Students can go through AP Board 8th Class Social Notes 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 14th Lesson పార్లమెంటు – కేంద్ర ప్రభుత్వం
→ రాజ్యాంగం దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది.
→ కొత్త ఢిల్లీలో పార్లమెంటు భవనంలో సమావేశాల సమయంలో జరిగే చర్చలను లోక్ సభ టీ.వీ. ఛానల్ ప్రసారం చేస్తుంది.
→ 1986లో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది.
→ పార్లమెంటుకి ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది.
→ పార్లమెంట్ లో 2 సభలున్నాయి – లోకసభ, రాజ్యసభ.
→ రాజ్యాంగం ప్రకారం అనేక విషయాలలో లోకసభకు అత్యున్నత అధికారాలున్నాయి.
→ భారతదేశంలో మొదటి ఎన్నికలు 1951 – 52 లో జరిగాయి. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘాన్ని – ఏర్పాటు చేశారు.
→ ఓటు వేసేటప్పుడు ఎవరి స్వంత నిర్ణయం వారు తీసుకోవాలి.
→ లోకసభకు యిప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరిగాయి.
→ చట్టాలు చేయాల్సిన విషయాలను మూడుగా విభజించారు – కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు.
→ అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు, పార్లమెంటు ఉభయ సభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
→ పార్లమెంటుకు 2 అధికారాలు కలవు. శాసన అధికారం, కార్యనిర్వహణాధికారం.
→ ప్రధాన మంత్రిని లోకసభ సభ్యులు ఎన్నుకుంటారు, ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గంగా మంత్రివర్గం పని చేస్తుంది.
→ నిర్ణయాలు అమలు చేసే బాధ్యత మంత్రిత్వశాఖ అధికారులది.
→ శాసనసభ : రాష్ట్రంలో ఓటర్లచే ఎన్నుకోబడిన సభ్యులచే ఏర్పడు సభ.
→ లోక్సభ : దేశంలోని ఓటర్లచే ఎన్నుకోబడిన సభ్యులచే ఏర్పడే సభ. దానిలో మెజారిటీ పక్షం నాయకుడు ‘ప్రధాన మంత్రి’ అవుతారు. దీనినే దిగువసభ అని కూడా అంటారు.
→ రాజ్య సభ : దీనిని ఎగువసభ అని అంటారు. దీనిలోని సభ్యులను రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. కొందరు నామినేట్ చేయబడతారు. వీరు అన్నిరంగాలలో మేధావులు అయి ఉంటారు.
→ ఎన్నికల సంఘం : భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘం. ఇది దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది.
→ మంత్రిమండలి : ఎన్నిక కాబడిన, నియమించబడిన ఎమ్.పి. ల నుండి మంత్రివర్గ సభ్యులను (రాజ్యసభ, లోకసభ) ప్రధానమంత్రి ఎంపిక చేస్తాడు. వీరిని మంత్రిమండలి అంటారు.
→ కేంద్ర జాబితా : కేంద్ర పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయగల విషయాలను కేంద్ర జాబితా అంటారు.
→ రాష్ట్ర జాబితా : రాష్ట్ర శాసనసభ మాత్రమే చట్టాలు చేయగల విషయాలను రాష్ట్ర జాబితా అంటారు.
→ ఉమ్మడి జాబితా : పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండూ చట్టాలు చేయగల విషయాలను ఉమ్మడి జాబితా అంటారు.