Students can go through AP Board 6th Class Social Notes 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు to understand and remember the concept easily.
AP Board 6th Class Social Notes 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
→ భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు.
→ భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు.
→ పీఠభూములు అనగా ఎత్తు ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు.
→ అగ్ని పర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి.
→ రాయలసీమలోని అధికభాగం దక్కన్ పీఠభూమికి చెందినది.
→ సాధారణంగా పీఠభూములు ఖనిజ సంపదను కలిగి ఉంటాయి.
→ సముద్ర మట్టం నుండి 1,000 నుండి 6,000 మీ|| ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి.
→ సముద్రమట్టం నుండి గరిష్ఠంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు.
→ మైదానాలు ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు.
→ చోటానాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినది.
→ అంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 972 కి. మీ.||
→ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణతపరంగా భారతదేశంలో ఏడవ పెద్ద రాష్ట్రం, జనాభాపరంగా 10వ పెద్ద రాష్ట్రం.
→ కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో 9 జిల్లాలున్నాయి. ఇది సారవంతమైన ప్రదేశం.
→ రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాలున్నాయి. అనిశ్చిత వర్షపాత ప్రాంతం.
→ ఆంధ్రప్రదేశ్ లో కొండల వరుసలు విచ్చిన్న శ్రేణులుగా ఉండి తూర్పు కనుమలుగా పిలవబడుతున్నాయి.
→ 1690 మీ|| ఎత్తుగల అరుకులోయలోని అరోమకొండ (జిందగడ) మన రాష్ట్రంలో ఎత్తయిన శిఖరం.
→ పోలవరం ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.
→ విశాఖ జిల్లాలోని అరకులోయ, బొర్రాగుహలు, తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండలు పేరుపొందిన పర్యాటక ప్రదేశాలు.
→ లంబ సింగి/ లమ్మసింగిని ఆంధ్రా కాశ్మీర్‌గా పిలుస్తారు.
→ పోడు అనేది గిరిజన వ్యవసాయ పద్ధతి. దీనినే ‘స్థలమార్పిడి’ లేదా ‘ఝూమ్’ వ్యవసాయం అనికూడా పిలుస్తారు.
→ 1989లో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
→ ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతం రాయలసీమలో కలదు. ఇక్కడ వర్షపాతం తక్కువ మరియు అంతగా నమ్మదగినదిగా ఉండదు.
→ ఆంధ్రప్రదేశ్ లో మైదానాలు కోస్తా జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
→ డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడంగుల వంటివి.
→ వర్షకాలపు పంటని ఖరీఫ్’గానూ, శీతాకాలపు పంటని ‘రబీ’ అని పిలుస్తారు.
→ కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు.
→ పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో కలదు.
→ ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంటలను నగదు పంటలు / వ్యాపార, వాణిజ్య పంటలు అంటారు.
→ ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగు చేసేవి.
→ ఆహారం కొరకు జలచరాలను పెంచుటను (సాగు చేయుటను) ‘ఆక్వాకల్చర్’ అంటారు.
→ ఆహారం, వస్త్రధారణ, వృత్తులు వారి జీవనోపాధులు ప్రాంతీయంగా ఉండే భౌగోళిక పరిసరాలు, శీతోష్ణస్థితితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.
→ ఆంధ్రప్రదేశ్ లోని కొండలు (తూర్పు కనుమలు) భాండలైట్, చార్నోకైట్ రాళ్ళతో ఏర్పడినవి.
→ కొండ ప్రాంతాలు (నేలలు) కాఫీ, తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనువుగా ఉంటాయి.
→ కడప, కర్నూలు జిల్లాల్లో నల్లరేగడి నేలలు కలవు.
→ చౌడు నేలల్లో ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉంటాయి. ఇవి పంటలకు అనుకూలంగా ఉండవు.
→ ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన ఉన్న పులికాట్ సరస్సు వరకు విస్తారమైన తీర మైదానం ఉంది.
→ ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన నదులు గోదావరి, కృష్ణా.
→ యారాడ మరియు అనంతగిరి కొండలు విశాఖపట్నం జిల్లాలో కలవు.
→ శేషాచలం, హార్సిలీ కొండలు చిత్తూరు జిల్లాలో కలవు.
→ పెనుకొండ, మడకశిర కొండలు అనంతపురం జిల్లాలో కలవు.
→ పూర్వకాలంలో వర్షపునీటిని నిల్వ ఉంచుకోవడానికి చెరువులు తవ్వేవారు.
→ భూస్వరూపం : భూమి ఉపరితలం పైన విస్తరించి ఉన్న వివిధ భూభాగాలు.
→ భూభాగం : ఒక ప్రదేశం యొక్క భౌగోళిక స్థితిని తెలుపుతుంది.
→ మధ్యవర్తి : ఒక వ్యక్తి లేదా సమూహానికి ప్రతినిధిగా వ్యవహరించేవాడు.
→ నీటి ఊట : భూమి ఉపరితలం పైకి ఉబికి వచ్చే నీటి జాడ.
→ కరవు : సుదీర్ఘమైన వర్షాభావం వల్ల ఏర్పడే స్థితి.
→ కరవుకు గురయ్యే ప్రాంతం : తరచుగా కరవులు వచ్చే ప్రదేశం.
→ ఒండ్రు మట్టి నేలలు : నదీప్రవాహం మేట వేయటం వలన ఏర్పడిన సారవంతమైన నేలలు.
→ ఉద్యానవనాలు : పండ్లతోటలు.
→ మెరక భూములు : మైదాన ప్రాంతానికి కన్నా కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశాలు.
→ పర్వతాలు : భూ ఉపరితలంపై సహజమైన ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు, కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో చిన్న శిఖరాన్ని కల్గి ఉంటాయి.
→ పీఠభూములు : ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. ఇవి పరిసరాల కంటే ఎత్తయిన సమ ఉపరితలం గల బల్ల పరుపు భూములే పీఠభూములు.
→ మైదానాలు : సముద్ర మట్టం నుండి గరిష్ఠంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలే మైదానాలు.
→ కోస్తా ఆంధ్ర : ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న 9 జిల్లాలను కోస్తా ఆంధ్రగా పిలుస్తారు.
→ రాయలసీమ : రాతిపొరలు, పొడి నేలలతో కూడిన 4 జిల్లాల సమాహారం.
→ ఖరీఫ్ : వర్షాకాలపు పంట (జూన్, జులై నెలలో ప్రారంభించే పంట)
→ రబీ : శీతాకాలపు పంట (డిసెంబరు నెలలో వేసే పంట)
→ నగదు పంట/వ్యాపార వాణిజ్య పంట : అధిక ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంటలు.
ఉదా : వేరుశనగ, పొగాకు.
→ ఆహార పంటలు : ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు సాగుచేసేవి.
ఉదా : వరి
→ ఆక్వాకల్చర్ (జలసేద్యం) : ఆహారం కొరకు జలచరాలను పెంచుటను (సాగు చేయుటను) ఆక్వాకల్చర్ అంటారు.
→ చౌడు నేలలు : ఎక్కువగా సున్నం, క్షార లవణాలు ఉండి పంటలు పండించటానికి అనుకూలంగా ఉండని నేలలు.
→ భూగర్భ జలం : నేల లోపలి పొరలలో ఉండే నీరు.
→ దక్కన్ పీఠభూమి : భారతదేశంలో దక్షిణాన ఉన్న పీఠభూమి, ఆంధ్రప్రదేశ్ ఈ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందినది.
→ గిరిజనులు : కొండ ప్రాంతాలలో (అడవుల్లో) నివసించే ఆదిమ జాతులు.
→ పెరటి తోట : ఇంటి ఆవరణలో పెంచేతోట.
→ అటవీ ఉత్పత్తులు : అడవులలో దొరికే ఉత్పత్తులు.
→ పోడు వ్యవసాయం (ఝూమ్) : కొండ ప్రాంతాలలో గిరిజనులు చేయు ఒక వ్యవసాయ పద్ధతి. అడవులను నరికి (కాల్చి, ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు. తరువాత భూసారం తగ్గడం వలన వేరే స్థలానికి మారతారు.
→ గొట్టపు బావులు : భూమిలోపలికి డ్రిల్లింగ్ ద్వారా గొట్టములను పంపి నీరును, మోటార్ల ద్వారా బయటకు తీసుకు వచ్చుట.
→ ITDA : ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ.
→ డెల్టా : నది సముద్రంలో కలిసే ముందు ఏర్పడే పాయల మధ్యభాగం మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడుతుంది. ఇవి సాధారణంగా ‘∆’ ఆకారంలో ఉంటాయి. ఇవే డెల్టాలు.