AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

These AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత will help students prepare well for the exams.

AP Board 8th Class Physical Science 9th Lesson Important Questions and Answers ద్రవాల విద్యుత్ వాహకత

8th Class Physics 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 1 Mark Important Questions and Answers

ప్రశ్న 1.
ఎలక్ట్రోప్లేటింగ్ అనగానేమి?
జవాబు:
విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా ఒక లోహంపై మరో లోహం పూత పూయబడే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు.

ప్రశ్న 2.
టెస్టర్ లో బల్బు స్థానంలో LED ని ఉపయోగిస్తారు. ఎందుకు?
జవాబు:
వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహం ఉన్నా కూడా LED వెలుగుతుంది. కాబట్టి బల్బు స్థానంలో LED ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 3.
ఎలక్ట్రోప్లేటింగ్ లో క్రోమియం లోహాన్ని ఎందుకు ఉపయోగిస్తారు?
జవాబు:
క్రోమియం లోహం చాలా ఖరీదైనది. ఈ లోహానిది మెరిసే స్వభావం. గట్టిగా గీసినా గీతలు పడవు మరియు తుప్పుపట్టదు. – కావున ఎలక్ట్రోప్లేటింగ్ విధానంలో తక్కువ ఖరీదు గల లోహాలపై పూత పూయుటకు క్రోమియం లోహాన్ని ఉపయోగిస్తారు.

ప్రశ్న 4.
ఎలక్ట్రోప్లేటింగ్ చేయబడిన కొన్ని వస్తువుల పేర్లు రాయండి.
జవాబు:
ఆభరణాలు, వాహన చక్రాల రిమ్ములు, మోటారు సైకిల్ మరియు సైకిల్ హాండిల్స్, బాలమ్ పంపులు. తలుపులు హాండిల్స్, గ్యాస్ స్టాలు మొ||నవి.

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 5.
ఆహార పదార్థాలు నిల్వచేసే ఇనుప డబ్బాలకు ఎందుకు తగరపు పూత పూస్తారు?
జవాబు:
ఆహార పదార్థాలతో చర్య జరిపే లక్షణం ఇనుము కంటే తగరానికి (Tin)కు తక్కువ ఉంటుంది. కావున ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా ఇనుప డబ్బాలకు తగరం పూత పూస్తారు.

ప్రశ్న 6.
సముద్ర తీర ప్రాంతంలో గల క్రాంతి అనే విద్యార్థి త్రాగు నీటిని, సముద్రపు నీటిని అయస్కాంత దిక్సూచి గల టెస్టర్ తో పరీక్షించెను. దిక్సూచిలోని సూచి త్రాగునీటిలో కంటే సముద్రపు నీటిలో ఎక్కువ అపవర్తనం చెందినది. ఎందుకు సముద్రపు నీటిలో ఎక్కువ, అపవర్తనం చెందినదో వివరించండి?
జవాబు:
త్రాగు నీటిలో కంటే సముద్రపు నీటిలో ఎక్కువ లవణాలు ఉంటాయి. సముద్రపు నీరు అధిక విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. కావున టెస్టర్ లోని దిక్సూచి సూచిక సముద్రపు నీటిలో ఎక్కువ అపవర్తనం చెందినది.

ప్రశ్న 7.
అయస్కాంత దిక్సూచి కలిగిన ఒక టెస్టర్ తో ఒక ద్రావణాన్ని పరీక్షించినపుడు, దిక్సూచిలో సూచిక అపవర్తనం చెందినది. సూచిక ఎందుకు అపవర్తనం చెందినదో కారణం రాయండి.
జవాబు:
ద్రావణం విద్యుత్ వాహకతను ప్రదర్శించుట వలన టెస్టర్ లోని దిక్సూచి అపవర్తనం చెందినది.

ప్రశ్న 8.
విద్యుత్ బంధకాలకు కొన్ని ఉదాహరణలు రాయండి.
జవాబు:
కర్రలు, రబ్బరు, ప్లాస్టిక్ మొదలైనవి విద్యుత్ బంధకాలకు ఉదాహరణలు.

8th Class Physics 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 2 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తున్నపుడు నాణ్యమైన పూత ఏర్పడడానికి ఏమి చేయాలి?
జవాబు:

  1. పూత పూయవలసిన వస్తువుకు గ్రీజు, నూనె వంటి పదార్థాలు అంటి ఉండకూడదు.
  2. పూత పూయవలసిన వస్తువు యొక్క ఉపరితలం గరుకుగా ఉండాలి.
  3. విద్యుత్ విశ్లేష్యం గాఢత తగినంతగా ఉండాలి.
  4. ఎలక్ట్రోప్లేటింగ్ జరుగుతున్నంత సేపు విద్యుత్ ప్రవాహం నిలకడగా ఉండాలి.

ప్రశ్న 2.
విద్యుత్ వాహకం, విద్యుత్ బంధకాల మధ్య భేదాలు రాయండి.
జవాబు:

విద్యుత్ వాహకం విద్యుత్ బంధకం
ఏ పదార్థాలు ‘తమగుండా విద్యుత్ ను ప్రసరింపచేయవో ప్రసరింపచేస్తాయో ఆ పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.

ఉదా : లోహాలు (రాగి, వెండి, అల్యూమినియం తీగలు)

ఏ పదార్థాలు తమగుండా విద్యుతను ఆ పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.

ఉదా : కర్ర, ప్లాస్టిక్, కాగితం మొదలగునవి.

ప్రశ్న 3.
ఒక సాధారణ విద్యుత్ వలయంలో బల్బు వెలగలేదు. కారణాలు ఏమై ఉండవచ్చును? తెల్పండి.
జవాబు:

  1. వలయంలోని తీగలను సరియైనట్లు కలిపి ఉండకపోవచ్చును.
  2. బల్బు పాడైపోయినది కావచ్చును.
  3. బ్యాటరీ వాడినది అయి ఉండవచ్చును.

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

ప్రశ్న 4.
విద్యుత్ విశ్లేషణ వలన ఉపయోగాలు రాయండి.
జవాబు:

  1. లోహాలను సంగ్రహణ చేయుటకు ఉపయోగిస్తారు.
  2. రసాయన పదార్థాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు.
  3. లోహాలను శుద్ధి చేయుటకు ఉపయోగిస్తారు.
  4. ఎలక్టోప్లేటింగ్ చేయుటకు ఉపయోగిస్తారు.

8th Class Physics 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 4 Marks Important Questions and Answers

ప్రశ్న 1.
“మెగ్నీషియం రిబ్బన్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది” అని నిరూపించుటకు ఒక ప్రయోగాన్ని వివరించండి.
జవాబు:
ఉద్దేశ్యం :
మెగ్నీషియం రిబ్బన్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది అని నిరూపించుట.

పరికరాలు :
మెగ్నీషియం రిబ్బన్, ఒక టార్చిలైట్ బల్బు లేదా LED, నిర్జల ఘటం (dry cell), చెక్క పలక, రెండు డ్రాయింగ్ పిన్నులు మరియు వలయాన్ని కలపడానికి కొన్ని రాగి తీగలు.

విధానం :

  1. పటంలో చూపిన విధంగా సాధారణ విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేయండి.
  2. మెగ్నీషియం రిబ్బన్ ను రెండు డ్రాయింగ్ పిన్నులకు ఆనిస్తే బల్బు వెలుగుతుంది.
  3. బల్బు వెలుగుతుంది కనుక మెగ్నీషియం రిబ్బన్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తుంది అని చెప్పవచ్చు.

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 1

ప్రశ్న 2.
ఒక లోహంపై మరో లోహాన్ని పూతగా పూసే పద్ధతిని ఏమంటారు?
ఈ ప్రక్రియకు సంబంధించిన పటాన్ని గీయండి. భాగాలను గుర్తించండి.
జవాబు:
ఒక లోహంపై మరో లోహాన్ని పూతగా పూసే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు.
AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 2

8th Class Physics 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 1 Mark Bits Questions and Answers

బహుళైచ్ఛిక ప్రశ్నలు

I. సరియగు జవాబును ఎంచుకోండి

1. పాలిథిన్ అనునది
A) విద్యుత్ వాహకము
B) విద్యుత్ బంధకం
C) అర్ధవాహకం
D) లోహము
జవాబు:
B) విద్యుత్ బంధకం

2. LED అనగా
A) లైట్ ఎలక్ట్రాన్ డౌన్
B) లైట్ ఎమిటింగ్ డయోడ్
C) లో ఎలక్ట్రిక్ డివైస్
D) లో ఎలక్ట్రాన్ డెన్సిటి
జవాబు:
B) లైట్ ఎమిటింగ్ డయోడ్

3. ఈ కింది వానిలో విద్యుత్ బంధకం కానిది
A) ఇటుక
B) స్టీల్
C) రబ్బరు
D) ప్లాస్టిక్
జవాబు:
B) స్టీల్

4. దిక్సూచి గల టెస్టర్ ని ……… కొరకు ఉపయోగిస్తారు.
A) అతి తక్కువ పరిమాణంలోని విద్యుత్ ప్రవాహం
B) ఎక్కువ పరిమాణాలలో గల విద్యుత్ ప్రవాహాలు
C) దిక్కులను కనుగొనుటకు
D) ఏదీకాదు
జవాబు:
A) అతి తక్కువ పరిమాణంలోని విద్యుత్ ప్రవాహం

5. నీరు ……..
A) విద్యుత్ బంధకం
B) విద్యుత్ వాహకం
C) అర్ధవాహకం
D) ఏదీకాదు
జవాబు:
B) విద్యుత్ వాహకం

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

6. కాపర్ సల్ఫేట్ సాధారణ నామం
A) కర్పూరం
B) నవాసారం
C) మైలతుత్తం
D) సురేకారము
జవాబు:
C) మైలతుత్తం

7. LED వెలిగే తీవ్రత ఆ వలయంలో ప్రవహించే ………. పై ఆధారపడి ఉంటుంది.
A) ఉష్ణం
B) ద్రవం గాఢత
C) ద్రవం రంగు
D) విద్యుత్
జవాబు:
B) ద్రవం గాఢత

8. ఈ క్రింది వానిలో విద్యుత్ వాహకం కానిది
A) పంపునీరు
B) నిమ్మరసం
C) స్వేదనజలం
D) పైవన్నీ
జవాబు:
C) స్వేదనజలం

9. నీటి విద్యుత్ విశ్లేషణ చేసినపుడు విడుదలయ్యే వాయువులు
A) ఆక్సిజన్
B) హైడ్రోజన్
C) ఆక్సిజన్ మరియు హైడ్రోజన్
D) ఆక్సిజన్ మరియు కాపర్.
జవాబు:
C) ఆక్సిజన్ మరియు హైడ్రోజన్

10. సాధారణ విద్యుత్ వలయంలో బల్బు వెలుగుట లేదు-కారణం
A) వలయంలో తీగల కనెక్షన్లు లూజుగా ఉండుట
B) బల్బు కాలిపోయినది
C) బ్యాటరీ ఇంతకుముందు వాడినది
D) పై అన్ని కారణాల వల్ల
జవాబు:
D) పై అన్ని కారణాల వల్ల

11. విద్యుత్ విశ్లేషణ ఉపయోగం ………
A) లోహాల సంగ్రహణ
B) లోహాలను శుద్ధి చేయుట
C) రసాయనాలు తయారుచేయుట
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

12. బ్యాటరీకి కలిపిన ఋణ ఎలక్ట్రోడ్ ను …… అంటారు.
A) కాథోడ్
B) ఆనోడ్
C) ధనావేశ పలక
D) ఏదీకాదు
జవాబు:
A) కాథోడ్

13. తమ గుండా విద్యుతను ప్రసరింపజేయు పదార్థాలు
A) విద్యుత్ వాహకాలు
B) విద్యుత్ బంధకాలు
C) అధమ విద్యుత్ వాహకాలు
D) ఉత్తమ విద్యుత్ వాహకాలు
జవాబు:
A) విద్యుత్ వాహకాలు

14. క్రింది వాటిలో మంచి విద్యుత్ వాహకాలు
A) లోహాలు
B) చెక్క
C) రబ్బరు
D) అన్నియూ
జవాబు:
A) లోహాలు

15. తమ గుండా విద్యుత్ ను ప్రసరింపజేయని పదార్థాలు
A) విద్యుత్ వాహకాలు
B) విద్యుత్ బంధకాలు
C) అధమ విద్యుత్ వాహకాలు
D) ఉత్తమ విద్యుత్ వాహకాలు
జవాబు:
B) విద్యుత్ బంధకాలు

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

16. క్రింది వాటిలో విద్యుత్ నిరోధకాలు
A) లోహాలు
B) సిలికాన్
C) జెర్మేనియం
D) రబ్బరు
జవాబు:
D) రబ్బరు

17. విద్యుత్ వాహకత దీని లక్షణం
A) పదార్థం
B) ఎలక్ట్రాన్
C) ప్రోటాన్
D) న్యూట్రాన్
జవాబు:
A) పదార్థం

18. మొబైల్ ఫోన్, టి.వి, ‘ట్రాన్స్ఫ ర్మర్ పనితీరును తెలుసుకోవడానికి టెస్టర్‌గా వాడునది
A) బల్బు
B) రబ్బరు
C) చార్జర్
D) LED
జవాబు:
D) LED

19. LED నందు పొడవాటి తీగను వలయంలోని దీనికి కలుపుతారు.
A) బ్యాటరీ ధనధృవంకు
B) బ్యాటరీ రుణధృవంకు
C) రెండింటికీ
D) ఏదీకాదు
జవాబు:
A) బ్యాటరీ ధనధృవంకు

20. LEDనందు పొట్టితీగను వలయంలోని దీనికి కలుపుతారు.
A) బ్యాటరీ ధనధృవంకు
B) బ్యాటరీ రుణధృవంకు
C) రెండింటికీ
D) ఏదీకాదు
జవాబు:
B) బ్యాటరీ రుణధృవంకు

21. క్రింది వాటిలో దేని గుండా విద్యుత్ ప్రపంచును.
A) స్వేదనజలం
B) లవణాలు కలిగిన నీరు
C) రబ్బరు ముక్క
D) చెక్క
జవాబు:
B) లవణాలు కలిగిన నీరు

22. ఈ క్రింది వాటిలో విద్యుత్ ను ప్రసరింపజేయునవి
A) ఆమ్లాలు
B) లవణాలు
C) క్షారాలు
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ

23. విద్యుత్ పరికరాలను తడి చేతులతో తాకవద్దని అనుటకు గల కారణం
A) లవణ నీరు మంచి విద్యుద్వాహకం
B) అధమ వాహకం
C) రెండూనూ
D) ఏదీకాదు
జవాబు:
A) లవణ నీరు మంచి విద్యుద్వాహకం

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

24. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చు పరికరం
A) ఘటము
B) డైనమో
C) మోటరు
D) స్విచ్
జవాబు:
A) ఘటము

25. ఏవైనా రెండు వేర్వేరు లోహాలను ఒక ద్రకంలో ఉంచి విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నవారు
A) అలెసాండ్రో ఓల్టా
B) బోలోనా
C) థామస్
D) ఎడిసన్
జవాబు:
A) అలెసాండ్రో ఓల్టా

26. మొట్టమొదటగా (1800 సం||లో) కనుగొనబడిన ఘటంలో వాడిన విద్యుత్ విశ్లేష్యము
A) HCl
B) H2 SO4
C) NH3
D) SO2
జవాబు:
B) H2 SO4

27. 1800 సం||లో ఓల్టా కనుగొనబడిన ఘటంలో వాడిన విద్యుత్ ధృవాలు
A) రాగి
B) జింక్
C) రాగి, జింకు
D) ఇనుము, వెండి
జవాబు:
C) రాగి, జింకు

28. ఒక లోహంపై మరో లోహంను విద్యుత్ ను ప్రయోగించి పూత పూయబడే పద్ధతి
A) విద్యుత్ మలాం
B) ఎలక్ట్రోస్టేలింది
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B

29. ఓల్టా ఘటం యొక్క విద్యుత్ చ్ఛాలక బలం పిలువ
A) 1.08 V
B) 2V
C) 2.08V
D) 3V
జవాబు:
A) 1.08 V

30. గాలిలోని తేమ, ఆక్సిజన్‌తో వస్తువులు చర్య జరుపకుండుటకు వాడు ప్రక్రియ
A) ఎలక్ట్రోప్లేటింగ్
B) ఎలక్ట్రోటైపింగ్
C) ఎలక్ట్రాలసిస్
D) ఏదీకాదు
జవాబు:
A) ఎలక్ట్రోప్లేటింగ్

31. విద్యుత్ ను తమ గుండా ప్రసరింపజేయు ద్రావణం
A) విద్యుత్ కారకం
B) విద్యుత్ విశ్లేష్యం
C) విద్యుత్ ప్రవాహం
D) ఏదీకాదు
జవాబు:
B) విద్యుత్ విశ్లేష్యం

32. ప్రక్క పటంలో జరుగుచున్న చర్య
A) ఎలక్ట్రో టైపింగ్
B) విద్యుత్ విశ్లేషణం
C) ఎలక్ట్రోప్లేటింగ్
D) ఏదీకాదు
జవాబు:
C) ఎలక్ట్రోప్లేటింగ్

33. యంత్రాల భాగాలు తుప్పుపట్టకుండా ఉండుటకు మరియు మెరియుటకు దీనిపూత వాడతారు.
A) నికెల్
B) క్రోమియం
C) రాగి
D) అల్యూమినియం
జవాబు:
B) క్రోమియం

34. క్రింది వాటిలో వాహకం కానిది
A) రాగి
B) ఇనుము
C) కార్బన్
D) గ్రాఫైట్
జవాబు:
C) కార్బన్

35. ధనాత్మక అయానును …….. అంటారు.
A) కొటయాన్
B) యానయాన్
C) పరమాణువు
D) న్యూట్రాన్
జవాబు:
A) కొటయాన్

36. ఎలక్ట్రోలైటిక్ ఘటం యొక్క మరొక నామము
A) అమ్మీటరు
B) వోల్ట్ మీటరు
C) ఎలక్ట్రోడ్
D) వోల్టామీటరు
జవాబు:
D) వోల్టామీటరు

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

37. ఎలక్ట్రాన్ల ప్రవాహంను ………. అంటారు.
A) కరెంట్
B) ఎలక్ట్రోడ్
C) ఎలక్ట్రోలైట్
D) ఎలక్ట్రోప్లేటింగ్
జవాబు:
A) కరెంట్

38. ఆహార పదార్థాలు నిల్వ చేయు ఇనుప డబ్బాలకు తగరపు పూత పూయుటకు గల కారణం
A) పదార్థాలతో ఇనుము కంటే తగరం తక్కువగా చర్య జరుపును.
B) పదార్థాలతో ఇనుము కంటే తగరం ఎక్కువగా చర్య జరుపును.
C) పదార్థాలతో తగరం కంటే ఇనుము ఎక్కువగా చర్య జరుపును.
D) పదార్థాలతో తగరం కంటే ఇనుము తక్కువగా చర్య జరుపును.
జవాబు:
A) పదార్థాలతో ఇనుము కంటే తగరం తక్కువగా చర్య జరుపును.

39. వంతెనల నిర్మాణంలోనూ, వాహన పరికరాల తయారీలోనూ వాడు ఇనుముకు దీని పూత పూస్తారు.
A) జింకు
B) రాగి
C) అల్యూమినియం
D) ఇత్తడి
జవాబు:
B) రాగి

40. క్రింది వాటిలో ఆమ్ల విద్యుద్వాహకాలకు చెందనిది
A) HCl
B) H2SO4
C) N2O4
D) NaOH
జవాబు:
D) NaOH

41. క్రింది వాటిలో క్షార విద్యుద్వాహకాలకు చెందనిది
A) NaOH
B) Mg(OH)2
C) KOH
D) HCl
జవాబు:
D) HCl

42. ఎలక్ట్రిక్ టెస్టర్కు లోహంతో చేసిన పిడిని వాడరు. ఎందుకు?
A) లోహాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు
B) లోహాలు చాలా ఖరీదైనవి
C) లోహాలు అరుదుగా లభిస్తాయి
D) లోహాలు విద్యుత్ బంధకాలు
జవాబు:
A) లోహాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు

43. వలయంలో విద్యుత్ ప్రవాహం సూచించునది
A) ఆవేశం ఏర్పడుట
B) వాహకం యొక్క చలనం
C) ఆవేశం యొక్క చలనం
D) విద్యుత్ ఉత్సర్గం
జవాబు:
C) ఆవేశం యొక్క చలనం

44. ఓల్టాయిక్ ఘటంలో
A) విద్యుచ్ఛక్తి, యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది
B) యాంత్రిక శక్తి, విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది
C) విద్యుచ్ఛక్తి రసాయనిక శక్తిగా మార్చబడుతుంది
D) రసాయనిక శక్తి, విద్యుచ్ఛక్తిగా మార్చబడుతుంది
జవాబు:
D) రసాయనిక శక్తి, విద్యుచ్ఛక్తిగా మార్చబడుతుంది

45.
AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 4
పై పటాలలో గుర్తు బల్బును, గుర్తు బ్యాటరీని తెలియజేస్తుంది. అయిన పై వాటిలో సరైనవి
A) ii మాత్రమే
B) i మరియు ii మాత్రమే
C) ii మరియు iii మాత్రమే
D) i మాత్రమే
జవాబు:
A) ii మాత్రమే

46. i) జింక్ సల్ఫేట్ నుండి జింకను కాపర్ తొలగించలేదు.
ii) కాపర్ సల్ఫేట్ నుండి కాపర్‌ను తొలగించగలదు.
పై రెండు విషయాలను బట్టి మీరు తెలుసుకునే విషయం
A) ఎక్కువ చర్యాశీలత గల లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి.
B) ఎక్కువ చర్యాశీలత గల లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందించలేవు.
C) చర్యాశీలతలు సమానమైనప్పుడు లోహాలు స్థానభ్రంశం చెందుతాయి.
D) తక్కువ చర్యాశీలత గల లోహాలు ఎక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి.
జవాబు:
A) ఎక్కువ చర్యాశీలత గల లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి.

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

47. గ్రూపు – A గ్రూపు – B
a) సల్ఫర్ – i) ప్యాకింగ్ కవర్లు
b) కార్బన్ – ii) అగ్గిపెట్టెలు
c) అల్యూమినియం – iii) ఆభరణాలు
d) వెండి – iv) విరంజనకారి
A) a-ii, b-iv, c-i, d-iii
B) a-iv, b-iii, c-ii, d-i
C) a-ii, b-iii, c-i, d-iv
D) a-i, b-ii, c-iii, d-iv
జవాబు:
A) a-ii, b-iv, c-i, d-iii

II. జతపరచుము.
1)

Group – A Group – B
1. విద్యుత్ వాహకము A) ఎలక్ట్రోడ్
2. విద్యుత్ బంధకము B) లైట్ ఎమిటింగ్ డయోడ్
3. లోహపు కడ్డీ C) ప్లాస్టిక్
4. LED D) విద్యుత్ బంధకము
5. స్వేదన జలం E) అల్యూమినియం

జవాబు:

Group – A Group – B
1. విద్యుత్ వాహకము E) అల్యూమినియం
2. విద్యుత్ బంధకము C) ప్లాస్టిక్
3. లోహపు కడ్డీ A) ఎలక్ట్రోడ్
4. LED B) లైట్ ఎమిటింగ్ డయోడ్
5. స్వేదన జలం D) విద్యుత్ బంధకము

2)

Group – A Group – B
1. విద్యుత్ ఘటము A) ఒక లోహంపై మరో లోహం పూతపూయడం
2. విద్యుద్విశ్లేషణము B) విద్యుత్ బంధకం
3. ఎలక్ట్రోప్లేటింగ్ C) రసాయనశక్తిని విద్యుత్ శక్తిగా మార్చునది
4. గ్రాఫైట్ D) విద్యుత్ శక్తిని రసాయనశక్తిగా మార్చునది
5. డైమండ్ (వజ్రం) E) విద్యుత్ వాహకం

జవాబు:

Group – A Group – B
1. విద్యుత్ ఘటము C) రసాయనశక్తిని విద్యుత్ శక్తిగా మార్చునది
2. విద్యుద్విశ్లేషణము D) విద్యుత్ శక్తిని రసాయనశక్తిగా మార్చునది
3. ఎలక్ట్రోప్లేటింగ్ A) ఒక లోహంపై మరో లోహం పూతపూయడం
4. గ్రాఫైట్ E) విద్యుత్ వాహకం
5. డైమండ్ (వజ్రం) B) విద్యుత్ బంధకం

మీకు తెలుసా?

మనం తయారు చేసిన టెస్టర్ లో బల్బ్ కు బదులు LED ఎందుకు వాడాం?
AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత 3

వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహం ఉన్నా కూడా LED వెలుగుతుంది. కాబట్టి వలయంలో కొద్ది పాటి విద్యుత్ ప్రవాహాల ఉనికిని తెలుసుకొనుటకు LED సహాయపడుతుంది.

ఇలా ఇవి తక్కువ విద్యుత్ ప్రవాహానికే వెలుగుతాయి, కాబట్టి మొబైల్ ఫోన్, టి.వి., ట్రాన్స్ఫ ర్మర్ వంటి పరికరాలు పని చేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి LED లను “సూచిక/ టెస్టర్”గా వాడతాం

LED లో రెండు తీగలు (Leads) ఉంటాయి. పటంలో చూపినట్లు వాటిలో ఒక తీగ కొంచెం పొడవుగా ఉంటుంది.

(LEDని వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగను బ్యాటరీ ధనధ్రువానికి, పొట్టి తీగను బ్యాటరీ రుణధ్రువానికి కలపాలి.)

విద్యుత్ ఘటంను మొదట ఎలా తయారు చేశారు?

400 సంవత్సరాల క్రితమే ఐరోపావారు విద్యుత్ పై వివిధ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. వారు వివిధ పద్ధతులలో విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. విద్యుత్ ను గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నిలకడగా, శాశ్వతంగా విద్యుత్ ను ఉత్పత్తి చేసే విద్యుత్ జనకం లేకపోవడమనేది వారికి అవరోధంగా మారింది. ఇది మనకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కాని దీనికొక తరునోపాయం కనుగొనడానికి శాస్త్రవేత్తలకు దాదాపు 200 సంవత్సరాలు పట్టింది.

1780వ సంవత్సరంలో అనుకోకుండా దీనికొక మార్గం దొరికింది. ఇటలీ దేశపు ‘బోలోనా’ ప్రాంత వాసియైన లూయీ గాల ్వనీ అనబడే జీవశాస్త్రవేత్త రాగికొక్కానికి వేలాడదీసిన చనిపోయిన కప్ప కాలు వేరొక లోహానికి తగిలినప్పుడు బాగా వణకి కడం గమనించాడు. అది కప్పకు తిరిగి జీవం వచ్చిందని తలపించేదిగా ఉండింది.

తర్వాత గాల్వాని చనిపోయిన కప్ప కాళ్ళతో అనేక ప్రయోగాలు చేశాడు. విద్యుత్ ప్రవాహం వలననే ఆ కప్పకాలు వణికిందనే నిర్ణయానికొచ్చాడు. తద్వారా ఆయన “జీవ విద్యుత్”ను కనుగొన్నానని భావించాడు. అందువల్ల ప్రతిజీవి విద్యుత్ ను కలిగి ఉంటుందని దానిలోని. జీవానికి ఈ విద్యుత్ కారణమని సిద్ధాంతాన్ని రూపొందించాడు.

గాల్వాని ప్రయోగం వల్ల చాలా మంది ఐరోపా శాస్త్రవేత్తలు వివిధ జంతువులతో ప్రయోగాలు నిర్వహించడం మొదలుపెట్టారు. వారిలో ఇటలీ దేశానికి చెందిన అలెసాండ్రో ఓల్టా ఒకరు. ఇతను కూడా కప్ప కాళ్ళతోనే ప్రయోగాలు చేశాడు. ఈయన తన ప్రయోగాల ద్వారా ఇనుప కొక్కానికి వేలాడదీసిన కప్పకాలు ఇనుపకడ్డీకి తగిలితే అది వణకడం లేదని గుర్తించాడు.

వేలాడదీసిన కప్ప యొక్క కాలు వణకడమనేది దాని శరీరంలోని విద్యుత్ వలననే జరుగుతుందనుకుంటే, మరి రెండు వేర్వేరు లోహాలను తీసుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుండడం అతనికి సందేహాన్ని కలిగించింది. వానిని బట్టి కప్పకాలు వణకడమనేది దానిలోని విద్యుత్ వల్ల కాదని, దానికి వేరే కారణమేదో ఉండవచ్చని భావించాడు.

AP 8th Class Physical Science Important Questions 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత

తర్వాత కప్పకాళ్ళకు బదులుగా వివిధ ద్రవాలను తీసుకొని ఓల్టా ప్రయోగాలు నిర్వహించాడు. ఆ ప్రయోగాల వల్ల విద్యుత్ ఉత్పత్తి కొరకు జీవుల శరీరాలు అవసరం లేదని తెలుసుకున్నాడు. ఏవైనా రెండు వేర్వేరు లోహాలను ఒక ద్రవంలో ఉంచి విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నాడు.

ఈ ప్రయోగాలు నిలకడగా విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాధనాన్ని తయారుచేయడానికి తోడ్పడ్డాయి. ఓల్టా 1800 సంవత్సరంలో రాగి, జింక్ పలకలను సల్ఫ్యూరికామ్లంలో ఉంచి ‘సెల్’ను తయారుచేశాడు. ఆయన గౌరవార్థం ఆ. సెల్ ను ఓల్టా సెల్ (ఓలాఘటం) అంటాం. ‘ఓల్టేజ్’ అనే పదం కూడా ఆయన పేరు నుంచే వచ్చింది.