These AP 8th Class Biology Important Questions 5th Lesson కౌమార దశ will help students prepare well for the exams.
AP Board 8th Class Biology 5th Lesson Important Questions and Answers కౌమార దశ
ప్రశ్న 1.
కౌమారదశను ఒడిదుడుకులతో కూడిన దశ అని అంటారు ఎందుకు ?
జవాబు:
- కౌమారదశ ఒడిదుడుకులతో కూడిన దశ.
- ఎందుకంటే ఇప్పుడిప్పుడే పిల్లలు శైశవదశను దాటి కౌమారదశలో ప్రవేశిస్తుంటారు.
- ఈ దశలో వచ్చే శారీరక మార్పులు పిల్లల్ని ఒత్తిడికి గురిచేస్తాయి.
- తాము ‘పిల్లలా’ ‘పెద్దలా’ అనేది నిర్ణయించుకోలేరు.
- మనిషి జీవితంలో ఇది సంశయానికి, సందిగ్గానికి, మార్పుకు గురయ్యే దశ.
ప్రశ్న 2.
కౌమారదశలో బాలురు, బాలికల్లో వచ్చే శారీరక మార్పులు ఏమిటి ? (లేదా)
కౌమారదశలో మార్పులు అబ్బాయిలలో, అమ్మాయిలలో వేరువేరుగా ఉంటాయని ఎలా చెప్పగలవు ?
జవాబు:
- కౌమారదశలో శరీరంలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి.
- అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో భుజాలు వెడల్పుగా మారడం గమనించే ఉంటారు.
- అలాగే అమ్మాయిలలో నడుము కింద భాగం వెడల్పుగా మారడం కూడా గమనించి ఉంటారు.
- అమ్మాయిలలో ఈ మార్పు తరువాతి కాలంలో బిడ్డలకు జన్మనివ్వడంలో తోడ్పడుతుంది.
- అబ్బాయిలలో కండరాలు గట్టిబడతాయి.
- అమ్మాయిలలో సుకుమారతనం పెరుగుతుంది.
- అంటే కౌమారదశలో జరిగే మార్పులు అబ్బాయిల్లో, అమ్మాయిల్లో వేరువేరుగా ఉంటాయన్నమాట.
ప్రశ్న 3.
ఋతుచక్రం గురించి రాయండి.
జవాబు:
- స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా 10-12 సంవత్సరాల వయస్సు మధ్యలో మొదలై సుమారుగా 45-50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది.
- కౌమారదశలో ప్రవేశించగానే అండం పరిపక్వం చెంది విడుదల కావడం మొదలవుతుంది.
- ప్రతి బీజకోశం నుండి నెలకోసారి ఒక అండం విడుదలవుతుంది.
- ఒక నెలలో కుడి బీజకోశం నుండి అండం విడుదలైతే దాని తరువాత నెలలో ఎడమ బీజకోశం నుండి అండం విడుదలౌతుంది.
- ఇది శుక్రకణంతో కలిసినట్లయితే ఫలదీకరణం జరుగుతుంది.
- ఈ సమయంలో గర్భాశయ కుడ్యాలు ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించేందుకు వీలుగా మందంగా తయారవుతాయి.
- ఫలితంగా స్త్రీలు గర్భం ధరించగలుగుతారు.
- ఫలదీకరణ జరగకపోతే, అండం మరియు గర్భాశయ కుడ్యం పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదల అవుతాయి.
- దీన్నే ఋతుచక్రం లేదా బహిష్టుకావడం (Menstruation) అని అంటారు. ఇది ఒక సహజమైన ప్రక్రియ.
ప్రశ్న 4.
ఋతుచక్రంపై సమాజంలో గల అపోహలు ఏమిటి ? వీటిని నీవు ఎలా ఖండిస్తావు ?
జవాబు:
- కొన్ని సమాజాలలో బహిష్టు సమయంలో స్త్రీలు ఇతరులను తాకడం పాపం అని భావిస్తారు.
- వాళ్ళని స్నానం చేయడానికి గాని, వంటచేయడానికి గాని అనుమతించరు.
- ఆ సమయంలో పాఠశాలకి కూడా అనుమతించకపోవడం వలన చదువులో కూడా వెనుకబడతారు.
- కొంతమంది వాళ్ళను ఇండ్లలోనికి కూడా అనుమతించరు.
ఇలాంటి వివక్ష స్త్రీలకు మేలు చేస్తుందా ?
1. దీనిపై చాలా పరిశోధనలు జరిపి, చివరికి పరిశోధకులు తేల్చింది ఏమిటంటే ఋతుచక్రం ఒక సహజ ప్రక్రియ. ఇలా స్త్రీల పట్ల వివక్షత చూపించడంలో మూఢనమ్మకం తప్ప ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏ రక్తం అయితే బయటకు విడుదలవుతుందో అదే రక్తం ఒకవేళ ఫలదీకరణ జరిగినట్లయితే బిడ్డ పెరుగుదలకు తోడ్పడుతుంది.
2. మరి అదే రక్తం ఋతుచక్రం ద్వారా విడుదలయ్యేటప్పుడు మాత్రం ఎట్లా కలుషితం అవుతుంది.
3. ఇటువంటి మూఢనమ్మకాల వల్ల ప్రయోజనం కలుగకపోగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వలన స్త్రీలలో అనేక రోగాలు వ్యాపించే అవకాశం ఉంది.
ప్రశ్న 5.
హార్మో న్స్ అనగా నేమి ? వాటి ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
- అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు. కాబట్టి వీటిని వినాళగ్రంథులు అని కూడా అంటారు.
- ఈ గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలను “హార్మోన్లు” అంటారు.
- ఈ హార్మోన్లు మానవ శరీరంలో కొన్ని జీవక్రియలను నియంత్రిస్తాయి.
- ఉదా : శరీరంలో చక్కెర, కాల్షియం, లవణాల వంటి పదార్థాల పరిమాణం నియంత్రించడం.
- ఇవి శరీరంలో నీటి పరిమాణాన్ని కూడా నియంత్రిస్తాయి.
- ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదలలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి.
- ఋతుచక్ర ప్రారంభం ఆగిపోవడం, గర్భధారణ, పాల ఉత్పత్తి మొదలగునవన్నీ వీటి నియంత్రణలోనే జరుగుతాయి.
- బాలబాలికలలో కనిపించే ద్వితీయ లైంగిక లక్షణాలన్నీ హార్మోన్ ప్రభావం వల్లనే కలుగుతాయి.
ప్రశ్న 6.
మన శరీరంలోని కొన్ని వినాళ గ్రంథులు, వాటి హార్మోన్స్, ప్రభావాన్ని తెలపండి.
జవాబు:
ప్రశ్న 7.
కౌమార దశలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ? (లేదా) కౌమార దశలో తీసుకోవలసిన సంతులిత ఆహారాన్ని గురించి వివరించండి.
జవాబు:
1) సంతులిత ఆహారంలో తగు పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్రొవ్వు పదార్థాలు మరియు విటమిన్లు కలిగి ఉంటాయి.
2) మన దేశీయ ఆహారపదార్థాలైన, రోటి, అన్నం, పప్పు, తృణధాన్యాలు కాయగూరల్లో ఈ పదార్థాలు తగు మోతాదులో ఉంటాయి.
3) కనుక వీటిని తగు పరిమాణంలో తీసుకోవాలి. ఇనుము (Iron) రక్తకణాల తయారీలో తోడ్పడుతుంది.
4) కనుక ఐరన్ లభ్యమయ్యే పదార్థాలైన ఆకుకూరలు, బెల్లం, మాంసం, సిట్రస్ జాతికి చెందిన ఫలాలు, ఉసిరికాయలు వంటివి కూడా తీసుకోవడం ఈ దశలో అవసరం.
ప్రశ్న 8.
జంక్ ఫుడ్స్ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి ?
జవాబు:
1) కౌమార వయస్సులో ఆకలి తట్టుకోలేక రకరకాల ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్, చిప్స్, స్నాక్స్ అంగడిలో అమ్మే ఆహార – పదార్థాలు తినడానికి ఇష్టపడతారు.
2) కానీ ఇవేవీ సరైన పోషకాలను అందించలేవు.
3) కాబట్టి ఇవేవీ సంతులిత ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.
4) వీటిని రోజూ తీసుకొంటే శరీరబరువు పెరిగి స్థూలకాయానికి (Obesity) గురయ్యే అవకాశం ఉంది.
5) వీటిని ఎక్కువగా తింటే కడుపులో పుండ్లు, రక్తంలో చక్కెర శాతం పెరగడం, ఒత్తిడి, రక్తపోటు వంటివి కలుగుతాయి.
6) కాబట్టి కౌమారులు జంక్ ఫుడ్ తినేటప్పుడు ఒక నిమిషం ఆలోచించాలి. ‘వద్దని’ చెప్పాలి.
ప్రశ్న 9.
కౌమారదశలో వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ఆవశ్యకత ఏమిటి ? (లేదా) కౌమార దశలో వున్న నీవు ఆరోగ్యంగా వుండుటకు పరిశుభ్రతను ఎలా పాటిస్తావు ?
జవాబు:
1) కౌమారదశలో స్వేదగ్రంథులు చురుకుగా పనిచేయటం వలన శరీరం నుండి ఘాటైన చెమట వాసన వస్తూ ఉంటుంది.
2) కాబట్టి ఈ దశలో ఉన్నవారు రోజుకి రెండుసార్లు శుభ్రంగా స్నానం చేయడం మంచిది.
3) ప్రతిరోజు అన్ని శరీర అవయవాలు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడం, ఉతికిన లోదుస్తులు ధరించడం మంచిది.
4) ఒక వేళ ఇలా చేయకపోతే రకరకాల శిలీంధ్రాల వలన, బ్యా క్టీరియాల వలన జబ్బులు వస్తాయి.
5) ఋతుచక్రం సమయంలో అమ్మాయిలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం.
6) వాడిపారేసే (Disposable) నాప్ కిన్లు వాడటం వలన చాలా రకాల రుతు సంబంధ వ్యాధులను దూరం చేయవచ్చు.
ప్రశ్న 10.
కౌమార దశలో శారీరక వ్యాయామం ప్రాధాన్యత ఏమిటి ?
జవాబు:
1) ఆరు బయట స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అక్కడ నడవడం, ఆటలు ఆడుకోవటం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
2) ఈ వయస్సులో ఉన్న అబ్బాయి, అమ్మాయిలందరూ నడకను అలవాటు చేసుకోవాలి.
3) తేలికపాటి వ్యాయామం చేయటంతో పాటు ఆరు బయట ఆటలు ఆడాలి.
4) ఇది ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడమే కాకుండా మంచి నిద్రను కూడా ఇస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది.
5) ఇది రోజువారీ కార్యక్రమాలను చురుకుగా చేయడానికి సహాయపడుతుంది.
ప్రశ్న 11.
అబ్బాయిల గొంతు అమ్మాయి గొంతుకన్నా ఎందుకు భిన్నంగా ఉంటుంది ?
జవాబు:
- కౌమారదశలో అబ్బాయిలలో ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది.
- ఇది గొంతు క్రింద స్వరపేటిక 9వ మృదులాస్థి వృద్ధి వలన ఏర్పడుతుంది.
- దీని వలన స్వరపేటిక పరిమాణం పెరిగి గొంతు గంభీరంగా మారుతుంది.
- ఆడపిల్లలలో స్వరపేటిక పరిమాణం పెరగదు కావున వారి గొంతు సాధారణంగా ఉంటుంది.
- ఆడమ్స్ యాపిల్ వలన అబ్బాయి గొంతు అమ్మాయి గొంతుకన్నా భిన్నంగా మారుతుంది.
ప్రశ్న 12.
కౌమారదశలో మొటిమల గురించి నీవు తీసుకొనే జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు:
1) మొటిమలను గిల్లరాదు.
2) తక్కువ క్షారగుణం గల సబ్బుతో రోజుకు రెండు మూడు సార్లు ముఖం కడుగుతుండాలి.
3) గోరువెచ్చని నీళ్ళతో మొటిమలను కడుగుతూ ఉండాలి. అవసరమైతే వైద్యుడిని కలవాలి.
4) వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒత్తిడి, ఆందోళనలు మొటిమలను ఇంకా ఎక్కువ వచ్చేలా చేస్తాయి.
ప్రశ్న 13.
ఎ) ఈ చిత్రంలో కనిపిస్తున్న భాగం పేరు ఏమిటి?
బి) ఇది ఏ దశలో అభివృద్ధి చెందుతుంది ?
సి) పై అవయవము ఎవరిలో బాగా అభివృద్ధి చెందుతుంది ? దీనివల్ల ఏమౌతుంది ?
డి) ఏ మృదులాస్థి పెరగడం వల్ల ఇది ఏర్పడుతుంది ?
జవాబు:
ఎ) ఆడమ్స్ ఆపిల్
బి) కౌమార దశలో మగపిల్లలలో అభివృద్ధి చెందుతుంది
సి) కౌమార దశలోని బాలుర యందు అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల బాలుర కంఠస్వరం బొంగురుగా మారుతుంది.
డి) థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వలన ఆడమ్స్ ఆపిల్ ఏర్పడుతుంది.
ప్రశ్న 14.
క్రింది పట్టికను చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) కోపమొచ్చినప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఏది ?
బి) టెస్టోస్టిరాన్ హార్మోన్ ను విడుదల చేసే గ్రంథి ఏది ?
సి) ఏ హార్మోన్ ఇతర వినాళ గ్రంథులను నియంత్రిస్తుంది ?
డి) స్త్రీ, పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమైన హార్మోన్లు ఏవి ?
జవాబు:
ఎ) అడ్రినలిన్
బి) ముష్కాలు
సి) పెరుగుదల హార్మోన్
డి) టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్
ప్రశ్న 15.
చిత్రంలోని అవయవంను గూర్చి తెలుసుకోవడానికి మీ సైన్స్ టీచరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
1) పై పటంలో చూపబడిన భాగం పేరు ఏమిటి ?
2) ఇది ఎవరిలో అభివృద్ధి చెందుతుంది ?
3) ఇది అభివృద్ధి చెందడం వల్ల వారిలో కలిగే మార్పు ఏమిటి ?
ప్రశ్న 16.
క్రింది వాక్యాలను చదివి తప్పుగా ఉన్న వాటిని సవరించి రాయండి.
ఎ) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం చేయనవసరం లేదు.
బి) కణకవచం కణం యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది.
జవాబు:
ఎ) కేంద్రకం, కణాంగాలు స్పష్టంగా చూడటానికి రంజనం తప్పనిసరిగా చేయాలి.
బి) కణకవచం కణానికి బాహ్య, ఆఘాతాల నుండి రక్షణ కల్పిస్తుంది. యాంత్రిక బలాన్ని ఇస్తుంది.
ప్రశ్న 17.
ఈ కింది పట్టిక ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి.
పట్టిక ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ? ఇందుకు కారణమైన హార్మోను ఏది ?
బి) కోపం, బాధ వంటి ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏది ?
సి) స్త్రీ బీజకోశాల నుండి విడుదలయ్యే హార్మోన్లు చేసే పనులు ఏవి ?
డి) కొన్ని గ్రంథులను అంతఃస్రావ గ్రంథులు అంటారు. ఎందుకు ?
జవాబు:
ఎ) ముష్కాల్ టెస్టోస్టిరాన్ హార్మోన్
బి) అడ్రినలిన్
సి) అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, ఋతుచక్రం నియంత్రణ
డి) ఈ గ్రంథులు తమ స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. అందువల్ల వీటిని అంతస్రావీ గ్రంథులని, వినాళ గ్రంథులని అంటారు.
ప్రశ్న 18.
మల్లికకు 15 సంవత్సరాలకే వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఇది సరియైనదేనా ? ఎందుకు?
జవాబు:
1) ఈ నిర్ణయం సరియైనది కాదు.
2) ఎందుకంటే భారత వివాహ చట్టం ప్రకారం బాలికలకు 18 సం|| వయస్సు వివాహ వయస్సుగా నిర్ణయించడమైనది. మల్లికకు 15 సం||లకే వివాహం చేయాలనుకోవడం చటరిత్యా నేరం.
3) 15 సం|| వయస్సులో మల్లికకు శారీరక మానసిక స్థాయిలు సంపూర్ణంగా అభివృద్ధి చెందవు. ఈ వయసులో వివాహం ఆమె బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తుంది.
ప్రశ్న 19.
బాల్యవివాహాలు సామాజిక దురాచారం అని నీకు తెలుసుకదా ? దీన్ని గురించి సమాజాన్ని చైతన్యపరుచుటకు మీ పాఠశాల విద్యార్థులు ఓ ర్యాలీని తలపెట్టారు. దీనిని ఉద్దేశించి కొన్ని నినాదాలను తయారు చేయండి ?
జవాబు:
బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం
1) దీనిని సమాజంలో కొసాగించడం ప్రమాదకరం
2) బాలికల చదువు – భవితకు వెలుగు.
3) బాలికలకు కౌమారదశలో వివాహం వారి జీవితాలను అంధకారం చేస్తుంది.
4) బాల్యవివాహాలు – దేశ ప్రగతి నిరోధకాలు.
1 మార్కు ప్రశ్నలు
ప్రశ్న 1.
ఏ వయస్సుకు చేరుకున్న తర్వాత అబ్బాయిలలో ఎత్తు పెరుగుదల దాదాపుగా ఆగిపోతుంది?
జవాబు:
18 సం|| వయస్సు నాటికి అబ్బాయిలలో పెరుగుదల 100% పూర్తి అవుతుంది.
ప్రశ్న 2.
అమ్మాయిలలో పెరుగుదల ఏ వయస్సులో వేగంగా జరుగుతుంది?
జవాబు:
అమ్మాయిలలో పెరుగుదల 8 సంవత్సరాల నుండి వేగంగా ప్రారంభమై 16 సం|| పూర్తి అవుతుంది.
ప్రశ్న 3.
అమ్మాయిల్లో నిజంగా పెరుగుదల ఏ వయసులో ఎక్కువగా జరుగుతుంది ?
జవాబు:
అమ్మాయిల్లో పెరుగుదల ప్రధానంగా 11 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల మధ్య ఎక్కువగా (4%) జరుగుతుంది.
ప్రశ్న 4.
అబ్బాయి, అమ్మాయిలలో ఎవరు వేగంగా పెరుగుతారు ? ఎట్లా చెప్పగలవు ?
జవాబు:
1. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలలో పెరుగుదల రేటు అధికం అనిపిస్తుంది.
2. మొదట అమ్మాయిలు వేగంగా పెరిగినప్పటికీ 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల సమానంగా ఉంటుంది.
ప్రశ్న 5.
చిన్న పిల్లలు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు గొంతును బట్టి అమ్మాయా, అబ్బాయో చెప్పగలమా ?
జవాబు:
చిన్న పిల్లల గొంతును బట్టి అబ్బాయో, అమ్మాయో చెప్పలేము. ఇద్దరి గొంతు ఒకే విధంగా ఉంటుంది.
ప్రశ్న 6.
మాట్లాడేవారు అబ్బాయో, అమ్మాయో ఎప్పుడు ఎలా చెప్పగలుగుతాం ?
జవాబు:
యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిల గొంతు గంభీరంగా మారి అమ్మాయిల కంటే విభిన్నంగా ఉంటుంది. అప్పుడు గొంతు ఆధారంగా, అబ్బాయో, అమ్మాయో చెప్పగలుగుతాం.
ప్రశ్న 7.
కౌమార దశలో సాధారణంగా మగపిల్లల కంఠస్వరంలో మార్పు ఎందుకు వస్తుంది ?
జవాబు:
కౌమార దశలో మగపిల్లల స్వరకోశం పరిమాణంలో పెద్దదిగా పెరుగుతుంది. దీనినే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పరిమాణం పెరగటం వలన గొంతు గంభీరంగా ఏర్పడి ఆడవారి నుండి విభేదిస్తుంది.
ప్రశ్న 8.
స్త్రీలలో అండం విడుదల చాలా రోజుల వరకు కొనసాగుతుందా ?
జవాబు:
స్త్రీలలో అండం విడుదల దాదాపు 50 నుండి 55 సంవత్సరాలపాటు కొనసాగుతుంది.
ప్రశ్న 9.
ఒక వేళ అండం విడుదల ఆగిపోతే ఏం జరుగుతుంది ?
జవాబు:
1. అండం విడుదల కాకపోతే, ఫలదీకరణ జరగదు.
2. కావున కొత్త జీవులు ఏర్పడవు.
ప్రశ్న 10.
ఫలదీకరణ చెందిన అండాలు ఏమవుతాయి ?
జవాబు:
1. ఫలదీకరణ చెందిన అండాలు సంయుక్త బీజంగా మారతాయి.
2. సంయుక్త బీజం గర్భాశయంలో జీవిగా ఎదుగుతుంది.
ప్రశ్న 11.
ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది ?
జవాబు:
1. ఫలదీకరణ జరగకపోతే జీవులు ఏర్పడవు.
2. జాతి అంతరించిపోతుంది.
ప్రశ్న 12.
అసలు అండమే విడుదల కాకపోతే ఏమవుతుంది ?
జవాబు:
లైంగిక ప్రత్యుత్పత్తికి అండము తప్పనిసరి. అసలు అండము విడుదల కాకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి జరగదు. దానివలన కొత్త జీవులు రూపొందవు.
ప్రశ్న 13.
హార్మోన్లు అనగానేమి ?
జవాబు:
అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైన నాళాలు ఉండవు. కాబట్టి వీటిని వినాళగ్రంథులు అని కూడా అంటారు. ఈ గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలను “హార్మోన్లు” అంటారు.
లక్ష్యాత్మక నియోజనము
ప్రశ్న 1.
‘కౌమార విద్య’ కార్యక్రమాలు …………. క్లబ్ నిర్వహిస్తుంది.
ఎ) లయన్స్ క్లబ్
బి) రెడ్ రిబ్బన్ క్లబ్
సి) రోటరీ క్లబ్
డి) వాసవీ క్లబ్
జవాబు:
బి) రెడ్ రిబ్బన్ క్లబ్
ప్రశ్న 2.
ఋతుచక్రం ప్రతీ …….. రోజుల కొకసారి వస్తుంది.
ఎ) 20-30
బి) 25-30
సి) 28-30
డి) 30-32
జవాబు:
సి) 28-30
ప్రశ్న 3.
ముష్కాలు ……….ను విడుదల చేస్తాయి.
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఈస్ట్రోజన్
సి) ప్రొజెస్టిరాన్
డి) F.S.H
జవాబు:
ఎ) టెస్టోస్టిరాన్
ప్రశ్న 4.
స్వేద గ్రంథులు ……. ను ఉత్పత్తి చేస్తాయి.
ఎ) హార్మోనులు
బి) చెమట
సి) విటమిన్లు
డి) తైలం
జవాబు:
బి) చెమట
ప్రశ్న 5.
అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకుంటే అది ……………. కు దారితీస్తుంది.
ఎ) పోషకాహారలోపం
బి) బలహీనత
సి) ఫ్లోరోసిస్
డి) స్థూలకాయం
జవాబు:
డి) స్థూలకాయం
ప్రశ్న 6.
NPEGEL ఎవరి కోసం నిర్వహించబడు కార్యక్రమం?
ఎ) బాలురు
బి) బాలికలు
సి) స్త్రీలు
డి) పురుషులు
జవాబు:
డి) పురుషులు
ప్రశ్న 7.
పురుషులలో కనీస వివాహ వయస్సు ……..
ఎ) 20 సం||
బి) 21 సం||
సి) 22 సం||
ది) 23 సం||
జవాబు:
ది) 23 సం||
ప్రశ్న 8.
స్త్రీల వ్యాధి నిపుణులను ………………. అంటారు.
ఎ) ఆంకాలజిస్ట్
బి) గైనకాలజిస్ట్
సి) కార్డియాలజిస్ట్
డి) నెఫ్రాలజిస్ట్
జవాబు:
బి) గైనకాలజిస్ట్
ప్రశ్న 9.
అబ్బాయిలలో గడ్డం, మీసాలు పెరగటం
ఎ) ప్రాథమిక లైంగిక లక్షణాలు
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు
సి) తృతీయ లైంగిక లక్షణాలు
డి) పైవేవీ కావు
జవాబు:
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు
ప్రశ్న 16.
పుట్టుకతో పిల్లల్ని ఆడ లేదా మగ గుర్తించటానికి సహాయపడేవి
ఎ) ప్రాథమిక లైంగిక లక్షణాలు
బి) ద్వితీయ లైంగిక లక్షణాలు
సి) తృతీయ లైంగిక లక్షణాలు
డి) పైవేవీ కావు
జవాబు:
సి) తృతీయ లైంగిక లక్షణాలు
ప్రశ్న 17.
సాధారణంగా ప్రత్యుత్పత్తి శీ ఈ కాలంలో మొదలవుతుంది.
ఎ) 9-13 సం||
బి) 11-15 సం||
సి) 14-18 సం||
డి) 13-19 సం||
జవాబు:
సి) 14-18 సం||
ప్రశ్న 18.
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు త్వరగా కౌమార దశకు చేరుటకు కారణం
ఎ) రసాయనాలు కలిపిన పండ్లు తినడం
బి) కలుషిత ఆహారం, జంక్ ఫుడ్
సి) ఈస్ట్రోజన్ కలిపిన పాలు తాగడం
డి) పైవన్నీ
జవాబు:
సి) ఈస్ట్రోజన్ కలిపిన పాలు తాగడం
ప్రశ్న 19.
ఈ క్రింది వానిలో సరైన వరుస క్రమం
ఎ) మీనార్క్ – సుయేషన్ – మోనోపాజ్
బి) మెస్ట్రుయేషన్ – మోనోపాజ్ – మీనార్క్
సి) మోనోపాజ్ – మీనార్క్ – మెస్ట్రుయేషన్
డి) మెనోపాజ్ – మెనుస్టుయేషన్ – మీనార్క్
జవాబు:
ఎ) మీనార్క్ – సుయేషన్ – మోనోపాజ్
ప్రశ్న 20.
మన దేశంలో చట్టపరంగా స్త్రీ పురుషుల వివాహ వయస్సు
ఎ) 21 – 25 సం
బి) 18 – 21 సం||
సి) 16 – 18 సం||
డి) 25 – 28 సం||
జవాబు:
బి) 18 – 21 సం||
ప్రశ్న 21.
అంతస్రావికా గ్రంథులు స్రవించేది )
ఎ) ఎంజైములు
బి) హార్మోనులు
సి) స్రావాలు
డి) స్వేదం
జవాబు:
బి) హార్మోనులు
ప్రశ్న 22.
పురుషులలో స్రవించబడే హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) రుస్ట్రోజెన్
సి) ప్రొజెస్టిరాన్
డి) ఎడ్రినలిన్
జవాబు:
ఎ) టెస్టోస్టిరాన్
ప్రశ్న 23.
ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఈస్ట్రోజెన్
సి) ప్రొజెస్టిరాన్
డి) ఎడ్రినలిన్
జవాబు:
డి) ఎడ్రినలిన్
ప్రశ్న 24.
ఎగ్రంధి హార్మోను మిగతా గ్రంథులను నియంత్రిస్తుంది?
ఎ) పీనియల్ గ్రంథి
బి) పీయూష గ్రంథి
సి) అధివృక్క గ్రంధి
డి) థైరాయిడ్ గ్రంథి
జవాబు:
బి) పీయూష గ్రంథి
ప్రశ్న 25.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జనాభాలో 15 సం|| కన్నా తక్కువ వయస్సు గలవారి జనాభా.
ఎ) 65%
బి) 6850
సి) 72
డి) 75%
జవాబు:
బి) 6850
ప్రశ్న 26.
స్టాన్లీహాల్ ఏ దశను ఒడిదుడుకులతో కూడిన దశ అన్నాడు?
ఎ) శైశవదశ
బి) కౌమారదశ
సి) యవ్వనదశ
డి) వృద్ధాప్యదశ
జవాబు:
బి) కౌమారదశ
ప్రశ్న 27.
మొటిమలను ఏర్పరచేవి
ఎ) స్వేద గ్రంథులు
బి) సెబేషియస్ గ్రంథులు
సి) ఎ మరియు బి
డి) లాలాజల గ్రంథులు
జవాబు:
సి) ఎ మరియు బి
ప్రశ్న 28.
స్త్రీ లైంగిక హార్మోన్
ఎ) టెస్టోస్టిరాన్
బి) ఎడ్రినలిన్
సి) ఈస్ట్రోజెన్
డి) ల్యూటినైజింగ్ హార్మోన్
జవాబు:
సి) ఈస్ట్రోజెన్
ప్రశ్న 29.
ఈ గ్రంథి యొక్క స్రావాలు భావోద్వేగాలను నియంత్రిస్తాయి.
A) క్లోమము
B) ముష్కాలు
C) వీబీజకోశము
D) అధివృక్క గ్రంధి
జవాబు:
D) అధివృక్క గ్రంధి
ప్రశ్న 30.
కౌమార దశ గురించి ఈ కింది వాటిలో నిజమైన వాక్యాన్ని గుర్తించండి.
A) మగ పిల్లల్లో ఆడమ్స్ ఆపిల్ స్పష్టంగా కనిపిస్తుంది.
B) మగ పిల్లల కంటే ఆడపిల్లల్లో భుజాలు వెడల్పుగా పెరుగుతాయి.
C) ఆడ పిల్లల్లో పోలిస్తే, మగ పిల్లల్లో స్వరంలో ఎలాంటి మార్పు ఉండదు.
D) కండరాల పెరుగుదల మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో స్పష్టంగా వుంటుంది.
జవాబు:
A) మగ పిల్లల్లో ఆడమ్స్ ఆపిల్ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రశ్న 31.
కౌమార దశలో వచ్చే మార్పు కానిది.
A) మీసాలు రావడం
B) గొంతులో మార్పు రావడం
C) వెంట్రుకలు తెల్లబడడం
D) మొటిమలు కనపడటం
జవాబు:
C) వెంట్రుకలు తెల్లబడడం
ప్రశ్న 32.
స్వరపేటికలోని మృదులాస్థుల సంఖ్య
A) 3
B) 6
C) 9
D) 12
జవాబు:
C) 9
ప్రశ్న 33.
ఋతుచక్రం ఆగిపోయే వయస్సు
A) 35-45 సం||
B) 30-40 సం||
C) 40-45 సం||
D) 45-50 సం||
జవాబు:
D) 45-50 సం||
ప్రశ్న 34.
బాలుర కౌమార దశకు చేరుకొన్నారని చెప్పే లక్షణాలు
A) ముఖంపై మొటిమలు రావడం
B) మీసాలు, గడ్డాలు రావడం
C) ఆడమ్స్ ఆపిల్ ఏర్పడటం
D) ఇవన్నియు
జవాబు:
D) ఇవన్నియు
ప్రశ్న 35.
స్టాన్లీ హాల్ చెప్పినదేమిటంటే
A) కౌమారదశ ఒత్తిడి మరియు అలసటకు గురిఅయ్యే
B) కౌమారదశ అనేది ఆనందంగా గడిపేది
C) కౌమారదశ ఒత్తిడిలేని దశ,
D) కౌమారదశ విశ్రాంతితో కూడినది
జవాబు:
A) కౌమారదశ ఒత్తిడి మరియు అలసటకు గురిఅయ్యే
ప్రశ్న 36.
తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి.
P. పురుషుల్లో మాత్రమే ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి.
Q. ద్వితీయ లైంగిక లక్షణాలను హార్మోన్లు ప్రభావితం చేస్తాయి.
R. వినాళగ్రంథుల నుండి వచ్చే స్రావాన్ని మందులు అంటారు.
S. కౌమారదశ అనేది సమతుల్యంకాని భావోద్వేగాలతో కూడినది.
A) P మరియు Q
B) R మరియు S
C) P మరియు R
D) Q మరియు S
జవాబు:
C) P మరియు R
ప్రశ్న 37.
కౌమారదశలో ఉన్న ఒక బాధ్యత గల విద్యార్థిగా మీరు కల్గిఉండాల్సింది
A) మంచి అలవాట్లు
B) సరైన జీవననైపుణ్యాలు
C) మానవత్వాన్ని కల్గి ఉండడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
ప్రశ్న 38.
కౌమారదశలో చెమట, మొటిమలకు సంబంధించి సరైన వాక్యం కానిది
A) ఇవి కౌమారదశలో కనపడతాయి.
B) చెమట గ్రంథులు, తైలగ్రంథులు చురుకుగా ఉంటాయి.
C) మొటిమలు కురుపులుగా మారే ప్రమాదం ఉంది.
D) మొటిమలు సాధారణ చర్మవ్యాధి.
జవాబు:
D) మొటిమలు సాధారణ చర్మవ్యాధి.
ప్రశ్న 39.
రాజు యొక్క కంఠస్వరంలో మార్పు కనబడినది అంటే అతను కింది దశలో ఉన్నాడు. ఈ
A) కౌమారదశ
B) పూర్వబాల్యదశ
C) వయోజన దశ
D) శిశుదశ
జవాబు:
A) కౌమారదశ