Students can go through AP Board 8th Class Maths Notes 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ to understand and remember the concept easily.
AP Board 8th Class Maths Notes 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ
→ సర్వసమానత్వం : ఒకే ఆకారం మరియు పరిమాణం గల వస్తువులను సర్వసమాన వస్తువులు అంటారు. త్రిప్పుట అనునది పరివర్తనము. దీనిలో ఒక సమతల చిత్రము తిప్పబడును లేదా ఒక రేఖలో పరావర్తనం చేయబడి అసలు చిత్రపు పరావర్తన రూపం కల్పించబడును.
→ భ్రమణము : భ్రమణము చేయబడు వస్తువు ఒక బిందువు కేంద్రంగా తిప్పబడును. భ్రమణములో వస్తువు ఆకారముగాని, భ్రమణ కేంద్రము నుండి వస్తువుపై గల ఏదేని బిందువు యొక్క దూరములో గాని మార్పుండదు. భ్రమణ కేంద్రము చుట్టూ వస్తువులోని ప్రతిబిందువు వృత్తాకారములో తిరుగును. ఒక సంపూర్ణభ్రమణము 360°.
→ క్రింది జ్యామితీయ చిత్రములను పరిశీలించుము.
పై అన్ని సందర్భాలలో, ప్రతి వరుసలోని మొదటి పటాన్ని చలించడం, భ్రమణం, చెందించడం మరియు త్రిప్పుట ద్వారా దాని ఆకారంలోగాని లేక పరిమాణంలో గానీ ఏదైనా మార్పుని గమనించావా ? ఎటువంటి మార్పు లేదు. ప్రతి వరుసలోని అన్ని పటాలు వివిధ దిశలలో అమరియున్నప్పటికీ అవన్నీ సర్వసమానమే. రెండు పటాలు సర్వసమానమైన, వాటిని చలింపజేసిన, భ్రమణం చెందించినా లేదా తిప్పిన వాటి సర్వసమానత్వం అలానే నిలచియుంటుంది.
→ మనం సర్వసమానత్వాన్ని సూచించుటకు = గుర్తుని వాడతాము.
→ రెండు జ్యామితీయ పటాలు ఒకదానిని మరొకటి పూర్తిగా కప్పివేసిన ఆ పటాలు సర్వసమానాలు.
→ సరూప పటాలు : రెండు బహుభుజిలు సరూపాలు కావలెనంటే వాటి అనురూప కోణాల జతలు సమానం మరియు వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం కావలెను.
→ పటాలు ‘సౌష్టవం’ను కలిగియుండవచ్చు లేదా కలిగియుండకపోవచ్చు.
→ పటాలు ఒకటి కన్నా ఎక్కువ విధాలైన సౌష్ఠవాన్ని కలిగి యుండవచ్చు.
→ సౌష్ఠవం మూడు రకాలు అవి బిందుసౌష్ఠవం, రేఖా సౌష్ఠవం మరియు భ్రమణ సౌష్ఠవం.
→ భ్రమణ సౌష్ఠవం గల పటాలను భ్రమణం చేసినపుడు అవి తొలిస్థితిని పోలిన స్థితులలోకి ఒకటి కన్నా ఎక్కువసార్లు రావచ్చును. ఈ సంఖ్యను భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటారు.
→ ఒక పటాన్ని పోలిన పెద్ద లేదా చిన్న సరూప పటాలను గీచే పద్ధతిని విస్తరణ అంటారు. ఒకే పటాలను ప్రక్కప్రక్కనే ఖాళీలు లేకుండా లేదా అతిక్రమణలు లేకుండా కొంత వైశాల్యాన్ని ఆక్రమించేట్లు అమర్చుటను టెస్సలేషన్ అంటారు.