AP 8th Class Social Notes Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

Students can go through AP Board 8th Class Social Notes 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 16th Lesson జమీందారీ వ్యవస్థ రద్దు

→ స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. కరవు కాటకాలు, రోగాలు తరచు సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి.

→ బ్రిటిషు కాలంలోని ఆందోళనలు రైతుకూలీల సమస్యలు, వారి కోరికలు, ఆశలపై దృష్టి కేంద్రీకరించాయి. ‘దున్నేవాడికి భూమి’ అని నినదించారు.

→ జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1950లో చేశాయి.

→ మద్రాసు ఎస్టేట్ బిల్లు 1950లో అమలులోకి వచ్చింది.

→ 1927లోనే వెట్టిని నిర్మూలిస్తూ చట్టం చేశారు. కానీ అది 1948 నాటికి అంతమయింది.

→ 1949, ఆగస్టు 15న జారీ చేసిన మరొక ఫర్మానా ద్వారా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న 995 జాగీర్లను రద్దు చేశారు.

→ అన్ని రకాల కౌలుదార్లకు రక్షణ కల్పిస్తూ ప్రఖ్యాత హైదరాబాదు కౌలుదారీ చట్టాన్ని 1950లో చేశారు.

→ భూకేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా, అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే భావించాడు.

→ భూపరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ, విధానసభలు 1972 సెప్టెంబరులో ఆమోదించాయి.

→ భూ పరిమితి : ఒక్కొక్క కుటుంబం ఎంత భూమి కలిగి ఉండాలనే పరిమితి.

→ జాగీరుదారీ వ్యవస్థ : చిన్న చిన్న రాజ్యాలను జాగీర్లు అనేవారు. వీటిని పాలించే వారిని జాగీర్దారులు అంటారు. ఈ వ్యవస్థ జాగీర్దారీ వ్యవస్థ.

→ ఫర్మానా : ప్రభుత్వ ఉత్తర్వులు – నాటి నిజాం ప్రభుత్వ ఉత్తర్వులు.

→ కౌలుదారీ చట్టం : కౌలుదారులను భూ యజమానులుగా ప్రకటించిన చట్టం.

AP 8th Class Social Notes Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు

→ భూదాన ఉద్యమం : ఆచార్య వినోబాభావే ప్రారంభించిన ఉద్యమం. భూమి ఉన్నవారి నుండి సేకరించి, లేనివారికి పంచడం.

→ సర్ఫ్-ఎ-ఖాస్ : నిజాం సొంత ఆస్తి.

→ మక్తాలు : చిన్న చిన్న రాజ్యాల లాంటివి.

→ భూకమతం : ఒక యజమాని కలిగియున్న భూమి.

→ బేగార్ / వెట్టి : ఫలం లేకుండా ఇతరుల వద్ద పనిచేయడం (బలవంతంగా)

→ నష్టపరిహారం : ఏదేనీ ఒక వస్తువును పోగొట్టుకున్నందుకు బదులుగా పొందేది.

→ ఖుద్‌కాస్త్ : జమీందారుల సొంత భూమి.

AP 8th Class Social Notes Chapter 16 జమీందారీ వ్యవస్థ రద్దు 1