AP 8th Class Biology Notes Chapter 10 పీల్చలేము – తాగలేము

Students can go through AP Board 8th Class Biology Notes 10th Lesson పీల్చలేము – తాగలేము to understand and remember the concept easily.

AP Board 8th Class Biology Notes 10th Lesson పీల్చలేము – తాగలేము

→ కాలుష్యం అనేది గాలి, నీరు, నేలలోని జీవ భౌతిక, రసాయనిక ధర్మాలలో వచ్చిన మార్పు.

→ వాతావరణంలోకి కలుషితాలు చేరడం వల్ల దానిలో నివసించే సజీవులకు, నిర్జీవ అంశాలకు ప్రమాదకరంగా మారితే దానిని వాతావరణ కాలుష్యం అంటారు.

→ కాలుష్య కారకములు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ముఖ్యమైన కాలుష్య కారకములు కార్బన్ మోనాక్సెడ్ (CO), కార్బన్ డై ఆక్సెడ్ (CO2), సల్ఫర్ డై ఆక్సెడ్ (SO2), నత్రజని (N2), క్లోరోఫ్లోరో కార్బన్స్, భారలోహాలు మరియు గాలిలో దుమ్ము రేణువులు.

→ ఇంధనాలు మండించుట, వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎరువులు మరియు పురుగుల మందులు, అడవుల నరికివేత, సి.ఎఫ్.సి. (క్లోరోఫ్లోరో కార్బన్స్) మరియు గనులు గాలికాలుష్యం జరుగుటకు గల కారణాలు.

→ గాలి కాలుష్యం వలన అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ మొదలగునవి.

→ విషపూరితమైన రసాయనాలు, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, మురుగునీరు వీటి వలన నీరు కలుషితమై ఉండకూడని హానికరమైన పదార్థాలు కలిగి ఉంటే నీటి కాలుష్యం జరిగినదని అనవచ్చు.

→ పరిశ్రమల వ్యర్థాలు, మురుగు పదార్థాలు, ఎరువులు, పురుగులను చంపే మందులు మొదలగు కారకాలు నీటిని కలుషితం చేస్తున్నాయి.

→ నీటి వలన కలిగే వ్యాధులైన టైఫాయిడ్, కలరా, రక్త విరేచనాలు, కామెర్లు, అతిసారం మొదలైన వ్యాధులు నీటి కాలుష్యం వలన వస్తాయి.

→ గాలి, నీరు కాలుష్యాలను 4R సూత్రం అమలుపరచుట వలన తగ్గించవచ్చు.

AP 8th Class Biology Notes Chapter 10 పీల్చలేము - తాగలేము

→ కాలుష్యం : ప్రకృతి విరుద్ధమైన మూలకాలు వాతావరణంలో కలియడాన్ని “కాలుష్యం” అంటారు.

→ గాలి కాలుష్యం : మానవ చర్యల వలన గాని, ప్రకృతిలో జరిగే మార్పుల వలన గాని వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దానిని “గాలి కాలుష్యం” అంటారు.

→ విటికాలుష్య కారకాలు : నీటిని కలుషితం చేసే వాటిని (పదార్థాలను) “నీటి కాలుష్య కారకాలు” అంటారు.

→ అగ్నిపర్వత ప్రేలుడు : ఇది ప్రకృతి సహజంగా జరిగే కాలుష్యానికి ఒక కారణం.

→ థర్మల్ పవర్ ప్లాంట్ : బొగ్గును మండించి, విద్యుత్ తయారుచేయు కేంద్రాన్ని ‘థర్మల్ పవర్ ప్లాంట్” అంటారు.

→ క్లోరోఫ్లోరో కార్బన్ : రిఫ్రిజిరేటర్స్, ఎ.సి.లు, విమానాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలను క్లోరోఫ్లోరో కార్బన్లు అంటారు. వీటిని CFCs అని కూడా అంటారు.

→ నీటికాలుష్యం : నీటిలో నిర్ధారిత స్థాయి కంటే ఎక్కువగా హానికరమైన పదార్థాలు ఉంటే దానిని “నీటి కాలుష్యం” అంటారు.

→ పరిశ్రమల విషపూరిత వ్యర్థ పదార్థాలు : కొన్ని పరిశ్రమల నుంచి మానవునికి, జంతువులకు హాని కల్గించే వ్యర్థ పదార్థాలు విడుదలగును.

→ తేలియాడే పదార్థాలు : కొన్ని పదార్థాలు నీటి కన్నా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. వీటిని తేలియాడే పదార్థాలు అంటారు.

→ యూట్రాఫికేషన్ : నీటిలోని పోషకాలు బాగా పెరిగి, మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని యూట్రాఫికేషన్ అంటారు.

→ అవక్షేపం : నీరు కాలుష్యం కావడానికి అవక్షేపం అనేది ఒక సాధారణ కారకం. ఈ విధానంలో ఖనిజ లవణాలు మరియు ఘనరూపంలోని కర్బన పదార్థాలు నేల నుండి కొట్టుకొని పోయి నీటిలోనికి ప్రవేశిస్తాయి.

→ పునర్వినియోగం : కొన్ని పదార్థాలు వాడిన తర్వాత తిరిగి ఉపయోగించుట జరుగును. దీనిని పునర్వినియోగం అంటారు.

AP 8th Class Biology Notes Chapter 10 పీల్చలేము - తాగలేము 1
AP 8th Class Biology Notes Chapter 10 పీల్చలేము - తాగలేము 2