AP 8th Class Physical Science Notes 2nd Lesson ఘర్షణ

Students can go through AP Board 8th Class Physical Science Notes 2nd Lesson ఘర్షణ to understand and remember the concept easily.

AP Board 8th Class Physical Science Notes 2nd Lesson ఘర్షణ

→ స్పర్శలో గల రెండు తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలమే ఘర్షణ. ఇది రెండు తలాల పైన పనిచేస్తుంది.

→ స్పర్శలో రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చలస్థితిలో ఉంటే వాటి మధ్య ఉండే ఘర్షణను “స్టైతిక ఘర్షణ” అంటారు.

→ ఒక వస్తు తలం పరంగా, రెండవ వస్తుతలం సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు.

→ తలాల స్వభావంపై మరియు తలాల మధ్య గల అభిలంబ బలంపై ఘర్షణ ఆధారపడి ఉండును.

→ తలాల స్పర్శావైశాల్యంపై ఘర్షణ ఆధారపడదు.

→ ఘర్షణను తగ్గించడానికి కందెనలు, బాల్ బేరింగ్లు వాడుతారు.

→ వస్తువులు ప్రవాహుల్లో చలించేటప్పుడు అవి కలుగజేసే నిరోధక బలాన్నే “ప్రవాహి ఘర్షణ” అంటారు.

→ వస్తువులు ప్రయాణించే దూరాలను వస్తువు, నేల తలాల గరుకుదనాలు ప్రభావితం చేస్తాయి.

→ తలాల్లో గల చిన్న చిన్న ఎగుడు దిగుడుల్ని గరుకుతనం అంటారు.

→ స్ప్రింగ్ లో వచ్చే సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉండును.

→ ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.

AP 7th Class Physical Science Notes 2nd Lesson ఘర్షణ

→ ఘర్షణ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది.

→ ఒక వస్తువు, రెండవ వస్తుతలంపై దొర్లేటప్పుడు వాటి మధ్య గల ఘర్షణను దొర్లుడు ఘర్షణ అంటారు.

→ యంత్రాలలో భ్రమణంలో గల ఇనుపరాడ్ల మధ్య ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్ లను ఉపయోగిస్తారు.

→ వాయువులను మరియు ద్రవాలను కలిపి ప్రవాహులు అంటారు.

→ ప్రవాహులు వస్తువుల పై కలుగజేసే బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటారు.

→ ప్రవాహి ఘర్షణ వస్తువు వడి పై, వస్తువు ఆకారంపై మరియు స్వభావంపై ఆధారపడును.

→ ఘర్షణ : స్పర్శలో ఉన్న రెండు వస్తుతలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్ని “ఘర్షణ” అని అంటారు.

→ సైతిక ఘర్షణ : స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చలస్థితిలో ఉంటే, ఆ తలాల మధ్య గల ఘర్షణను “సైతిక ఘర్షణ” అంటారు.

→ జారుడు ఘర్షణ : ఒక వస్తుతలం, రెండవ వస్తుతల పరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్యగల ఘర్షణను “జారుడు ఘర్షణ” అంటారు.

→ దొర్లుడు ఘర్షణ : ఒక వస్తువు, రెండవ వస్తుతలం పై దొర్లేటప్పుడు, వాటి మధ్యగల ఘర్షణను “దొర్లుడు ఘర్షణ” అంటారు.

AP 7th Class Physical Science Notes 2nd Lesson ఘర్షణ

→ కందెనలు : యంత్రభాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి వాడే పదార్థాలను కందెనలు లేదా లూబ్రికెంట్స్ అంటారు.

→ బాల్ బేరింగ్లు : యంత్రాలలో భ్రమణంలో గల ఇనుపరాడ్ల, చక్రాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగించే వాటిని బాల్ బేరింగ్లు అంటారు.

→ ప్రవాహులు : వాయువులను మరియు ద్రవాలను కలిపి ప్రవాహులు అంటారు.

→ ప్రవాహి ఘర్షణ : ప్రవాహులు వస్తువుల పై కలుగజేసే బలాన్ని “ప్రవాహి ఘర్షణ” అంటారు.

→ డ్రాగ్ : ప్రవాహి ఘర్షణను “డ్రాగ్” అంటారు.

→ గరుకుతనం : వస్తువు తలాల్లో గల చిన్న చిన్న ఎగుడుదిగుడుల్ని గరుకుతనం అంటారు.

→ త్వరణం : సరళరేఖా మార్గంలో చలించే వస్తువు వడి మారుతూ ఉంటే ఆ వస్తువు త్వరణాన్ని పొందింది అంటారు.

AP 7th Class Physical Science Notes 2nd Lesson ఘర్షణ 1