These AP 8th Class Biology Important Questions 11th Lesson మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 11th Lesson Important Questions and Answers మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది?
ప్రశ్న 1.
వైరల్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ ఎందుకు పనిచేయవు ?
జవాబు:
వైరస్లు కణకవచాన్ని రక్షక కవచంగా మార్చుకోవడమనే జీవరసాయనిక మార్గాన్ని అసలు అనుసరించవు. కాబట్టి వైరల్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ పనిచేయవు.
ప్రశ్న 2.
గాలి ద్వారా వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి? ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- కొన్ని అంటు వ్యాధులు గాలి ద్వారా వ్యాపిస్తాయి.
- జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు కాని, దగ్గినప్పుడు గాని ఏర్పడే తుంపరల ద్వారా వ్యాధికారక జీవులు వ్యాప్తి చెందుతాయి.
- ఆ తుంపరలు ఎదుటి వ్యక్తి పీల్చినప్పుడు బ్యాకీరియాలు అతనిలో ప్రవేశించి వ్యాధిని సంక్రమింపచేస్తాయి.
- గాలి ద్వారా వ్యాప్తి చెందేవి జలుబు, ‘న్యూమోనియా, క్షయ మొదలైన వ్యాధులు.
ప్రశ్న 3.
నీటి ద్వారా వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి ? వివరించండి.
జవాబు:
- కొన్ని రకాల వ్యాధులు నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి.
- వ్యాధి సోకిన వ్యక్తి విసర్జక పదార్థాల (మలమూత్రాలు) వలన. కొన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
- కలరా, రక్తవిరేచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి.
- కలరాను కలిగించే సూక్ష్మజీవులు త్రాగేనీటిలో కలిసిపోవడం వలన ఆ నీరు తాగిన ప్రజలకు వ్యాధి సోకుతుంది.
- కలరా కలిగించే వ్యాధి జనకం క్రొత్త అతిథేయిలోకి త్రాగే నీటి ద్వారా ప్రవేశించి వ్యాధిని కలుగచేస్తుంది.
- రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతాలలో ఇటువంటి వ్యాధులు త్వరగా సోకుతాయి.
ప్రశ్న 4.
లైంగిక వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి ? ఎలా వ్యాపించవు ?
జవాబు:
- కొన్ని రకాల వ్యాధులు కేవలం లైంగిక పరమైన సంబంధాల వలన మాత్రమే వస్తాయి.
- సిఫిలిస్, ఎయిడ్స్ వంటివి లైంగిక వ్యాధులు.
- ఇలాంటి వ్యాధులు కలిగిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం వలన ఒకరి నుండి మరొకరికి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
- లైంగిక వ్యాధులు భౌతిక స్పర్శ వలన వ్యాపించవు.
- సర్వసాధారణంగా కరచాలనం, కౌగిలించుకోవటం, లేక కుస్తీ పోటీలు వంటి ఆటల వలన కానీ కలిసి కూర్చోవడం, పనిచేయడం, ప్రయాణించడం వంటి వాటి వలన సోకవు.
ప్రశ్న 5.
వ్యాధికారక సూక్ష్మజీవులు శరీరంలో ఎక్కడ చేరతాయి ?
జవాబు:
- వ్యాధికారక జీవులు శరీరంలోని వివిధ భాగాలలోకి చేరి పరిణితి చెందుతాయి.
- శరీరంలోని వివిధ భాగాలు వ్యాధి కారక జీవులకు ప్రవేశ మార్గాలుగా పనిచేస్తాయి.
- ఏ శరీర భాగం వీటికి ఆవాసంగా మారుతుంది అనే విషయం ఏ మార్గం ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది.
- ఉదాహరణకు గాలిద్వారా ముక్కులోకి ప్రవేశించినప్పుడు అది చివరికి ఊపిరితిత్తులలోకి చేరే అవకాశముంటుంది.
- క్షయ వ్యాధిని కలుగచేసే బ్యాక్టీరియా కూడా ఈ మార్గం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది.
- ఒకవేళ నోటి ద్వారా ప్రవేశిస్తే అవి జీర్ణాశయ, చిన్నప్రేగు గోడల్లో నిల్వ ఉండి, వ్యాధిని కలుగజేస్తాయి.
ఉదా : టైఫాయిడ్. - బాక్టీరియా కొన్ని రకాల వైరస్లు కాలేయంలో చేరడం వల్ల కామెర్ల వ్యాధి కలిగే అవకాశం ఉంది.
- కానీ ప్రతిసారి ఇలా జరుగదు. ఉదాహరణకి హెచ్.ఐ.వి. లైంగిక అవయవాల ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పటికీ . లింఫ్ గ్రంథుల నుండి మొత్తం శరీరంలోకి వ్యాపిస్తాయి.
- మలేరియా కలుగజేసే వ్యాధికారక జీవులు దోమకాటు ద్వారా కాలేయంలోకి వెళ్ళి అక్కడి నుండి ఎర్రరక్త కణాలలోకి వెళ్తాయి.
- మెదడు వాపు వ్యా ధి (Japanese encephalitis) కలుగచేసే వైరస్ దోమకాటు వలన ప్రవేశించి మెదడుకు చేరి వ్యాధిని కలుగచేస్తుంది.
ప్రశ్న 6.
వ్యాధి లక్షణాలు దేనిపైన ఆధారపడతాయి? ఉదహరించండి.
జవాబు:
- వ్యాధి జనక జీవులు ఏరకమైన అవయవాలు లేదా కణజాలాలలో ప్రవేశిస్తాయో వాటి ఆధారంగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
- వ్యాధికారక జీవులు ,ఊపిరితిత్తులను ఆశ్రయిస్తే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
- కాలేయాన్ని ఆశ్రయిస్తే కామెర్ల వ్యాధి లక్షణాలు కనబడుతాయి.
- మెదడులో ప్రవేశించినట్లయితే తలనొప్పి, వాంతులు, స్పృహకోల్పోవడం వంటి వ్యాధి లక్షణాలను చూస్తాం.
- వ్యాధి జనక జీవులు దాడిచేసే కణజాలం లేదా అవయవం విధులను బట్టి మనం వ్యాధి లక్షణాలను ఊహించవచ్చు.
ప్రశ్న 7.
పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ప్రజలను చైతన్యపరచడానికి ఒక కరపత్రం తయారుచేయండి.
జవాబు:
కరపత్రం
“చికిత్స కన్నా నివారణ అత్యుత్తమం” అన్న సూక్తిని అనుసరించి, మనం మన ఇంటి పరిసరాలను చెత్తాచెదారం, మురికి గుంటలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. మురుగు నీటి కాల్వలలో కిరోసిన్ చల్లడం ద్వారా దోమల లార్వాలను. అరికట్టవచ్చు.. ఆహార పదార్థాలను ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తగినంత శారీర వ్యాయామం అనంతరం స్నానం చేయాలి. ఆరోగ్యవంతమైన అలవాట్ల ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారు.
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
స్వల్పకాలిక వ్యాధులు ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి ?
జవాబు:
స్వల్పకాలిక వ్యాధులకు తరచు గురి అవుతూ ఉన్నప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను సరిగా గుర్తించలేనప్పుడు, స్వల్పకాలిక వ్యాధులను నిర్లక్ష్యం చేసినపుడు, స్వల్పకాలికంగా ఉన్నప్పుడు సరిగా చికిత్స చేయించుకోకపోయినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి.
ఉదా : ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు.
ప్రశ్న 2.
మంచి ఆరోగ్యానికి కావల్సిన రెండు పరిస్థితులను వివరించండి.
జవాబు:
1. శరీర అవయవాలు అన్నీ చక్కగా పనిచేయుట : దీని వలన శరీరంలో ప్రతి అవయవం చక్కగా పనిచేయును. ఉదాహరణకు నాట్యం చేసే వ్యక్తిలో మంచి ఆరోగ్యం అంటే తన శరీరాన్ని ఎలా కావలిస్తే అలా వంచుతూ వివిధ భంగిమలతో అద్భుతంగా నాట్యం చేయడం.
2. మనలోని ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించగలిగితే మంచి ఆరోగ్యంగా ఉంటాము.
ప్రశ్న 3.
అసంక్రామ్యత అంటే ఏమిటి ?
జవాబు:
ఒక వ్యాధికి ఒక వ్యక్తి పలుసార్లు గురి అయినప్పుడు ఆ వ్యాధిని ఎదురుకొనే శక్తి అతనికి వస్తుంది. దీనిని అసంక్రామ్యత అంటారు.
ప్రశ్న 4.
వైరల్ వ్యాధులకు యాంటిబయోటిక్స్ ఎందుకు పనిచేయవు ?
జవాబు:
వైరస్లు కణకవచాన్ని రక్షక కవచంగా మార్చుకోవడమనే జీవరసాయనిక మార్గాన్ని అసలు అనుసరించవు. కాబట్టి ఆ వైరల్ వ్యాధులకు యాంటీబయోటిక్స్ పనిచేయవు.
లక్ష్యాత్మక నియోజనము
ప్రశ్న 1.
కామెర్ల వ్యాధి కలుగచేసే వైరస్ ఎలా వ్యాప్తి చెందును?
ఎ) గాలి
బి) నీరు
సి) జంతువులు
డి) ఆహారం
జవాబు:
బి) నీరు
ప్రశ్న 2.
దీర్ఘకాలిక వ్యా ధి ఏది ?
ఎ) జలుబు
బి) జ్వరం
సి) ఊపిరితిత్తుల క్షయ
డి) ఏదీ కాదు
జవాబు:
సి) ఊపిరితిత్తుల క్షయ
ప్రశ్న 3.
ఈ క్రింది వానిలో అసాంక్రమిక వ్యాధి
ఎ) గుండెపోటు
బి) జలుబు
సి) క్షయ
డి) కలరా
జవాబు:
ఎ) గుండెపోటు
ప్రశ్న 4.
మార్షల్ మరియు వారెను దేనిపై పరిశోధన జరిపినారు?
ఎ) ఊపిరితిత్తులు
బి) గుండె
సి) మూత్రపిండాలలో రాళ్ళు
డి) జీర్ణాశయ అల్సర్
జవాబు:
డి) జీర్ణాశయ అల్సర్
ప్రశ్న 5.
వ్యాధిగ్రస్తుడి నుండి వ్యాధి ఏ విధంగా ఉన్నప్పుడు సులువుగా వ్యాపించును ?
ఎ) దూరంగా
బి) దగ్గరగా
సి) బాగా దూరంగా
డి) ఏదీకాదు
జవాబు:
బి) దగ్గరగా
ప్రశ్న 6.
తల్లి నుండి బిడ్డకు సోకకుండా చేసిన వ్యాధి
ఎ) మెదడువాపు
బి) కలరా
సి) ఎయిడ్స్
డి) టైఫాయిడ్
జవాబు:
సి) ఎయిడ్స్
ప్రశ్న 7.
సూక్ష్మజీవ నాశికకు ఉదాహరణ
ఎ) పెన్సిలిన్
బి) 2, 4 – డి .
సి) పారాసిటమల్
డి) వార్ఫిన్
జవాబు:
ఎ) పెన్సిలిన్
ప్రశ్న 8.
ఈ క్రింది వానిలో ప్రపంచంలో ఎక్కడా లేని వ్యాధి
ఎ) ఆటలమ్మ
బి) మశూచి
సి) డెంగ్యూ
డి) ఎయిడ్స్
జవాబు:
బి) మశూచి
ప్రశ్న 9.
ఆరోగ్యంగా ఉండడం అంటే
ఎ) శారీరకంగా బాగుండటం
బి) మానసికంగా బాగా ఉండటం
సి) సామాజికంగా సరైన స్థితిలో ఉండటం
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
ప్రశ్న 10.
వ్యక్తిగత పరిశుభ్రతలో చాలా ముఖ్యమైనది
ఎ) పరిసరాల శుభ్రత
బి) సామాజిక పరిశుభ్రత
సి) గ్రామ పరిశుభ్రత
డి) పైవన్నీ
జవాబు:
బి) సామాజిక పరిశుభ్రత
ప్రశ్న 11.
ఈ క్రింది వానిలో దీర్ఘకాలిక వ్యా ధి
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) టైఫాయిడ్
డి) జ్వరం
జవాబు:
బి) ఫైలేరియా
ప్రశ్న 12.
పేదరికం, ప్రజా పంపిణీ వ్యవస్థ వ్యాధి కారకతలో ఎన్నవ దశకు చెందిన కారణాలు ?
ఎ) ప్రథమ దశ
బి) రెండవ దశ
సి) మూడవ దశ
డి) నాల్గవ దశ
జవాబు:
సి) మూడవ దశ
ప్రశ్న 13.
పౌష్టికాహారం దొరకకపోవటం వ్యాధికారకతలో ఎన్నవ దశకు చెందిన కారణం?
ఎ) ప్రథమ దశ
బి) రెండవ దశలో
సి) మూడవ దశ
డి) నాల్గవ దశ
జవాబు:
బి) రెండవ దశలో
ప్రశ్న 14.
సాంక్రమిక సూక్ష్మజీవులు వ్యాధికి
ఎ) సత్వర కారకం
బి) దోహదకారకం
సి) పై రెండూ
డి) పైవేవీ కావు
జవాబు:
ఎ) సత్వర కారకం
ప్రశ్న 15.
కేన్సర్ ఒక
ఎ) సాంక్రమిక వ్యాధి
బి) అసాంక్రమిక వ్యాధి.
సి) దీర్ఘకాలిక వ్యాధి
డి) బి మరియు సి
జవాబు:
డి) బి మరియు సి
ప్రశ్న 16.
జీర్ణాశయ అల్సరకు ఈ క్రింది బాక్టీరియా కారణమని వారెన్, మార్షల్ కనుగొన్నారు.
ఎ) స్టాఫైలోకోకస్
బి) విబ్రియోకామా
సి) హెలికోబాక్టర్ పైలోరి
డి) లాక్టోబాసిల్లస్
జవాబు:
సి) హెలికోబాక్టర్ పైలోరి
ప్రశ్న 17.
ఈ క్రింది వానిలో వైరస్ వల్ల రాని వ్యాధి.
ఎ) ఎయిడ్స్
బి) ఆంధ్రాక్స్
సి) ఇనూయెంజా
డి) డెంగ్యూ
జవాబు:
బి) ఆంధ్రాక్స్
ప్రశ్న 18.
ఈ క్రింది వానిలో బాక్టీరియా వ్యాధి కానిది
ఎ) జలుబు
బి) టైఫాయిడ్
సి) కలరా
డి) క్షయ
జవాబు:
ఎ) జలుబు
ప్రశ్న 19.
ఈ క్రింది వానిలో ప్రోటోజోవన్ల వలన కలిగే వ్యాధి
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) టైఫాయిడ్
డి) డెంగ్యూ జ్వరం
జవాబు:
ఎ) మలేరియా
ప్రశ్న 20.
ఈ క్రింది వానిలో హెల్మింథిస్ జాతి క్రిముల వలన కలిగే వ్యాధి
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) టైఫాయిడ్
డి) డెంగ్యూ జ్వరం
జవాబు:
బి) ఫైలేరియా
ప్రశ్న 21.
ఎల్లప్పుడు అతిథేయి కణాలలో జీవించేవి
ఎ) బాక్టీరియా
బి) వైరస్
సి) ప్రోటోజోవా
డి) హెల్మింథిస్
జవాబు:
బి) వైరస్
ప్రశ్న 22.
యాంటీబయోటిక్స్ వైరస్ మీద పని చేయకపోటానికి కారణం
ఎ) వైరస్టు అతిధేయ కణాల వెలుపల నిర్జీవంగా ఉండటం
బి) వైరస్లు కణకవచాన్ని రక్షక కవచంగా మార్చుకోక పోవటం
సి) వైరస్లు ప్రత్యేకమయిన జీవ రసాయన మార్గాలను అవలంబించటం
డి) బి మరియు సి
జవాబు:
సి) వైరస్లు ప్రత్యేకమయిన జీవ రసాయన మార్గాలను అవలంబించటం
ప్రశ్న 23.
ఈ క్రింది వానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి
ఎ) కలరా
బి) క్షయ
సి) న్యుమోనియా
డి) జలుబు
జవాబు:
ఎ) కలరా
ప్రశ్న 24.
ఈ క్రింది వానిలో నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి
ఎ) జలుబు
బి) క్షయ
సి) న్యుమోనియా
డి) రక్త విరేచనాలు
జవాబు:
డి) రక్త విరేచనాలు
ప్రశ్న 25.
ఈ క్రింది వానిలో లైంగిక సంబంధాల వలన వచ్చే
ఎ) మలేరియా
బి) ఫైలేరియా
సి) గనేరియా
డి) ఢిల్జీరియా
జవాబు:
సి) గనేరియా
ప్రశ్న 26.
అసంక్రామ్యత వ్యాధి జనక జీవులను చంపటానికి కొత్త కణాలను కణజాలాలలోనికి చేర్చటానికి కనిపించే లక్షణాలు
ఎ) నొప్పి
బి) వాపు
సి) జ్వరం
డి) పైవన్నీ
జవాబు:
డి) పైవన్నీ
ప్రశ్న 27.
క్రింది వానిలో టీకాలేని వ్యాధి
ఎ) ఆటలమ్మ
బి) కామెర్లు
సి) రేబిస్
డి) ఎయిడ్స్
జవాబు:
డి) ఎయిడ్స్
ప్రశ్న 28.
హెపటైటిస్ వ్యాధి కలుగచేసే వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందును?
ఎ) గాలి
బి) నీరు
సి) జంతువులు
డి) ఆహారం
జవాబు:
బి) నీరు
ప్రశ్న 29.
చిత్రంలో ఏ జీవి కాలా అజార్ వ్యాధిని కలిగిస్తుంది ?
జవాబు:
ప్రశ్న 30.
వ్యాధులను కింది విధంగా వర్గీకరిస్తారు.
(A) సాంక్రమిక వ్యాధులు మరియు అసాంక్రమిక వ్యాధులు
(B) దీర్ఘకాల వ్యాధులు మరియు స్వల్పకాల వ్యాధులు
(C) A మరియు B
(D) దీన్ని వర్గీకరించలేము
జవాబు:
(C) A మరియు B
ప్రశ్న 31.
కింది వాటిలో , కామెర్ల వ్యాధిలో అధికంగా ప్రభావితమయ్యే అంగము
(A) కాలేయం
(B) మూత్రపిండాలు
(C) ఊపిరితిత్తులు
(D) కళ్ళు
జవాబు:
(A) కాలేయం
ప్రశ్న 32.
జీవజాతులను సంరక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినవి SA-II : – 2016-17 ( D )
(A) జాతీయ పార్కులు
(B) సంరక్షణ కేంద్రాలు
(C) శాంక్చురీలు
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ