AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

Students can go through AP Board 8th Class Social Notes 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు

→ భూమిపై ఎంతో వైవిధ్యత ఉంది.

→ రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులు, వానలను ప్రభావితం చేస్తాయి.

→ మొక్కలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి హరితగృహాలు ఏర్పరుస్తారు.

→ సూర్యకిరణాలు భూమిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పడతాయి.

→ భూమిపై, నేల మీద, సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో తేడా ఉంటుంది.

→ సూర్యుని నుండి భూమి పొందే వేడి వివిధ పద్ధతులలో వికిరణం చెందుతుంది. (భూవికిరణం)

→ అత్యధిక ఉష్ణోగ్రత లిబియాలోని అజీజియాలో 1992లో 57.8°C గా నమోదు అయ్యింది.

→ అత్యల్ప ఉష్ణోగ్రత అంటార్కిటికాలోని వ్లాడివోస్టోక్ కేంద్రంలో 1983 జులైలో – 89.2 °C గా నమోదు అయ్యింది.

→ ఉష్ణోగ్రతలను సిక్స్ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణమాపకంతో కొలుస్తారు.

→ ఉష్ణోగ్రతలలోని తేడాలను ఉష్ణోగ్రతా పటాల ద్వారా తెలుసుకోవచ్చు.

→ భూమధ్యరేఖ నుండి ధృవాల వైపుకి వెళ్ళే కొలదీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.

→ వాతావరణం : భూమిని ఆవరించియున్న వాయువుల పొరను వాతావరణం అంటారు.

→ భూమధ్యరేఖా ప్రాంతం : భూమధ్యరేఖకు దగ్గరగా ఇరువైపులా ఉన్న ప్రాంతం.

→ ఘనీభవనం : చల్లని ప్రదేశంలో వాతావరణంలోని గాలిలో ఉన్న నీరు గడ్డ కట్టడం.

→ సౌరవికిరణం : సూర్యుని నుండి విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదలయ్యే శక్తి.

AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

→ సూర్యపుటం : సూర్యుని నుండి విడుదల అయ్యే శక్తి కొంత భూమి వైపుకి ప్రసరిస్తుంది. అలా ప్రసరించినదానిలో భూమి స్వీకరించే దానిని ‘సూర్యపుటం’ అంటారు.

→ పతనకోణం : సూర్యకిరణాలు భూమిపై భూమధ్యరేఖా ప్రాంతం మీద 90° కోణంలో పడతాయి. ధృవాల వద్దకు పోయే కొద్దీ ఇవి ఏటవాలుగా పడతాయి. ఇలా కోణం పతనం చెందటం మూలంగా దీనిని పతన కోణం అంటారు.

→ ఉష్ణ సమతుల్యం : భూమి తను గ్రహించిన ఉష్ణరాశిలో కొంత వెనక్కి తిప్పి పంపుతుంది. దీని వలన వాతావరణం వేడెక్కుతుంది. ఇది భూమిపైన ఉష్ణాన్ని సమతుల్యం చేస్తుంది.

→ గరిష్ఠ ఉష్ణోగ్రత : ఏదేని ఒక రోజు ఒక ప్రదేశంలో ఉండే అధిక ఉష్ణోగ్రత.

→ కనిష్ఠ ఉష్ణోగ్రత : ఏదేని ఒక రోజు ఒక ప్రదేశంలో ఉండే అల్ప ఉష్ణోగ్రత.

→ ఉష్ణ విలోమనం : ఉష్ణోగ్రతా విస్తరణ కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిచోట్ల దానికి వ్యతిరేకంగా జరుగుతుంది దానినే ఉష్ణోగ్రతా విలోమనం అంటారు.

→ భూగోళం వేడెక్కటం : వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం మూలంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే ‘భూగోళం వేడెక్కడం’ అంటారు.

AP 8th Class Social Notes Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 1