These AP 8th Class Physical Science Important Questions 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట will help students prepare well for the exams.
AP Board 8th Class Physical Science 8th Lesson Important Questions and Answers దహనం, ఇంధనాలు మరియు మంట
8th Class Physics 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ఉత్తమ ఇంధనానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
L.P.G. వాయువు ఉత్తమ ఇంధనం.
ప్రశ్న 2.
కొవ్వొత్తిని గాలిలో మండిస్తే ఏమి ఏర్పడతాయి?
జవాబు:
కొవ్వొత్తిని గాలిలో మండిస్తే మండి కాంతిని, ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. మరియు CO, నీటి ఆవిరులను ఇస్తుంది.
ప్రశ్న 3.
కొవ్వొత్తిని మండిస్తున్నప్పుడు మధ్య ప్రాంత (vellow zone) పసుపు రంగులో మండుటకు కారణం ఏమిటి?
జవాబు:
కొవ్వొత్తిని మండిస్తున్నప్పుడు మధ్య ప్రాంతంలో వాయు రూపంలో ఉన్న మైనానికి కావసినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల పసుపు రంగులో మండుతుంది.
ప్రశ్న 4.
దహనం అనగానేమి?
జవాబు:
ఒక పదార్థాన్ని గాలిలో (ఆక్సిజన్) పూర్తిగా మండించడాన్ని దహనం అంటారు.
ప్రశ్న 5.
జ్వలన ఉష్ణోగ్రత అనగానేమి?
జవాబు:
ఏ కనిష్ఠ ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు.
ప్రశ్న 6.
కెలోరిఫిక్ విలువ అనగానేమి?
జవాబు:
ఒక కిలోగ్రాం ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారు.
ప్రశ్న 7.
విద్యుత్ పరికరాలు మండుతున్నప్పుడు మంటలను ఆర్పుటకు ఏమి ఉపయోగిస్తారు? కారణం ఏమిటి?
జవాబు:
విద్యుత్ పరికరాలు మండుతున్నప్పుడు మంటలను ఆర్పుటకు కార్బన్ డై ఆక్సైడ్ ను ఉపయోగిస్తారు. కారణం అది విద్యుత్ పరికరాలకు హాని కలుగచేయదు.
ప్రశ్న 8.
కాలుష్య నివారణ చర్యలకు రెండు ఉదాహరణలు రాయండి.
జవాబు:
- ఇంధనాలను పొదుపుగా వాడాలి.
- వాయు కాలుష్య కారకాలైన పదార్థాలను ఇంధనాల నుండి తొలగించాలి.
ప్రశ్న 9.
“ఘన వ్యర్థాల నిర్వహణ” పై రెండు నినాదాలు రాయండి.
జవాబు:
1) ఘన వ్యర్థాలు తగ్గించండి – పర్యావరణాన్ని కాపాడండి.
2) ఘన వ్యర్థాలు వద్దు – పర్యావరణాన్ని కాపాడండి.
8th Class Physics 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
మంటలను ఆర్పడానికి నీరు ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
నీరు దహనశీలి పదార్థాన్ని చల్లబరచి దాని ఉష్ణోగ్రతను ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ అయ్యే విధంగా చేస్తుంది. అందువల్ల మంటలు వ్యాపించకుండా నిరోధింపబడతాయి. తరువాత అక్కడ ఉండే ఉష్ణోగ్రత వల్ల నీరు ఆవిరై దహనం చెందుతున్న పదార్ధం చుట్టూ నీటి ఆవిరి చేరుతుంది. తద్వారా మండుతున్న పదార్థానికి గాలి, ఆక్సిజన్ అందక మంట ఆరిపోతుంది.
ప్రశ్న 2.
పెట్రోల్ లేదా కిరోసిన్ వంటి వాటి మంటలను ఆర్పుటకు కార్బన్ డై ఆక్సెడ్ ఉపయోగిస్తారు – ఎందుకు?
జవాబు:
కార్బన్ డై ఆక్సైడ్ ను అధిక పీడనానికి గురిచేసి సిలిండర్లలో ద్రవరూపంలో నిల్వ చేస్తారు. దీనిని మంట మీదకు వదిలినప్పుడు వ్యాకోచించి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అంతేగాక ఇది మంటను ఒక కంబళి వలె కప్పివేసి మంటకు ఆక్సిజన్ అందకుండా చేయుట వలన మంటలను ఆర్పవచ్చును.
ప్రశ్న 3.
కొవ్వొత్తిని మండిస్తే ఏ విధంగా మండుతుందో వివరించండి.
జవాబు:
కొవ్వొత్తిని వెలిగించినపుడు మైనం కరిగి. మొదట ద్రవంగా మారుతుంది. అందులో కొంత భాగం తిరిగి బాష్పంగా మారుతుంది. ఆ మైనపు బాష్పం , గాలిలోని ఆక్సిజన్ తో కలిసి మంటను ఏర్పరుస్తుంది. కొవ్వొత్తి యొక్క వేడి దాని మంట నుండి వచ్చే పై భాగంలో గల మైనాన్ని మరింతగా కరిగించి ద్రవంగా మారుస్తుంది. ఆ ద్రవం దారం ద్వారా వత్తి యొక్క పై భాగానికి చేరాక బాష్పంగా మారి నిరంతరంగా మండుతుంది.
ప్రశ్న 4.
L.P.G. వాయువు ఉత్తమ ఇంధనంగా భావించుటకు కొన్ని కారణాలు రాయండి.
జవాబు:
- L.P.G. వాయువుకు ఇంధన దక్షత ఎక్కువగా ఉంటుంది.
- L.P.G. వాయువు ధర అందుబాటులో ఉంటుంది.
- L.P.G. ని సులభంగా నిల్వ చేయవచ్చును. త్వరగా వెలిగించవచ్చును. ఆర్పవచ్చును.
- L.P.G. తక్కువ కాలుష్యం కలిగించేదిగా ఉంటుంది.
ప్రశ్న 5.
నూనెలు, పెట్రోల్ వంటి వాటి మంటలను ఆర్పడానికి నీటిని ఉపయోగించరు. ఎందుకు?
జవాబు:
- నూనెలు, పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు ఆర్పడానికి నీటిని ఉపయోగించరు.
- కారణం నూనె, పెట్రోల కంటే నీరు బరువైనది.
- కాబట్టి నూనె, పెట్రోల్ అడుగు భాగానికి నీరు చేరిపోతుంది.
- పైనున్న నూనె, పెట్రోలు మండుతూనే ఉంటాయి.
ప్రశ్న 6.
ఒక పదార్థం మండడానికి కావలసిన నిబంధనలు రాయండి.
జవాబు:
- పదార్థం దహనశీల పదార్థం అయి ఉండాలి.
- మండుతున్న పదార్థానికి ఆక్సిజన్ (గాలి) అందే విధంగా చూడాలి.
- పదార్థానికి జ్వలన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఇవ్వాలి.
ప్రశ్న 7.
పెట్రోలువలే స్పిరిట్ త్వరగా మండుతుంది. కాని సోడియం’ లోహం మరియు తెల్ల ఫాస్పరస్ జ్వలనం చేయకుండానే మండుతాయి.
ఈ క్రింది పట్టికను పూర్తి చేయండి. సమాధాన పత్రంలో తిరిగి రాయండి.
జవాబు:
శీఘ్ర దహన పదార్థాలు | స్వతస్సిద్ధ దహన పదార్థాలు |
పెట్రోల్ | సోడియం లోహం |
స్పిరిట్ | తెల్ల ఫాస్ఫరస్ |
8th Class Physics 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
శీఘ్ర దహనం (Rapid combustion) మరియు స్వతస్సిద్ధ దహనం (Spontaneous combustion) ల మధ్యగల – భేదాలను వ్రాయండి.
జవాబు:
శీఘ్ర దహనం | స్వతస్సిద్ధ దహనం |
ఏ పదార్థాల దగ్గరకు మంటను తెచ్చినపుడు వెంటనే మండి కాంతిని, ఉష్ణాన్ని విడుదల చేస్తాయో ఆ పదార్థాలను శీఘ్ర దహనాలు అంటారు.
ఉదా : పెట్రోల్, ఆల్కహాల్, వంటగ్యాస్, స్పిరిట్. |
‘ఎటువంటి ‘బాహ్య కారకం లేకుండానే పదార్థం ఉన్నట్లుండి మండడాన్ని స్వతస్సిద్ధ దహనం అంటారు.
ఉదా : సోడియం లోహం, ఫాస్ఫరస్ మరియు అడవులు కాలడం. |
ప్రశ్న 2.
ఉత్తమ ఇంధనం లక్షణాలను రాయండి.
జవాబు:
- ఇంధనం తక్కువ ధరకు లభించవలెను.
- ఇంధనానికి అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉండవలెను.
- ఇంధనాలను మండించినపుడు విష పదార్థాలను విడుదల చేయరాదు.
- ఇంధనాన్ని సురక్షితంగా రవాణా చేసేవిధంగా ఉండాలి.
- ఇంధనం సురక్షితంగా వినియోగించుకొనేదిగా ఉండాలి.
- ఇంధనం యొక్క జ్వలన ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండాలి.
ప్రశ్న 3.
కొవ్వొత్తి మంటలోని వివిధ ప్రాంతాలను వివరించండి.
జవాబు:
కొవ్వొత్తి మంటలో మూడు రకాల ప్రాంతాలు ఉంటాయి. అవి : 1. చీకటి ప్రాంతం 2. మధ్య ప్రాంతం 3. అతి బాహ్య ప్రాంతం.
1. చీకటి ప్రాంతం (Dark Zone) :
ఇది నల్లని రంగుగల చీకటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మైనం వాయువు మండక చీకటి ప్రదేశం ఏర్పడును. ఈ ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.
2. మధ్య ప్రాంతం :
ఈ ప్రాంతంలో మైనం వాయువు పాక్షికంగా మండుతుంది కారణం ఆక్సిజన్ తగినంత లేకపోవడం. ఈ ప్రాంతంలో మంట పసుపు రంగులో ఉంటుంది. ఈ ప్రాంతంలో మండని కార్బన్ కణాలు వేడిగా ఎరుపు రంగులో ఉంటాయి. మొత్తానికి ఈ ప్రాంతం పసుపు రంగులో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉంటుంది. దీనిని మధ్యస్థ ఉష్ణభాగం అంటారు.
3. అతి బాహ్య ప్రాంతం :
ఈ ప్రాంతం పారదర్శకంగా నీలి రంగులో ఉంటుంది. ఈ ప్రాంతంలోని మైనపు వాయువు పూర్తిగా మండి నీలి రంగు మంటను ఇస్తుంది. ఈ ప్రాంతంలో మైనం ఉష్ణాన్ని, కార్బన్ డై ఆక్సైడు, వాయువును మరియు నీటి ఆవిరిని విడుదల చేస్తుంది. ఈ ప్రాంతం అత్యధిక ఉష్ణభాగం.
4.
ఇంధనము | కెలోరిఫిక్ విలువ (కిలో ఔల్/కి.గ్రా) |
పిడకలు | 6,000 – 8,000 |
బొగ్గు | 25,000 – 30,000 |
పెట్రోలు, డీజిల్ | 45,000 |
ఎల్.పి.జి. | 55,000 |
హైడ్రోజన్ | 1,50,000 |
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
i) అత్యధిక కెలోరిఫిక్ విలువ గల ఇంధనము పేరు రాయండి.
జవాబు:
హైడ్రోజన్
ii) ఒక కే.జి. పెట్రోలును మండించడం వల్ల విడుదలయ్యే ఉష్ణశక్తి ఎంత?
జవాబు:
4500 కి.వొళ్ళు.
iii) తక్కువ కాలుష్యంను కలిగించే రెండు ఇంధనాల పేర్లు రాయండి.
జవాబు:
L.P.G, హైడ్రోజన్.
iv) పై పట్టికలో పేర్కొనబడని ప్రత్యామ్నాయ ఇంధన వనరును ఒక దానిని రాయండి.
జవాబు:
పవనశక్తి, బయో వాయువు.
ప్రశ్న 5.
మానవ అవసరాలకు వినియోగించవలసినంత ఇంధన వనరులు లభ్యం కాకపోవడాన్ని శక్తి లేమి అంటాం. క్రింది పట్టిక 1994 నుండి 1997 వరకు భారతదేశంలో శక్తి లేమిని శాతాలలో సూచిస్తుంది. పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానములిమ్ము.
సం|| | శక్తి లేమి |
1. 1994 | 7.4 |
2. 1995 | 7.1 |
3. 1996 | 9.2 |
4. 1997 | 11.5 |
అ) శక్తి లేమి ఏ సంవత్సరం తక్కువగా ఉంది.
జవాబు:
1995.
ఆ) ఏ రెండు సంవత్సరాల మధ్య శక్తి లేమి తేడా అధికంగా ఉంది?
జవాబు:
1996, 1997ల మధ్య.
ఇ) శక్తి లేమి ఏ సంవత్సరం అధికంగా ఉంది.
జవాబు:
1997.
ఈ) 1994, 95 సంవత్సరాల శక్తి లేమి గురించి వ్యాఖ్యానించుము.
జవాబు:
1) శక్తి లేమి శాతం తగ్గింది.
2) శక్తిలేమి శాతంలో తేడా 7.4 – 7.1 = 0.3 గా ఉన్నది.
8th Class Physics 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట 1 Mark Bits Questions and Answers
బహుళైచ్ఛిక ప్రశ్నలు
I. సరియగు జవాబును ఎంచుకోండి.
1. దహనం చేయుటకు దోహదపడే వాయువు
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) నైట్రోజన్
D) కార్బన్ డై ఆక్సైడ్
జవాబు:
A) ఆక్సిజన్
2. ……… వంటి పదార్థాలు మండినపుడు ఆర్పుటకు నీటిని ఉపయోగించకూడదు.
A) కిరోసిన్
B) పెట్రోల్
C) విద్యుత్ పరికరాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
3. ఈ కింది వానిలో దహనశీలి పదార్ధము కానిది
A) గుడ్డ
B) కాగితం
C) రాయి
D) కర్ర
జవాబు:
C) రాయి
4. ఈ కింది వానిలో త్వరగా మండే పదార్థాలు
A) నేలబొగ్గు
B) మెగ్నీషియం తీగ
C) పెట్రోల్
D) కర్ర
జవాబు:
C) పెట్రోల్
5. స్వతసిద్ధ దహన పదార్థానికి ఉదాహరణ
A) పెట్రోల్
B) మెగ్నీషియం రిబ్బన్
C) అడవులు
D) మైనం
జవాబు:
C) అడవులు
6. కొవ్వొత్తి మంటలో అత్యధిక ఉష్ణభాగం
A) చీకటి ప్రాంతం
B) మధ్యప్రాంతం
C) అతి బాహ్య ప్రాంతం
D) ఏదీకాదు
జవాబు:
C) అతి బాహ్య ప్రాంతం
7. ఈ కింది వానిలో ఘన ఇంధనం
A) నేలబొగ్గు
B) పెట్రోల్
C) LPG
D) CNG
జవాబు:
A) నేలబొగ్గు
8. ఈ క్రింది ఇంధనాలలో అత్యధిక కెలోరిఫిక్ విలుష గలది
A) LPG
B) పెట్రోల్
C) CNG
D) హైడ్రోజన్
జవాబు:
D) హైడ్రోజన్
9. ఈ కింది వానిలో స్వతసిద్ధ దహన పదార్థం కానిది
A) సోడియం
B) ఫాస్పరస్
C) స్పిరిట్
D) అడవులు
జవాబు:
C) స్పిరిట్
10. మంటలను అదుపు చేయాలంటే
A) దహన పదార్థాలను తొలగించుట
B) గాలి సరఫరా లేకుండా చేయుట
C) దహన పదార్థాల ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గించుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
11. ఈ కింది వానిలో దహనశీల పదార్థం
A) నేలబొగ్గు
B) లోహాలు
C) గాజు
D) సిరామిక్స్
జవాబు:
A) నేలబొగ్గు
12. దహనమును రసాయనికంగా ….. అంటారు.
A) క్షయకరణం
B) ఆక్సీకరణం
C) ఇంధనం
D) ఏవీకావు
జవాబు:
B) ఆక్సీకరణం
13. LPG మండుట
A) శీఘ్ర దహనం
B) స్వతసిద్ధ దహనం
C) పేలుడు పదార్థం
D) మందకొడి దహనం
జవాబు:
A) శీఘ్ర దహనం
14. ఈ కింది వానిలో మంటలను అదుపు చేయు వాయువు
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) కార్బన్ డై ఆక్సెడ్
D) ఫ్లోరిన్ వాయువు
జవాబు:
C) కార్బన్ డై ఆక్సెడ్
15. ఏ ప్రాంతం కొవ్వొత్తి మంటలో పాక్షికంగా మండుతుంది?
A) బాహ్య ప్రాంతం
B) మధ్య ప్రాంతం
C) లోపలి ప్రాంతం
D) కింది ప్రాంతం
జవాబు:
B) మధ్య ప్రాంతం
16. ఒక పదార్థం గాలిలోని ఆక్సిజన్ తో కలిసి మండడాన్ని ……….. అంటారు
A) దహనం
B) జ్వలన ఉష్ణోగ్రత
C) దహనశీలి పదార్ధం
D) ఏదీకాదు
జవాబు:
A) దహనం
17. మంట దగరకు తీసుకు వచ్చినప్పుడు మండే గుణం గల పదార్థాలను ……. పదార్థాలు అంటారు.
A) దహనశీలి
B) దహనశీలి కాని
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) దహనశీలి
18. మంట దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మండని పదార్థాలను………. పదార్థాలు అంటారు.
A) దహనశీలి
B) దహనశీలి కాని
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) దహనశీలి కాని
19. క్రింది వాటిలో దహన ప్రక్రియలో ఉపయోగపడు వాయువు
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) నైట్రోజన్
D) ఫ్లోరిన్
జవాబు:
A) ఆక్సిజన్
20. క్రింది వాటిలో దహనం చెందే స్వభావం కలవి
A) ఇంధనాలు
B) ఫోటోగ్రఫీ
C) యుద్ధవాయువులు
D) ఏవీకావు
జవాబు:
A) ఇంధనాలు
21. క్రింది వాటిలో ఏవి దహనం చెందినపుడు అధిక ఉష్టాన్ని ఇస్తాయి?
A) ఇంధనాలు
B) ఫోటోగ్రఫీ
C) యుద్ధవాయువులు
D) ఏవీకావు
జవాబు:
A) ఇంధనాలు
22. క్రింది వాటిలో ఏవి మండినపుడు CO<sub>2</sub>, నీటి ఆవిరులు పరిసరాల్లోకి వెలువడుతాయి?
A) ఇంధనాలు
B) ఫోటోగ్రఫీ
C) యుద్ధవాయువులు
D) ఏవీకావు
జవాబు:
A) ఇంధనాలు
23. దహన చర్య దీని సమక్షంలోనే జరుగుతుంది
A) గాలి
B) నీరు
C) నిప్పు
D) ఏవీకావు
జవాబు:
A) గాలి
24. ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ….. అంటారు.
A) దహనశీలి
B) జ్వలన ఉష్ణోగ్రత
C) మండుట
D) ఏదీకాదు
జవాబు:
B) జ్వలన ఉష్ణోగ్రత
25. పెట్రోల్, ఆల్కహాల్, వంటగ్యాస్ వంటివి ఈ కోవకు చెందినవి
A) త్వరగా మండే పదార్థాలు
B) త్వరగా మండని పదార్థాలు
C) దహనం చెందు పదార్థాలు
D) ఏవీకావు
జవాబు:
A) త్వరగా మండే పదార్థాలు
26. పదార్థాలు ఏ ప్రత్యేకమైన కారణం లేకుండా స్వతహాగా మండడాన్ని ……….. అంటారు.
A) స్వతసిద్ధ దహనం
B) శీఘ్ర దహనం
C) పేలుడు
D) ఏవీకావు.
జవాబు:
A) స్వతసిద్ధ దహనం
27. అగ్గిపుల్ల యొక్క తలభాగం (ముందు ఉండు భాగం) లో ఉండు రసాయనాలు
A) అంటిమొని ట్రై సల్ఫైడ్
B) పొటాషియం క్లోరేట్
C) తెల్ల ఫాస్ఫరస్
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
28. ప్రస్తుతం అగ్గిపుల్లల తలభాగం యందు వాడబడుతున్న రసాయనాలు
A) అంటిమొని ట్రై సల్ఫైడ్
B) పొటాషియం క్లోరేట్
C) తెల్ల ఫాస్ఫరస్
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
29. అగ్గిపెట్టె గరుకుతలంపై వీటి మిశ్రమం ఉండును
A) గాజుపొడి
B) ఎర్ర ఫాస్ఫరస్
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
30. అగ్గిపుల్లను గరుకుతలంపై రుద్దినపుడు ఎర్ర ఫాస్ఫరస్ ………. గా మారును.
A) పొటాషియం క్లోరేట్
B) తెల్ల ఫాస్ఫరస్
C) అంటిమొని
D) A మరియు B
జవాబు:
B) తెల్ల ఫాస్ఫరస్
31. క్రింది వాటిలో “శీఘ్ర దహనం” ను పాటించు పదార్థాలు
A) స్పిరిట్
B) పెట్రోలు
C) కర్పూరం
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
32. క్రింది వాటిలో ఉష్ణాన్ని కొలిచే ప్రమాణాలు
A) కిలో ఔల్
B) కిలోగ్రాం
C) జైనులు
D) ఫారడే
జవాబు:
A) కిలో ఔల్
33. ఒక కిలో గ్రాం ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణరాశి ఆ ఇంధనం యొక్క …… అగును.
A) కిలో ఔల్
B) కెలోరిఫిక్ విలువ
C) ఆంపియర్
D) ఓమ్
జవాబు:
B) కెలోరిఫిక్ విలువ
34. పిడకల యొక్క కెలోరిఫిక్ విలువ
A) 6,000-8,000
B) 17,000-22,000
C) 25,000-30,000
D) 35,000-40,000
జవాబు:
A) 6,000-8,000
35. పెట్రోలు యొక్క కెలోరిఫిక్ విలువ
A) 45,000
B) 50,000
C) 55,000
D) 1,50,000
జవాబు:
A) 45,000
36. CNG యొక్క కెలోరిఫిక్ విలువ
A) 45,000
B) 50,000
C) 55,000
D) 1,50,000
జవాబు:
B) 50,000
37. LPG యొక్క కెలోరిఫిక్ విలువ
A) 45,000
B) 50,000
C) 55,000
D) 1,50,000
జవాబు:
C) 55,000
38. బయోగ్యాస్ యొక్క కెలోరిఫిక్ విలువ
A) 6,000-8, 000
B) 17,000-22,000
C) 25,000-30,000
D) 35,000-40,000
జవాబు:
D) 35,000-40,000
39. మంటలను అదుపు చేయుటకు అవసరమైన అంశాలు
A) దహనశీల ‘ఇంధనం
B) మండుతున్న పదార్థానికి గాలి / ఆక్సిజన్ సరఫరా జరుగుతుండడం
C) పదార్ధజ్వలన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం
D) పై వాటిలో దేనిని తొలగించినను
జవాబు:
D) పై వాటిలో దేనిని తొలగించినను
40. క్రింది వాటిలో నీరునుపయోగించి మంటలను ఆర్పు విషయములో విభిన్నమైనది
A) కర్ర
B) కాగితం
C) గుడ్డ
D) నూనె
జవాబు:
D) నూనె
41. మంటలను ఆర్పడానికి ఉత్తమమైనది
A) ఆక్సిజన్
B) కార్బన్
C ) కార్బన్ డై ఆక్సైడ్
D) నీరు
జవాబు:
C ) కార్బన్ డై ఆక్సైడ్
42. మన నిత్య జీవితంలో వంట చేసేటప్పుడు ఏ సందర్భంలో ఇంధన వనరుల దుర్వినియోగం జరుగుతుంది.
A) మూత పెట్టకుండా వంట చేయుట
B) వంట చేసేటపుడు ఎక్కువ నీరు ఉపయోగించుట
C) లీక్ అవుతున్న పైపులు, బర్నర్లు, రెగ్యూలేటర్ల వల్ల
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు
43. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీకి క్రింది వానిలో ఏ పదార్థాన్ని ఉపయోగించవచ్చు?
A) పొటాషియం పర్మాంగనేట్
B) పొటాషియం క్లోరైడ్
C) అమ్మోనియం క్లోరైడ్
D) కాపర్ సల్ఫేట్
జవాబు:
A) పొటాషియం పర్మాంగనేట్
44. కెలోరిఫిక్ విలువకు ప్రమాణాలు
A) కి.జౌ
B) కి.జె.కేజి
C) కి.జో/కేజి
D) కేజీలు
జవాబు:
C) కి.జో/కేజి
45. గీత : వస్తువు మండటానికి మంట తప్పనిసరి కాకపోవడం అది
హరిణి : వస్తువు మండటానికి సరైన ఉష్ణోగ్రత ఉంటే ! చాలు. మీరు ఎవరిని సమర్ధిస్తారు?
A) గీతని
B) హరిణిని
C) ఇద్దరినీ
D) ఇద్దరినీకాదు
జవాబు:
C) ఇద్దరినీ
46. దిగువ ను పరిశీలించండి.
A) బొగ్గు, డీజిల్
B) బొగ్గు, పెట్రోల్
C) హైడ్రోజన్, డీజిల్
D) పెట్రోల్, డీజిల్
జవాబు:
D) పెట్రోల్, డీజిల్
47. కింది వాక్యాల సరైన క్రమాన్ని సూచించునది.
1. ఒక గాజు గ్లాసును దానిపై బోర్లించండి.
2. తర్వాత రెపరెపలాడి మంట ఆరిపోతుంది.
3. మండుతున్న కొవ్వొత్తిని ఒక టేబుల్ పై అమర్చండి.
4. కొవ్వొత్తి కొద్దిసేపు మండుతుంది.
A) 3, 2, 1, 4
B) 3, 1, 4, 2
C) 3, 1, 2, 4
D) 3, 4, 2, 1
జవాబు:
B) 3, 1, 4, 2
48. గాలిలో బొగ్గును మండించినపుడు ……..
A) కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది
B) ఆక్సిజన్ ఏర్పడుతుంది
C) సల్ఫర్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది
D) కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది
జవాబు:
D) కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది
49. మండుతున్న కొవ్వొత్తిపై తలక్రిందులుగా ఒక గాజు గ్లాసును ఉంచినపుడు కొంత సమయానికి మంట ఆరిపోవును. దీనికి కారణం కింది వాటిలో ఒకటి లభ్యం
A) నీటి భాష్పం
B) ఆక్సిజన్
C) కార్బన్ డై ఆక్సైడ్.
D) మైనం
జవాబు:
B) ఆక్సిజన్
50. గ్రామాలలో వంట చెరకును ఇంధనంగా వాడటానికి గల కారణం
A) అది ఒక స్వచ్ఛమైన ఇంధనంగా భావించడం
B) అది సులభంగా లేదా తక్కువ ఖర్చుతో లభించడం
C) అది పర్యావరణ హితంగా ఉండటం
D) అది త్వరగా మంటని అంటుకోవడం
జవాబు:
B) అది సులభంగా లేదా తక్కువ ఖర్చుతో లభించడం
51. కింది వానిలో ఏది అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం
A) కిరోసిన్
B) బయోగ్యాస్
C) ఎల్.పి.జి (L.P.G)
D) పెట్రోల్
జవాబు:
C) ఎల్.పి.జి (L.P.G)
52. కింది వానిలో ఏది అత్యధిక అంటుకునే ఉష్ణోగ్రత కలిగిన పదార్థం?
A) కిరోసిన్
B) పెట్రోల్
C) బొగ్గు
D) ఆల్కహాల్
జవాబు:
C) బొగ్గు
53. కింది వానిలో ఏది దహనశీల పదార్థం కాదు? ఏయే పదార్థాలకు సమాన కెలోరిఫిక్ విలువ కలదు?
A) కర్పూరం
B) గాజు
C) స్ట్రా
D) ఆల్కహాల్
జవాబు:
B) గాజు
54. లోహాలు ఉష్ణవాహకతను కలిగి ఉంటాయని నీకు తెలుసు. దోసెలు చేసే పెనం తయారు చేయుటలో ఏ జాగ్రత్త తీసుకుంటావు?
A) పెనం పెద్దదిగా ఉండేలా తయారుచేస్తాను.
B) పెనం చిన్నదిగా ఉండేలా చేస్తాను.
C) పెనంను ఉష్ణబంధక పదార్థంతో తయారుచేస్తాను.
D) పెనం పిడిని ఉష్ణబంధక పదార్థంతో తొడుగును తయారు చేస్తాను.
జవాబు:
D) పెనం పిడిని ఉష్ణబంధక పదార్థంతో తొడుగును తయారు చేస్తాను.
55. మన దైనందిన జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తూ, పర్యావరణానికి తక్కువగా హాని కలిగించే పెట్రో రసాయనం
A) LPG
B) కిరోసిన్
C) డీసిల్
D) కోల్ తారు
జవాబు:
A) LPG
II. జతపరచుము.
1)
Group – A | Group – B |
1. ఘన ఇంధనం | A) దీపావళి టపాకాయలు |
2. ద్రవ ఇంధనం | B) రాయి |
3. వాయు ఇంధనం | C) పెట్రోలు |
4. పేలుడు పదార్థం | D) నేలబొగ్గు |
5. దహనశీలి కాని పదార్థం | E) CNG |
జవాబు:
Group – A | Group – B |
1. ఘన ఇంధనం | D) నేలబొగ్గు |
2. ద్రవ ఇంధనం | C) పెట్రోలు |
3. వాయు ఇంధనం | E) CNG |
4. పేలుడు పదార్థం | A) దీపావళి టపాకాయలు |
5. దహనశీలి కాని పదార్థం | B) రాయి |
2)
Group – A | Group – B |
1. చీకటి ప్రాంతంలో | A) హైడ్రోజన్ వాయువు |
2. మధ్య ప్రాంతంలో | B) కార్బన్ డై ఆక్సెడ్ |
3. అతి బాహ్య ప్రాంతంలో | C) దహనచర్య జరగదు |
4. అత్యధిక ఇంధన దక్షత | D) సంపూర్ణంగా దహనచర్య జరుగును |
5. ఇంధనం కానిది | E) పాక్షికంగా దహనచర్య జరుగును |
జవాబు:
Group – A | Group – B |
1. చీకటి ప్రాంతంలో | C) దహనచర్య జరగదు |
2. మధ్య ప్రాంతంలో | E) పాక్షికంగా దహనచర్య జరుగును |
3. అతి బాహ్య ప్రాంతంలో | D) సంపూర్ణంగా దహనచర్య జరుగును |
4. అత్యధిక ఇంధన దక్షత | A) హైడ్రోజన్ వాయువు |
5. ఇంధనం కానిది | B) కార్బన్ డై ఆక్సెడ్ |
3)
Group – A | Group – B |
1. మందకొడి (నెమ్మదిగా) దహనం | A) ఫాస్ఫరస్ |
2. శీఘ్ర దహనం | B) ఇనుము తుప్పుపట్టుట |
3. స్వతసిద్ధ దహనం | C) దీపావళి టపాకాయలు |
4. పేలుడు పదార్థం | D) ఆక్సీకరణము |
5. దహనం అంటే | E) కర్పూరం |
జవాబు:
Group – A | Group – B |
1. మందకొడి (నెమ్మదిగా) దహనం | B) ఇనుము తుప్పుపట్టుట |
2. శీఘ్ర దహనం | E) కర్పూరం |
3. స్వతసిద్ధ దహనం | A) ఫాస్ఫరస్ |
4. పేలుడు పదార్థం | C) దీపావళి టపాకాయలు |
5. దహనం అంటే | D) ఆక్సీకరణము |
మీకు తెలుసా?
1. పెట్రోల్ ట్యాంకర్లపై “Highly inflammable” అని రాసి ఉండడం మీరు చూసి ఉంటారు కదా ! పెట్రోల్ చాలా త్వరగా మంటను అందుకుంటుంది కాబట్టి ఆ ట్యాంకర్‌కు దగ్గరలో మంటని ఉంచరాదని చేసే హెచ్చరిక అది.
2. మనం సాధారణంగా పండుగల సమయంలో బాణాసంచా కాలుస్తాం. బాణాసంచాను వెలిగించగానే అవి పెద్ద శబ్దంతో పేలి కాంతిని, ఉష్టాన్ని ఇస్తాయి. దానిని “పేలుడు” (explosion) అంటాం. బాణాసంచాపై పీడనం (వత్తిడి) పెంచడం ద్వారా కూడా ‘పేలుడు’ సంభవించే అవకాశం ఉంది.
కొవ్వొత్తి ప్రధానంగా ఒక కాంతి జనకం కాని ఇది కొద్ది మోతాదులో ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తుంది. ఇది మైనంతో తయారు చేయబడి మధ్యలో మందపాటి దారంను కలిగి ఉంటుంది. మండుచున్న అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించినపుడు మైనం కరిగి మొదట ద్రవంగా మారుతుంది. అందులో కొంతభాగం తిరిగి బాష్పంగా మారుతుంది. ఆ మైనపు బాష్పం , గాలిలోని ఆక్సిజన్ తో కలిసి మంటను ఏర్పరుస్తుంది. కొవ్వొత్తి యొక్క వేడి దాని మంట నుండి వచ్చే పై భాగంలో గల మైనాన్ని మరింతగా కరిగించి ద్రవంగా మారుస్తుంది. ఆ ద్రవం దారం ద్వారా వత్తి యొక్క పై భాగానికి చేరాక బాష్పంగా మారి నిరంతరంగా మండుతుంది.