AP 8th Class Social Notes Chapter 13 భారత రాజ్యాంగం

Students can go through AP Board 8th Class Social Notes 13th Lesson భారత రాజ్యాంగం to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 13th Lesson భారత రాజ్యాంగం

→ మన నాయకులు బ్రిటిషు వలస పాలనకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు దేశ భవిష్యత్తు, ప్రభుత్వం రాచరిక పాలనలో కాకుండా ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకున్నారు.

→ రాజ్యాంగం అన్నది దేశాన్ని ఎలా పరిపాలించాలి, చట్టాలు ఎలా చేయాలి, వాటిని ఎలా మార్చాలి, ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, పౌరుల పాత్ర ఏమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి వంటి నియమాలను కలిగి ఉంటుంది.

→ మత కల్లోలాల వల్ల దేశవిభజన జరిగింది. దేశం మరిన్ని ముక్కలు కాకుండా ఒకటిగా ఉండటానికి నాయకులు కృషి చేశారు.

→ చట్టం ముందు ప్రజలందరూ సమానులుగా ఉంటారు. అందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి.

→ స్వాతంత్ర్యం రాకముందే 1928 లో మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన మరో 8 మంది కలిసి భారతరాజ్యాంగాన్ని రాశారు.

→ ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని రాసింది. రాజ్యాంగసభ సభ్యులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు.

→ స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చి, మార్గదర్శకంగా నిలిచిన విలువలే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచాయి.

→ భారత రాజ్యాంగంలోని అన్ని అంశాలకు పీఠిక మార్గదర్శకం చేస్తుంది. రాజ్యాంగంలో ఇదేకాక ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి.

→ ఈ రాజ్యాంగం మనకు పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఇచ్చింది. మన దేశం సమాఖ్యవ్యవస్థను కలిగి ఉంది.

→ అంతిమంగా, రాజ్యాంగం అన్నది మారుతూ, సజీవంగా ఉండే పత్రం. 2011 వరకు మన రాజ్యాంగానికి 97 సవరణలు చేశారు.

AP 8th Class Social Notes Chapter 13 భారత రాజ్యాంగం

→ రాచరికం : రాజుల పాలన

→ ప్రతినిధి : ఒకరి లేదా కొందరి తరఫున నియమించబడినవారు లేదా ఎన్నుకోబడినవారు.

→ వివక్ష : వేరుగా చూడటం ఉదా : లింగ వివక్ష వర్ణ వివక్ష.

→ స్వయం ప్రతిపత్తి : స్వతంత్రంగా వ్యవహరించడం. (రాజ్యాంగ బద్దంగా)

→ రాజ్యాంగం : భారతదేశం నమ్మిన మౌలిక సూత్రాలు, దేశాన్ని పరిపాలించే విధానాలు, ఒక పుస్తకంలో పొందుపరిచారు. అదే భారత రాజ్యాంగం.

→ సర్వసత్తాక : అంతర్గత, విదేశీ వ్యవహారాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోడానికి, చట్టాలు చేయటానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉంటుంది. బయటి శక్తులు ఏవీ భారతదేశానికి చట్టాలు రూపొందించలేవు.

→ సమాఖ్య వ్యవస్థ : ఒక కేంద్ర ప్రభుత్వం దాని క్రింద రాష్ట్రస్థాయి ప్రభుత్వాలు ఉన్న వ్యవస్థను సమాఖ్య వ్యవస్థ అంటారు.

→ రాష్ట్రం : కేంద్రానికి లోబడి క్రింది స్థాయిలో ఉన్న ప్రభుత్వ పరిధిలో కచ్చితమైన హద్దులు కలిగిన భూభాగం.

→ ముసాయిదా : చిత్తుప్రతి. రాజ్యాంగాన్ని ముందుగా డా|| బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో చర్చ నిమిత్తం తయారుచేసిన ప్రతి.

→ గణతంత్రం : ఎన్నికైన వ్యక్తి దేశాధినేత అవుతాడు. అంతేకాని రాజ్యా లలో మాదిరి ‘ వారసత్వంగా అధికారం రాదు.

→ లౌకిక : మత ప్రమేయం లేకుండుట.

→ సౌభ్రాతృత్వం : ప్రజలందరి మధ్య ఐక్యత, సోదర భావన పెంపు. తోటి పౌరులను పరాయివారిగా భావించకుండా తక్కువ చేయకుండా ఉండుట.

→ సవరణ : మార్పులు చేయుట.

AP 8th Class Social Notes Chapter 13 భారత రాజ్యాంగం 1