AP 8th Class Social Important Questions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

These AP 8th Class Social Important Questions 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 14th Lesson Important Questions and Answers పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 1.
ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎందుకుండాలి?
జవాబు:
ఎన్నికలల్లో గెలిచిన వ్యక్తులు ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. వారి ఎన్నికను ఏ ఆకర్షణీయమైన అంశాలు లేదా ఒత్తిళ్ళు ప్రభావితం చేయరాదు. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి.

ప్రశ్న 2.
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత ఎవరిది?
జవాబు:
దేశం మొత్తానికి వర్తించే చట్టాలు చేసే బాధ్యత పార్లమెంటుది.

ప్రశ్న 3.
పార్లమెంటు చట్టాలు మాత్రం చేసి ప్రభుత్వాన్ని నియంత్రించకుండా ఉంటే సరిపోతుందా?
జవాబు:
పార్లమెంటు చేసిన చట్టాలు సరిగ్గా అమలు జరగాలంటే ప్రభుత్వంపై నియంత్రణ ఉండాలి. లేనిచో వాటి అమలు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే తన చర్యలకు పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం పొందాలని నియమం రూపొందించడమైనది.

ప్రశ్న 4.
ఎంత శాతం ఓటర్లు ఓటు వేశారో తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం? ఇది మనకు ఏం చెబుతుంది?
జవాబు:
ఇది ఓటింగు సరళిని తెలియజేస్తుంది. ఎన్నికల పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఇది ముఖ్యం.

AP 8th Class Social Important Questions Chapter 14 పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం

ప్రశ్న 5.
ప్రజాస్వామ్య భావనకు ప్రాతినిధ్య భావన ఎందుకు ముఖ్యమైనది?
జవాబు:
ప్రజాస్వామ్యమంటే ప్రజల స్వామ్యమని అర్థం. అందుకే దీనికి వారి ప్రాతినిధ్య భావన ముఖ్యమైనది. ప్రజలు అంటే ప్రత్యేకించి ఏ ఒక్కరూ కారు. అందరూ అని అర్థం.

ప్రశ్న 6.
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారు?
జవాబు:
2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. దాంతో వారు భావస్వారూప్యం కలిగిన ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ ప్రోగ్రసివ్ అలయన్స్ గా ఏర్పడి ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ కలదు.

ప్రశ్న 7.
మొదటి లోకసభ ఎన్నికలు ‘చీకటిలో ముందుకు దూకడం వంటిది. భారతదేశం లాంటి దేశానికి ఇది అనువైనది కాదు. భారతదేశం కులప్రాతిపదిక ఏర్పడిన సమాజం, అందరు సమానమనే భావనను అధిక శాతం ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి ప్రజాస్వామికంగా ఎన్నికలు జరపడం సాధ్యం కాదు అని కొంతమంది అన్నారు.
ప్రశ్న : ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? లేదా? ఎందుకు?
జవాబు:
పై అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు, ఎందుకనగా, భారతదేశం కులప్రాతిపదిక మీద ఏర్పడలేదు. మనదేశం లౌకికవాదాన్ని అనుసరిస్తున్న దేశం. అందురూ సమానులే అనే భావన కూడా మన సమాజంలో ఉంది. పాకిస్తాన్ దేశం మాత్రమే కులాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడింది. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రజలలో కులం, మతం అనే అంశాలలో వారి భావాలు కూడా మారాయి. ప్రస్తుతం మన ప్రజలందరూ ఒకటే అని, ‘అందరం’ సమానమే అని భావన కూడా ఉంది.

కావున మనదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపటం సాధ్యమే.

అంతేకాకుండా మనకు అత్యున్నత రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రజలందరూ సమానులే అని తీర్మానిస్తూ వయోజన ఓటుహక్కును 18 సం||లు నిండిన ప్రతి ఒక్క భారతీయుడికి ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికలలో పోటీచేసే అవకాశాన్ని కూడా కల్పించింది.