:
b) తెలివి, మేధ
19. గురువులను గౌరవించాలి.
a) పెద్దలు, వృద్ధులు
b) ఉపాధ్యాయులు, చదువు చెప్పేవారు
c) ప్రధానోపాధ్యాయులు, అధికారులు
d) ఉపాధ్యాయుడు, బృహస్పతి
జవాబు:
b) ఉపాధ్యాయులు, చదువు చెప్పేవారు
20. దేవతలు వరాలిస్తారు.
a) సురలు, అసురులు
b) అసురులు, అమరులు
c) సురలు, అమరులు
d) కిన్నెరులు, మరులు
జవాబు:
c) సురలు, అమరులు
21. తల్లికి గుండె నిండా ప్రేమ ఉంటుంది.
a) హృదయం, ఎద
b) మనసు, ఆత్మ
c) ఆలోచన, యోచన
d) అంతరంగం, లోపల
జవాబు:
a) హృదయం, ఎద
22. ఇంటికి గవాక్షము వలన గాలి, వెలుతురు వస్తుంది.
a) కిటికీ, వాతాయనము
b) తలుపు, ద్వారం
c) గుమ్మం, వాకిలి
d) ద్వారము, గుమ్మం
జవాబు:
a) కిటికీ, వాతాయనము
23. కన్నును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
a) నయనం, చెవి
b) కర్ణం, శ్రోత్రం
c) నయనం, నేత్రం
d) మూడవకన్ను, ఫాలనేత్రం
జవాబు:
c) నయనం, నేత్రం
24. నిరంతరం మంచినే చేయాలి.
a) అప్పుడు, ఇప్పుడు
b) ఎల్లప్పుడు, ఎప్పుడు
c) అప్పుడప్పుడు, అక్కడక్కడ
d) అంతరం, అంతరంగం
జవాబు:
b) ఎల్లప్పుడు, ఎప్పుడు
25. నిద్ర పోయేవారిని అకస్మాత్తుగా లేపకూడదు.
a) మత్తు, మగత
b) కల, స్వప్నం
c) మగద, మగత
d) నిదుర, కునుకు
జవాబు:
d) నిదుర, కునుకు
26. కలం కత్తి కంటె పదునైనది.
a) పెన్ను, అక్షర జనని
b) పెన్ను, పెన్సీలు
c) అక్షరం, అంకె
d) వ్రాసేది, పెన్ను
జవాబు:
a) పెన్ను, అక్షర జనని
27. అన్నము వృథా చేయకూడదు.
a) తిండి, తినడం
b) భోజనము, ఆహారము
c) ఆహారము, నీరు
d) తిండి, బట్ట
జవాబు:
b) భోజనము, ఆహారము
28. అమ్మను ఎదిరించకూడదు.
a) తల్లి, దైవం
b) ఉపాధ్యాయురాలు, తల్లి
c) జనని, జనకుడు
d) జనని, తల్లి
జవాబు:
d) జనని, తల్లి
29. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.
a) విచారం, సంతోషం
b) సంతోషం, సంతాపం
c) సంతోషం, మోదము
d) సంతోషం, మోదకము
జవాబు:
c) సంతోషం, మోదము
30. ఎవరి ఒళ్లు వారికి అందంగా కనబడుతుంది.
a) శరీరం, దేహం
b) ముఖం, వదనం
c) కళ్లు, నయనాలు
d) పళ్లు, రదనములు
జవాబు:
a) శరీరం, దేహం
ప్రకృతి-వికృతులు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.
31. అమ్మకు సాటి వచ్చే దైవం లేదు.
a) మాత
b) తల్లి
c) జనని
d) అంబ
జవాబు:
d) అంబ
32. జమున నీరు నల్లగా ఉంటుంది.
a) గజము
b) యమున
c) యముడు
d) గోదావరి
జవాబు:
b) యమున
33. మా చేలో రతనాలు పండాయి.
a) రత్నాలు
b) ధాన్యం
c) గోధుమలు
d) వరి
జవాబు:
a) రత్నాలు
34. కడుపు నిండా అన్నం తినాలి.
a) పొట్ట
b) గర్భము
c) ఉదరము
d) బొజ్జ
జవాబు:
b) గర్భము
35. ఎవరు అడిగినా భిక్షము వేయాలి.
a) బిచ్చము
b) ముష్టి
c) ధాన్యం
d) దానం
జవాబు:
a) బిచ్చము
36. అక్షరం నేర్చుకో, భవిత మార్చుకో.
a) అక్కరం
b) అక్షయం
c) క్షరం
d) క్షవరం
జవాబు:
a) అక్కరం
37. నిద్ర తగినంత ఉండాలి.
a) నిద్దర
b) నిదుర
c) నిద్దు
d) నిధ్ర
జవాబు:
b) నిదుర
38. చంటి పిల్లలు ముద్దుగా ఉంటారు.
a) ముద్రా
b) ముగ్ధ
c) ముగుద
d) ముగ్ధము
జవాబు:
a) ముద్రా
39. రాత్రి ఒంటరిగా తిరగకూడదు.
a) రాతిరి
b) రాతిరి
c) రాతిర్రి
d) రాత్రము
జవాబు:
a) రాతిరి
2. వ్యాకరణాంశాలు
క్రింద గీత గీసిన పదాలకు కోరిన రూపం గుర్తించి వ్రాయండి.
40. రాముడు + అతడు – దీనిలో రాముడు అనేది?
a) పూర్వపదం
b) పరపదం
c) పదం
d) పదాంతరం
జవాబు:
a) పూర్వపదం
41. కృష్ణుడితడు – దీనిలో ఇతడు అనేది?
a) పూర్వరూపం
b) పరరూపం
c) పూర్వపదం
d) పరపదం
జవాబు:
d) పరపదం
42. ఆమేది దీనిలో, ఉన్న పదాల సంఖ్య?
a) 1
b) 2
c) 3
d) 4
జవాబు:
b) 2
43. రామన్న – దీనిని విడదీసిన రూపం?
a) రాము + అన్న
b) రామయ్య + అన్న
c) రామ + అన్న
d) రామ్ + అన్న
జవాబు:
c) రామ + అన్న
44. ఏమది – దీనిలో పరపదం ఏది?
a) ఏమి
b) అది
c) ఏమది
d) ఏదీకాదు
జవాబు:
b) అది
45. అమ్మదిగో – దీనిలో పూర్వపదం ఏది?
a) అమ్మదిగో
b) అదిగో
c) అమ్మ
d) అమ్మది
జవాబు:
c) అమ్మ
46. ఎందరెందరు – దీనిలో పూర్వ పర పదాలు?
a) ఒకటే
b) రెండు రకాలు
c) మూడు పదాలు
d) నాల్గు పదాలు
జవాబు:
a) ఒకటే
47. మీరెవరు? – దీనిలో పరపదం ఏది?
a) మీరు
b) ఎవరు
c) మీరెవరు
d) మీరే
జవాబు:
b) ఎవరు
48. అక్కడున్నది – దీనిలో పూర్వపదం ఏది?
a) అక్కడు
b) అక్కడే
c) అక్కడున్న
d) అక్కడ
జవాబు:
d) అక్కడ
49. ఈ ఇల్లెవరిది – దీనిలో పూర్వపదమేది?
a) ఈ
b) ఈ ఇల్లు
c) ఈ ఇల్లే
d) ఎవరిది
జవాబు:
b) ఈ ఇల్లు
సంధి విడదీయుట : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరైన రూపాలు గుర్తించండి.
50. అమ్మంటే దైవం – విడదీసిన రూపమేది?
a) అమ్మ + టే
b) అమ్మా + అటె
c) అమ్మే + అంటే
d) అమ్మ + అంటే
జవాబు:
d) అమ్మ + అంటే
51. భారతమంటే కౌరవ పాండవుల కథ విడదీయండి.
a) భారతం + అంటే
b) భారతము + అంటే
c) భారతమ + అంటే
d) భారతంబు + అంటే
జవాబు:
b) భారతము + అంటే
52. అతడొక్కడే వచ్చాడు – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అతడా + ఒక్కడే
b) అతడె + ఒక్కడే
c) అతడు + ఒక్కడే
d) అతడూ + ఒక్కడే
జవాబు:
c) అతడు + ఒక్కడే
53. ఏమైనది – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) ఏమి + ఐనది
b) ఏమై + నది
c) ఏమి + అయినది
d) ఏమైన + ది
జవాబు:
a) ఏమి + ఐనది
54. చాలా శ్రమౌతోంది – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) శ్రమా + అవుతోంది
b) శ్రమే + ఔతోంది
c) శ్రమ + ఔతోంది
d) శ్రమము + ఔతోంది
జవాబు:
c) శ్రమ + ఔతోంది
55. నేనోడిపోను – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) నేనూ + ఓడిపోను
b) నేను + ఓడిపోను
c) నేనె + ఓడిపోను
d) నేనోడి + పోను
జవాబు:
b) నేను + ఓడిపోను
56. మనూరు పోదాం – విడదీసిన రూపం గుర్తించండి.
a) మనూ + ఊరు
b) మనదు + ఊరు
c) మనం + ఊరు
d) మన + ఊరు
జవాబు:
d) మన + ఊరు
57. కాకీక కాకిదే కదా ! – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) కాకీ + క
b) కాకి + ఈక
c) కాకి + ఇక
d) కాకీ + ఇక
జవాబు:
b) కాకి + ఈక
58. తెల్లావు పాలెక్కువిస్తోంది – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) తెల్ల + ఆవు
b) తెల్లని + ఆవు
c) తెల్లటి + ఆవు
d) తెల్లదైన + ఆవు
జవాబు:
a) తెల్ల + ఆవు
59. మరొకడు సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) మరు + ఒకడు
b) మరీ + ఒకడు
c) మరి + ఒకడు
d) మరి + ఓకడు
జవాబు:
c) మరి + ఒకడు
సంధి కలుపుట : క్రింది వానికి సంధి కలిసిన రూపం గుర్తించి వ్రాయండి.
60. రాధ + ఏది అని అడిగారు.
a) రాధది
b) రాధేది
c) రాధేది
d) రాధయేది
జవాబు:
b) రాధేది
61. మన + అందరం ఒకటే.
a) మనందరం
b) మనమందరం
c) మనాందరం
d) మనం అందరం
జవాబు:
a) మనందరం
62. అలా కళ్లు + అప్పగించి చూస్తున్నావేం?
a) కళ్ళప్పగించి
b) కళ్లు ఒప్పగించి
c) కళ్లు అప్పగించి
d) కళ్లప్పగించి
జవాబు:
a) కళ్ళప్పగించి
63. కాకి + అమ్మ కథలు చెప్పకు.
a) కాకియమ్మ
b) కాకొమ్మ
c) కాకిమ్మ
d) కాకమ్మ
జవాబు:
d) కాకమ్మ
64. ఏమి + ఔతుంది అని అడగకు.
a) ఏమౌతోంది
b) ఏమియౌతుంది
c) ఏమౌతుంది
d) ఏమి ఔతుంది
జవాబు:
c) ఏమౌతుంది
65. వాడు + ఒక్కడే అన్నీ చేయాలా?
a) వాడు ఒక్కడే
b) వాడొక్కడే
c) వాడువొక్కడే
d) వాడూ ఒక్కడే
జవాబు:
b) వాడొక్కడే
66. బలము + ఉందని గర్వపడకు
a) బలముందని
b) బలముంటుందని
c) బలము ఉందని
d) బలం ఉందని
జవాబు:
a) బలముందని
67. గురువులకు + ఎప్పుడూ నమస్కరించాలి.
a) గురువులకునెప్పుడూ
b) గురువులకెప్పుడూ
c) గురువులకె ఎప్పుడూ
d) గురువులకు ఎప్పుడూ
జవాబు:
b) గురువులకెప్పుడూ
68. గొడవ + ఔతుంది కదా!
a) గొడవ ఔతుంది
b) గొడవవుతుంది
c) గొడవౌతుంది
d) గొడవే ఔతుంది
జవాబు:
c) గొడవౌతుంది
69. ఔతుంది + అని ధీమాగా ఉండకు.
a) ఔతుందియని
b) ఔతుందిఅని
c) ఔతుందే అని
d) ఔతుందని
జవాబు:
d) ఔతుందని
క్రింది ఖాళీలలో సరైన విభక్తి ప్రత్యయం గుర్తించి వ్రాయండి.
70. చంద్రు ……….. వెన్నెల చల్లగా ఉంటుంది.
a) ను
b) డు
c) ని
d) లో
జవాబు:
c) ని
71. వనము ………… ఏనుగులు పాడుచేశాయి.
a) ను
b) ని
c) డు
d) ల
జవాబు:
a) ను
72. పుస్తకము ………. విలువ తెలుసుకోండి.
a) ని
b) ను
c) తో
d) ల
జవాబు:
d) ల
73. ఎవరిని ……….. మాట్లాడుతున్నావు?
a) ని
b) ను
c) గూర్చి
d) యొక్క
జవాబు:
c) గూర్చి
74. రాముని ………… రామాయణంలో వ్రాశారు.
a) గురించి
b) యొక్క
c) తో
d) వలన
జవాబు:
a) గురించి
75. గురువుల ……….. గౌరవించు.
a) ని
b) ను
c) గూర్చి
d) గురించి
జవాబు:
b) ను
76. తల్లి ………….. గౌరవించాలి.
a) యొక్క
b) ను
c) ని
d) తో
జవాబు:
c) ని
77. సముద్రము ………. హనుమంతుడు దాటెను.
a) ని
b) ను
c) లో
d) ల
జవాబు:
b) ను
78. భారతము ……….. వ్యాసమహర్షి రచించెను.
a) న
b) ల
c) ను
d) యొక్క
జవాబు:
c) ను
79. భారతంలో పాండవుల ………… వ్రాసెను.
a) కథ
b) చరిత్ర
c) ను
d) గురించి
జవాబు:
d) గురించి
నేనివి చేయగలనా?
1. పాఠం అర్థం చేసుకుని సొంతమాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
2. పాఠాన్ని ధారాళంగా చదవగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదాలను సొంతవాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. అమ్మ ప్రేమ గురించి నా మాటలలో రాయగలను. [ ఔను / కాదు ]
చదవండి – ఆనందించండి
దేశభక్తి
ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు నలుగురు కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. ఈ పిల్లలకు చదువుకొనే రోజుల్లో ఆ పేర్లు కొంచెం బాగున్నప్పటికీ రాను రాను ఆ పేర్లుకు బదులు రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అనే పేర్లుంటే బాగుండేదని భావించేవారు.
తండ్రి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం ఇవన్ని గుర్తుకు వచ్చి తండ్రి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కొన్నాళ్లకు తండ్రి మరణించాడు. కొడుకులు నలుగురు ఆస్తి పంపకానికి సిద్ధమయి ఒకచోట సమావేశం అయ్యారు. స్వేచ్ఛ లభించింది గనుక తమ పేర్లు కూడా మార్చుకోవాలని అనుకున్నారు. అంతలోనే వారి నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ రావడం జరిగింది. కుశల ప్రశ్నలయ్యాక వారి ఉద్దేశాలను అతనికి వివరించారు.
చంద్రశేఖర్ వారు చెప్పినదంతా ఓపికగా విని “మీ నాన్న ఏ ఉద్దేశంతో ఆ పేర్లు పెట్టాడో చెబుతాను. అది విని మీకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి” అని ఇలా చెప్పసాగాడు. “భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెన్నికగన్న నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించని దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటీష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ శాస్త్రవేత్త యల్లా ప్రగడ సుబ్బారావు పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నాడు. వీథుల్లో విగ్రహాలు పెట్టడం కాదు ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని మీ నాన్న” అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతా విన్న నలుగురు కొడుకులు తమ తప్పును తెలిసికొని దేశ సమైక్యత అనేది ముందు ఇంట్లోనే ప్రారంభం కావాలని వారంతా కలసి మెలసి జీవించసాగారు. అన్నదమ్ముల ఐక్యత అందరికీ ఆదర్శమయింది.
నిరక్షరాస్యుడు మాట్లాడినా వినసొంపుగా ఉండే భాష – తెలుగు భాష – హెన్రీ మోరిస్