Students can go through AP Board 8th Class Physical Science Notes 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత to understand and remember the concept easily.
AP Board 8th Class Physical Science Notes 9th Lesson ద్రవాల విద్యుత్ వాహకత
→ లోహాలు తమగుండా విద్యుత్ ను ప్రసరింపచేస్తాయి.
→ కొన్ని రకాల ఘనపదార్థాల వలె కొన్ని ద్రవాలు కూడా తమగుండా విద్యుత్ ను ప్రసరింపచేస్తాయి.
→ తమగుండా విద్యుత్ ను ప్రసరింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.
→ తమగుండా విద్యుత్ ను ప్రసరింప చేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు లేదా అధమ విద్యుత్ వాహకాలు అంటారు.
→ పరిశుద్ధ నీటిని స్వేదన జలం అంటారు. స్వేదన జలం గుండా విద్యుత్ ప్రసరించదు.
→ వలయంలో అతి తక్కువ విద్యుత్ ప్రవాహం ఉన్నా కూడా LED వెలుగుతుంది.
→ విద్యుత్ ను తమగుండా ప్రసరింపనిచ్చే ద్రావణాన్ని విద్యుత్ విశ్లేష్యం అంటారు.
→ విద్యుత్ ను తమగుండా ప్రసరింపచేసే ద్రవాలు చాలా వరకు ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలు.
→ విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా “ఎలక్ట్రోప్లేటింగ్” చేయవచ్చును.
→ విద్యుత్ వాహకాలు : విద్యుతను తమగుండా ప్రవహింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు.
→ విద్యుత్ బంధకాలు : విద్యుతను తమగుండా ప్రవహింపని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు.
→ LED : లైట్ ఎమిటింగ్ డయోడ్.
→ విద్యుత్ ధృవాలు (ఎలక్ట్రోలు) : విద్యుత్ ఘటంలో లోహపు పలకలను ఎలక్ట్రోలు అంటారు.
→ విద్యుత్ విశ్లేషణం : విద్యుత్ ప్రవహింపజేయడం వలన ద్రావణాలు వియోగం చెందే ప్రక్రియను విద్యుత్ విశ్లేషణం అంటారు.
→ విద్యుత్ విశ్లేష్యాలు (విద్యుద్విశ్లేష్యం) : విద్యుత్ ప్రవహింపచేసే ద్రావణాలను విద్యుత్ విశ్లేష్యాలు అంటారు.
→ ఎలక్ట్రోప్లేటింగ్ : విద్యుద్విశ్లేషణ ద్వారా ఎక్కువ ధర ఉన్న లోహాలను లేదా త్వరగా క్షయంగాని లోహాలను వేరే లోహంపై పల్చగా పూతపూయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు.
→ విద్యుత్ ఘటం : రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే దానిని విద్యుత్ ఘటం (dry cell) అంటారు.