AP 8th Class Social Important Questions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

These AP 8th Class Social Important Questions 9th Lesson ప్రజారోగ్యం – ప్రభుత్వం will help students prepare well for the exams.

AP Board 8th Class Social 9th Lesson Important Questions and Answers ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 1.
“మౌలిక ప్రజా సౌకర్యాలు” శీర్షిక కింద గల మొదటి పేరా చదివి కింది ప్రశ్నకు జవాబు రాయండి.

జీవనానికి, మంచి ఆరోగ్యానికి నీళ్లు తప్పనిసరి. మన రోజువారీ అవసరాలకు నీళ్లు కావాలి. రక్షిత మంచినీటి ద్వారా అనేక రోగాలను నివారించవచ్చు. నీళ్ల వల్ల వ్యాపించే విరేచనాలు, కలరా వంటి రోగాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో ప్రతిరోజూ నీటి సంబంధిత వ్యాధుల కారణంగా 1600 మంది చనిపోతే, అందులో చాలామంది 5 సంవత్సరాల లోపు పిల్లలే. ప్రజలకు రక్షిత మంచినీరు అందుబాటులో ఉంటే ఇలాంటి మరణాలు నివారించవచ్చు. మీ ప్రాంతంలో ఏదైనా రక్షిత మంచినీటి సదుపాయం ఉందా? వివరించండి. మా ఊరు ఖానాపూర్’ మండలంలో ఉన్న హుస్నాబాద్ గ్రామం. ఇక్కడ రెండు చెరువులున్నాయి. ఒక చెరువులో ఉన్న నీరును శుద్ధిచేసి ట్యాంకుకు ఎక్కిస్తారు. అక్కడి నుండి ఊరందరికీ మంచినీరు సరఫరా అవుతుంది. ఇలా చేయడం మూలంగా మేమందరం నీటి వలన వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడబడుతున్నాం. ఈ సరఫరా మొత్తంను మా పంచాయితీ వారే చూసుకుంటారు.

ప్రశ్న 2.
క్రింది పేరాను చదివి, ఒక ప్రశ్నను తయారుచేయుము.

ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి నివేదిక 2007 ఆధారంగా మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. “ఆకలి, పోషకాహారలోపం నుంచి స్వేచ్ఛ అన్నది ప్రాథమిక హక్కులలో ఒకటి. మానవజాతి పురోభివృద్ధికి ఇది ఎంతో అవసరం. మెరుగైన పోషకాహారం ఉంటే రోగనిరోధకశక్తి బాగా ఉంటుంది, రోగాలు తక్కువగా ఉండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలలో అయిదేళ్లలోపు పిల్లల్లో అంటువ్యాధుల కారణంగా మరణాలలో రెండింట ప్రతి ఒకదానికి (53 శాతానికి) పోషకాహారలోపమే కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయిదు సంవత్సరాల లోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ బరువులేని వాళ్లు 33 శాతం ఉన్నారు….. 31 శాతం మహిళలు, 25 శాతం పురుషులు పోషకాహారలోపానికి గురవుతున్నారు,” అని ఈ నివేదిక పేర్కొంటోంది.
ప్ర. మానవజాతి పురోభివృద్ధికి ఏది అవసరం?

AP 8th Class Social Important Questions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 3.
ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా కూడా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయం తెలుపండి.
జవాబు:
ప్రభుత్వ ఆసుపత్రులు ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీచేసి ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయిస్తోంది. దీన్ని ప్రజలు కూడా ఆదర్శంగా తీసుకుని ఉండవచ్చు.

ప్రశ్న 4.
మలేరియా నివారణకు తీసుకోవలసిన రెండు చర్యలు రాయండి.
జవాబు:

 1. మలేరియా నివారణకు ముందు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 2. దోమ తెరను వాడాలి.
 3. ‘ఓడోమాస్’ లాంటి క్రిములను ఒంటికి రాయాలి.

ప్రశ్న 5.
మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల జాబితా రాయండి. (వీటిల్లో ఏదో ఒకదానికి వెళ్లి) మీ అనుభవంలో అక్కడ లభ్యమయ్యే సదుపాయాలు, దానిని నిర్వహించే వాళ్ల గురించి రాయండి.
జవాబు:
మాకు దగ్గరలో ఇందుపల్లిలో ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఇంకొంచెం దూరంలో ఉంగుటూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. మా ఊరిలో ఒక RMP నడిపే ఆసుపత్రి ఉన్నది.

ప్రశ్న 6.
మీ ప్రాంతంలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక ప్రజాసౌకర్యాలకు ఉదాహరణలివ్వండి.
జవాబు:
మా ప్రాంతంలో ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజా సౌకర్యాలు

 1. మంచినీటి సరఫరా
 2. ఆరోగ్య సేవలు
 3. పారిశుద్ధ్యం
 4. విద్యుత్తు
 5. ప్రజా రవాణా
 6. పాఠశాలలు మొ||నవి.

AP 8th Class Social Important Questions Chapter 9 ప్రజారోగ్యం – ప్రభుత్వం

ప్రశ్న 7.
గ్రామీణ ప్రాంతంలో వైద్యం కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చర్చించండి?
జవాబు:
గ్రామీణ ప్రాంతంలో ప్రజలు వైద్యం కోసం ఈ క్రింది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 1. గ్రామీణ ప్రాంతంలో డాక్టర్లు అందుబాటులో ఉండరు.
 2. ప్రాథమిక చికిత్సా కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు ఏమీ లభించవు.
 3. రక్త పరీక్ష, ఎక్సరే, మొదలగు సదుపాయాలు కూడా ఏమీ ఉండవు.
 4. మందులు కూడా అన్ని రకాలు లభించవు.
 5. అత్యవసర పరిస్థితులలో కూడా అంటే ప్రాణాపాయస్థితిలో కూడా వారు దగ్గరలో ఉన్న టౌన్ కి వెళ్ళాలి.
 6. కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యాలు కూడా ఉండవు.