These AP 8th Class Social Important Questions 13th Lesson భారత రాజ్యాంగం will help students prepare well for the exams.
AP Board 8th Class Social 13th Lesson Important Questions and Answers భారత రాజ్యాంగం
ప్రశ్న 1.
రాజ్యాంగ పీఠికలో ఉపయోగించిన పదాలలో కల, హామీలలో ఏ అంశాలను గుర్తించారు? వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఒక పటం తయారుచేయండి.
జవాబు:
ప్రశ్న 2.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయుము.
వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొంది. మనం నమ్మిన మౌలిక సూత్రాలను, దేశాన్ని పరిపాలించే విధానాలను, ఒక చోట పొందుపరచాలనుకున్నారు. వీటిని ‘భారత రాజ్యాంగం’ అనే పుస్తకంలో పొందుపరిచారు.
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి. ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ల హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది. అన్నిటికీ మించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.
అ) ఎవరి పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది?
జవాబు:
వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది.
ఆ) మనం, నమ్మిన సిద్ధాంతాల్ని దేంట్లో పొందుపరిచారు?
జవాబు:
భారత రాజ్యాంగం అనే పుస్తకంలో పొందుపరిచారు.
ఇ) రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.
ఈ) దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.
ప్రశ్న 3.
కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము.
రాజ్యాంగ నిర్మాతల చిత్రాలలో ఒకరి చిత్రం లేకపోవటం మీలో కొందరు గమనించి ఉంటారు మహాత్మాగాంధీ. అతడు రాజ్యాంగసభలో సభ్యుడు కాదు. అయితే అతడి దృక్పథాన్ని అనుసరించిన సభ్యులు అనేకమంది ఉన్నారు. 1931లో ‘యంగ్ ఇండియా’ అన్న పత్రికలో రాస్తూ రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీజీ పేర్కొన్నాడు.
భారతదేశాన్ని అన్నిరకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను. అత్యంత పేదలు ఇది తమ దేశమనీ, దాని నిర్మాణంలో తమకూ పాత్ర ఉందని భావించే భారతదేశం కోసం, ఉన్నతవర్గ, నిమ్నవర్గ ప్రజలు లేని భారతదేశం కోసం. అన్ని మతాల వాళ్లు, జాతుల వాళ్లు సామరస్యంతో ఉండే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఇటువంటి భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి. ఇంతకంటే తక్కువ దానితో నేను సంతృప్తి పడను. – మహాత్మా గాంధీ
అ) రాజ్యాంగ నిర్మాతలలో ఎవరి చిత్రం లేదు?
జవాబు:
మహాత్మాగాంధీ చిత్రం
ఆ) ఈ కల దేంట్లో రాయబడినది?
జవాబు:
1931లో ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాయబడింది.
ఇ) ఇది ఎవరి కల?
జవాబు:
ఇది మహాత్మాగాంధీ కల.
ఈ) ఈ కలలో భవిష్యత్తులో ఏమి ఉండవు?
జవాబు:
భారతదేశంలో అంటరానితనం అనే శాపం, మత్తు పానీయాలు, మత్తుమందులు అనే శాపం ఉండవు.
ఉ) మహిళలకూ …………………….. హక్కులు ఉంటాయి.
జవాబు:
మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు ఉంటాయి.
ప్రశ్న 4.
భారత ప్రజలు రెండు ఉద్దేశాలు సాధిస్తామని నిర్ణయించారు. ఈ రెండూ ఏమిటి?
జవాబు:
- దేశాన్ని గణతంత్రంగా ఏర్పాటు చేయడం.
- ప్రజాస్వామ్యాన్ని అవలంబించడం.
ప్రశ్న 5.
అ) రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ పూనాలని నెహ్రూ కోరారు?
ఆ) “ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మనతరం మహానాయకుడు కలగన్నాడు”. ఆయన ఎవరి గురించి చెబుతున్నారు?
జవాబు:
అ) రాజ్యాంగ నిర్మాతలు నిరంతరం శ్రమిస్తామని ప్రతిజ్ఞ పూనాలని ఆయన కోరారు.
ఆ) ఆయన గాంధీజీ గురించి చెబుతున్నారు
ప్రశ్న 6.
రాజ్యాంగం ఏమి కలిగి ఉంటుందో రెండు రాయండి.
జవాబు:
రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి – చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి మొదలైన నియమాలను కలిగి ఉంటుంది.
ప్రశ్న 7.
దేశం దేనికి కృషి చేయాలి?
జవాబు:
రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి దేశం కృషి చేయాలి.
ప్రశ్న 8.
రాజ్యాంగ సభకు సభ్యులను నామినేట్ చేయడానికి రాజులను ఎందుకు అనుమతించారు?
జవాబు:
ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను గమనించి రాజ్యాంగం రాయడానికి, అన్ని ప్రాంతాల వారి ఉద్దేశాలను సమన్వయం చేయడానికి వీలుగా రాజులను అనుమతించారు.
ప్రశ్న 9.
మహిళా సభ్యులు చాలా తక్కువగా ఎందుకున్నారు?
జవాబు:
నాడు మహిళలు, విద్యాధికులు, రాజకీయాలలో ఉన్నవారు చాలా తక్కువ. కాబట్టి మహిళా సభ్యులు తక్కువగా ఉన్నారు.
ప్రశ్న 10.
ఉద్దేశాల తీర్మానంలోని ఏ మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది?
జవాబు:
‘మానవాళి అంతట సంక్షేమం’ అనే మార్గదర్శక సూత్రం అన్నిటికంటే ముఖ్యమైనది.
ప్రశ్న 11.
ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఎందుకుండాలి?
జవాబు:
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఉండాలి.
ప్రశ్న 12.
రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను, ఉద్దేశాలను పీఠిక తెలియజేస్తుంది. పీఠికలోని ముఖ్యమైన భావనలను వివరించండి.
జవాబు:
రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన భావనలు :
“భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని గణతంత్రంగా ‘ఏర్పాటు చేయటానికి తీర్మానించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వం ఇస్తూ మాకు మేము ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాం.”
భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని, చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్, 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసికొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం.
ప్రశ్న 13.
భారత రాజ్యాంగ పీఠికలోని కీలకపదాల భావాన్ని వివరించండి.
జవాబు:
‘భారత రాజ్యాంగంలోని కీలక పదాల భావాలు :
భారతదేశ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా రాసి, చట్టంగా చేశారు. అంతేకానీ దానిని రాజులో, బయటి శక్తులో వాళ్ళకి ఇవ్వలేదు. మన గణతంత్రపు ప్రజాస్వామిక స్వభావాన్ని ఇది చాటి చెపుతుంది.
గణతంత్రం :
ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు. అంతేకాని రాజ్యాలలో మాదిరి వారసత్వంగా అధికారం రాదు.
సర్వసత్తాక :
అంతర్గత, విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోటానికి, చట్టాలు చేయటానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. బయటి శక్తులు ఏవీ భారతదేశానికి చట్టాలు రూపొందించలేవు.
సామ్యవాదం :
తమ పని ద్వారా ప్రజలందరూ సంపదను సృష్టిస్తారు. దానిని అందరూ సమానంగా పంచుకోవాలి.
లౌకికతత్వం :
ఏ మత ఆధారంగా ప్రభుత్వం నడవదు. ఏ మతాన్ని అనుసరించటానికైనా, ఏ మతాన్ని అనుసరించక పోవటానికైనా ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంటుంది. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాముఖ్యతను ఇవ్వదు.
ప్రజాస్వామ్యం :
ఇది ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండే ప్రభుత్వ విధానం. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. న్యాయం : ప్రతి పౌరునికి వారికి చెందింది దక్కాలి. అన్యాయానికి గురైన ప్రజల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు.
సమానత్వం :
మన రాజ్యాంగం అన్ని అంశాలలో సమానతను ఇవ్వటం లేదు. కానీ అందరికీ ఒకే హోదా ఉండేలా చూస్తుంది. దీని అర్థం ప్రతి ఒక్కరికీ ఒకే చట్టాలు వర్తిస్తాయి.
స్వేచ్చ :
పౌరులు వాళ్ళు ఆలోచించే దానిమీద, వాళ్లు అనుసరించే మతం, లేక మతాన్నే అనుసరించకపోవటం, తమ భావాలను వ్యక్తపరిచే విధానం లేదా భావాలను చర్యలలో చేపట్టటం, అందరూ కలిసి సంఘాలు, పార్టీలుగా ఏర్పడటం వంటి స్వేచ్ఛ అందరికీ ఉంటుంది.
సౌభ్రాతృత్వం :
ప్రజలందరి మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలి. తోటి పౌరులను పరాయివారిగా భావించకుండా, వారిని తక్కువ చేయకుండా ఉండాలి.
ప్రశ్న 14.
భారత రాజ్యాంగం ప్రవేశిక గురించి రాయండి.
జవాబు:
భారత రాజ్యాంగం ఉద్దేశాలను, మౌలిక సూత్రాలను రాజ్యాంగ ప్రవేశిక తెలియజేస్తుంది.
ప్రశ్న 15.
భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశం. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య పదాలను భారతదేశ పరిస్థితుల ఆధారంగా వివరించండి.
జవాబు:
సర్వసత్తాక :
సర్వసత్తాక అనగా భారతదేశం ఏ ఇతర దేశం నియంత్రణ క్రింద ఉండకపోవడం మరియు భారతదేశం తన పౌరుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకోవడం. ఉదాహరణకు భారతదేశం తన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నది. చట్టాల విషయంలో కూడా ఏ ఇతర దేశాల జోక్యం ఉండదు.
సామ్యవాద :
దేశ సంపదను, వనరులను అందరికీ సమానంగా పంపిణీ చేయటం. ధనికులకు, పేదవారికి మధ్య ఉన్న అంతరాలను తొలగించటం.
ఉదా :
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూత అందించడం రిజర్వేషన్లను కల్పించడం.
లౌకిక :
ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రోత్సాహించక పోవడం. ఉదా : భారతదేశంలో ప్రజలు తమకు నచ్చిన మతాన్ని – స్వీకరించడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండటం,
ప్రజాస్వామ్యం :
ఈ ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలందరూ సమాన రాజకీయ హక్కులు కలిగి ఉంటారు.
ఉదా :
పౌరులు ప్రభుత్వ తీరును ప్రశ్నించే హక్కును కలిగి ఉంటారు.
ప్రశ్న 16.
కింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పై చిత్రంలో భారత ప్రభుత్వం యొక్క ఏ మూల సూత్రం వివరించబడింది?
బి) ఏ ప్రభుత్వం “విద్య”పై చట్టాలు చేయడానికి బాధ్యత కలిగి వుంది? కేంద్రమా లేదా రాష్ట్ర ప్రభుత్వమా?
జవాబు:
ఎ) సమాఖ్య వ్యవస్థ.
బి) విద్యపై చట్టాలు చేసే బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి పై కలదు.