Students can go through AP Board 8th Class Social Notes 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 1st Lesson పటాల అధ్యయనం – విశ్లేషణ
→ ముఖ్యమని భావించే అంశాలను చూపించటానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు.
→ పటాలకు ఎంతో చరిత్ర కలదు.
→ సుమేరియన్లు, బాబిలోనియన్లు, గ్రీకులు, అరబ్బులు మరియు చైనీయులు పూర్వకాలంలో పటాలను తయారుచేశారు.
→ పటాలు తయారుచేసే శాస్త్రాన్ని ‘కార్టోగ్రఫీ’ అంటారు.
→ అల్ ఇద్రిసి, టాలమీ, అనాక్సిమాండర్, హెకేటియస్ మరియు హెరిడోటస్ మొదలైన వారు ప్రపంచ ప్రఖ్యాత భూగోళ శాస్త్రవేత్తలు మరియు కార్టోగ్రాఫర్లు.
→ దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని ‘గెరార్డస్ మెర్కేటర్’ రూపొందించారు. దీనినే మెర్కేటర్ ప్రక్షేపణం అని అంటారు.
→ ఐరోపా వలస పాలకులు శాస్త్రీయ బృందాలను, పటాలు తయారుచేయువారిని కలిపి వారి వలసలకు పంపారు.
→ సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ‘ఎవరెస్టు శిఖరానికి ఆ పేరు వచ్చింది.
→ యుద్ధ సమయంలో పటాల విలువ, ఉపయోగం పెరుగుతాయి.
→ పటాలు అనేక రకాల అవసరాల కోసం తయారుచేయబడతాయి.
→ థీమాటిక్ లేదా నిర్దేశిత పటాలు ప్రత్యేకించి ఒక అంశంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి.
→ ప్రతి పటంపై దానికి సంబంధించిన గుర్తులు, రంగులు, సంకేతాలు ఉపయోగించాలి.
→ జనాభా పటాలను రంగుల ఛాయా క్రమశ్రేణి ద్వారా తయారుచేయవచ్చు.
→ ఒకే రకమైన ఎత్తు కలిగిన ప్రదేశాలను కలుపు రేఖలను ఐసోలైన్స్ అంటారు.
→ పటాల సంకలనాన్ని అట్లాస్ అని అంటారు.
→ ప్రక్షేపణ : ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలు సరిగా చూపించే విధానాన్ని ‘ప్రక్షేపణ’ అని అంటారు.
→ సంకేతాలు : ఏదేని ఒక దానికి గుర్తుగా సూచించబడేది.
→ భూగోళ శాస్త్రవేత్త : భూగోళాన్ని గురించి, దానికి సంబంధించినంత వరకు మానవుల గురించి చదివిన వ్యక్తి.
→ కాంటూర్ : సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపే వాటిని “కాంటూరు రేఖలు” అంటారు.
→ కార్టోగ్రఫీ : పటాలను తయారు చేసే శాస్త్రీయ విధానాన్ని “కార్టోగ్రఫీ” అంటారు.