AP 8th Class Physical Science Notes 1st Lesson బలం

Students can go through AP Board 8th Class Physical Science Notes 1st Lesson బలం to understand and remember the concept easily.

AP Board 8th Class Physical Science Notes 1st Lesson బలం

→ నెట్టుట, లాగుట, ఏరడం, తవ్వడం, మెలితిప్పడం, సాగదీయడం వంటి చర్యలను బలం అంటారు.

→ బలాలు రెండు రకాలు. అవి 1) స్పర్శా బలాలు, 2) క్షేత్ర బలాలు.

→ ఒక బలం వస్తువుతో స్పర్శలో ఉన్నా, లేకున్నా పనిచేయగలదు. వస్తువు పై పనిచేసే బలం స్పర్శాబలం కావచ్చు లేదా క్షేత్రబలం కావచ్చును.

→ రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శా బలాలు అంటారు.

→ కండర బలం, ఘర్షణ బలం, అభిలంబ బలం మరియు తన్యతా బలం మొదలగునవి స్పర్శా బలాలు.

→ రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం అంటారు.

→ అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం మరియు గురుత్వాకర్షణ బలాలు క్షేత్రబలాలు.

→ క్షేత్రం ఒక ప్రభావ ప్రాంతం. వస్తువును క్షేత్రంలో ఎక్కడ ఉంచినా దానిపై బలం ప్రయోగించబడుతుంది.

→ శరీర కండరాలనుపయోగించి ప్రయోగించే బలాన్ని కండర బలం అంటారు.

→ ఘర్షణ స్పర్శలో ఉన్న తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది.

AP 7th Class Physical Science Notes 1st Lesson బలం

→ నిశ్చల స్థితిలో ఉన్న వస్తువును చలనంలోకి మార్చుటకు, చలనంలో ఉన్న వస్తువు యొక్క వడిని మార్చుటకు, చలనంలో ఉన్న వస్తువును నిశ్చలస్థితిలోకి మార్చుటకు, చలనంలో ఉన్న వస్తువు యొక్క దిశను మార్చుటకు మరియు వస్తువు యొక్క ఆకృతిని, పరిమాణాన్ని మార్చుటకు బలం ఉపయోగపడుతుంది.

→ ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో (అభిలంబంగా) కలుగజేసే బలాన్ని ‘అభిలంబ బలం’ అంటాం. ఈ తాడు లేదా దారంలో గల బిగుసుదనాన్ని తన్యతా బలం అంటాం.

→ అయస్కాంత బలం ఇనుము వంటి అయస్కాంత పదార్థాలను ఆకర్షిస్తుంది. అలాగే వేరొక అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది లేదా వికర్షిస్తుంది.

→ ఒక విద్యుదావేశపూరిత వస్తువు వేరొక ఆవేశ లేదా ఆవేశరహిత వస్తువులపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు.

→ ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా గల ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు.

→ బలానికి దిశ, పరిమాణం రెండూ ఉంటాయి.

→ ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.

→ ఒక వస్తువు అసమ చలనంలో ఉంటే అది త్వరణాన్ని పొందింది అంటాం.

→ నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన పటాన్ని స్వేచ్ఛా వస్తు పటం అంటాం. దీన్ని క్లుప్తంగా FBD తో సూచిస్తాం.

→ ప్రమాణ వైశాల్యంగల తలానికి లంబంగా కలుగచేసే బలాన్ని పీడనం అంటారు.

→ పీడనం యొక్క SI ప్రమాణం = న్యూటన్ / (మీటరు)² = N/m².

→ బలం ప్రయోగింపబడిన ఉపరితల వైశాల్యం తక్కువైతే పీడనం ఎక్కువగా ఉంటుంది. ఉపరితల వైశాల్యం ఎక్కువైతే పీడనం తగ్గుతుంది.

→ ఘర్షణ దిశ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తువు చలన దిశకు వ్యతిరేకదిశలో ఉంటుంది.

AP 7th Class Physical Science Notes 1st Lesson బలం

→ బలం : వస్తువుల నిశ్చలస్థితినిగాని, సమవేగంతో ఋజుమార్గంలో పోయే స్థితినిగాని మార్చేది లేక మార్చడానికి ప్రయత్నించే దాన్ని బలం అంటారు.

→ స్పర్శాబలం : రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం ద్వారా పనిచేసే బలాలను స్పర్శాబలం అంటారు.

→ క్షేత్రబలం : రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్రబలం అంటారు.

→ క్షేత్రం : క్షేత్రబలం ప్రదర్శించే వస్తువు. దాని త్ర బల ప్రభావము దాని కుట్టూ ఎంత మేరకు గలదో ఆ ప్రదేశాన్ని దాని క్షేత్రం అంటారు.

→ అభిలంబ బలము : ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబదిశలో (అభిలంబంగా) కలుగజేసే బలాన్ని అభిలంబ బలం అంటారు.

→ తన్యతా బలం : తాడు లేదా దారంలో బిగుసుదనాన్ని తన్యతా బలం అంటారు.

→ అయస్కాంత బలం : రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు.

→ స్థావర విద్యుత్ బలం : ఒక ఆవేశ వస్తువు, వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువు పై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు.

→ గురుత్వాకర్షణ బలం : ఒక వస్తువు పై భూమికి గల ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు.

→ స్వేచ్ఛావస్తుపటం : నిర్దిష్ట సమయం వద్ద ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాలను చూపుతూ గీసిన (Free Body Diagram) పటాన్ని స్వేచ్ఛావస్తుపటం అంటారు.

→ పీడనం : ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని పీడనం అంటారు.

→ ఘర్షణ బలం : ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలం పై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించే బలాన్ని ఘర్షణ బలం అంటారు.

→ కండర బలం : శరీర కండరాలనుపయోగించి ప్రయోగించే బలాన్ని కండర బలం అంటారు.

AP 7th Class Physical Science Notes 1st Lesson బలం

→ ఫలిత బలం : ఒక వస్తువు పై పనిచేసే అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటారు.

→ సమతాస్థితి : ఒక వస్తువు పై పనిచేసే ఫలితబలం శూన్యమైతే ఆ వస్తువు సమతాస్థితిలో ఉంది అంటారు.

→ గమన స్థితి : ఒక వస్తువు పై బలాన్ని ప్రయోగించడం వల్ల ఆ వస్తువు గమనంలో ఉంటే దానిని గమనస్థితి అంటారు.

→ నెట్టుట : ఒక వ్యక్తి ఒక వస్తువు పై బలాన్ని ప్రయోగించి తనకు దూరంగా కదిలేటట్లు చేయుటను నెట్టుట అంటారు.

→ లాగుట : ఒక వ్యక్తి ఒక వస్తువు పై బలాన్ని ప్రయోగించి తనకు దగ్గరగా కదిలేటట్లు చేయుటను లాగుట అంటారు.

AP 7th Class Physical Science Notes 1st Lesson బలం 1