These AP 7th Class Telugu Important Questions 7th Lesson కప్పతల్లి పెళ్ళి will help students prepare well for the exams.
AP Board 7th Class Telugu 7th Lesson Important Questions and Answers కప్పతల్లి పెళ్ళి
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత పద్యాలు
కింది పద్యాల్ని చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
కప్పతల్లి పెళ్లి నేడూ – చూడారే
కావిళ్ళనీళ్ళోంపినాడు !
వరుణదేవుడు వంపినాడూ – ఓ చెలీ
వాడలన్నీ నింపినాడు !
గగనతలము నుంచి నేడు – వీవెనలు
చెట్లచే వేయించినాడు !
స్వర్గాధినాథుడు నేడూ – రథమెక్కి
పయనమై పోవుచున్నాడు !
ప్రశ్నలు-జవాబులు:
అ) పై గేయంలో చెప్పబడిన వర్షదేవుడు ఎవరు?
జవాబు:
వరుణదేవుడు
ఆ) పూర్వం మగవారు నీళ్ళు తేవడానికి ఉపయోగించే వస్తువు పై గేయంలో చెప్పబడింది. అది ఏది?
జవాబు:
కావిడి
ఇ) స్వర్గానికి అధిపతి ఎవరు?
జవాబు:
ఇంద్రుడు
ఈ) ‘వీవెన’ అంటే ఏమిటి?
జవాబు:
విసనకర్ర
2. భత్యాలు లేకనేవాడు – పెళ్లికి
బాజాలు వేయించినాడు!
బండరాళ్ళ పైని వాడు – చక్రములు
బడబడాదొర్లించినాడు !
బాణసంచా వెలితి లేదే – పెళ్లికీ
బహుబాగుగా జేసినారే
కళ్ళు చెదిరే మెరుపులమ్మా – చూడగా
వొళ్ళు పరవశమౌనుసుమ్మా !
ప్రశ్నలు-జవాబులు:
అ) ‘భత్యము’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
భోజనమునకై ఇచ్చే ధనం
ఆ) ‘బడబడా దొర్లించినాడు’ అని గేయంలో ఉంది కదా ! అతడు ఎవరు?
జవాబు:
ఇంద్రుడు
ఇ) బాణసంచా వెలిగించే పండుగ ఏది?
జవాబు:
దీపావళి
ఈ) ‘వెలితి’ అంటే అర్థము రాయండి.
జవాబు:
తక్కువ / లోపం
3. కప్పమ్మ పెళ్లికోయంచూ – మేళములు
గొప్పగా తెప్పించినారే!
చెప్ప శక్యము కాదు వేరే – బోదురూ
కప్పలా మేళములురారె !
కప్పమ్మ గడప తొక్కినది – శుభమన్న
సూచనలు చూరు చెప్పినది !
కప్పలెగిరేవానలమ్మా – పొలములో
కనకాలే పండుతాయమ్మా !
ప్రశ్నలు- జవాబులు:
అ) ‘మేళము’లో వాడే వాయిద్యాల పేర్లు రాయండి.
జవాబు:
డోలు, సన్నాయి మొదలైనవి.
ఆ) ‘పెళ్ళి’ అనే పదానికి పర్యాయపదాలు రాయండి.
జవాబు:
వివాహం, పరిణయం
ఇ) ‘పొలములో కనకాలె పండుతాయి’ అంటే అర్థం ఏమిటి?
జవాబు:
మంచి పంటలు పండుతాయి. (వెల / విలువ గల పంటలు పండుతాయి, బంగారపు రంగులో గల మంచి వరి పంట పండుతుంది.)
ఈ) ‘గడప’ లాగా ‘ప’ చివరి అక్షరంగా ఉండి మూడు అక్షరాల పదాలు రాయండి.
జవాబు:
కలప, కడప, పిడప, పిదప
అపరిచిత పద్యాలు
1. కింది అపరిచిత పద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
“ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు
కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు
కావ్యచర్చలు కళాలయాలు ఆకర్షించటం లేదు
స్వార్థజీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు
సిద్దాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు
సిరా యింకకుండానే ఎగ్రిమెంట్లు చింపేస్తున్నారు”
ప్రశ్నలు-జవాబులు:
అ) ఎవరు ఎలా విరగబడుతున్నారు?
జవాబు:
ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు.
ఆ) ఎందుకు గుసగుసలాడుతున్నారు?
జవాబు:
కంగారుతో, భయంతో గుసగుసలాడుతున్నారు.
ఇ) ప్రజల్ని ఆకర్షించనివేవి?
జవాబు:
కావ్యచర్చలు, కళాలయాలు ప్రజల్ని ఆకర్షించడం లేదు.
ఈ) ఎవరు రొమ్ములు బాదుకుంటున్నారు?
జవాబు:
స్వార్థ జీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు.
2. “అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు
ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు
సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబి
సదా ప్రజాహితైషిణి సుభాషిణి గర్వంలేని రాణి
కల్లనీ క్రౌర్యాన్ని కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది
తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది
చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి”
ప్రశ్నలు- జవాబులు:
అ) ‘దయతో కూడిన కనుగొలకులు’ అని భావం వచ్చే గేయపంక్తి ఏది?
జవాబు:
”అపార కృపాతరంగితాలైన నయనాంచలాలు’ – అనే గేయపంక్తి భావాన్ని ఇస్తుంది.
ఆ) శాంతి రాణి సద్గుణాలు పేర్కొనండి.
జవాబు:
శాంతి రాణి ఎప్పుడూ ప్రజల మేలును కోరుతుంది. చక్కగా మాట్లాడుతుంది. ఆమె గర్వం లేని రాణి.
ఇ) శాంతి రాణి వేటిని ఎగరేస్తుంది?
జవాబు:
శాంతి రాణి, తెల్లని పావురాల్ని సరదాగా ఎగరేస్తుంది.
ఈ) శాంతి కేశపాశంలో ఏమి అలంకరించుకొంది?
జవాబు:
శాంతి తన కొప్పులో, ప్రేమ గులాబిని అలంకరించుకొంది.
3. విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్ణింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె.
ప్రశ్నలు-జవాబులు:
అ) చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు?
జవాబు:
దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు.
ఆ) ఎటువంటి పాము భయంకరమైనది?
జవాబు:
తలపై మణులచేత అలంకరింపబడినా పాము భయంకరమైనది.
ఇ) ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు?
జవాబు:
ఈ పద్యంలో దుర్జనుడు, పాముతో పోల్చబడ్డాడు.
ఈ) ఈ పద్యానికి శీర్షికను సూచించండి.
జవాబు:
ఈ పద్యానికి శీర్షిక ‘దుర్జనుడితో స్నేహం పనికి రాదు.
4. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
ఆతడేల గలుగు యావత్ప్రపంచంబు
నీతడేల గలుగు నిహము పరము
ప్రశ్నలు- జవాబులు:
అ) రాజు చేతి కత్తి దేనిని వర్షిస్తుంది?
జవాబు:
రాజు చేతి కత్తి రక్తంబు వర్షించును.
ఆ) సుధలు కురిపించేది ఏది?
జవాబు:
సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది.
ఇ) ఇహపరాలెవరు పరిపాలించగలరు?
జవాబు:
ఇహపరాలను సుకవి పరిపాలించగలడు.
ఈ) పై పద్యం ప్రకారం ఎవరు గొప్పవారు?
జవాబు:
పై పద్యం -ప్రకారం సుకవి గొప్పవాడు.
II. వ్యక్తికరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
వర్షం ఎవరు కురిపించారు? ఎందుకు?
జవాబు:
వరుణదేవుడు వర్షాన్ని కురిపించాడు. కప్పతల్లి పెళ్లికి నీరు అవసరం కదా ! అందుకే వరుణదేవుడు కావిళ్లతో నీళ్లు ఒంపినాడు. వాడవాడలా వర్షం కురిపించాడు.
ప్రశ్న 2.
కప్ప గడప తొక్కితే శుభమని కవయిత్రి ఎందుకన్నారు?
జవాబు:
కప్పలు వర్షాలెక్కువగా వస్తేనే గంతులు వేస్తాయి. కప్పలు గంతులు వేస్తూ ఇళ్లలోకి వచ్చేస్తాయి. అలా గడప తొక్కి కప్ప ఇంట్లోకి వస్తే, ఇంకా వర్షాలెక్కువ పడతాయని నమ్మకం. వర్షాలేక్కువగా పడితే చెరువులు నిండుతాయి. పంటలు బాగా పండుతాయి. తిండికి, నీటికి లోటుండదు. అంతా శుభమే జరుగుతుంది. అందుకే కవయిత్రి అలా అన్నారు.
ఆ) కింది ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాలలో జవాబు రాయండి.
ప్రశ్న 1.
కప్పల గురించి మీకు తెలిసినవి వ్రాయండి.
జవాబు:
కప్పలను మండూకాలు అంటారు. ఇవి వానాకాలం ఎక్కువగా కనిపిస్తాయి. వానాకాలమే వీటి సంతాన వృద్ధి కలుగుతుంది. వీటి శరీరం పొట్టిగా ఉంటుంది. వెనుక కాళ్లు పొడవుగా ఉంటాయి. కాలివేళ్లు అతుక్కొని ఉంటాయి. కనుగ్రుడ్లు పెద్దగా ఉంటాయి. తోక ఉండదు. ఇవి. ఉభయచరాలు. అంటే నీటిలోనూ, భూమిపైనా కూడా జీవిస్తాయి. నీటిలో ఈదుతాయి. భూమి పైన గెంతుతాయి. ఇవి నీటి గుంటలలో గ్రుడ్లు పెడతాయి. వీటి పిల్లలైన చిన్న కప్పలను తోక కప్పలంటారు. వీటికి మొప్పలుంటాయి. అభివృద్ధి చెందాక చిన్ని చిన్ని పురుగులను తిని జీవిస్తాయి. కప్పలు బెకబెకమని శబ్దం చేస్తాయి. కప్పలు ప్రపంచంలో ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో ఎక్కువగా జీవిస్తాయి.
III. భాషాంశాలు
పర్యాయపదాలు
కప్ప = మండూకము, భేకము
నీరు = జలము, సలిలము
చెలి = స్నేహితురాలు, చెలికత్తె
వాడ = వీథి, ఇండ్ల వరుస
చెట్లు = తరువులు, వృక్షములు
స్వర్గము = విష్టపము, దివి
వీవన = సురటి, వ్యజనము, విసనకర్ర
అధినాథుడు = అధిపతి, ప్రభువు
రథము = తేరు, స్యందనము
స్వర్గాధినాథుడు = ఇంద్రుడు, దేవేంద్రుడు
పెళ్లి = ఉద్వహము, పరిణయము
రాళ్లు= రాలు, ఉపలములు
గగనం = ఆకాశం, నభము
మెరుపు = తటిత్తు, సౌదామిని
వాన = వర్షం, జడి
పొలము = చేను, క్షేత్రము
ఒళ్లు = శరీరం, కాయము
కళ్లు = నయనాలు, నేత్రాలు
వరుణుడు = పడమటి దిక్కుకు అధిపతి, నీటిఱేడు
ప్రకృతి – వికృతులు
స్థలము – తలము
దేవుడు – దేవర
భత్యము – బత్తెము
రథము – అరదం
ప్రయాణం – పయనం
వ్యతిరేక పదాలు
ఎక్కి × దిగి
పోవు × వచ్చు
లేదు × ఉంది
పైన × క్రింద
చేసి × చేయక
పరవశం × స్వాధీనం
కాదు × ఔను
శుభము × అశుభము
పండుతాయి × పండవు
శక్యము × అశక్యము
ఖాళీలు : క్రింది ఖాళీలను సరైన వ్యతిరేక పదాలతో పూరించండి.
1. కష్టపడితే శక్యము. కష్టపడకపోతే …………. (అశక్యము)
2. అందరికీ శుభము జరగాలి. ………………. కోరుకోకూడదు. (అశుభము)
3. వానలు వస్తే పంటలు పండుతాయి, లేకుంటే ………………… (పండవు)
4. లేదు అనకూడదు ……………………. అనుకోవాలి. (ఉంది)
5. నింగి పైన ఉంటుంది. నేల …………………… ఉంటుంది. (క్రింద)
సంధులు : ఈ క్రింది పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. నీల్గింపినారు = నీళ్లు + ఒంపినారు – ఉత్వ సంధి
2. వాడలన్నీ = వాడలు + అన్నీ – ఉత్వ సంధి
3. పయనమై పయనము + ఐ – ఉత్వ సంధి
4. పరవశమౌను – పరవశము + ఔను – ఉత్వ సంధి
5. పండుతాయమ్మా = పండుతాయి + అమ్మా – ఇత్వ సంధి
IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భాషాంశాలు
అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.
1. గగనంలో సూర్య, చంద్రులుంటారు.
a) ఆకాశం
b) స్వర్గం
c) భూమి
d) పైలోకం
జవాబు:
a) ఆకాశం
2. పూర్వం వీవెనతో విసురుకొనేవారు.
a) చేట
b) జల్లెడ
c) తిరగలి
d) విసనకర్ర
జవాబు:
d) విసనకర్ర
3. స్వర్గాధినాథుడు దేవతలకు రాజు.
a) బ్రహ్మ
b) ఇంద్రుడు
c) విష్ణువు
d) శివుడు
జవాబు:
b) ఇంద్రుడు
4. పిల్లలకు వెలితి రాకుండా తల్లిదండ్రులు పెంచుతారు.
a) కోపం
b) అల్లరి
c) లోటు
d) దరిద్రం
జవాబు:
c) లోటు
5. ఒళ్లు శుభ్రంగా తోముకోవాలి.
a) కాళు
b) శరీరం
c) పళ్లు
d) వీపు
జవాబు:
b) శరీరం
6. మంచి కథ వింటే పరవశం కలుగుతుంది.
a) తన్మయం
b) నిద్ర
c) ఆలోచన
d) ఆవులింత
జవాబు:
a) తన్మయం
7. కప్ప ఉభయచరజీవి.
a) బెకబెక
b) మొప్ప
c) మండూకము
d) కూపము
జవాబు:
c) మండూకము
8. కష్టపడితే ఏదైనా శక్యము ఔతుంది.
a) అసాధ్యం
b) సాధ్యము
c) సులువు
d) ముఖ్యము
జవాబు:
b) సాధ్యము
9. కనకం అందరికీ కావాలి.
a) డబ్బు
b) గాలి
c) ఆహారం
d) బంగారం
జవాబు:
d) బంగారం
10. పెళ్లికి పిలిచారు.
a) వేడుక
b) ఉత్సవం
c) వివాహం
d) వివాదం
జవాబు:
c) వివాహం
పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో, గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
11. మంచి నీరు ఎక్కువ త్రాగాలి.
a) జలము, సలిలము
b) పాలు, క్షీరము
c) పెరుగు, దధి
d) టీ, తేనీరు
జవాబు:
a) జలము, సలిలము
12. చెలితో విరోధం పెట్టుకోకూడదు.
a) భార్య, సఖి
b) స్నేహితురాలు, చెలికత్తె
c) అమ్మ, వదిన
d) చెల్లి, సోదరి
జవాబు:
b) స్నేహితురాలు, చెలికత్తె
13. చెట్లు ఎక్కువగా పెంచాలి.
a) మొక్కలు, తీగలు
b) తోట, వనం
c) కాన, అడవి
d) తరువులు, భూరుహములు
జవాబు:
d) తరువులు, భూరుహములు
14. స్వర్గంలో దేవతలుంటారు.
a) ద్యుమణి, దివిజం
b) నరకం, మమకారం
c) విష్టపము, దివి
d) లోకం, ప్రపంచం
జవాబు:
c) విష్టపము, దివి
15. పూర్వం వీవనతో విసురుకొన్నారు.
a) ఫాను, పంకా
b) సురటి, వ్యజనము
c) సుర, అసుర
d) విసన, కర్ర
జవాబు:
b) సురటి, వ్యజనము
16. రాముడు రథం మీద అయోధ్యకు సీతతో వచ్చాడు.
a) తేరు, స్యందనము
b) బండి, గుర్రపు బండి
c) బండి, బంధనం
d) తేరు, తేనీరు
జవాబు:
a) తేరు, స్యందనము
17. ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి.
a) పిడుగులు, ఉరుములు
b) నక్షత్రాలు, కాంతులు
c) వెలుగులు, ఉడులు
d) తటిత్తు, సౌదామిని
జవాబు:
d) తటిత్తు, సౌదామిని
18. మా పొలములో బంగారం పండింది.
a) భూమి, అడవి
b) భూమి, నీరు
c) చేను, క్షేత్రము
d) దివి, స్వర్గం
జవాబు:
c) చేను, క్షేత్రము
19. కళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
a) నయనాలు, నేత్రాలు
b) ఒళ్లు, శరీరం
c) పళ్లు, రదనాలు
d) కాళ్లు, పాదాలు
జవాబు:
a) నయనాలు, నేత్రాలు
20. పెళ్లిలో చాలామంది చుట్టాలు కలుస్తారు.
a) ఉద్వహము, ఉత్సవము
b) వేడుక, సరదా
c) పరిణయము, వివాహము
d) మ్యారేజ్, ఫంక్షన్
జవాబు:
c) పరిణయము, వివాహము
ప్రకృతి-వికృతులు: ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.
21. మంచి స్థలములో నిద్రించాలి.
a) స్తలము
b) సలిలము
c) తలము
d) తరలము
జవాబు:
c) తలము
22. చక్రవర్తి అరదంపై వెడతాడు.
a) రథం
b) అర్థం
c) అనర్థం
d) అనడ్వాహం
జవాబు:
a) రథం
23. మన పయనం ఆగకూడదు.
a) పయానం
b) పయాణం
c) పెయానం
d) ప్రయాణం
జవాబు:
d) ప్రయాణం
24. దేవుడు మంచి చేస్తాడు.
a) దైవం
b) దేవర
c) దేవత
d) దేవాలయం
జవాబు:
b) దేవర
25. జీతం బత్తెం లేని ఉద్యోగం ఎందుకు?
a) భత్యము
b) భృత్యుడు
c) బాధ్యత
d) భాద్యము
జవాబు:
a) భత్యము
2. వ్యాకరణాంశాలు
క్రింద గీత గీసిన ప్రత్యయాలు ఏ విభక్తో గుర్తించండి.
26. రాముని కంటె గొప్ప వీరుడు లేడు.
a) షష్టీ
b) పంచమీ
c) చతుర్టీ
d) ద్వితీయ
జవాబు:
b) పంచమీ
27. నేను జ్ఞానం కొఱకు చదువుతున్నాను.
a) ద్వితీయ
b) తృతీయ
c) ప్రథమ
d) చతుర్డీ
జవాబు:
d) చతుర్డీ
28. హనుమంతునిచే లంక తగులబెట్టబడెను.
a) ప్రథమ
b) తృతీయ
c) ద్వితీయ
d) పంచమీ
జవాబు:
b) తృతీయ
29. కోతికి స్థిరత్వం తక్కువ.
a) షష్ఠీ
b) ద్వితీయ
c) చతుర్థి
d) సప్తమీ
జవాబు:
a) షష్ఠీ
30. చెఱువు నందు కమలాలున్నాయి.
a) పంచమీ
b) షష్ఠీ
c) సప్తమీ
d) ద్వితీయ
జవాబు:
c) సప్తమీ
31. ఓరీ ! దుర్మార్గుడా ! ఎంత పని చేశావురా?
a) సంబోధన ప్రథమ
b) ప్రథమ
c) ద్వితీయ
d) చతుర్థీ
జవాబు:
a) సంబోధన ప్రథమ
32. నీటిని వృథా చేయకు.
a) ప్రథమ
b) ద్వితీయ
c) తృతీయ
d) చతుర్థీ
జవాబు:
b) ద్వితీయ
33. రాముడు సీతాపతి.
a) ద్వితీయ
b) తృతీయ
c) ప్రథమ
d) చతుర్థీ
జవాబు:
c) ప్రథమ
34. పట్టణమునందు సౌకర్యాలెక్కువ.
a) ప్రథమ
b) తృతీయ
c) ద్వితీయ
d) సప్తమీ
జవాబు:
d) సప్తమీ
35. రాజు యొక్క భటులు.
a) షష్టీ
b) ప్రథమ
c) ద్వితీయ
d) తృతీయ
జవాబు:
a) షష్టీ
ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
36. విద్యకు సాటి ధనంబు లేదు – ఇది ఏ అక్షరం?
a) అచ్చు
b) హల్లు
c) ద్విత్వాక్షరం
d) సంయుక్తాక్షరం
జవాబు:
d) సంయుక్తాక్షరం
37. కాకిపిల్ల కాకికి ముద్దు – దీనిలో ద్విత్వాక్షరాలు?
a) 2
b) 3
c) 5
d) 4
జవాబు:
a) 2
38. 7వ తరగతి పుస్తకం బాగుంది – ఇది ఏ అక్షరం?
a) ద్విత్వం
b) సంయుక్తం
c) సంశ్లేష
d) సంశ్లిష్టం
జవాబు:
b) సంయుక్తం
39. పాపమ్ము దుఃఖమును తెచ్చును – దీనిలో ద్విత్వాక్షరాలెన్ని?
a) 3
b) 1
c) 2
d) 4
జవాబు:
c) 2
40. “సంయుక్తాక్షరం”లో సంయుక్తాక్షరాలెన్ని ఉన్నాయి?
a) 2
b) 4
c) 5
d) 3
జవాబు:
a) 2
41. “ద్విత్వాక్షరం”లో ద్విత్వాక్షరాలెన్ని ఉన్నాయి?
a) 1
b) 2
c) 3
d) లేవు
జవాబు:
d) లేవు
42. రెండు కాని అంత కంటే ఎక్కువ కాని, హల్లులతో ఏర్పడేది?
a) ద్వితం
b) సంయుక్తం
c) సంశ్లేష
d) సంశ్లిష్టం
జవాబు:
b) సంయుక్తం
43. ‘ఆంధ్రప్రదేశ్’లో ఎన్ని సంయుక్తాక్షరాలున్నాయి?
a) 1
b) 3
c) 2
d) 4
జవాబు:
c) 2
44. క్రిందివానిలో ద్విత్వాక్షరమేది?
a) క్ష
b) త
c) క్క
d) ప్ర
జవాబు:
c) క్క
45. క్రిందివానిలో సంయుక్తాక్షరమేది?
a) భ్ర
b) త్త
c) మ్మ
d) ల్ల
జవాబు:
a) భ్ర
సంధులు : ఈ క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
46. ఎవ్వారు – సంధి విడదీయండి.
a) ఎ + వారు
b) ఏ + వారు
c) ఎ + వ్వారు
d) ఎవ్వా + రు
జవాబు:
b) ఏ + వారు
47. ఎట్లెట్లు – సంధి విడదీయండి.
a) ఎట్లు + ఎట్లు
b) ఎట్లె + ఎట్లు
c) ఎట్లె + ట్లు
d) ఎట్లున్ + ఎట్లు
జవాబు:
a) ఎట్లు + ఎట్లు
48. అక్కడ – సంధి విడదీయండి.
a) అక్క + డ
b) అ + కడ
c) ఆ + కడ
d) ఆ + కాడ
జవాబు:
c) ఆ + కడ
49. లోకాధిపతి – సంధి పేరేమి?
a) గుణసంధి
b) అత్వసంధి
c) ఇత్వసంధి
d) సవర్ణదీర్ఘ సంధి
జవాబు:
d) సవర్ణదీర్ఘ సంధి
50. కప్పమ్మ – సంధి పేరేమిటి?
a) అత్వసంధి
b) ఇత్వసంధి
c) ఆమ్రేడిత సంధి
d) త్రికసంధి
జవాబు:
a) అత్వసంధి
51. నీళ్ళోంపినాడు – సంధి విడదీయండి.
a) నీళ్లును + ఒంపినాడు
b) నీళ్లు + ఒంపినాడు
c) నీళోంపి + నాడు
d) నీళ్ళాంపిన + వాడు
జవాబు:
b) నీళ్లు + ఒంపినాడు
52. రథమెక్కి – సంధి పేరేమి?
a) అత్వసంధి
b) ఉత్వసంధి
c) ఇత్వసంధి
d) గుణసంధి
జవాబు:
c) ఇత్వసంధి
53. దారేది – సంధి పేరు ఏమి?
a) ఇత్వసంధి
b) అత్వసంధి
c) ఉత్వసంధి
d) యడాగమం
జవాబు:
a) ఇత్వసంధి
54. ఇది యేమిటి? – సంధి విడదీయండి.
a) ఇది + యేమిటి
b) ఇది + ఏమిటి
c) ఇదేమి + టి
d) ఇదేమిట + ఇ
జవాబు:
b) ఇది + ఏమిటి
55. అక్కడున్నదేమిటి – దీనిలో ఎన్ని సంధులున్నాయి?
a) 1
b) 3
c) 2
d) 4
జవాబు:
c) 2
నేనివి చేయగలనా?
1. గేయాన్ని రాగయుక్తంగా పాడగలను. [ ఔను / కాదు ]
2. గేయాన్ని ధారాళంగా చదవగలను, అర్థం చేసుకుని సొంతమాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని పదజాలాన్ని వాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
4. వానను వర్ణించే పాటలను సేకరించగలను. [ ఔను / కాదు ]
చదవండి – ఆనందించండి
పాలిథిన్ భూతం -(పర్యావరణ స్పృహ) ఏకపాత్రాభినయం
గడగడలాడి పోవాలి ! మొత్తం ఈ మానవజాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి. ఈ భూగోళాన్ని మొత్తం నేను ఆక్రమించాలి. ఇంతకీ నేను ఎవరో తెలుసా ? మీకు తెలియదు కదా ! నా పేరే పాలిథిన్. నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చాపకింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచిలో వేసుకుపోతా.
మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామగ్రిని మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికివస్తా. కూరలు, పండ్లు, స్వీటు, పూలు, పాలు… ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం. చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు. చూశారా ! నా ప్రతాపం, చూశారా ! నా ప్రభావం.
మీ సామానులను మోసుకుని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్తకుప్పలోకి విసురుతారు. కాలువలు, చెత్తకుప్పలే నా స్థావరాలు. అక్కడి నుంచి మానవ జాతిపై నా సమరభేరి మోగించి భూగోళాన్ని దడ దడ లాడిస్తాను. మీ జీవిత కాలం వందేళ్లు. కానీ నా జీవితకాలం కొన్ని వందల యేళ్లు.
చెత్తలో ఉన్నా, కాలువలో ఉన్నా, నేలపై ఉన్నా, నీటిలో ఉన్నా ఎక్కడున్నా ‘నేను క్షేమం – మీకు క్షామం’ నేను ఎప్పటికీ భూమిలో కలవను. నా తోటి నేస్తాలైన దోమలు, ఈగలు పెరిగేందుకు చక్కని భవనంగా మారి దుర్గంధాన్ని వ్యాప్తిచేసే శిబిరంగా మారతాను. మలేరియా, ఫైలేరియా లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేస్తాను. భూమిపై నీటిని కిందకు ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికే వీలులేకుండా పచ్చదనాన్ని కబళిస్తాను. పర్యావరణాన్ని పాడుచేసే మానవజాతి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాను.
మానవజాతిలో అజ్ఞానం, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మధ్య మీరు గుడ్డ సంచులు, కాగితపు సంచులు, గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కుపెడుతున్నారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంతవరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు, ఇది చాలు నేను భూమిని వశం చేసుకోవడానికి, ఈ భూగోళాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక. విద్యార్థులూ ! నన్ను ఆపగలరా? …… ప్రయత్నించండి…… చూద్దాం…..