These AP 7th Class Telugu Important Questions 8th Lesson ఎద will help students prepare well for the exams.
AP Board 7th Class Telugu 8th Lesson Important Questions and Answers ఎద
I. అవగాహన – ప్రతిస్పందన
పరిచిత గద్యాలు
కింది పరిచిత గద్యాలను చదివి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. ఎంత రాత్రయిందో తెలియదు. కుదురుమీద దీపం వెలుగుతూనే ఉంది. పోలమ్మకు కంటికి కునుకు మాత్రం రావడం లేదు. ఆవిడ ఆలోచనంత వర్షం గురించే, కొండల మీద నుండి మేఘాలు రావడం అయితే వస్తున్నాయి గానీ – వర్షం పడ్డం లేదు.
ప్రశ్నలు:
అ) ‘రాత్రి’ పదానికి వ్యతిరేక పదం ఏమిటి?
జవాబు:
పగలు
ఆ) ‘కుదురు’ పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
పాదు, ఆధారం
ఇ) ‘కునుకు’ పదానికి అర్థం ఏమిటి?
జవాబు:
నిద్ర
ఈ) ‘మేఘం’ పదానికి వికృతి పదం ఏమిటి?
జవాబు:
మొగలు
2. బడులు పెట్టి పిల్లలకి తిండి, బట్టా ఇవ్వడంతో ఇద్దరు పిల్లలూ చదవగలుగుతున్నారు. తల్లిదండ్రి బాగుచేసి ఇచ్చిన మడిసెక్కలు – ఆ రెండు మడిసెక్కలే పోలమ్మకు ఏకైక ఆధారం. అందులో పండగా వచ్చిన గింజలతో అర్థాంతరంగా వచ్చిన ఖర్చులు గట్టెక్కిపోతున్నాయి. ఆ మడిసెక్కలు అమ్మడం గానీ – అప్పు చెయ్యడం గానీ లేకుండా ఇంతవరకూ కాలం గడిచింది.
ప్రశ్నలు:
అ) పోలమ్మ పిల్లలు చదవగలుగుతున్నారంటే దానికి కారణం ఏమిటి?
జవాబు:
బడులు పెట్టి పిల్లలకు తిండి, బట్టా ఇవ్వడం వల్ల.
ఆ) ‘మడిసెక్క’ అంటే ఏమిటి?
జవాబు:
చిన్నపొలం
ఇ) ‘ఏకైక’ పదాన్ని విడదీయండి.
జవాబు:
ఏక + ఏక
ఈ) ‘కాలం’ నానార్థాలు రాయండి.
జవాబు:
సమయం, నలుపు
అపరిచిత గద్యాలు
కింది అపరిచిత గద్యాలను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతూంటే వారికి చెరో పక్కా ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని “కథకుడు” అనీ ఆయనకు రెండుపక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళను “వంతలు” అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతలుగా వస్తున్నారు.
ప్రశ్నలు:
అ) జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ ఏది?
జవాబు:
జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ “బుర్రకథ”.
ఆ) బుర్రకథను చెప్పేవారిని ఏమంటారు?
జవాబు:
బుర్రకథను చెప్పేవారిని కథకుడు అంటారు.
ఇ) తంబురా వాయించేది ఎవరు?
జవాబు:
కథకుడు తంబూరా వాయిస్తాడు.
ఈ) కథకునికి వంత పాడేవాళ్ళను ఏమంటారు?
జవాబు:
కథకునికి వంత పాడేవారిని “వంతలు” అంటారు.
2. శ్రావణి టీచర్ సీత మనసులో చదువుబీజాలు బలంగా నాటింది. టీచర్ బదిలీ అయినా ఉన్న ఊళ్ళో పై చదువులకు అవకాశం లేకపోయినా పక్క టౌనుకు పోయి స్కూల్ చదువుతూ కాలేజీలో ఇంటరూ పూర్తిచేసి డిగ్రీలో చేరింది. ఏదో చదువుకొని, డబ్బులు సంపాదించి, తను మాత్రం హాయిగా ఉండాలనుకోలేదు సీత. తను బాగా చదువుకొని, తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టరుగానో, నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది. డిగ్రీ చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించి, మండల అభివృద్ధి అధికారిగా ఎంపికైంది.
ప్రశ్నలు:
అ) సీత మనసులో చదువు బీజాలు నాటింది ఎవరు?
జవాబు:
శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు నాటింది.
ఆ) పై చదువులకు సీత ఎక్కడికి వెళ్ళింది?
జవాబు:
సీత పై చదువులకు టౌనుకు వెళ్ళింది.
ఇ) సీత ఎంత వరకు చదువుకొంది?
జవాబు:
సీత డిగ్రీ వరకు చదువుకొంది.
ఈ) సీత ఏ అధికారిగా ఎంపికైంది?
జవాబు:
సీత “మండల అభివృద్ధి అధికారి”గా ఎంపిక అయ్యింది.
3. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నప్పుడు బోధిసత్వుడు ఐదువందల మంది శిష్యులతో హిమాలయాల్లో | – ఉండేవాడు. ఒకసారి ఎండలు బాగా కాసి అన్నిచోట్లా నీరు ఎండిపోయింది. జంతువులు. నీళ్ళు దొరక్క. అల్లాడిపోయాయి. శిష్యులలో ఒకడు వాటి దప్పిక తీర్చడం కోసం ఒక తొట్టి తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టెలో పోసేవాడు. జంతువులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ నీరు తాగుతుండటంతో శిష్యుడికి పండ్లు తెచ్చుకోవడానికి గూడా తీరిక చిక్కలేదు. తనేమీ తినకుండానే ఆ జంతువులకు నీళ్ళు పోసేవాడు. ఇది చూసి జంతువులన్నీ మోయగలిగినన్ని పళ్ళు తెచ్చి ఇతనికివ్వాలని నిర్ణయించుకుంటాయి. అవన్నీ కలిపితే రెండువందల యాభై బండ్లు నిండాయి. వాటిని అక్కడి ఐదువందలమంది శిష్యులు తృప్తిగా తినేవాళ్ళు.
ప్రశ్నలు :
అ) జంతువులు ఎందుకు అల్లాడిపోయాయి?
జవాబు:
జంతువులు నీళ్ళు దొరక్క అల్లాడిపోయాయి.
ఆ) వాటి బాధ ఎలా తీరింది?
జవాబు:
బోధిసత్వుని శిష్యుడు ఒక తొట్టెను తయారుచేసి, దూరంగా ఉన్న నీళ్ళను తెచ్చి ఆ తొట్టిలో పోయటం ద్వారా వాటి బాధ తీరింది.
ఇ) ఈ కథ ద్వారా మీరు గ్రహించిందేమిటి?
జవాబు:
అన్ని ప్రాణుల యెడల జాలి, దయ కలిగి ఉండాలనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాను.
ఈ) జీవకారుణ్యం అంటే ఏమిటి?
జవాబు:
జీవులపట్ల జాలి, దయ కలిగి ఉండుటను జీవకారుణ్యం అంటారు.
4. బాలమురళీకృష్ణగారు 1930 జూలై 6వ తేదీన తూర్పుగోదావరిలోని శంకరగుప్తంలో పుట్టారు. అమ్మ సూర్యకాంతమ్మ, వీణా కళాకారిణి. నాన్న పట్టాభిరామయ్య, వయోలిన్ ఉపాధ్యాయులు. బాలమురళీకృష్ణ గారు కర్నాటక సంగీత విద్వాంసుడి గానే కాక వాగ్గేయకారుడిగా బోలెడంత పేరు సంపాదించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి జాతీయ పురస్కారాలు పొందారు. ప్రశ్నలు:
అ) బాలమురళీకృష్ణగారు ఎప్పుడు జన్మించారు?
జవాబు:
6.7.1930.
ఆ) పట్టాభిరామయ్యగారు ఏం చేసేవారు?
జవాబు:
వయోలిన్ ఉపాధ్యాయులు.
ఇ) బాలమురళీకృష్ణగారు పొందిన జాతీయ పురస్కారాలు ఏవి?
జవాబు:
పద్మశ్రీ, పద్మభూషణ్
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
జవాబు:
బాలమురళీకృష్ణ గారి తల్లి పేరేమి?
5. క్రింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
అది విద్యానగరం ఆవరణం
ఎంతోమంది అనాథలకు ఆశ్రయ ప్రాంగణం
అక్కడ అమ్మలా నీడ నిచ్చే వేపచెట్టు
అక్కడ నాన్నలా హుందాగా రావిచెట్టు
అందాలు చిందించే పూల పాదులు
లేలేత కాయలతో అందాల తోటలు
ఆ చెట్లపై పరవశంతో పాడుతున్న పిట్టలు
ప్రశ్నలు :
అ) విద్యానగరంలో ఎవరు ఆశ్రయం పొందుతున్నారు?
జవాబు:
విద్యానగరంలో చాలామంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు.
ఆ) వేపచెట్టు ఏమిస్తుంది?
జవాబు:
అమ్మలా వేపచెట్టు నీడనిస్తుంది.
ఇ) పూలపాదులెలా ఉన్నాయి?
జవాబు:
పూలపాదులు అందాలు చిందిస్తున్నాయి.
ఈ) పిట్టలెక్కడ ఉన్నాయి?
జవాబు:
పిట్టలు చెట్ల పై ఉన్నాయి.
II. వ్యక్తీకరణ – సృజనాత్మకత
అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పోలమ్మకెందుకు కడుపులో దేవినట్టయింది?
జవాబు:
రోజూ మేఘాలు వర్షిస్తాయని పోలమ్మ ఆశగా చూసేది. పొలమంతా తిరిగేది. ఆశగా ఆకాశంలోకి చూసేది. వర్షపు చుక్క పడేది కాదు. గోగు మొక్కలు కొంచెం పెరిగాయి. వర్షం లేక అవి కూడా వాడిపోయాయి. తలలు వాల్చేసాయి. ఎదిగిన మొక్కలు కూడా చచ్చిపోతున్నాయనే బాధ పోలమ్మకు కలిగింది. అందుకే ఆ మొక్కలను చూస్తే బాధ మరీ ఎక్కువైపోయి కడుపులో దేవినట్లు అయింది.
ప్రశ్న 2.
వర్షం ఎందుకు రావడం లేదని పోలమ్మ అనుకొంది?
జవాబు:
అడవి తగ్గిపోయింది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు అడవులు నరికేశారు. అడవిని పాడుచేసేసేరు. మనుషులు తమ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు. అది కలికాలపు లక్షణం. మనుషులకు దేవుడిపై భక్తి లేదు. పాపం చేయడానికి భయపడరు. ఇటువంటి మనుషులని చూసి కాలం కూడా మారిపోయింది. అందుకే వర్షాలు రావడం లేదని పోలమ్మ అనుకొంది.
ఆ) కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
పోలమ్మ గురించి వ్రాయండి.
జవాబు:
పోలమ్మ చిన్నతనంలో తల్లిదండ్రులతో పశువులను మేపేది. ఏమీ చదువుకోలేదు. మలేరియా వచ్చి, ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దోమల నివారణకు వచ్చిన వారిలో ఒకతనిని ఇష్టపడింది. ఇద్దరు పిల్లల తల్లయింది. ఆమె భర్త ఆమెను, పిల్లలను పట్టించుకోడు. అప్పుడప్పుడు వస్తాడు. పోతాడు. రాళ్లు కొట్టి, వ్యవసాయపు పనులు చేసి తను, పిల్లలు బ్రతుకుతున్నారు. ఆ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో చాలా బాధపడింది. ఎదరుచూసింది. ఆమె తపన ఫలించింది. వర్షాలు వచ్చాయి.
ప్రశ్న 2.
వర్షం పడుతుందని పోలమ్మ ఎందుకు నమ్మింది? నిజమైందా?
జవాబు:
పోలమ్మకు భక్తి ఎక్కువ. భూమిని భూదేవత, నేలతల్లి అంటుంది. జన్మ నిచ్చిన తల్లి ఎప్పుడూ తన పిల్లలకు అన్యాయం చేయదు. తిండికి లోటు రానివ్వదు. అలాగే భూమాత పంటలిచ్చి కాపాడుతుందని ఆమెకు పూర్తి నమ్మకం.
నీటిని కూడా గంగమ్మ తల్లి అంటుంది. నీటిని కూడా తల్లిగా భావిస్తుంది. తమకు అన్యాయం చేయదని . గట్టిగా నమ్మింది. నీరు, భూమి, ప్రకృతికి మానవులకున్న మూర్ఖత్వం లేదు. మానవులు మూర్ఖత్వంతో అడవులు నాశనం చేసినా గంగమ్మ క్షమిస్తుందని పోలమ్మ నమ్మకం.
ఆమె అమాయకపు నమ్మకాన్ని ప్రకృతి కూడా కాదనలేకపోయింది. ఆమె నమ్మకమే నిజమైంది. వర్షం కురిసింది. నేలతల్లి పులకించింది. గోగు మొక్కలు తలలెత్తాయి. ధాన్యపు మొలకలు వచ్చాయి.
III. భాషాంశాలు
పర్యాయపదాలు
ఎద = హృదయం, గుండె
నిద్ర = కునుకు, నిదుర
రాత్రి = రేయి, రాతిరి
పిల్లలు = బిడ్డలు, తనూజులు
దీపం = జ్యోతి, దివ్వె
పశువు = జంతువు, మృగము
అయ్య = తండ్రి, జనకుడు
కొండ = నగము, అది
బాల్యం = చిన్నతనం, పసితనం
బడి = పాఠశాల, విద్యాలయం
పుస్తకం = గ్రంథం, పొత్తము
బతుకు = జీవితం, జీవనం
ఇల్లు = గృహము, సదనము
ఆనందం = సంతోషం, మోదము
మంటి = మట్టి, మన్ను
మొలక = మొక్క, అంకురము
పొద్దున్న = ఉదయం , పొద్దుట
పొలం = చేను, క్షేత్రము
పక్షి = విహంగం, పులుగు
కాపలా = కావలి, రక్షణ
వాన = వర్షం, వృష్టి
మేఘం = పయోధరము, మొగిలు
కుండ = కడవ, మట్టిపాత్ర
చుక్క = బిందువు, బొట్టు
కడుపు = పొట్ట, ఉదరము
గంగ = నీరు, జలము
మనసు = మనము, మనస్సు
ఇష్టము = ప్రీతి, మక్కువ
జ్ఞాపకం = జ్ఞప్తి, గుర్తు
వయసు = వయస్సు, ఈడు, ప్రాయము.
రోజు = దినము, దివసము
అడవి = అరణ్యము, కాననము
జబ్బు = రుగ్మత, రోగం
వీధి = వాడ, ఇండ్లవరుస
పాపం = దురితం, దోషం
భీతి = భయం, పిరికితనం
మొక్క = మొలక, చిగురుమొలక
సమస్తం = సర్వం, అఖిలం
తగువు = గొడవ, జగడం
మేత = తిండి, ఆహారం
కోడి = కుక్కుటము, అజ్జవము
మేక = మేషము, అజము
దోమ = మశకము, చీకటీగ
కష్టము = ఇడుము, ఆపద
పని = కార్యము, వ్యాపారము
వ్యవసాయం = కృషి, కమతము
తండ్రి = జనకుడు, పిత
గింజ = పిక్క విత్తు
మామిడి = మావి, ఆమ్రము
నిమ్మ = జంభీరము, రేవతము
కొబ్బరి = కొబ్బెర, నారికేళము
ఉత్సాహం = హుషారు, చురుకుదనం
తల = మస్తకం, శిరస్సు
కాంతి = వెలుగు, దీప్తి
చెవి = కర్ణము, శ్రోత్రము
తోట = ఉపవనము, గృహవనము
ప్రకృతి – వికృతులు
హృదయము – ఎద
నిద్ర – నిదుర
రాత్రి – రాతిరి, రేయి
దీపము – దివ్వె
పుస్తకము – పొత్తము
పశువు – పసరము
బ్రధ్నము – పొద్దు
మొక్క – మూలిక
కష్టము – కస్తి
మేఘము – మొగలు
కుండ – కుండ
భీతి – బీతు
గర్భము – కడుపు
అటవి – అడవి
రాశి – రాసి
వీధి – వీథి
దృఢము – దిటవు
వృద్ధు – పెద్ద
శబ్దము – సద్దు
మేషము – మేక
పక్షి – పక్కి
దాహము – దప్పి
సంతోషము – సంతసము
శ్రవము – చెవి
వ్యతిరేక పదాలు
నిద్ర × మెలుకువ
రాత్రి × పగలు
చింత × నిశ్చింత
వెళ్లి × వచ్చి
వెలిగించు × ఆర్పు
ఆనందం × విచారం
పొద్దున్న × సాయంత్రం
రావడం × పోవడం
వంచి × ఎత్తి
జ్ఞాపకం × మరపు
ఇష్టం × అయిష్టం
కష్టం × సుఖం
పాపం × పుణ్యం
భీతి × నిర్భీతి
భయం × నిర్భయం
చల్లారు × వేడెక్కు
ఇవ్వడం × తీసుకోవడం
బాగుచేసి × పాడుచేసి
ముందు × వెనుక
సంధులు – ఉత్వసంధి
పిల్లలిద్దరూ = పిల్లలు + ఇద్దరూ
మామూలై = మామూలు + ఐ
దేవేసినట్టనిపించింది = దేవేసినట్టు + అనిపించింది
ఎన్నాళ్లిలా = ఎన్నాళ్లు + ఇలా
కొందరిలా = కొందరు + ఇలా
మనుషులిలాగ = మనుషులు + ఇలాగ
రోజులై = రోజులు + ఐ
ఎంతసేపైనా = ఎంతసేపు + ఐనా
కొండలంతటా = కొండలు + అంతటా
పనులక్కడే = పనులు + అక్కడే
పట్టాలిస్తున్నామని = పట్టాలు + ఇస్తున్నాము +అని
నేలనిచ్చేరు = నేలను + ఇచ్చేరు
పెంచలేనంటాదా = పెంచలేను + అంటాదా
నీరెండ = నీరు + ఎండ
మొలకలెత్తిన = మొలకలు + ఎత్తిన
పోలమ్మ = పోలు + అమ్మ
ఇత్వసంధి
రాత్రయిందో – రాత్రి + అయింది + ఓ
పడుతుందేమో = పడుతుంది + ఏమో
పన్తె = పని + ఐ
ఎవరిష్టం = ఎవరి + ఇష్టం
మరోలా = మరి + ఓలా
ఏమై = ఏమి + ఐ
ఏమౌతుందో = ఏమి + ఔతుంది + ఓ
రావాలని = రావాలి + అని
వెళ్లాలని = వెళ్లాలి + అని
పడిందమ్మా = పడింది + అమ్మా
అత్వసంధి
పోతున్నప్పుడు = పోతున్న + అప్పుడు
ఈవేళైనా = ఈ వేళ + ఐనా
గంగమ్మ = గంగ + అమ్మ
చల్లారిన = చల్ల + ఆరిన
అనుకొన్నప్పుడు = అనుకొన్న + అప్పుడు
వెళ్లినప్పుడు = వెళ్లిన + అపుడు
తలెత్తి = తల + ఎత్తి
పరిచినట్లు = పరిచిన + అట్లు
సవర్ణదీర్ఘ సంధి
అర్థాంతరంగా = అర్థ + అంతరంగా
సంధులు: ఈ క్రింది. పదాలను విడదీసి, సంధి పేరు రాయండి.
1. రాత్రయింది = రాత్రి + అయింది – ఇత్వ సంధి
2. కొందరిలా = కొందరు + ఇలా – ఉత్వ సంధి
3. అర్థాంతరంగా = అర్థ + అంతరంగా – సవర్ణదీర్ఘ సంధి
4. వెళ్లినప్పుడు = వెళ్లిన + అప్పుడు – అత్వ సంధి
5. పడిందమ్మా = పడింది అమ్మా – ఇత్వ సంధి
6. తలెత్తి = తల + ఎత్తి – అత్వ సంధి
7. ఏమై = ఏమి + ఐ – ఇత్వ సంధి
8. రావాలని = రావాలి + అని – ఇత్వ సంధి
9. పిల్లలిద్దరూ = పిల్లలు + ఇద్దరూ – ఉత్వ సంధి
10. పరచినట్లు = పరచిన + అట్లు – అత్వ సంధి
IV. బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. భాషాంశాలు
అర్థాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి.
1. కుదురులో దీపం వెలిగించాలి.
a) కుంది
b) మామిడి
c) లాంతరు
d) దీపం
జవాబు:
a) కుంది
2. కష్టపడి పనిచేస్తే కునుకు వస్తుంది.
a) ఆవులింత
b) బద్దకం
c) చెమట
d) నిద్ర
జవాబు:
d) నిద్ర
3. మడిలో విత్తులు చల్లాలి.
a) పవిత్రం
b) పునీతం
c) వరిపొలం
d) భూమి
జవాబు:
c) వరిపొలం
4. మందులు వాడితే జబ్బులు తగ్గుతాయి.
a) రొంప
b) రోగాలు
c) తుమ్ములు
d) కరోనా
జవాబు:
b) రోగాలు
5. నిన్న డొంకలలో పాము మెదిలింది.
a) కనిపించింది
b) సంచరించింది
c) బుసకొట్టింది
d) ఉంది
జవాబు:
b) సంచరించింది
6. అనవసరంగా భీతి చెందకూడదు.
a) భయం
b) కోపం
c) పంతం
d) దూరం
జవాబు:
a) భయం
7. కటకట పడితే సమస్యలు పరిష్కారం కావు.
a) ఆందోళన
b) కంగారు
c) హడావిడి
d) పరుగు
జవాబు:
a) ఆందోళన
8. అనవసరంగా తగువు పడకూడదు.
a) తిట్లు
b) దెబ్బలు
c) గొడవ
d) ఆందోళన
జవాబు:
c) గొడవ
9. పశువులకు మేత పెట్టాలి.
a) గడ్డి
b) నీరు
c) దాణా
d) తిండి
జవాబు:
d) తిండి
10. ధరణిని నమ్మిన రైతు చెడిపోడు.
a) డబ్బు
b) ధనం
c) భూమి
d) చేను
జవాబు:
c) భూమి
పర్యాయపదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు గుర్తించండి.
11. పిల్లలు అల్లరి చేస్తారు.
a) విద్యార్థులు, పెద్దలు
b) తనూజులు, బిడ్డలు
c) శిష్యులు, కొడుకులు
d) కూతుళ్లు, కొడుకులు
జవాబు:
b) తనూజులు, బిడ్డలు
12. మేక ఆకులను తింటుంది.
a) మేషం, అజము
b) మేమే, మేక
c) ఝషం, మేషం
d) మృగం, మెకం
జవాబు:
a) మేషం, అజము
13. పాపం చేయకూడదు.
a) ఘోరం, నేరం
b) నేరం, హత్య
c) దురితం, దోషం
d) చెడు, పని
జవాబు:
c) దురితం, దోషం
14. మామిడి కాయ పుల్లగా ఉంటుంది.
a) చింత, ఆమ్లం
b) బంగినపల్లి, గోవా
c) తింత్రిణీ, పులుపు
d) మావి, ఆమ్రము
జవాబు:
d) మావి, ఆమ్రము
15. మనసులో మంచి ఆలోచనలే ఉండాలి.
a) మనము, మనస్సు
b) తల, తలపు
c) మనము, మేము
d) దేహం, కాయం
జవాబు:
a) మనము, మనస్సు
16. దోమ కుడితే మలేరియా వస్తుంది.
a) ఈగ, చీకటిగ
b) హస్తి, మశకం
c) మశకం, చీకటీగ
d) ఈగ, హస్తి
జవాబు:
c) మశకం, చీకటీగ
17. కోడి ప్రతి ఝాముకు కూస్తుంది.
a) కుక్కుటము, భైరవం
b) భైరవం, అజము
c) భైరవం, రౌరమా
d) కుక్కుటము, అజ్ఞవము
జవాబు:
d) కుక్కుటము, అజ్ఞవము
18. మా పొలంలో నల్లవరి పండించాము.
a) పంట, ధాన్యం
b) క్షేత్రము, చేను
c) చేను, తోట
d) తోట, వనం
జవాబు:
b) క్షేత్రము, చేను
19. వ్యవసాయం చేస్తే రైతు కష్టం తెలుస్తుంది.
a) కృషి, కమతము
b) సేద్యం, శ్వేదం
c) క్షేత్రం, కృషి
d) కమతం, పొలం
జవాబు:
a) కృషి, కమతము
20. సూర్యకాంతి పడితే రోగాలు పోతాయి.
a) వెలుగు, వేడి
b) దీప్తి, దీపం
c) వెలుగు, దీప్తి
d) దీప్తి, వేడి
జవాబు:
c) వెలుగు, దీప్తి
ప్రకృతి-వికృతులు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి-వికృతులను గుర్తించండి.
21. కష్టమునకు తగిన ఫలితం ఉంటుంది.
a) నష్టము
b) కషటము
c) కస్తి
d) కసి
జవాబు:
c) కస్తి
22. నిదురపోతే అలసట తగ్గుతుంది.
a) నిద్ర
b) నీరసం
c) మత్తు
d) కునుకు
జవాబు:
a) నిద్ర
23. హృదయం పవిత్రంగా ఉండాలి.
a) మనసు
b) గుండె
c) ఎద
d) తల
జవాబు:
c) ఎద
24. పశువును హింసించడం మహాపాపం.
a) జంతువు
b) మూగజీవి
c) మృగం
d) పసరము
జవాబు:
d) పసరము
25. దీపము లేకుండా నిద్రపోకూడదు.
a) లైటు
b) దివ్వె
c) కాంతి
d) దీప్తి
జవాబు:
b) దివ్వె
26. పుస్తకములు ఎక్కువగా చదవాలి.
a) పొత్తము
b) పుస్తె
c) పుత్తము
d) పుత్తడి
జవాబు:
a) పొత్తము
27. బ్రద్నము వెలుగు తెస్తుంది.
a) బద్ధకం
b) బద్ధము
c) ప్రొద్దు
d) బదనాం
జవాబు:
c) ప్రొద్దు
28. ఆకాశంలో మేఘములు ఉన్నాయి.
a) మేగము
b) మొగిలు
c) మేఘన
d) మొగ్గ
జవాబు:
b) మొగిలు
29. మన ఆశ తీరాలంటే కృషి చేయాలి.
a) అశ
b) అస్సు
c) ఆస
d) ఆష
జవాబు:
c) ఆస
30. మూలికలు జాగ్రత్తగా పెంచాలి.
a) మొక్క
b) ఔషధం
c) మందు
d) ఆయుర్వేదం
జవాబు:
a) మొక్క
వ్యతిరేక పదాలు : ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు గుర్తించండి.
31. దీపము వెలిగించు.
a) జ్వలించు
b) ఆర్పు
c) పెద్దది
d) వెలుగు
జవాబు:
b) ఆర్పు
32. చింత పనికిరాదు.
a) నిశ్చింత
b) చింతాకు
c) పరచింత
d) ఈస్వచింత
జవాబు:
a) నిశ్చింత
33. చుట్టాలు రావడం మంచిది.
a) కూర్చోవడం
b) ఉండడం
c) పోవడం
d) నిలవడం
జవాబు:
c) పోవడం
34. నీరు చల్లారుతుంది.
a) గడ్డకట్టు
b) ఆవిరగు
c) ఘనీభవించు
d) వేడెక్కు
జవాబు:
d) వేడెక్కు
35. ముందు ఏం జరుగుతుందో తెలియదు.
a) వెనుక
b) మున్ముందు
c) పైన
d) క్రింద
జవాబు:
a) వెనుక
36. నిర్భయంగా జీవించాలి.
a) ధైర్యం
b) అధైర్యం
c) భయం
d) దడ
జవాబు:
c) భయం
37. కష్టం తెలుసుకోవాలి.
a) సుఖం
b) లాభం
c) ఇడుము
d) ఆపద
జవాబు:
a) సుఖం
38. భీతి పనికిరాదు.
a) బీతు
b) భయం
c) పిరికితనం
d) నిర్భీతి
జవాబు:
d) నిర్భీతి
39. పాపం చేయకూడదు.
a) దురితం
b) పుణ్యం
c) దోషం
d) కల్మషం
జవాబు:
b) పుణ్యం
40. ఆనందంగా జీవించాలి.
a) సంతోషం
b) వందనం
c) విచారం
d) వనచరం
జవాబు:
c) విచారం
2. వ్యాకరణాంశాలు
క్రిందివానిని కోరిన విధంగా గుర్తించండి.
41. రజనీ చాలా పొడవుగా ఉంది – భాషాభాగమేది?
a) క్రియ
b) విశేషణం
c) నామవాచకం
d) సర్వనామం
జవాబు:
b) విశేషణం
42. ఆమె అన్నం తిని సినిమాకు వెళ్లింది.
a) సమాపక క్రియ
b) అసమాపక క్రియ
c) అవ్యయం
d) సర్వనామం
జవాబు:
b) అసమాపక క్రియ
43. వాడు ఈ రోజే వెళ్లాడు.
a) సమాపక క్రియ
b) అసమాపక క్రియ
c) అవ్యయం
d) నామవాచకం
జవాబు:
a) సమాపక క్రియ
44. ఈ పేపరు బాగుంది.
a) నామవాచకం
b) క్రియ
c) అవ్యయం
d) సర్వనామం
జవాబు:
d) సర్వనామం
45. ఆహా ! ఎంత రుచిగా ఉంది?
a) నామవాచకం
b) సర్వనామం
c) అవ్యయం
d) క్రియ
జవాబు:
c) అవ్యయం
46. గులాబీ పూలు అందంగా ఉన్నాయి.
a) నామవాచకం
b) క్రియ
c) విశేషణం
d) అవ్యయం
జవాబు:
a) నామవాచకం
47. ఇంటికి వెళ్లి, చదువుకో.
a) సమాపక క్రియ
b) అసమాపక క్రియ
c) అవ్యయం
d) విశేషణం
జవాబు:
b) అసమాపక క్రియ
48. నేను పాఠశాలకు వెడతాను.
a) అవ్యయం
b) నామవాచకం
c) సమాపక క్రియ
d) అసమాపక క్రియ
జవాబు:
c) సమాపక క్రియ
49. సూర్యుడు తూర్పున ఉదయించును.
a) సర్వనామం
b) క్రియ
c) విశేషణం
d) నామవాచకం
జవాబు:
d) నామవాచకం
50. క్రిందివానిలో అసమాపక క్రియను గుర్తించండి.
a) చేసి
b) చూస్తాను
c) కృష్ణుడు
d) అయ్యో
జవాబు:
a) చేసి
సంధులు : క్రింది వానిని కోరిన విధంగా గుర్తించండి.
51. ధర్మార్థములు – సంధి పేరేమిటి?
a) అత్వసంధి
b) సవర్ణదీర్ఘ సంధి
c) ఇత్వసంధి
d) ఉత్వసంధి
జవాబు:
b) సవర్ణదీర్ఘ సంధి
52. ఆటాడుకో – సంధి పేరేమిటి?
a) అత్వసంధి
b) సవర్ణదీర్ఘ సంధి
c) ఇత్వసంధి
d) గుణసంధి
జవాబు:
a) అత్వసంధి
53. బాలుడెవరు – సంధి విడదీయండి.
a) బాలుడె + వరు
b) బాలు + డెవరు
c) బాలుడు + ఎవరు
d) బాలుడెవ + రు
జవాబు:
c) బాలుడు + ఎవరు
54. – పాకెక్కడుంది – సంధి పేరేమి?
a) ఇత్వసంధి
b) ఉత్వసంధి
c) గుణసంధి
d) అత్వసంధి
జవాబు:
d) అత్వసంధి
55. తరగతిగదియేది – సంధి విడదీయండి.
a) తరగతి గది + ఏది
b) తరగతి గది + యేది
c) తరగతి + గదియేది
d) తర + గతి + యేది
జవాబు:
a) తరగతి గది + ఏది
56. క్రిందివానిలో అత్వసంధి పదం గుర్తించండి.
a) రామార్పణం
b) మనమందరం
c) వంటాముదం
d) పానకాలు
జవాబు:
c) వంటాముదం
57. పాపాత్ముడు – సంధి పేరేమి? – పంది పేరేమి?
a) సవర్ణదీర్ఘసంధి
b) త్రికసంధి
c) ఆమ్రేడిత సంధి
d) గుణసంధి
జవాబు:
a) సవర్ణదీర్ఘసంధి
58. కట్టకడ – సంధి విడదీయండి.
a) కట్ట + కడ
b) కడ + కడ
c) కట్టు + కడ
d) కట్టడి + కడ
జవాబు:
b) కడ + కడ
59. పిడుగు + పిడుగు – సంధి కలిపిన రూపమేది?
a) పిడుపిడుగు
b) పిప్పిడుగు
c) పిడవిడుగు
d) పిట్టపిడుగు
జవాబు:
d) పిట్టపిడుగు
60. అచ్చెరువున – సంధి విడదీసిన రూపం గుర్తించండి.
a) అ + చెరువున
b) ఆ + చెరువున
c) అచ్చేరు + వున
d) అచ్చె + రువున
జవాబు:
b) ఆ + చెరువున
నేనివి చేయగలనా?
1. పాఠాన్ని ధారాళంగా చదవగలను, అర్థం చేసుకొని సొంతమాటల్లో చెప్పగలను. [ ఔను / కాదు ]
2. పాఠంలోని పదబంధాలను వాక్యాలలో ఉపయోగించగలను. [ ఔను / కాదు ]
3. పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంతమాటల్లో రాయగలను. [ ఔను / కాదు ]
4. రైతు గొప్పతనాన్ని గురించి నా అభిప్రాయాన్ని రాయగలను. [ ఔను / కాదు ]
చదవండి – ఆనందించండి
నిరంతరం నెర్చుకో …………
సోక్రటీస్ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడనే నెపంతో రాజు మరణశిక్ష విధించాడు. శిక్షలో భాగంగా తనకుతాను విషం తాగి మరణించవలసి ఉంది. ఆయన్ని జైల్లో పెట్టారు. పేరుకు జైల్లో పెట్టారే కానీ అందరూ వచ్చి చూసి వెళుతున్నారు. శిష్యులు మాత్రం అక్కడే ఉండి బాధ పడుతున్నారు. సోక్రటీస్ ఇవేమీ పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉండేవాడు. మరణించబోతున్నాననే భయం లేకుండా ఉన్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు.
సోక్రటీస్ జీవితంలో చివరి రోజు రానే వచ్చింది. మరణశిక్ష అమలు కావడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది. అక్కడ శిష్యులతో పాటు అందరి ముఖాల్లో ఆందోళన దిగులు ఎక్కువయింది. సోక్రటీస్ ముఖంలో మాత్రం ప్రశాంతత, ఆనందం, వెలుగు కనిపిస్తున్నాయి.
సోక్రటీస్, కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని ఒక వాద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. అది సోక్రటీస్ మనసును ఆకట్టుకుంది. ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ ని పిలిచాడు. జైలర్ గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు. సోక్రటీస్ కిటికీలో నుంచి చూపిస్తూ “మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకువస్తారా” అని అడిగాడు. ‘అలానే అంటూ జైలర్ వెళ్లి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చాడు. సోక్రటీస్ బిచ్చగాడితో తనకు ఆ పాట నేర్పమన్నాడు.
అతని దగ్గర నుంచి వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్ పాటపాడుతూ వాద్యం వాయించాడు. ఇలా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే సోక్రటీస్ ఆ పాట పాడాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించాడు.
ఇదంతా చూస్తున్న శిష్యులు, జైలర్ మరింతగా ఆశ్చర్యపోయారు. అప్పుడు శిష్యులు “గురువుగారు ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. మీరు ఈ లోకాన్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఆఖరిక్షణాల్లో మీరు ఆ వాద్యం మీద అభ్యాసం చేసి పాడటం నేర్చుకున్నారు. ఎందుకు? అని అడిగారు. సోక్రటీస్ నవ్వి “జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను, నువ్వు ఇక్కడున్న అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినంత కాలం ప్రతిక్షణం విలువైనదే.. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. గంట క్రితం నాకు ఆ పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది. అంటే ఇప్పటికీ నేర్చుకోటానికి నాకు అవకాశం ఉంది” అన్నాడు. అక్కడున్న వారి నోట మాట రాలేదు.