Students can go through AP Board 8th Class Physical Science Notes 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం
→ సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగియుండి, స్థలాన్ని ఆక్రమించే దేనినైనా ‘పదార్థం’ గా చెప్పవచ్చు.
→ పదార్థం మన ఊహకందనంత చిన్న చిన్న కణాలచే నిర్మించబడింది.
→ పదార్థం ఘన, ద్రవ, వాయుస్థితులనే మూడు స్థితులలో ఉంటుంది.
→ ఘన, ద్రవ, వాయుపదార్థాలు వాటి వాటి ధర్మాలలో విభేదిస్తాయి.
→ ద్రవ, వాయుపదార్థాలలోని కణాలు నిరంతరం చలిస్తూ ఉంటాయి. దీనినే ‘వ్యాపనం’ అంటారు.
→ పదార్ధంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది.
→ వాయు పదార్థాల వ్యాపన రేటు ద్రవ, ఘన పదార్థాల కంటే ఎక్కువ.
→ ఒక ఘన పదార్థాన్ని, ద్రవ పదార్థానికి కలిపినపుడు ద్రవ పదార్థంలోని కణాల మధ్యనున్న ఖాళీ స్థలాన్ని ఘన పదార్థ కణాలు ఆక్రమించడాన్ని ‘కరుగుట’ అంటారు.
→ పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తి వల్ల కణాలన్నీ దగ్గరగా బంధించబడి ఉంటాయి.
→ కణాల మధ్యనున్న ఆకర్షణ బలం ఘనపదార్థాలలో ఎక్కువగాను, వాయువులలో తక్కువగాను, ద్రవపదార్థాలలో మధ్యస్థంగాను ఉంటుంది.
→ ఘన పదార్థాలలో కణాలు దగ్గర దగ్గరగా ఉండి ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. వాయువులలో కణాలు స్వేచ్ఛగా చలిస్తుంటాయి. పదార్థాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చవచ్చు. స్థితి మార్పు పీడనం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది.
→ ఘన పదార్థాలు ద్రవ పదార్థాలుగా మారే ఉష్ణోగ్రతనే ద్రవీభవన స్థానం అంటారు.
→ ద్రవీభవించే ప్రక్రియను ‘విలీనం’ అంటారు.
→ ఒక పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి కావలసిన అదనపు శక్తిని ఆ పదార్థపు ‘గుప్తోష్ణం’ అంటారు.
→ వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ‘మరుగు స్థానం’ అంటారు.
→ ఏదేని ద్రవం దాని మరుగు స్థానం కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ‘ఇగురుట’ అంటారు.
→ ఇగురుట అనేది ఉపరితల దృగ్విషయం. ద్రవాలను వేడిచేసినపుడు ద్రవం ఉపరితలంలోని కణాలు శక్తిని పొందటం చేత అవి కణాల మధ్య గల ఆకర్షణ బలాలను అధిగమించి బాష్పస్థితిలోకి మారతాయి.
→ ఇగిరే ప్రక్రియపై ఉపరితల వైశాల్యం, గాలివేగం, ఆర్ధతలు ప్రభావాన్ని చూపుతాయి.
→ గాలిలో ఉండే తేమ శాతాన్ని ఆర్ధత అంటారు.
→ నీరు మరగటం అనేది పదార్థం మొత్తంగా జరిగే దృగ్విషయం. ద్రవాలను వేడిచేసినపుడు దానిలో కణాలు మొత్తం బాష్పంగా మారుతుంటాయి.
→ పదార్థము : సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగియుండి, స్థలాన్ని ఆక్రమించే దేనినైనా పదార్థంగా చెప్పవచ్చు.
→ పదార్థ స్థితి : పదార్థము ఘన, ద్రవ, వాయుపదార్థాలనే మూడు స్థితులలో ఉండును. ఈ మూడూ / వాటి ధర్మాలలో విభేదిస్తాయి.
→ ఘనపదార్థం : ఘనపదార్థాలు నిర్దిష్టమైన ఆకారాన్ని, ఘనపరిమాణాన్ని కలిగియుంటాయి.
→ ద్రవపదార్థం : ద్రవాలకు నిర్దిష్ట ఆకారం ఉండదు. ద్రవాల ఆకారం ఎల్లప్పుడు వాటిని నిల్వ చేసిన పాత్రల ఆకారం పై ఆధారపడి ఉంటుంది. ద్రవాలు ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి సులభంగా ప్రవహిస్తాయి. అందువల్ల వీటిని ‘ప్రవాహులు’ అంటారు. ఉదా: నీరు, పాలు మొ||వి.
వాయుపదార్థాలు : వాయువులకు నిర్దిష్ట ఆకారం, ఘనపరిమాణం ఉండవు.
ఉదా: గాలి, CNG మొ||వి.
→ కణం : పదార్థం కణాలచే నిర్మించబడింది. పదార్థంలోని అతి చిన్న భాగమే కణము.
→ వ్యాపనం : పదార్థంలో కణాలు నిరంతరం ద్రవ, వాయు పదార్థాలలోనికి చలిస్తాయి. ఈ చలనాన్నే ‘వ్యాపనం’ అంటారు.
→ సంపీడ్యత : ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువుని సంపీడ్యం చెందించి, తక్కువ పరిమాణం గల సిలిండర్లలో నింపి ఎక్కడికైనా సులభంగా తీసుకొని వెళ్ళగలుగుతున్నాం.
→ బాష్పీభవనం : నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు.
→ నీటి బాష్పం : నీటి ఆవిరి.
→ కణాల మధ్య స్థలం : పదార్థంలోని కణాల మధ్య ఖాళీ స్థలం ఉంటుంది. ఈ ఖాళీ వాయు పదార్థాలలో ఎక్కువగాను, ద్రవ పదార్థాలలో కొంచెం తక్కువగాను, ఘన పదార్థాలలో చాలా
తక్కువగాను ఉంటుంది.
→ కణాల మధ్య ఆకర్షణ బలాలు : కణాల మధ్య ఆకర్షణ ఘన పదార్థాలలో ఎక్కువగాను, వాయువులలో తక్కువగాను, ద్రవ పదార్థాలలో మధ్యస్థంగాను ఉంటుంది.
→ ఇగురుట : మరుగు స్థానం కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవాలు బాష్పంగా మారగలిగే దృగ్విషయాన్ని ‘ఇగురుట’ అంటారు.
→ సంపీడిత సహజ వాయువు (CNG) : అధిక ఘనపరిమాణం కలిగిన సహజ వాయువును సంపీడనం చెందించి, చిన్న చిన్న సిలిండర్లలో నింపడం ద్వారా మోటారు వాహనాలలో పాడుటకు అనుకూలంగా తయారు చేస్తారు.
→ కరగటం : ఘన పదార్థాలను ద్రవాలలో కరిగించినపుడు ఘన పదార్థాల కణాలు ద్రవాలలోని . కణాల మధ్య గల స్థలంలోకి చేరతాయి. దీనినే ‘కరగటం’ అంటారు.
→ థర్మా మీటర్ : ఒక పదార్ధము యొక్క లేదా మన శరీరము యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి వాడే పరికరమే ‘థర్మామీటరు’.
→ ద్రవీభవన స్థానం : ఘనపదార్థాలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రవపదార్థాలుగా మారుతాయి. ఘనపదార్థాలు ‘ద్రవాలుగా మారే ఈ ఉష్ణోగ్రతనే ‘ద్రవీభవన స్థానం’ అంటారు.
→ విలీనం : ద్రవీభవించే ప్రక్రియను ‘విలీనం’ అంటారు.
→ మరుగు స్థానం : వాతావరణ పీడనం వద్ద ద్రవాలు బాష్పంగా మారే ఉష్ణోగ్రతను ‘మరుగు స్థానం’ అంటారు.
→ ఉత్పతనం : కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి, అదే విధంగా తిరిగి వాయుస్థితి నుండి ఘనస్థితికి మధ్యలో ద్రవస్థితికి చేరకుండానే మారతాయి. ఇలా మారడాన్నే ‘ఉత్పతనం’ అంటారు.
→ గుప్తోష్ణం : ఒక పదార్థంలోని కణాల మధ్య ఆకర్షణను అధిగమించడానికి కావలసిన అదనపు శక్తిని ఆ పదార్థపు ‘గుప్తోష్ణం’ అంటారు.
→ ఆర్ధత : గాలిలో ఉండే తేమ శాతాన్ని ‘ఆర్థత’ అంటారు.
→ ఇరుగుట : ఏదేని ద్రవం దాని మరుగుస్థానం కన్నా దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా భాష్పంగా . మారగలిగే దృగ్విషయాన్నీ ‘ఇరుగుట’ అంటారు.