Students can go through AP Board 8th Class Physical Science Notes 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 4th Lesson కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు
→ నూలు, సిల్క్, ఉన్ని వంటివి సహజ దారాలు.
→ పాలిస్టర్, నైలాన్, రేయాన్, మరియు అక్రలిక్ వంటివి కృత్రిమ దారాలు.
→ కృత్రిమ దారాలు పాలిమర్లు అనబడే పెద్ద యూనిట్లతో నిర్మింపబడతాయి.
→ రేయాన్, సెల్యులోజ్ తో తయారుచేయబడ్డ ఒక కృత్రిమ పట్టుదారం.
→ నేలబొగ్గు, నీరు మరియు గాలి ముఖ్య పదార్థాలుగా వాడి నైలాన్ ను కృత్రిమంగా తయారుచేస్తారు.
→ అక్రలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, మరియు సున్నపురాయి నుండి తయారయ్యే కృత్రిమ ఉన్ని.
→ కృత్రిమ దారాలను తయారుచేయడానికి పెట్రో రసాయనాలను వాడతారు.
→ గతంలో చాలా వస్తువుల తయారీకి వాడే లోహాలు, కలప స్థానంలో ఇప్పుడు ప్లాస్టిక్ లను వాడుతున్నారు.
→ అలెగ్జాండర్ పార్క్స్ మొదటి మానవ నిర్మిత ప్లాస్టిక్ సృష్టించాడు.
→ ప్లాస్టిక్ పదార్థాలు సులభంగా క్షయమవడం జరగదు మరియు చర్యాశీలత లేనివి కావున రసాయనాలతో పాటు, రకరకాల పదార్థాలు భద్రపరచుకోవడానికి వాడే పరికరాలను ప్లాస్టిక్ తో తయారుచేస్తారు.
→ ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది మరియు విభిన్న పరిమాణాలలో, విభిన్న రూపాలలోకి మలచగలిగేదిగా ఉంటుంది.
→ ప్లాస్టిక్లు జీవ విచ్ఛినం చెందనివి. ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి.
→ కృత్రిమ దారాలు, ప్లాస్టిక్ మంచి లక్షణాలను ఉపయోగించుకుంటూ వాటి విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించుకొని పర్యావరణ అపాయాలు జరగకుండా చూడాలి.
→ కృత్రిమ దారాలను గృహసామగ్రి నుండి ఆరోగ్య సంరక్షణ వరకు ఉపయోగిస్తున్నారు.
→ కృత్రిమ దారాలను సహజ దారాలతోను మరియు కృత్రిమ దారాలతోను మిశ్రణం చేయవచ్చును.
→ ప్లాస్టికు రెండు రకాలు. 1) థర్మో ప్లాస్టికు 2) థర్మోసెట్టింగ్ ప్లాస్టికు.
→ ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు డాక్టర్ లియో హెండ్రిక్ బే లాండ్.
→ బేకలైట్, మెలమిన్లు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ లు.
ప్లాస్టిక్ లో మోనోమర్లు రెండు రకాలుగా అమర్చబడి ఉంటాయి.
- రేఖీయంగా పొడవాటి గొలుసులు (Linear Chains)
- అడ్డంగా అనుసంధానించబడిన అమరికలోను (Cross linked) అమర్చబడి ఉంటాయి.
→ సహజ దారాలు : మొక్కల నుండి గానీ, జంతువుల నుండి గానీ పొందే దారాలను సహజ దారాలు అంటారు. ఉదా: నూలు, సిల్క్, ఉన్ని.
→ కృత్రిమ దారాలు : పెట్రో రసాయనాల నుండి తయారయ్యే దారాలను కృత్రిమ దారాలు అంటారు.
→ పాలిమర్ : ఒకే విధమైన చిన్న చిన్న అణువులన్నీ కలిసి ఏర్పడే పెద్ద అణువును పాలిమర్ అంటారు.
→ నైలాన్ : నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారుచేయబడిన కృత్రిమ దారాన్ని నైలాన్ అంటారు.
→ స్పిన్నరెట్ (Spinneret) : అతి చిన్న రంధ్రాలు కలిగిన లోహపు పళ్ళెం నుండి పాలిఎమైయ్ ఘనపు ముక్కలను కరిగించి తోయడం.
→ రేయాన్ మిశ్రణం (Blend) : సెల్యులోజ్ తయారు చేయబడిన కృత్రిమ పట్టుదారాన్ని రేయాన్ అంటారు. ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం అంటారు.
→ అక్టోలిక్ : నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపురాయిల నుండి తయారుచేసిన దారాన్ని అక్రలిక్ అంటారు.
→ టెరికాట్ : టెర్లిన్ ను నూలుతో మిశ్రణం చెందించగా ఏర్పడే దానిని టెరికాట్ అంటారు.
→ టెరిసిల్క్ : టెర్లిన్ ను సిల్క్ తో మిశ్రణం చెందించుటను టెరిసిల్క్ అంటారు.
→ టెరిఊల్ : టెర్లిన్ ను ఊ లో మిశ్రణం చెందించుటను టెరిఊల్ అంటారు.
→ PET : పాలీఎథిలీన్ టెరిప్తాలేట్
→ HDPE : అధిక సాంద్రత గల పాలీ ఎథిలీన్
→ PVC : పాలీ వినైల్ క్లోరైడ్
→ PP : పాలీ ప్రొపిలీన్
→ LDPE : అల్పసాంద్రతగల పాలీ ఎథిలీన్
→ PS : పాలీ స్టెరీన్
→ థర్మోప్లాస్టిక్ : వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్ లను థర్మోప్లాస్టిక్ కు’ అంటారు.
→ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ : ప్లాస్టిక్ లను ఒకసారి మలచిన తర్వాత వేడిచేయుట ద్వారా మృదువుగా మార్చలేక పోతే అటువంటి ప్లాస్టిక్ లను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కంటారు.
→ రీసైక్లింగ్ : విరిగిపోయిన, వాడలేని, పాతబడిన ప్లాస్టిక్ ను వివిధ పద్ధతులలో శుభ్రపరచి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయుటను రీసైక్లింగ్ అంటారు.
→ యూనివర్సల్ రీసైక్లింగ్ గుర్తు : ఒకదాని వెనుక ఒకటిగా ఉండే మూడు బాణం గుర్తులుంటాయి. ఆ బాణం గుర్తుల మధ్యలో ఏ సంఖ్యా లేకపోతే దానిని యూనివర్సల్ రీసైక్లింగ్ గుర్తు అంటారు.
→ 4Rల సూత్రం : ప్లాస్టిక్ ను తగ్గించడం, రీసైకిల్ చేయడం, తిరిగివాడటం, తిరిగి పొందడంలను 4Rల సూత్రం అంటారు. (Reduce, Recycle, Reuse, Recover)
→ జీవ విచ్ఛిన్నం చెందేవి (Bio-degradable) : సహజ ప్రక్రియ ద్వారా పదార్థాలు సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాలను జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు అంటారు.
→ జీవ విచ్ఛిన్నం చెందనివి : సహజ ప్రక్రియ ద్వారా వియోగం చెందకపోతే వానిని జీవ విచ్చిన్నం చెందని పదార్థాలు అంటారు.
→ పాలిథీన్ : పాలిథీన్ ఒక ప్లాస్టిక్ పదార్థం.
→ పాలిఎమైడ్ : పాలిఎమైడ్ అనేది కార్బన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ యొక్క సమ్మేళనం.
→ పెట్రో రసాయనాలు : పెట్రోలియం సంబంధ రసాయనాలు.
→ పాలిస్టర్ : డై మిథైల్ ఈథర్, టెరిఫాలిక్ ఆమ్లం చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నాన్ని డై హైడ్రిక్ ఆల్కహాల్ లో చర్య నొందించి పాలిస్టర్‌ను తయారుచేస్తారు.
→ ప్లాస్టిక్ : ప్లాస్టిక్ అనేది ఒక పాలిమర్.