AP 8th Class Physical Science Notes 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

Students can go through AP Board 8th Class Physical Science Notes 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ to understand and remember the concept easily.

AP Board 8th Class Physical Science Notes 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

→ సహజ వనరులను తరిగిపోయే శక్తి వనరులు, తరగని శక్తి వనరులుగా వర్గీకరించవచ్చును.

→ ప్రాణుల యొక్క మృత అవశేషాలు కొన్ని వేల సంవత్సరాలపాటు భూమి లోపల కప్పబడి ఉండి అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనవుట వలన శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి.

→ బొగ్గు, పెట్రోలియం మరియు సహజవాయువులు శిలాజ ఇంధనాలు.

→ చమురు పరిశ్రమలలో చమురు ఘనపరిమాణాన్ని “బారెల్”లలో కొలుస్తారు.

→ కోక్, కోల్ తారు మరియు కోల్ గ్యాస్లు బొగ్గు యొక్క ఉత్పన్నాలు.

→ ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాల నుండి పెట్రోలియం తయారవుతుంది.

→ పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పారఫిన్ మైనం, కందెనలు మొదలగునవి పెట్రోలియంను శుద్ధి చేయడం వలన పొందుతాము.

→ పెట్రోలియం నుండి గ్రహించబడిన ఉపయోగకరమైన పదార్థాలను పెట్రో రసాయనాలు అంటారు.

→ శిలాజ ఇంధనాల అతి వినియోగం గాలి కాలుష్యం, గ్రీన్ హౌజ్ ప్రభావం, భూతాపం వంటి సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

→ బయోడీజిల్‌ను వృక్ష తైలాలు లేదా జంతువుల క్రొవ్వుల నుండి తయారుచేస్తారు.

AP 8th Class Physical Science Notes 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

→ నేలబొగ్గు ప్రధానంగా ‘కార్బనను కలిగి ఉంటుంది.

→ పెట్రోలియం ప్రధానంగా హైడ్రోకార్బన్ సమ్మేళనాల మిశ్రమాలను కలిగి ఉంటాయి.

→ సి.యన్.జి మరియు సహజ వాయువులు పర్యావరణానికి సురక్షితమైన ఇంధనంగా ఉపయోగపడును.

→ నేలబొగ్గు నుండి కోక్ ను పొందే ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.

→ 1 బారెల్ = 159 లీటర్లకు సమానము.

→ నేల, నీరు, గాలి, పెట్రో వంటి వాటిని సహజ వనరులు అంటారు.

→ సహజవనరులు : ప్రకృతిలోని వివిధ వనరుల నుండి ఉత్పన్నమైన పదార్థాలను సహజవనరులు అంటారు.
ఉదా : నేల, నీరు, గాలి, మొదలగునవి.

→ పదార్థ శాస్త్రం : పదార్థాల గురించి వివరించే విజ్ఞానశాస్త్ర శాఖను పదార్థ శాస్త్రం అంటారు.

→ తరగని శక్తి వనరులు : శక్తి వనరులను ఎంత ఉపయోగించిన, ఎన్నటికీ తరిగిపోని శక్తి వనరులను తరగని శక్తి వనరులు అంటారు.

AP 8th Class Physical Science Notes 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

→ తరిగిపోయే శక్తి వనరులు : శక్తి వనరులను నిరంతరం వినియోగించడం వలన తరిగిపోతాయి. వాటిని తిరిగి ఉత్పత్తి చేయలేని వాటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు.

→ బారెల్ : 159 లీటర్ల ఘనపరిమాణాన్ని బారెల్ అంటారు.

→ పెట్రోలియం : ద్రవ స్థితిలో ముడిచమురు ఉండే శిలాజ ఇంధనాన్ని పెట్రోలియం అంటారు.

→ నేలబొగ్గు : ఘనస్థితిలో ఉండే శిలాజ ఇంధనాన్ని నేలబొగ్గు అంటారు.

→ సహజ వాయువు : వాయుస్థితిలో ఉండే శిలాజ ఇంధనాన్ని సహజవాయువు అంటారు.

→ సంపీడిత సహజవాయువు (సి.యన్.జి వాయువు) : అత్యధిక పీడనాల వద్ద సంపీడనం చెందించిన సహజవాయువును సి.యన్.జి. వాయువు అంటారు.

→ కోక్ : నేలబొగ్గును స్వేదనము లేక ఉష్ణ విశ్లేషణము చేసినపుడు ఏర్పడు దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థమును కోక్ అంటారు.

→ కోతారు : నేలబొగ్గును స్వేదనము చేసినపుడు ఏర్పడు దుర్వాసన కల నల్లటి చిక్కని ద్రవాన్ని కోతారు అంటారు.

→ కోల్ గ్యాస్ : నేలబొగ్గును స్వేదనము చేసినపుడు ఏర్పడు వాయువును కోల్ గ్యాస్ అంటారు.

→ ప్లాంక్టన్ : ప్లాంక్టన్ అనేది సూక్ష్మజీవి. ప్లాంక్టన్ సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరలలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా రూపాంతరం చెందును.

AP 8th Class Physical Science Notes 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్

→ కార్బోనైజేషన్ : భూమిలో గల జీవ పదార్థం నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను కార్బోనైజేషన్ అంటారు.

→ పెట్రో రసాయనాలు : పెట్రోలియం మరియు సహజ వాయువుల నుండి పొందే ఉపయుక్తకరమైన పదార్థాలను పెట్రో రసాయనాలు అంటారు.

→ అంశిక స్వేదనము : ఒక సంక్లిష్ట మిశ్రమమును బాష్పీభవన ఉష్ణోగ్రతల ఆధారంగా స్వేదనము ద్వారా వేరుచేయడాన్ని అంశిక స్వేదనము అంటారు.

→ శిలాజ ఇంధనాలు : ప్రాణుల యొక్క మృత అవశేషాలు కొన్ని వేల సంవత్సరాలపాటు భూమి లోపల కప్పబడి ఉండి అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద కార్బోనైజేషన్ జరిగి ఏర్పడే ఇంధనాలను శిలాజ ఇంధనాలు అంటారు.

→ భూతాపం (గ్లోబల్ వార్మింగ్) : ఇంధనాలను మండించడం వలన విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్, వాతావరణంలో మార్పులకు భూమి వేడెక్కుటను భూతాపం అంటారు.

AP 8th Class Physical Science Notes 7th Lesson నేలబొగ్గు మరియు పెట్రోలియమ్ 1