Students can go through AP Board 8th Class Social Notes 17th Lesson పేదరికం – అవగాహన to understand and remember the concept easily.
AP Board 8th Class Social Notes 17th Lesson పేదరికం – అవగాహన
→ వ్యవసాయ పనులలో మార్పులు రావటంతో కొంతమంది వృత్తిపనివారల జీవితాలలో సమస్యలు వచ్చాయి.
→ తీవ్రమైన ఆకలి కూడా పేదరికమే.
→ దీర్ఘకాల లేదా తీవ్ర ఆకలికి గురయిన వాళ్ళు బలహీనంగా ఉండి తరచు రోగాలబారిన పడుతుంటారు.
→ శక్తిని కిలోకాలరీలలో కొలుస్తారు.
→ పల్లె ప్రాంతాల వాళ్ళకి 2400, పట్టణంలో వాళ్ళకి 2100 కిలో కాలరీలు ఇచ్చే ఆహారం ప్రతిరోజూ అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు.
→ పోషకాహారలోపం ఉంటే చదవటం, పనిచేయటం, శారీరక పనులు చేయటం కష్టమవుతుంది.
→ భారత ప్రభుత్వం ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి జాతీయ నమూనా సర్వేని నిర్వహిస్తుంది.
→ జనాభాలో అత్యంత పేదవాళ్ళు అత్యంత ధనికుల కంటే చాలా తక్కువ కాలరీలు తీసుకుంటున్నారు.
→ ప్రామాణిక స్థాయిలో కాలరీలు తీసుకొని వాళ్ళనందరినీ పేదలుగా పరిగణించవచ్చు.
→ పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరకకపోవడం.
→ భారతదేశంలో ఇప్పటికీ 50% కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయం పనులపై ఆధారపడుతున్నారు.
→ ప్రస్తుతం వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంది.
→ ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవటానికి, ప్రతి వ్యక్తికి పని కల్పించాలని ‘పనికి హక్కు’ చెపుతోంది.
→ చౌక ధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయటాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అంటారు.
→ BPL సర్వే ఆధారంగా ప్రభుత్వం 3 రకాల కార్డులు జారీ చేసింది.
→ పోషకాహార లోపం : మనం తీసుకునే ఆహారంలో కావలసినన్ని పోషకాలు లేకపోవడం.
→ వ్యవసాయాభివృద్ధి : వ్యవసాయం ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నది. ఈ వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు నడిపించడమే వ్యవసాయాభివృద్ధి.
→ ఆదేశిక సూత్రాలు : ప్రభుత్వ విధానాలను నిర్దేశించినవే ‘ఆదేశిక సూత్రాలు’
→ ప్రజాపనులు : ప్రజలకు ఉపయోగపడే పనులు.
→ సామాజిక తనిఖీ : ప్రభుత్వంలోని అవినీతిని తగ్గించడానికి ఉద్దేశించినదే ‘సామాజిక తనిఖీ’.
→ దారిద్ర్యరేఖకు దిగువన : కుటుంబం ఆదాయం, జీవనోపాధి మార్గాలు, రోజూ తింటున్న ఆహారం, బట్టలు, గృహవసతి, వలస, అప్పు వంటి అంశాలను సేకరించి, ఆ వివరాలను బట్టి ఆ కుటుంబ స్థాయిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికి కొలబద్దే ఈ దారిద్ర్యరేఖ. దీనికన్నా తక్కువ స్థాయి ఉన్నవారిని దారిద్ర్యరేఖకు దిగువనున్నవారు అని అంటారు.
→ ప్రజాపంపిణీ వ్యవస్థ : చౌకధరల దుకాణాల ద్వారా ఆహారధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ అంటారు.