AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

These AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి will help students prepare well for the exams.

AP Board 7th Class Telugu 2nd Lesson Important Questions and Answers మాయాకంబళి

I. అవగాహన – ప్రతిస్పందన

పరిచిత గద్యాలు

కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. కంబళి సాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంత సేపటికి, తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి, తన చేతికర్రను ఒక పొదలో పెట్టి, ఎలాంటి చప్పుడూ చేయకుండా మసల సాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుక్కు తినటానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు, ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) బిచ్చగాడు చేతికర్రను ఎక్కడ దాచాడు?
జవాబు:
బిచ్చగాడు చేతికర్రను పొదలో దాచాడు.

ఆ) “మసలుట” అనగా అర్థం ఏమిటి?
జవాబు:
మసలుట అంటే అటూ ఇటూ తిరుగుట.

ఇ) బిచ్చగాడు చివరకు ఎక్కడకు చేరాడు?
జవాబు:
బిచ్చగాడు పాడుబడిన దేవాలయానికి చేరాడు.

ఈ) ‘అదృశ్యం’ వ్యతిరేకపదం రాయండి.
జవాబు:
ప్రత్యక్షం

2. ఆత్మానందుడు శోభావతీ నగరానికి వచ్చి రాజైన చండీదత్తుని ఏకాంతంగా కలిసి, కంబళి ఇమ్మన్నాడు. అందుకు రాజు “రాజ్య శ్రేయస్సు దృష్ట్యా, ఇది నా దగ్గర ఉండటమే మంచిది” అన్నాడు. అందుకు యోగి “ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు, నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఇలా శతవిధాల చెప్పినా, రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి, స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు” అంటూ నిట్టూర్చాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) పై పేరాలోని వ్యక్తుల పేర్లు ఏమిటి?
జవాబు:
యోగి ఆత్మానందుడు, రాజు చండీదత్తుడు.

ఆ) రాజు కంబళిని ఎందుకు ఇవ్వనన్నాడు?
జవాబు:
రాజు కంబళిని రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇవ్వనన్నాడు.

ఇ) ‘నిట్టూర్పు’ విడదీయండి.
జవాబు:
నిడు + ఊర్పు

ఈ) ‘స్వానుభవం’ విగ్రహవాక్యం రాయండి.
జవాబు:
తన యొక్క అనుభవం

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

3. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టే ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే’ కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు “నీ వద్ద ఈ కంబళి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు” అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) ఆత్మానందుడు రాజును కంబళి ఇమ్మని ఎందుకు అడిగాడు?
జవాబు:
కంబళి దుష్టుల చేతికి వెళితే రాజుకు ప్రమాదం. అందుకే ఆత్మానందుడు రాజును కంబళి అడిగాడు.

ఆ) రాజుకు రక్షాబంధనం కట్టింది ఎవరు?
జవాబు:
రాజుకు రక్షాబంధనం యోగి ఆత్మానందుడు కట్టాడు.

ఇ) ఆత్మానందుడు కంబళి తీసుకుంటూ రాజుతో ఏమన్నాడు?
జవాబు:
ఆత్మానందుడు “నీ వద్ద ఈ కంబళి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు” అన్నాడు.

ఈ) పై పేరాలో చెప్పబడిన నగరం ఏది?
జవాబు:
పై పేరాలో చెప్పబడిన నగరం శోభావతి.

అపరిచిత గద్యాలు

కింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.

1. శరీరం పసితనం నుంచి కుర్రతనానికి మార్పు చెందుతున్నప్పుడు వ్యక్తిత్వం వికసిస్తుంది. తమకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకుని గురువు సమక్షంలో విద్యార్జన చేస్తూ, ఉన్నత లక్ష్యం ఏర్పరచుకునే దశ అది. ప్రపంచంలో ఏదైనా సాధించగలం అన్న దృఢ విశ్వాసంతో, సముద్రమంత విశాలమైన భావాలతో ఆకాశమే హద్దుగా సాగే ఎగిసిపడే అల లాంటి వయసు అది. వాల్మీకి రాముడి ప్రశాంతతతో కూడిన హుందాతనాన్ని, పోతన కృష్ణుడి అల్లరి చేష్టలను చదువరుల కళ్ళకు కట్టి మనసున నాటిన వయసది.
ప్రశ్నలు – జవాబులు :
అ) వ్యక్తిత్వం ఎప్పుడు వికసిస్తుంది?
జవాబు:
శరీరం పసితనం నుంచి కుర్రతనానికి మార్పు చెందుతున్నప్పుడు వ్యక్తిత్వం వికసిస్తుంది.

ఆ) ‘ఎగిసిపడె అల’ అని ఏది చెప్పబడింది?
జవాబు:
ఎగిసిపడె అలలాంటిది వయసు.

ఇ) వాల్మీకి కథానాయకుడు ఎవరు?
జవాబు:
వాల్మీకి కథానాయకుడు రాముడు.

ఈ) కృష్ణుడి అల్లరి చేష్టలను తెలుగువారి గుండెల్లో రాసినదెవరు?
జవాబు:
కృష్ణుడి అల్లరి చేష్టలను తెలుగువారి గుండెల్లో రాసినది పోతన.

2. హనుమంతుడు సాధించిన (సీతమ్మ జాడ తెలుసుకోవడం) అసాధారణ విజయానికి రాముడు పరమానంద భరితుడై అతణ్ణి ఇలా ప్రస్తుతించాడు. “గరుత్మంతుడు తప్ప వేరెవ్వరు నీవు చేసినట్లు చేయలేరు. యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు. సేవకులందరిలో ఉత్తముడు. తాను మరింత చేయగల సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాల మేరకు మాత్రమే చేసి అంతకు మించి ప్రయత్నమే చేయనివాడు మధ్యస్థుడు. చివరగా సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాలను నిర్వర్తించనివాడు అధముల్లో అధముడైన సేవకుడు.
ప్రశ్నలు – జవాబులు :
అ) హనుమంతుడు సాధించిన అసాధారణ విజయం ఏమిటి?
జవాబు:
‘సీతమ్మ జాడ తెలుసుకోవడం హనుమంతుడు సాధించిన అసాధారణ విజయం.

ఆ) హనుమంతునితో సమానమైనవారు ఎవరు?
జవాబు:
హనుమంతునితో సమానమైనవారు గరుత్మంతుడు.

ఇ) సేవకులలో ఉత్తముడు ఎవరు?
జవాబు:
యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు సేవకులందరిలో ఉత్తముడు.

ఈ) యజమాని ఆదేశాలను నిర్వర్తించని వాడెవరు?
జవాబు:
యజమాని ఆదేశాలను నిర్వర్తించనివాడు అధముడైన సేవకుడు.

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

3. రచయితలకూ, కళాకారులకూ చాలాకాలం తమ రంగాలలో గణనీయమైన కృషి చేశాక, పేరు ప్రఖ్యాతులు వచ్చాక, వారికి బిరుదులు కాని, సత్కారాలు కాని, పురస్కారాలు కాని, ఎవరైనా ప్రదానం చేస్తే బాగుండును అనిపిస్తుంది. దీనినే కీర్తి కండూతి అని విమర్శిస్తుంటారు కొందరు.
ప్రశ్నలు – జవాబులు :
అ) బిరుదులు ఎవరు కోరుకుంటారు?
జవాబు:
రచయితలు, కళాకారులు బిరుదులను కోరుకుంటారు.

ఆ) బిరుదులు కావాలని ఎప్పుడు కోరుకుంటారు?
జవాబు:
చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాక బిరుదులు రావాలని కోరుకుంటారు.

ఇ) ఇటువంటిదాన్ని ఏమని విమర్శిస్తారు?
జవాబు:
దీనినే కీర్తి కండూతి అని విమర్శిస్తారు.

ఈ) పై పేరా దేని గురించి చెబుతోంది?
జవాబు:
పై పేరా రచయితలు, కవుల గురించి చెబుతోంది.

4. కింది గద్యాన్ని చదివి తప్పొప్పులను గుర్తించండి.

కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టి అన్ని ప్రాంతాలకు పాకుతోంది. ఇది శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలు హరిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మంచినీరు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. ముఖానికి మాస్క్ ధరించాలి. దగ్గినా, తుమ్మినా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.

అ) కరోనా వైరస్ ఊహాన్ నగరంలో పుట్టింది. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

ఆ) శ్వాసవ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలు తీస్తుంది. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

ఇ) మంచినీరు, పండ్లరసాలు తాగాలి. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

ఈ) ముఖానికి మాస్క్ ధరించాలి. (తప్పు / ఒప్పు)
జవాబు:
ఒప్పు

II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
చండీదత్తుని పాత్ర స్వభావం వ్రాయండి.
జవాబు:
చండీదత్తుడు చక్కటి పరిపాలకుడు. తన రాజ్యంలో శాంతి భద్రతలు కాపాడడానికి కృషిచేసేవాడు. మాయా కంబళి సహాయంతో దొంగలను, మోసగాళ్ళను అరికట్టాడు. కొంచెం ఆవేశం ఎక్కువ. అందుకే ఆత్మానందుడు కంబళిని ఇమ్మంటే ఇవ్వలేదు. చంచలకు ఇచ్చాడు. మోసాన్ని గ్రహించాడు. దుర్మార్గులను శిక్షించాడు. తను స్వయంగా తెలుసుకోనిదే దేనిని నమ్మడు.

ప్రశ్న 2.
ఆత్మానందుడు కంబళిని ఎందుకు సృష్టించాడు?
జవాబు:
ఆత్మానందుడు ఒక వృద్ధ యోగి. చాలా మహిమలు కలవాడు. చుట్టుప్రక్కల నుండి వచ్చే భక్తులు ఎక్కువయ్యారు. వారి సమస్యలు చెప్పేవారు. పరిష్కారాలడిగేవారు. దీని వలన తపస్సు చేసుకునేందుకు కుదిరేది కాదు. ఎవరో ఒకరు రావడం వలన ఏకాగ్రత చెడిపోయేది. ముసలితనం వలన తొందరగా ముక్తిని సంపాదించుకోవాలనే ఆత్రుత ఉండేది. భక్తుల నుండి తప్పించుకొనేందుకు మంత్రజలం చల్లి మాయాకంబళి సృష్టించాడు. అది కప్పుకొని మాయమయ్యేవాడు.

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
రాజు దగ్గర కంబళి ఉండకూడదని ఆత్మానందుడు ఎందుకు అన్నాడు? వివరించండి.
జవాబు:
రాజుపైన దేశం ఆధారపడి ఉంటుంది. రాజ్యం కోసం ఎన్నెన్నో కుట్రలు జరుగుతుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రాజు ప్రాణాలకు ప్రమాదం తెచ్చేవారు చాలామంది ఉంటారు. మాయాకంబళి వలన అదృశ్యంగా రాజుపై దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ కంబళి శత్రువులు, దురాశాపరుల చేతికి చిక్కితే రాజుకు చాలా ప్రమాదమని ఆత్మానందుడు ముందే గ్రహించాడు. స్నేహాన్ని నటిస్తూ శత్రుత్వం చూపించేవారికి ఆ మాయాకంబళి ,చిక్కితే రాజు ప్రాణాలకి ప్రమాదం అని ఆత్మానందుడు గ్రహించాడు. అందులోనూ రాజైన చండీదత్తుడు ఎవరిమాటా వినడు. తనకు నచ్చినదే చేస్తాడు. అది మరీ ప్రమాదం. అందుచేతనే కంబళిని ఇచ్చేయమన్నాడు. రాజు ఇవ్వలేదు. అయినా రాజును కాపాడడం తన ధర్మం కనుక రక్షాబంధం కట్టాడు. మాయాకంబళి వలన జరిగే అనర్థం తెలుసుకునే అవకాశం కల్పించాడు. కనువిప్పు కలిగిన రాజు కంబళిని తిరిగి ఇచ్చేశాడు.

ప్రశ్న 2.
మాయాకంబళి వలన రాజుకు కలిగిన ప్రమాదం ఏమిటి? ఎలా తప్పించుకున్నాడు?
జవాబు:
బిచ్చగాడి దగ్గర నుండి మాయాకంబళిని రాజు తీసుకున్నాడు. ఆ కంబళి మహిమతో రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొల్పాడు.

ఒకరోజు చంచల నాట్యానికి ఆనందించాడు. ఏమి కావాలన్నాడు. మాయాకంబళి కావాలంది. ఇచ్చాడు. అది కప్పుకొని, కోశాధికారి విక్రముని వద్దకు వెళ్లింది. ఆత్మానందుడు కట్టిన రక్షాబంధనం వలన రాజు చంచల వెళ్లడాన్ని స్పష్టంగా చూశాడు. కాని, కారణం తెలియలేదు. రాత్రి విక్రముడు కంబళి కప్పుకొన్నాడు. అదృశ్య రూపంలో రాజుగారి శయన మందిరంలోకి కత్తితో వచ్చాడు. రాజు గమనించి, అతనిని చంపాడు. మాయాకంబళి వలన ప్రమాదం జరగబోయినా రక్షాబంధనంతో తప్పించుకున్నాడు.

II. భాషాంశాలు

పర్యాయపదాలు

పూర్వం = మునుపు, గతంలో
వృద్దుడు = ముసలివాడు, ముదుసలి
తరచుగా = ఎక్కువగా, పదేపదే
కంబళి = దుప్పటి, రగ్గు
శిల = రాయి, ఉపలము
హిమాలయ పర్వతం = మంచుకొండ, తుహినాద్రి
మహిమ = మహత్తు, మహాత్మ్యం
మాయ = మోసం, దగా
జలం = నీరు, ఉదకం
మార్గం = దారి, బాట
స్పృహ = స్పందన, చైతన్యం
వార్త = విషయం, సమాచారం
బిచ్చగాడు = ముష్టివాడు, యాచకుడు
కాలు = అంఫ్రి, చరణము
కర్ర = కాష్టము, బెత్తము
దొంగలు = చోరులు, తస్కరులు
రూఢీ = నిర్ధారణ, నిశ్చయం
మనిషి మానవుడు, నరుడు
పాపము = దోషము, దురితము
చేయి = హస్తము, కరము
శిక్ష = దండన, నిగ్రహము
జీవితం = బ్రతుకు, జీవనయాత్ర
కత్తి = ఖడ్గం, కరవాలం
మందిరం = గృహము, ఇల్లు
దిక్కు = దిశ, ఆశ
నిద్ర = కునుకు, నిదుర
భటుడు = భృత్యుడు, సేవకుడు
వ్యాపారి = వర్తకుడు, వ్యాపారస్తుడు
ధర = మూల్యం, వెల
దుస్తులు = వస్త్రాలు, వలువలు
ప్రమాదం = కష్టం, ఆపద
దేవాలయం = గుడి, కోవెల
రాత్రి = రేయి, రజని
ప్రాణం = ఉసురు, జీవము
రాజు = ప్రభువు, పరిపాలకుడు
శాంతి = ప్రశాంతి, శాంతము
కొండ = గిరి, పర్వతం
శయనాగారం = పడకగది, పడకటిల్లు
ముప్పు = ప్రమాదం, ఆపద
దుష్టులు = దుర్మార్గులు, చెడ్డవారు
భయం = అధైర్యం, పిఱికితనం
నవ్వు = హాసము, హసనము

వ్యతిరేకపదాలు

పూర్వం × అ పూర్వం
తెలిసి × తెలియక
రహస్యం × బట్టబయలు
సుఖం × దుఃఖం
దుష్టులు × శిష్టులు
చౌక × ప్రియం
అదృశ్యం × దృశ్యం
దొంగ × దొర
పాపం × పుణ్యం
భయం × నిర్భయం
భద్రత × అభద్రత
సహాయం × అసహాయం
బయట × లోపల
ఇష్టం × అయిష్టం, అనిష్టం
స్వార్థం × నిస్వార్థం
ఆనందం × విచారం
వచ్చి × రాక
ఇవతల × అవతల
మంచి × చెడు
పాతది × క్రొత్తది
కొను × అమ్ము
ప్రత్యక్షం × పరోక్షం
ప్రయత్నం × అప్రయత్నం
ఉత్తముడు × అధముడు
దురాశ × సదాశ
నీతి × అవినీతి
దగ్గర × దూరం
శాంతి × అశాంతి
చచ్చు × పుట్టు
నవ్వు × ఏడ్పు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

ప్రకృతి – వికృతులు

హిమము – ఇగము
వృద్ధు – పెద్ద
యోగి – జోగి
మంత్రము – మంతరము
భిక్షము – బిచ్చము
దేవాలయము – దేవళము
ఆశ్చర్యము – అచ్చెరువు
మనుష్యుడు – మనిసి భుజము
రాత్రి – రాతిరి, రేయి
రాజు – రాయలు
విధము – వితము
ప్రాణము – పానము
సుఖము – సుగము, సుకము
ముఖము – మొగము, మోము
ఆజ్ఞ – ఆన
సహాయము – సాయము
ప్రజ – పజ
నాట్యం – నట్టువం

ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.

1. ఆనందంగా ఉండాలి కాని ………….. గా ఉండకూడదు. (విచారం)
2. అందరూ సుఖం కోరతారు కాని …………. కోరుకోరు. (దుఃఖం)
3. ఏదైనా ప్రత్యక్షంగా మాట్లాడాలి ……………. లో మాట్లాడకూడదు. (పరోక్షం)
4. పాపం చేయకూడదు …………. చేయాలి. (పుణ్యం)
5. స్వార్థం పనికిరాదు. …………….. గా జీవించాలి. (నిస్స్వార్థం)
6. దేనికీ భయం వద్దు ……………. గా జీవించాలి. (నిర్భయం)
7. ప్రయత్నం చేస్తే వస్తుంది …………. గా ఏదీ రాదు. (అప్రయత్నం)
8. నీతిగా బ్రతకాలి …………….. గా కాదు. (అవినీతి)
9. నవ్వుతూ ఉండాలి …………… పనికిరాదు. (ఏడ్పు)
10. సుఖం అంటే ఇష్టం కాని కష్టమంటే ……….. (అనిష్టం)

కర్త : ఈ క్రింది వానిలో కర్తను గుర్తించి వ్రాయండి.

1. రాముడు వానిని చంపెను.
జవాబు:
రాముడు

2. నేను సినిమాను చూశాను.
జవాబు:
నేను

3. లంకకు వారధిని వానరులు కట్టారు?
జవాబు:
వానరులు

4. చల్లగా గాలి వీచెను.
జవాబు:
గాలీ

5. రక్షకభటులు దొంగలను పట్టుకొన్నారు.
జవాబు:
రక్షక భటులు

6. దేశమును సైనికులు రక్షిస్తున్నారు.
జవాబు:
సైనికులు

7. మాయాకంబళి మహిమ కలది.
జవాబు:
మాయాకంబళి

8. ధర్మాత్ములు ఇతరులను తమవారను కొంటారు.
జవాబు:
ధర్మాత్ములు

9. కాలము అతిక్రమించరానిది
జవాబు:
కాలము

10. కృష్ణుడు వెన్నను తినెను.
జవాబు:
కృష్ణుడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

సంధులు: ఈ క్రింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.

1. ఆత్మానందుడనే = ఆత్మానందుడు + అనే – ఉత్వసంధి
2. వాడని = వాడు + అని – ఉత్వసంధి
3. ఎవరైనా = ఎవరు + ఐనా – ఉత్వసంధి
4. వచ్చని = వచ్చు + అని – ఉత్వసంధి
5. తనకెక్కడా = తనకు + ఎక్కడా – ఉత్వసంధి
6. లేదను = లేదు + అను – ఉత్వసంధి
7. తహతహలాడు = తహతహలు + ఆడు – ఉత్వసంధి
8. రాదని = రాదు + అని – ఉత్వసంధి
9. ప్రత్యక్షమయ్యాడు = ప్రత్యక్షము + అయ్యాడు – ఉత్వసంధి
10. తనకియ్యుమని = తనకు + ఇయ్యుము + అని – ఉత్వసంధి

ఈ క్రింది ఉత్వసంధి పదాలను కలిపి రాయండి.

1. ఉండటము + ఏ = ఉండటమే
2. అవకాశాలు + ఉన్నాయి = అవకాశాలున్నాయి
3. ఎందుకు + ఐనా = ఎందుకైనా
4. చకితుడు + ఐనాడు = చకితుడైనాడు
5. వస్తున్నాడు + అని = వస్తున్నాడని
6. భరితుడు + ఐ = భరితుడై
7. లేడు + అని = లేడని
8. ఆత్మానందుడు + ఉన్న = ఆత్మానందుడున్న
9. ప్రమాదము + ఓ = ప్రమాదమో
10. ఎవరు + ఐనా = ఎవరైనా

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

ఈ క్రింది పేరాలోని భాషాభాగాలను గుర్తించి వ్రాయండి.

దశరథుని పెద్ద కొడుకు శ్రీరాముడు. అతను చాలా మంచివాడు. సీతను పెళ్లి చేసుకొన్నాడు. శివ ధనుస్సు, విరిచి ఔరా అనిపించి, పెళ్లి చేసుకొన్నాడు. అబ్బ ! ఎంత చక్కని జంట అని దేవతలు కొనియాడారు.

1. నామవాచకం : దశరథుడు, కొడుకు, శ్రీరాముడు, సీత, శివధనుస్సు, పెళ్లి, జంట, దేవతలు
2. సర్వనామం : అతను, వాడు
3. విశేషణం : పెద్ద, చాలా, మంచి, చక్కని
4. క్రియ : చేసుకొన్నాడు, విరిచి, అనిపించి, అని, కొనియాడారు
5. అవ్యయం : అబ్బ, ఔరా

IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు

1. భాషాంశాలు

అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.

1. హిమాలయపర్వతం చల్లగా ఉంటుంది.
a) మంచుకొండ
b) కొండ
c) గిరి
d) అది
జవాబు:
a) మంచుకొండ

2. ఏకాగ్రతతో చేస్తే ఏ పనినైనా సాధించవచ్చు.
a) అదేపనిగా
b) పదేపదే
c) అవధానం
d) తరచుగా
జవాబు:
c) అవధానం

3. ఏ వస్తువుకైనా ఒక ధర ఉంటుంది.
a) మూలం
b) మూల్యం
c) భద్రత
d) చోటు
జవాబు:
b) మూల్యం

4. మంచి వార్త పదిమందికీ చెప్పాలి.
a) పేపరు
b) పత్రిక
c) కథ
d) విషయం
జవాబు:
d) విషయం

5. ప్రమాదం వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి.
a) ధనం
b) ఆపద
c) పాము
d) దొంగతనం
జవాబు:
b) ఆపద

6. కనీసం వారానికి ఒకసారైనా దేవాలయమునకు వెళ్లాలి.
a) గుడి
b) మందిరం
c) గోపురం
d) పుణ్యక్షేత్రం
జవాబు:
a) గుడి

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

7. ఒక విషయాన్ని రూఢి చేసుకోనిదే నలుగురికీ చెప్పకూడదు.
a) నిజం
b) సత్యం
c) యధార్థం
d) నిర్ధారణ
జవాబు:
d) నిర్ధారణ

8. దేవుని మహత్తును మనం కనిపెట్టలేము.
a) గొప్పతనం
b) ఆధిక్యం
c) మహిమ
d) పనితనం
జవాబు:
c) మహిమ

9. రాజు చేతిలో కత్తి ఉంటుంది.
a) కరవాలం
b) గద
c) విల్లు
d) బాణం
జవాబు:
a) కరవాలం

10. రానురాను మనిషి స్వార్థపరుడై పోతున్నాడు.
a) డబ్బు
b) నరుడు
c) డబ్బు-ఆమె
d) స్త్రీ
జవాబు:
b) నరుడు

పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.

11. వృద్ధుడు గౌరవింపతగినవాడు.
a) ముదుసలి, ముసలివాడు
b) తాత, తాతయ్య
c) తండ్రి తండ్రి, తల్లి తండ్రి
d) బోసినోరు, ముడత మొకం
జవాబు:
a) ముదుసలి, ముసలివాడు

12. అనవసరంగా జలం వృథా చేయకూడదు.
a) డబ్బు, ధనం
b) బంగారం, పసిడి
c) పదవి, అధికారం
d) నీరు, ఉదకం
జవాబు:
d) నీరు, ఉదకం

13. ఎవరి ప్రాణం వారికి తీపి.
a) శరీరం, కాయం
b) మనసు, ఆత్మ
c) ఉసురు, జీవము
d) జీవితం, గాలి
జవాబు:
c) ఉసురు, జీవము

14. చేయి కలిపితే కరోనా వస్తోంది.
a) హస్తం, కరము
b) ముక్కు నాసిక
c) ముఖం, వదనం
d) తుమ్ము, గాలి
జవాబు:
a) హస్తం, కరము

15. మంచు కొండ చల్లగా ఉంటుంది.
a) చల్లని, శీతలం
b) గిరి, పర్వతం
c) రాయి, బండ
d) రాళ్లు, మెట్టలు
జవాబు:
b) గిరి, పర్వతం

16. పాపము చేయకూడదు.
a) దురితము, దోషము
b) తప్పు, నింద
c) కినుక, కోపం
d) తప్పు, దుర్మార్గం
జవాబు:
a) దురితము, దోషము

17. సాధారణంగా వ్యాపారి తనలాభం చూసుకొంటాడు.
a) ధనవంతుడు, ధనికుడు
b) అధికారి, గొప్పవాడు
c) రాజు, ప్రభువు
d) వర్తకుడు, వ్యాపారస్తుడు
జవాబు:
d) వర్తకుడు, వ్యాపారస్తుడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

18. కత్తితో చెలగాటం ఆడకూడదు.
a) నిప్పు, అగ్ని
b) ఖడ్గం, కరవాలం
c) వరద, గోదావరి
d) ప్రాణం, గాలి
జవాబు:
b) ఖడ్గం, కరవాలం

19. ఎవ్వరినీ మాయ చేయకూడదు.
a) మంత్రం, ఆగమం
b) మ్రొక్కు వేడు
c) దగా, మోసం
d) ప్రార్థన, యాచన
జవాబు:
c) దగా, మోసం

20. ధరకు ధర పెరిగిపోతుంది.
a) వెల, మూల్యం
b) విలువ, గొప్ప
c) గౌరవం, ఖ్యాతి
d) కీర్తి, యశస్సు
జవాబు:
a) వెల, మూల్యం

ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.

21. హిమము చల్లగా ఉంటుంది.
a) ఇమము
b) ఇగము
c) ఇంకు
d) హిమ
జవాబు:
b) ఇగము

22. పెద్ద వారిని గౌరవించాలి.
a) పెద్ద
b) ముసలి
c) ముదుసలి
d) వృద్ధు
జవాబు:
d) వృద్ధు

23. ఏ విధముగానైనా మంచిచేయాలి.
a) విధి
b) విధం
c) వితము
d) వితానము
జవాబు:
c) వితము

24. ఎప్పుడూ మొగము పై చిరునవ్వు ఉండాలి.
a) ముఖము
b) మొహము
c) మోహము
d) మోఖము
జవాబు:
a) ముఖము

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

25. ప్రభుత్వ ఆజ్ఞ పాటించాలి.
a) అన్న
b) ఆజ్ఞప్తి
c) ఆనతి
d) ఆన
జవాబు:
d) ఆన

26. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి.
a) పజ
b) పజ్జి
c) పెజ
d) పిజ్జ
జవాబు:
a) పజ

27. జబ్బ సలుపుతోంది.
a) బుజము
b) భుజము
c) రెక్క
d) చేయి
జవాబు:
b) భుజము

28. ఆమె నాట్యం బాగా చేసింది.
a) నటన
b) నాటకం
c) నట్టువం
d) నృత్యం
జవాబు:
c) నట్టువం

29. జోగి మాయాకంబళిని సృష్టించాడు.
a) ఆత్మానందుడు
b) యోగము
c) వృద్ధుడు
d) యోగి
జవాబు:
d) యోగి

30. అచ్చెరువున విచ్చిన కలువలు చూశారు.
a) ఆశ్చర్యము
b) ఆ చెరువు
c) చెరువులో
d) కొలను
జవాబు:
a) ఆశ్చర్యము

2. వ్యాకరణాంశాలు

కర్త : ఈ క్రింది వానిలో కర్తను గుర్తించి వ్రాయండి.

31. రామాయణమును వాల్మీకి రచించెను.
a) రామాయణం
b) ను
c) వాల్మీకి
d) రచించెను
జవాబు:
c) వాల్మీకి

32. మాధురి పుస్తకంలో పద్యం చదివింది.
a) మాధురి
b) పుస్తకం
c) పద్యం
d) చదివింది
జవాబు:
a) మాధురి

33. బడిలో పనులను రామయ్య చేశాడు.
a) బడి
b) పనులు
c) చేశాడు
d) రామయ్య
జవాబు:
d) రామయ్య

34. తెల్లటి పాలను ఇచ్చింది .ఆవు.
a) తెల్లటి
b) పాలు
c) ఇచ్చింది
d) ఆవు
జవాబు:
d) ఆవు

35. సీతారాములు అడవికి వెళ్లారు?
a) సీత
b) రాముడు
c) సీతారాములు
d) అడవి
జవాబు:
c) సీతారాములు

36. వేదవ్యాస మహర్షి 18 పురాణాలు రచించెను.
a) వేదవ్యాస మహర్షి
b) వేద వ్యాసుడు
c) పురాణాలు
d) మహర్షి
జవాబు:
a) వేదవ్యాస మహర్షి

37. ఆవు అందంగా, తెల్లగా, ఆరోగ్యంగా ఉంది.
a) అందం
b) తెలుపు
c) ఆవు
d) ఆరోగ్యం
జవాబు:
c) ఆవు

38. రాముడు రావణుని సీత కొరకు చంపెను.
a) రాముడు
b) రావణుడు
c) సీత
d) చంపెను
జవాబు:
a) రాముడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

39. చల్లగా వీచెను గాలి అన్నాడు.
a) చల్లగా
b) వీచెను
c) గాలి
d) అన్నాడు
జవాబు:
c) గాలి

40. ధర్మరాజుకు భీష్ముడు నీతులు చెప్పెను.
a) ధర్మరాజు
b) భీష్ముడు
c) నీతులు
d) చెప్పెను
జవాబు:
b) భీష్ముడు

ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను కోరిన విధంగా వ్రాయండి.

41. రాజు చాలా తెలివైనవాడు – భాషాభాగం గుర్తించండి.
a) నామవాచకం
b) సర్వనామం
c) క్రియ
d) విశేషణం
జవాబు:
a) నామవాచకం

42. కంబళి చాలా మహిమ గలది.
a) నామవాచకం
b) క్రియ
c) అవ్యయం
d) విశేషణం
జవాబు:
d) విశేషణం

43. యోగి మహిమలు జనం చూస్తారు.
a) సర్వనామం
b) క్రియ
c) విశేషణం
d) అవ్యయం
జవాబు:
b) క్రియ

44. అబ్బబ్బ! ఈ జనంతో పడలేకపోతున్నాను.
a) కర్త
b) క్రియ
c) అవ్యయం
d) విశేషణం
జవాబు:
c) అవ్యయం

45. కిందివానిలో సర్వనామం గుర్తించండి.
a) రాముడు
b) అది
c) అందం
d) అయ్యో
జవాబు:
b) అది

46. క్రిందివానిలో విశేషణం గుర్తించండి.
a) తెల్లటి
b) ఆవు
c) పాలు
d) ఇచ్చింది
జవాబు:
a) తెల్లటి

47. క్రిందివానిలో అవ్యయం గుర్తించండి.
a) అయ్యో
b) అయ్య
c) ఆమె
d) ఎందుకు
జవాబు:
a) అయ్యో

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

48. క్రిందివానిలో క్రియను గుర్తించండి.
a) అందం
b) మందం
c) మందిరం
d) చూశాను
జవాబు:
d) చూశాను

49. క్రిందివానిలో నామవాచకం గుర్తించండి.
a) రాముడు
b) అది
c) అక్కట
d) వచ్చాడు
జవాబు:
a) రాముడు

50. కృష్ణుడు తెలివిగా వెన్నను దొంగిలించెను. – దీనిలో కర్తను గుర్తించండి.
a) తెలివి
b) వెన్న
c) కృష్ణుడు
d) దొంగిలించెను
జవాబు:
c) కృష్ణుడు

సంధులు: ఈ క్రింది వాటిని కోరిన విధంగా వ్రాయండి.

51. కలవాడని – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) కలవాడ + అని
b) కలవాడె + అని
c) కలవాడు + అని
d) కలవాడా + అని
జవాబు:
c) కలవాడు + అని

52. ఎవరు + ఐనా – సంధి కలిపిన రూపం గుర్తించండి.
a) ఎవరైనా
b) ఎవరేనా
c) ఎవరున్నా
d) ఎవరుయైనా
జవాబు:
a) ఎవరైనా

53. నగరమంతా – దీని సంధి పేరు వ్రాయండి.
a) అత్వసంధి
b) ఉత్వసంధి
c) ఇత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
b) ఉత్వసంధి

54. కిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) రాజేంద్రుడు
b) రాజాధిరాజు
c) రాజోద్యోగి
d) రాజైన
జవాబు:
d) రాజైన

55. క్రిందివానిలో ‘తహతహలాడు’ విడదీసిన రూపం గుర్తించండి.
a) తహతహలు + ఆడు
b) తహ + తహలాడు
c) తహతహలన్ + ఆడు
d) తహతహలున్ + ఆడు
జవాబు:
a) తహతహలు + ఆడు

56. తనకు + ఇయ్యమని – సంధి కలిసిన రూపం గుర్తించండి,
a) తనకుయ్యమని
b) తనకునియ్యమని
c) తనకియ్యమని
d) తనకుయియ్యమని
జవాబు:
c) తనకియ్యమని

57. క్రిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) ఉందని
b) అక్కడున్న
c) ఆహాహా
d) ఊరొకటి
జవాబు:
d) ఊరొకటి

58. రాజాజ్ఞను ఎవరైనా పాటించాలని చెప్పాలి – వీనిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) రాజాజ్ఞ
b) ఎవరైనా
c) పాటించాలని
d) చెప్పాలి
జవాబు:
b) ఎవరైనా

59. ఆత్మానందుడు భక్తుల నుండి తప్పించుకోవాలని మాటాలాడాడు – దీనిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) ఆత్మానందుడు
b) భక్తుల నుండి
c) తప్పించుకోవాలని
d) మాటలాడాడు
జవాబు:
d) మాటలాడాడు

AP 7th Class Telugu Important Questions 2nd Lesson మాయాకంబళి

60. క్రిందివానిలో ఉత్వసంధి పదం గుర్తించండి.
a) ఊరూరు
b) గురూత్తముడు
c) భానూదయం
d) పేరేది
జవాబు:
d) పేరేది

నేనివి చేయగలనా?

1. పాఠంలోని కథను సొంత మాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
2. పాఠంలోని కథను నేను సొంతంగా చదవగలను. రాయగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. కథను ఊహించి రాయగలను. [ ఔను / కాదు ]

చదవండి – ఆనందించండి

మనిషి

యూనాను (గ్రీకు) దేశంలో జాంథస్ అనే పేరుగల ఒక ధనవంతుడు ఉండేవాడు.

ఈసప్ అనేవాడు అతనికి బానిసగా ఉండేవాడు. ఈసప్ తెలివితేటలు గలవాడు. జాంథస్ ఈసపన్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడు. – ‘పోయి చూచిరా, నీటి తొట్టి (బాత్ టబ్) వద్ద ఎందరు మనుషులు ఉన్నారు? అక్కడకు వెళ్ళి నేను స్నానం చేసి రావాలి.’ తిరిగివచ్చి అతడు యజమానితో చెప్పాడు – ‘అయ్యా నీటి తొట్టివద్ద ఒకే ఒక మనిషి ఉన్నాడు, జాంథస్ ఈసపను వెంట పెట్టుకొని స్నానాలగది దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ అడుగుతీసి అడుగు పెట్టటానికి కూడా చోటులేదు. ఆయనకు కోపం వచ్చింది. ఏమిరా అబద్ధం చెప్పావు. సిగ్గులేదా? వ్యర్ధుడా! నీవు ఏమని చెప్పావు? స్నానాలతొట్టి దగ్గర ఒకే ఒక మనిషి ఉన్నాడన్నావు. మరి ఈ గుంపు ఎక్కడ నుండి వచ్చింది?

ఈసప్ వినయపూర్వకంగా ఇలా జవాబు చెప్పాడు. అయ్యా! నేను సరిగా ఉన్న విషయమే చెప్పాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు త్రోవలో ఒక పెద్దరాయి పడివుంది. వచ్చేపోయేవాళ్ళకు అది తగులుతోంది. అది తగిలి వారు క్రిందపడుతున్నారు. దానిని తొలగిద్దామన్న ఆలోచన ఏ ఒక్కరికీ కలుగలేదు. కొంచెం సేపటి తరువాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడు తన శక్తి అంతా ఉపయోగించి త్రోవలో నుండి దానిని తొలగించాడు. స్నానాలగది వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక నిరుపేద బిచ్చగత్తె నిలుచుని వుండగా చూశాను. ఆమె చాలా సేపటి నుండి అక్కడే నిలుచొని వుంది. స్నానం చేస్తున్నవారిని ఆమె నీరు అడిగింది. కాని ఏ ఒక్కరు ఆమెవైపు చూడలేదు. త్రోవలో రాయి తొలగించిన వ్యక్తే బిచ్చగత్తెకు మంచినీళ్ళు ఇచ్చాడు.

అయ్యా ! ఇప్పుడు మీరే చెప్పండి. స్వార్థపరులు, తమకోసం తాము జీవించేవాళ్ళు ఇతరుల కష్టాన్ని తొలగించనివారు వీరు మనుషులుగా పిలవబడటానికి యోగ్యులా ?? నాకు మాత్రం అక్కడ ఆ ఒకే ఒక వ్యక్తి కనిపించాడు. అతనిలో మానవత్వం వుంది. అందుకే నేను చెప్పాను. అక్కడ ఒకే ఒక మనిషి ఉన్నాడు, అని. జాంథస్ కు ఇదంతా వినేసరికి ఎంతో సంతోషం వేసింది.

“నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి. నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి”

“జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ”
జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి.