Students can go through AP Board 9th Class Maths Notes 8th Lesson చతుర్భుజాలు to understand and remember the concept easily.
AP Board 9th Class Maths Notes 8th Lesson చతుర్భుజాలు
→ సమతలంలో నాలుగు రేఖలతో ఏర్పడిన సరళ సంవృత పటమును “చతుర్భుజము” అంటాము. –
→ ABCD చతుర్భుజంలో నాలుగు భుజాలు AB, BC, CD మరియు DA.
→ ABCD చతుర్భుజంలో A, B, C మరియు D అనేవి నాలుగు శీర్షాలు; ZA, B, C మరియు 4D అనేవి శీర్షాల వద్ద ఏర్పడిన 4 కోణాలు.
→ ఒక చతుర్భుజంలో ఎదుటి శీర్షాలను కలిపితే ఏర్పడు రేఖాఖండాలను కర్ణాలు అంటారు.
→ చతుర్భుజంలో నాలుగు కోణాల మొత్తం 360° లేదా 4 లంబకోణాలు.
→ రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలుగా గల చతుర్భుజమును “సమాంతర చతుర్భుజం” అంటారు.
→ ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా గల చతుర్భుజమును “సమలంబ చతుర్భుజము” లేక “ట్రెపీజియం” అంటారు.
→ ఆసన్న భుజాలు సమానముగా గల చతుర్భుజమును “సమచతుర్భుజము లేక రాంబస్” అంటారు.
→ ఒక సమాంతర చతుర్భుజపు అన్ని కోణాలు లంబకోణాలైన ఆ చతుర్భుజమును “దీర్ఘచతురస్రం” అంటారు.
→ ఒక సమాంతర చతుర్భుజములో ఆసన్న భుజాలు సమానం మరియు ‘ప్రతీ కోణము 90° అయిన దానిని “చతురస్రము” అంటారు.
→ ఒక చతుర్భుజములో రెండు జతల ఆసన్న భుజాలు మాత్రమే సమానంగా ఉంటే ఆ చతుర్భుజంను “గాలిపటం” అంటారు.
→ సమాంతర చతుర్భుజంలో
- ఎదుటి భుజాలు మరియు ఎదుటి కోణాలు సమానము.
- కర్ణాలు ఒకదానికొకటి సమద్విఖండన చేసుకొనును.
- ఎదుటి కోణాలు సమానము.
- సమాంతర చతుర్భుజమును కర్ణము రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది.
→ రాంబ లో కర్ణాలు ఒకదానికొకటి లంబంగా వుంటాయి.
→ దీర్ఘచతురస్రంలో కర్ణాల పొడవులు సమానం మరియు ఒకదానికొకటి ఖండించుకుంటాయి.
→ చతురస్రంలో కర్ణాల పొడవులు సమానము మరియు అవి ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటాయి.
→ ఒక త్రిభుజములో రెండు భుజాల మధ్య బిందువులను కలుపుతూ గీయబడిన రేఖ, మూడవ భుజానికి సమాంతరంగానూ, మరియు దానిలో సగము ఉంటుంది.
→ ఒక త్రిభుజములో ఒక భుజము యొక్క మధ్య బిందువు నుండి వేరొక భుజానికి సమాంతరంగా గీయబడిన రేఖ, మూడవ భుజాన్ని సమద్విఖండన చేస్తుంది.
→ మూడు లేక అంతకన్నా ఎక్కువ సమాంతరరేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడు అంతరఖండాలు సమానము.