Students can go through AP Board 8th Class Biology Notes 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి to understand and remember the concept easily.
AP Board 8th Class Biology Notes 9th Lesson జంతువుల నుండి ఆహారోత్పత్తి
→ పాలు, మాంసం మరియు ఇతర ఉపయోగకరమైన పదార్థాల కొరకు పశువులకు ఆహారాన్ని అందచేసి వసతిని, రక్షణ కల్పించడాన్ని పశుపోషణ అంటారు.
→ గ్రామీణ ప్రాంతాలలో పశువుల పెంపకం సాంప్రదాయక పద్దతి.
→ సంవత్సరంలో మిగిలిన నెలల కంటే అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది.
→ పశువైద్యులు పశువుల పెంపకంలో కృత్రిమ గర్భధారణకు సహాయపడతారు.
→ బ్రాయిలర్లు మాంసాన్నిచ్చే రకాలు : లేయర్స్ గుడ్లనిచ్చే రకాలు.
→ కృత్రిమంగా గుడ్లను పొదిగించటానికి ఇంక్యుబేటర్ను వాడతారు.
→ తేనెను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడాన్ని ఎపి కల్చర్ అంటారు.
→ తేనెటీగల విషాన్ని ఎపిస్ టింక్చర్ అనే హోమియో మందు తయారుచేయడానికి వాడుతారు.
→ మంచి నీటిలో, ఉప్పునీటిలో ఉండే చేపల పెంపకాన్ని ఆక్వా కల్చర్ అంటారు.
→ ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాతీరంలో ఆక్వాకల్చర్ వలన చాలా రకాల పంట పొలాలు చేపల కుంటలుగా మారిపోయాయి.
→ ఉప్పునీటి మరియు మంచినీటి చేపలు ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతను తీరుస్తున్నాయి.
→ పశుపోషణ : జంతువుల పెంపకంలో ఆహారాన్ని అందజేయడం, వసతిని కల్పించడం, రక్షణకల్పించడం, జంతువుల ప్రజననం వంటి అంశాలను కలిపి పశుపోషణ (Animal husbandry) అంటారు.
→ పశుసంపద : ఆవులు, ఎద్దులు, గేదెలు కలిపి పశుసంపద లేక లైవ్ స్టాక్ అంటారు.
→ జెర్సీ : ఎక్కువ పాలు ఇచ్చే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆవు.
→ హాల్ స్టీన్ : ఎక్కువ పాలు ఇచ్చే డెన్మార్క్ చెందిన ఆవు.
→ బయోగ్యాస్ : పశువుల పేడను ఉపయోగించి తయారుచేసిన ఇంధనం బయోగ్యాస్.
→ కోళ్ళ పరిశ్రమ : అధిక మొత్తంలో కోళ్ళను ఉత్పత్తి చేసి పెంచడాన్ని కోళ్ళ పరిశ్రమ అంటారు.
→ పొదగటం : కోడి గ్రుడ్డు నుంచి కోడి పిల్లలు బయటకు వచ్చుటకు కోడి చేసే పనిని పొదగటం అంటారు.
→ ఇంక్యుబేటర్ : కృత్రిమ పద్ధతిలో గుడ్లను పొదిగించుటకు ఉపయోగించే పరికరం.
→ తేనెటీగల పెంపకం : తేనెటీగలను ఒక పరిశ్రమ వలె ఏర్పాటుచేసి పెంచుటను తేనెటీగల పెంపకం అంటారు.
→ తేనె మైనం : తేనెటీగలు స్రవించే ఒక రకమైన పదార్థం.
→ రాణి ఈగ : తేనెపట్టులో ఉండే ఒకే ఒక ఆడ (కీటకం) ఈగే రాణి ఈగ (లేదా) తేనెపట్టులో గ్రుడ్లు పెట్టే ఈగ.
→ డ్రోన్ ఈగలు : తేనెపట్టులో కొన్ని వందల సంఖ్యలో ఉండే మగ ఈగలు.
→ సముద్ర చేపలు : ఉప్పునీటిలో ఉండే చేపలు లేదా సముద్రంలో ఉండే చేపలను సముద్ర చేపలు అంటారు.
→ ఆక్వాకల్చర్ : మంచినీటిలో మరియు ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు.
→ మంచినీటి చేపలు : నదులలో, సరస్సులలో, చెరువులలో నివసించే చేపలను మంచినీటి చేపలు అంటారు.
→ ప్రజననం : నాణ్యమైన విత్తనాలు, గుడ్లు ఉత్పత్తి చేయుటకు ఉపయోగించు పద్ధతి. రోగనిరోధక శక్తి గల జంతువులను ఉత్పత్తి చేయు పద్దతిని ప్రజననం అంటారు.
→ ఆహారం నిల్వచేసే పద్ధతులు : ఆహారం ఎక్కువ కాలం ఉండేందుకు తోడ్పడు పద్ధతులు.