Students can go through AP Board 8th Class Physical Science Notes 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 8th Lesson దహనం, ఇంధనాలు మరియు మంట
→ ఒక పదార్థాన్ని గాలిలో (ఆక్సిజన్లో) మండించడాన్ని దహనం అంటారు.
→ దహన చర్యకు ఆక్సిజన్ అవసరము.
→ పదార్థాలను గాలిలో మండించినపుడు ఉష్ణం, కాంతిని విడుదల చేస్తాయి.
→ మంట దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మండే గుణం గల పదార్థాలను దహనశీల పదార్థాలు అంటారు.
→ మంట దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మండని గుణం గల పదార్థాలను దహనశీలికాని పదార్థాలు అంటారు.
→ ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను “జ్వలన ఉష్ణోగ్రత” అంటారు.
→ ఒకసారి పదార్థం మండటం ప్రారంభించి తర్వాత దాని నుండి వెలువడే ఉష్ణం ఆ పదార్థం పూర్తిగా, నిరంతరంగా మండటానికి ఉపయోగపడుతుంది.
→ జ్వలన ఉష్ణోగ్రత విలువ తక్కువగా ఉండి, త్వరగా మండే పదార్థాలను “త్వరగా మండే పదార్థాలు” అంటారు.
→ పదార్థాలు ఎటువంటి బాహ్య కారకం లేకుండానే పదార్థం మండడాన్ని “స్వతసిద్ధ దహనం” అంటారు.
→ పదార్థాలు అతి త్వరగా మండి కాంతిని, ఉష్ణాన్ని విడుదల చేయడాన్ని “శీఘ్ర దహనం” అంటారు.
→ ఒక కిలోగ్రాము ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారు.
→ నూనె, పెట్రోలు వంటి పదార్థాలు మండుతున్నపుడు వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు.
→ కిరోసిన్, కరిగిన మైనం వంటివి వత్తిద్వారా పైకి చేరి వాయువుగా మారి దహనం చెందడం ద్వారా మంటను ఏర్పరుస్తాయి.
→ కొవ్వొత్తి మంట యొక్క నీలి రంగు ప్రాంతంలో బాబాష్పం రూపంలో గల మైనం ఆక్సిజన్ తో కలిసి పూర్తిగా దహనం చెందుతుంది.
→ దహనం (Combustion] : ఒక పదార్థము గాలిలోని ఆక్సిజన్ తో కలసి పూర్తిగా మండడాన్ని “దహనం” అంటారు.
→ దహనశీల పదార్థాలు [Combustible Material] : మంట దగ్గరకు తీసుకువచ్చినపుడు మండే గుణము ఉండే పదార్థాలను “దహనశీల పదార్థాలు” అంటారు.
→ దహనశీలికాని పదార్థాలు [Non- Combustible Material] : మంట దగ్గరకు తీసుకువచ్చినపుడు మండని పదార్థాలను “దహనశీలికాని పదార్థాలు” అంటారు.
→ జ్వలన ఉష్ణోగ్రత [Ignition Temperature] : ఏ కనిష్ఠ ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండడం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు.
→ త్వరగా మండే పదార్థాలు [Inflammable Substances] : జ్వలన ఉష్ణోగ్రత విలువ తక్కువగా ఉండి త్వరగా మండే పదార్థాలను “త్వరగా మండే పదార్థాలు” అంటారు.
→ స్వతస్సిద్ధ దహనం [Spontaneous Combustion] : పదార్థాలు ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా మండడాన్ని “స్వతస్సిద్ధ దహనం” అంటారు.
→ పేలుడు పదార్థాలు [Explosion Materials] : పదార్థాలను మండించినపుడు కాంతి, ఉష్ణం మరియు ధ్వని విడుదల చేసే పదార్థాలను “పేలుడు పదార్థాలు” అంటారు.
→ ఇంధనాలు [Fuels] : దహనం వల్ల ఉష్ణం మరియు కాంతిని విడుదల చేసే పదార్థాలను “ఇంధనాలు” అంటారు.
→ కెలోరిఫిక్ విలువ : ఒక కిలోగ్రాము ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారు.
→ శీఘ్ర దహనం లేదా తక్షణ దహనం [Rapid Combustion] : పదార్థాలు అతి త్వరగా మండి కాంతి, ఉష్ణాన్ని విడుదల చేయడాన్ని “శీఘ్ర దహనం లేదా తక్షణ దహనం” అంటారు.
ఉదా : పెట్రో, వంటగ్యాస్, ఆల్కహాల్, కర్పూరం.