AP 8th Class Biology Notes Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

Students can go through AP Board 8th Class Biology Notes 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1 to understand and remember the concept easily.

AP Board 8th Class Biology Notes 3rd Lesson సూక్ష్మజీవుల ప్రపంచం 1

→ మన పరిసరాలలో, మన కంటికి కనబడకుండా వుండే జీవులను “సూక్ష్మజీవులు” అంటారు.

→ సూక్ష్మజీవులను బాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు, శైవలాలు మరియు సూక్ష్మ ఆర్రోపోడ్స్ అనే 5 సమూహాలుగా వర్గీకరించారు. మొ|| 4 సమూహాలుగా వర్గీకరించారు.

→ ‘బాక్టీరియా’ను మొదట ఎనిమాలిక్యూల్’ అనేవారు.

→ ఆంథోనివాన్ ల్యూవెన్‌హాక్ 1674లో తన సూక్ష్మదర్శిని సాయంతో సూక్ష్మజీవులను కనిపెట్టాడు.

→ వాతావరణంలోని సగం ఆక్సిజన్ ను సూక్ష్మ శైవలాలు తయారు చేస్తున్నాయి.

→ ఒక ఎకరం మృత్తికలో అరటన్ను వరకు శిలీంధ్రాలు, బాక్టీరియా వుంటాయి.

→ వైరస్లు సజీవ ప్రపంచానికి, నిర్జీవ ప్రపంచానికి వారధులు. ఎందుకంటే అవి కణం లోపల సజీవులుగా కణం బయట నిర్జీవులుగా వుంటాయి.

→ ఇతర జీవులపై ఆధారపడి జీవించే సూక్ష్మజీవులను క్రిములను ‘పరాన్న జీవులు’ అంటారు.

AP 8th Class Biology Notes Chapter 3 సూక్ష్మజీవుల ప్రపంచం 1

→ సూక్ష్మజీవులు : కంటికి కనపడని అతి చిన్న జీవులు. (వీటిని సూక్ష్మదర్శినితో చూడవచ్చు.)

→ సూక్ష్మదర్శిని : కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మజీవులను చూడడానికి వాడే సాధనం. (దీనిలో కటకాలు వుంటాయి. అవి సూక్ష్మజీవిని కొన్ని వందల రెట్లు పెద్దదిగా చేసి చూడటంలో సహాయపడతాయి.

→ సూక్ష్మ జీవశాస్త్రం : కంటికి కనిపించని బాక్టీరియా, ఆల్గే, శిలీంధ్రాలు, వైరల గురించి చెప్పే శాస్త్రం.

→ బాక్టీరియా : గాలి, నీరు, నేల, సజీవులలో వుండే సూక్ష్మజీవులు.

→ శైవలాలు : వీటిని ‘ఆల్గే’ అని కూడా అంటారు. ఇవి నిల్వ ఉన్న నీటిలో ఆకుపచ్చని తెట్టులా పైన కనిపిస్తాయి.

→ శిలీంధ్రాలు : బూజు, (ఆహారంపై) పుట్టగొడుగులు, నాచు లాంటి అతి చిన్న జీవులు. ప్రోటోజోన్
సూక్ష్మజీవులలో ముఖ్యమైన వర్గం ప్రోటోజోవా. ఈ వర్గంలో నేల నీటిలో వుండే సూక్ష్మజీవులను వర్గీకరించారు.

→ సూక్ష్మ ఆరోపోద్దు : నేల సారాన్ని పెంచే సూక్ష్మజీవులు. ఇవి మన శరీరం పైన కూడా వుంటాయి.

→ వైరస్ : సజీవులకు, నిర్జీవులకు మధ్య వారధిగా వున్న జీవులు. ఇవి ప్రత్యేకమైనవి. “ఇవి కణం లోపల సజీవంగా కణం బయట నిర్జీవంగా వుంటాయి.”

→ పరాన్నజీవులు : ఇతర జీవులపై ఆవాసం కోసం ఆహారం కోసం ఆధారపడే సూక్ష్మజీవులను ‘పరాన్న జీవులు’ అంటారు.

AP 8th Class Biology Notes Chapter 3i సూక్ష్మజీవుల ప్రపంచం 1