These AP 8th Class Social Important Questions 8th Lesson జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం will help students prepare well for the exams.
AP Board 8th Class Social 8th Lesson Important Questions and Answers జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం
ప్రశ్న 1.
ఈ చిత్రాన్ని వ్యాఖ్యానించండి.
తాడికాయను వత్తుతున్న కోయ స్త్రీ, పురుషుడు
జవాబు:
ఈ చిత్రంలో ఉన్నవారిద్దరు ఒక కోయ జంట. పురుషుని ఒంటి మీద వస్త్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. స్త్రీ ఒంటి మీద కూడా తక్కువగా ఉన్నాయి. ఇది వారి పేదరికాన్ని తెలియచేస్తోంది. వారు కోయవారని తెలుస్తోంది. వారు గుడిసెలో నివసిస్తారని, ఇంటి ముందు విశాలమైన ఖాళీ స్థలం ఉందని తెలుస్తోంది. వారు కోళ్ళను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది. స్త్రీ రెండు దుంగల మధ్య తాటిపండును ఉంచింది. పురుషుడు తన బలం కొద్దీ పై దుంగను కిందకి వత్తుతున్నాడు. దీని మూలంగా తాటిపండులోని రసం కింద నున్న కుండలోనికి జారుతుంది. దీనినుపయోగించి వారు తాటి తాండ్రను తయారుచేస్తారు.
ప్రశ్న 2.
ఈ పాఠంలోని సాంకేతిక అంశాల్లో నిమగ్నమైన అనేక మహిళల చిత్రాలున్నాయి. పై చిత్రంలో వలె అనేక మంది మహిళలు ఇంజనీరింగ్ డిగ్రీ లేనివాళ్లే. మహిళలు ఇంజనీరింగ్ విద్య చదవటం పట్ల గల భిన్నాభిప్రాయాలపై తరగతి గదిలో చర్చించండి. ఉంటుందో అనే అంశంపై చర్చను తరగతి గదిలో నిర్వహించండి.
జవాబు:
“మహిళల చదువు భవితకు వెలుగు”.
డిగ్రీ అనేది వాళ్ళ జ్ఞానాన్ని నిర్ధారించడానికి ఇచ్చే రశీదు. అది లేనివాళ్ళు ఎంతోమంది ఎన్నోరంగాల్లో నిపుణులై ఉన్నారు. ఉదా : వ్యవసాయ విద్య నభ్యసించిన వాళ్ళ కన్నా ఎక్కువ జ్ఞానం పల్లెటూరు రైతుకి ఉంటుంది. వీరిది అనుభవం నుండి వచ్చిన జ్ఞానం.
ఇక మహిళలు విద్యావంతులైతే వారు ఇంకా పై స్థాయికి ఎదుగుతారు. ఉన్నత ఉద్యోగాలను, పదవులను అలంకరిస్తారు. వారి కుటుంబానికి అంతటికీ చదువునిస్తారు. సంసారాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి పథంలోకి నడిపిస్తారు.
ప్రశ్న 3.
ఈ కింది పేరాను చదివి, ప్రశ్నలకు సమాధానమిమ్ము.
ఆవిరియంత్రం వల్ల కర్మాగారంలో పని విధానం పూర్తిగా మారిపోయింది. ఆ తరవాత విద్యుత్తు వంటి కొత్త ఇంధన వనరుల వల్ల ఈనాడు మనం చూస్తున్న కర్మాగారాలు ఆవిర్భవించాయి. ఒక కొత్త యంత్రాన్ని, లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు. అయితే ఈ ఆలోచనలు రోజువారీ ఉపయోగంలోకి రావటానికి ఎంతో సమయం పడుతుంది. ఇది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి సాంకేతిక విజ్ఞానం మెరుగుపరచటం కావచ్చు, కొత్త విధానాలు ఖర్చు తగ్గించటం కావచ్చు లేదా కొత్త ఉత్పత్తులకు, విధానానికి ఆమోదం లభించటం కావచ్చు. సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి లేదా పెరుగుదల పూర్తిగా కొత్త యంత్రాల వల్ల (ఎక్స్ రే యంత్రాలు, మర మగ్గాలు) రావచ్చు, ముడిసరుకులలో (రబ్బరుకు బదులు ప్లాస్టిక్) మార్పు వల్ల రావచ్చు, లేదా, ఉత్పత్తి ప్రక్రియల పునఃవ్యవస్థీకరణ వల్ల రావచ్చు.
1. ఆవిరియంత్రం వల్ల ఏం జరిగింది?
జవాబు:
ఆవిరియంత్రం వల్ల కర్మాగారంలో పని విధానం మారిపోయింది.
2. కర్మాగారాల ఆవిర్భవానికి కారణమేమి?
జవాబు:
విద్యుత్తు వంటి కొత్త ఇంధన వనరులు కర్మాగారాల ఆవిర్భవానికి కారణం.
3. ఆవిష్కరణ అంటే ఏమిటి?
జవాబు:
ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు.
4. ఏవేని రెండు యంత్రాల పేర్లను రాయండి.
జవాబు:
ఎక్స్ రే యంత్రాలు, మర మగ్గాలు.
5. రబ్బరుకు బదులుగా ఏది వాడవచ్చు?
జవాబు:
రబ్బరుకు బదులుగా ప్లాస్టిక్ ను వాడవచ్చు.
ప్రశ్న 4.
సేవారంగంలోకి వచ్చే అంశాలు ఏవి? దీనిలో సాంకేతిక విజ్ఞానం మార్పు ఏమి?
జవాబు:
- వ్యవసాయం, పరిశ్రమలకు మద్దతు ఇచ్చేవి. సేవారంగంలోనికి వస్తాయి.
- అన్ని వ్యాపార కార్యకలాపాలు సేవారంగంలోనికి వస్తాయి.
- నేరుగా ఉతుతికి దోహదం చేయని అత్యవసర కార్యక్రమాలు కూడా సేవారంగం కిందకి వస్తాయి.
- సాంకేతిక విజ్ఞాన మార్పులు సేవారంగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.
- సాంకేతిక విజ్ఞానంలో మార్పువల్ల సమాచారం వేగంగా అందుతుంది. అందరికీ తేలికగా అందుబాటులోకి వస్తుంది.
ప్రశ్న 5.
మొబైల్ ఫోన్ల వలన 2 లాభాలు, 2 నష్టాలు పేర్కొనుము.
జవాబు:
లాభాలు:
- ఇవి మనుషులను దగ్గర చేస్తున్నాయి.
- అత్యవసర సమాచారాల్ని సెకన్లలో తెలుసుకోగలుగుతున్నారు.
నష్టాలు :
- వీటి వినియోగం బాల్యాన్ని కలుషితం చేస్తోంది.
- వీటి వినియోగం శరీరానికుండే విద్యుదయస్కాంత తరంగాలకు అంతరాయం కలిగిస్తుంది.
ప్రశ్న 6.
ఈ కింది మహిళలను ప్రశంసించండి.
జవాబు:
ఎడమవైపు చిత్రంలోని మహిళలు తమ సాంప్రదాయ వేషధారణలోనే ఉండి రేడియోలను మరమ్మతు చేస్తున్నారు. వీరు తమ పని సమయంలో తమ పిల్లలను కూడా తమ వెంట ఉంచుకున్నారు. వారు పనిలో, చూపే ఏకాగ్రత చాలా బాగుంది.
కుడివైపు చిత్రంలో మహిళలందరూ తెల్లని వస్త్రాలు, టోపీలు ధరించి శాంతికి మారు పేరులా ఉన్నారు. వారు ఎంతో పద్ధతిగా ఒక వరుసలోనే కూర్చుని పనిచేసే విధానం పని పట్ల వారికున్న నిబద్ధతను తెలియచేస్తోంది.
“మహిళా శక్తి జిందాబాద్ !”
ప్రశ్న 7.
వరికోత యంత్రాలు వినియోగించటంలో గల రెండు ప్రయోజనాలను రాయండి.
జవాబు:
వరికోత యంత్రాలు వినియోగించటంలో ప్రయోజనాలు:
- ఇది సకాలంలో పంటను కోస్తుంది.
- ధాన్యం నూర్పిడి చేసి, పోత పోసి గింజ – పొల్లును వేరుచేస్తుంది.
- పంటకోత తక్కువ కాలంలో పూర్తవుతుంది.
ప్రశ్న 8.
మీ ప్రాంతంలో యువతకు కొత్తగా సృష్టించబడిన ఉద్యోగాలు ఏవి?
జవాబు:
బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు, టెలిఫోన్ బూత్ లలో ఆపరేటర్లు, మొబైల్ ఫోన్ల అమ్మకందారులు, మరమ్మతుదారులు, రీచార్జ్ / టాప్-అప్ చేయువారు మొదలైన కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి.
ప్రశ్న 9.
ఆవిష్కరణ అంటే ఏమిటి?
జవాబు:
ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కొన్నప్పుడు దానిని ఆవిష్కరణ అంటారు.
ప్రశ్న 10.
ఏవేని రెండు యంత్రాల పేర్లను రాయండి.
జవాబు:
ఎక్స్ రే యంత్రాలు, మరమగ్గాలు.
ప్రశ్న 11.
రబ్బరుకు బదులుగా ఏది వాడవచ్చు?
జవాబు:
రబ్బరుకు బదులుగా ప్లాస్టిక్ ను వాడవచ్చు.
ప్రశ్న 12.
మొబైల్ ఫోన్ల వలన రెండు లాభాలు పేర్కొనుము.
జవాబు:
లాభాలు :
- ఇవి మనుషులను దగ్గర చేస్తున్నాయి.
- అత్యవసర సమాచారాల్ని సెకన్లలో తెలుసుకోగలుగుతున్నారు.
ప్రశ్న 13.
మొబైల్ ఫోన్ల వలన రెండు నష్టాలు పేర్కొనుము.
జవాబు:
నష్టాలు :
- వీటి వినియోగం బాల్యాన్ని కలుషితం చేస్తోంది.
- వీటి వినియోగం శరీరానికుండే విద్యుదయస్కాంత తరంగాలకు అంతరాయం కలిగిస్తుంది.
ప్రశ్న 14.
సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవ జీవితంలో మార్పులు వచ్చాయని ఎట్లు చెప్పగలవు?
జవాబు:
సాంకేతిక పరిజ్ఞానం వలన మానవ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.
- సాంకేతిక విజ్ఞానాన్ని మన జీవితంలో మనం ప్రతిక్షణం వినియోగించుకుంటూనే ఉన్నాం.
- టి.వి. పెట్టినా, మొబైల్ ఫోన్లో మాట్లాడినా, కంప్యూటర్ పై పని చేసినా, పెన్సిలు చెక్కినా, కూరగాయలు తరిగినా, కోసినా వేరువేరు పాత్రలలో వంట చేసినా మనం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించు కుంటున్నాం.
చివరిగా మనం చేసే పనిలో, మన జీవితంలో వచ్చే మార్పులన్నీ సాంకేతిక పరిజ్ఞానం ఫలితమే.
ప్రశ్న 15.
భారత,టెలి కమ్యూనికేషన్ రంగంలో ఇటీవల వచ్చిన మార్పులను గురించి వివరించండి?
జవాబు:
భారత టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు
- ప్రభుత్వ కంపెనీయే కాకుండా అనేక ప్రైవేటు కంపెనీలు, లాండ్ లైన్, మొబైల్ ఫోను సేవలను అందిస్తున్నాయి.
- టెలీకమ్యూనికేషన్ సేవలలో ప్రైవేటు కంపెనీల వాటా పెరుగుతూ ఉంది.
- మొబైల్ ఫోనులు తయారుచేసే అనేక కంపెనీలు భారతదేశంలో నెలకొల్పబడుతున్నాయి.
- ఈ కంపెనీలు వీటిని ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
- టెలిఫోన్ మొబైల్ సాంకేతిక విజ్ఞానానిక కొత్త నైపుణ్యాలు కూడా అవసరం.
- బహుళ జాతి కంపెనీలలో, మొబైలు ఫోనులు తయారీలో, టెలిఫోన్ బూత్ లలో, మొబైల్ అమ్మకాలలో, మరమ్మత్తులలో రీఛార్జ్/టాప్-అప్ సేవలలో యువతకు కొత్త ఉపాధులు ఏర్పడ్డాయి.
ప్రశ్న 16.
భారతదేశ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పత్తి పట్టిక ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) ఇవ్వబడిన గ్రాఫ్ ఏ అంశాన్ని తెలియజేస్తుంది?
బి) ఏవేని రెండు ఆహారధాన్యాల పేర్లు రాయండి ?
సి) 1961-75 సంవత్సరాల మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత?
డి) 1976-90 నుండి 1991-2009 మధ్య ఆహారధాన్యాల ఉత్పత్తి ఎన్ని టన్నులు పెరిగింది?
జవాబు:
ఎ) ఇవ్వబడిన గ్రాఫ్ భారతదేశ వార్షిక ఆహారధాన్యాల ఉత్పత్తిని తెలియచేస్తుంది. .
బి) రెండు ఆహార ధాన్యాల పేర్లు వరి, జొన్న మొ||నవి.
సి) 1961-75 సం||రాల మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 101 మిలియన్ టన్నులు.
డి) 1976 – 90 నుండి 1991 – 2009 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 72 మిలియన్ టన్నులు పెరిగింది.
ప్రశ్న 17.
“సాంకేతిక విజ్ఞానం అన్ని వేళలా స్వాగతించతగినది కాదు. కొత్త యంత్రాల ప్రవేశంతో తమ ఉద్యోగాలు పోతాయని ప్రజలు భయపడతారు”.
సాంకేతిక విజ్ఞానం నిరుద్యోగితకు దారితీస్తుందని మీరు భావిస్తున్నారా ! మీ అభిప్రాయం రాయండి.
జవాబు:
సాంకేతిక, నిరుద్యోగితకు దారి తీస్తుంది అని భావించటానికి కారణాలు :
- వరికోత యంత్రం వలన కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు.
- ఇప్పటికే కంప్యూటర్ల ప్రవేశం అనేక ఉద్యోగాలను తొలగించి వేసింది.
- ఇంటర్నెట్, బ్యాంకింగ్, ఏటియమ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి సదుపాయాలతో బ్యాంకులకు ఎక్కువ మంది ఉద్యోగులతో అవసరం లేదు.
- ఏ విధంగా అయితే ట్రాక్టర్ల వాడకం పశువుల వాడకాన్ని తగ్గించి వేసిందో అదేవిధంగా ఉత్పత్తి ప్రక్రియలో మానవుల అవసరాన్ని సాంకేతికత తగ్గించి వేస్తున్నది.