Students can go through AP Board 8th Class Maths Notes 11th Lesson బీజీయ సమాసాలు to understand and remember the concept easily.
AP Board 8th Class Maths Notes 11th Lesson బీజీయ సమాసాలు
→ ఒక ఏకపదిలోని చరరాశుల ఘాతాంకాల మొత్తాన్ని ఆ ఏకపది పరిమాణం అంటారు.
→ ఒక బీజీయ సమాసంలోని వివిధ పదాల పరిమాణాల్లో గరిష్ఠ పరిమాణాన్ని ఆ బీజీయ సమాస పరిమాణం అంటారు.
→ రెండు ఏకపదుల లబ్ధం ఒక ఏకపది అవుతుంది.
→ ఒక బహుపదిని ఏకపదిచే గుణించాలంటే బహుపదిలోని అన్ని పదాలను ఆ ఏకపదిచే గుణించాలి.
→ సర్వసమానం అనునది ఒక సమానత. సమీకరణంలోని సమానత్వం, చరరాశిలోని అన్ని విలువలకు సత్యమైనపుడు సర్వసమానత్వం అవుతుంది. ఇంకోవైపు సమీకరణం కొన్ని విలువలకే సత్యం అయితే సర్వసమానత్వంలో అన్ని విలువలకు సత్యం అవుతాయి.
→ కొన్ని సర్వసమీకరణాలు
- (a + b)2 = a2 + 2ab + b2
- (a – b)22 = a2 – 2ab + b2
- (a + b) (a – b) = a2 – b2
- (x + a) (x + b) = x2 + x(a + b) + ab .
- (a + b)2 + (a – b)2 = 2(a2 + b2)
- (a + b)2 – (a – b)2 = 4ab
గమనిక :
- రెండు ధనసంఖ్యల లబ్ధము ధనసంఖ్య
- రెండు ఋణ సంఖ్యల లబ్ధము ధనసంఖ్య
- ఒక ధన మరియు ఒక ఋణ సంఖ్యల లబ్దము ఋణసంఖ్య