AP 8th Class Social Notes Chapter 18 హక్కులు – అభివృద్ధి

Students can go through AP Board 8th Class Social Notes 18th Lesson హక్కులు – అభివృద్ధి to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 18th Lesson హక్కులు – అభివృద్ధి

→ ప్రపంచంలోని మానవులందరికీ ఉల్లఘించకూడని కొన్ని మౌలిక హక్కులున్నాయి.

→ వీటిలో గౌరవప్రద జీవనం గడిపే హక్కు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు హక్కు జీవించే హక్కు అంటే మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించే హక్కు ముఖ్యమైనవి.

→ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించడం అంటే అది ప్రజలందరి ప్రాథమిక హక్కు.

→ 1945లో ఐ.రా.స. ఏర్పడినప్పుడు స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన హక్కులు మానవులందరి ప్రాథమిక హక్కులుగా పరిగణించారు.

→ పేదల ప్రయోజనాల కోసం రూపొందించిన కార్యక్రమాలు సాధారణంగా వారికి చేరవు. ఇలా జరగటానికి అవినీతే ముఖ్యమైన కారణం.

→ ఎన్నో సం||రాల పోరాటం తరువాత అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ 1995లో రాజస్థాన్లో ఒక చట్టం చేశారు.

→ జాతీయస్థాయిలో పార్లమెంటు 2005లో స.హ.చ. చేసింది.

AP 8th Class Social Notes Chapter 18 హక్కులు – అభివృద్ధి

→ 2002లో విద్యను 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుగా గుర్తించారు. 2009లో ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని చేశారు.

→ మానవ హక్కులు : మానవులకు మౌలికంగా, కొన్ని హక్కులున్నాయి. జీవించే హక్కు స్వేచ్ఛా హక్కు మొదలైనవి.

→ సమాచార హక్కు చట్టం : ప్రభుత్వ శాఖల నుండి ఏ సమాచారమైన నిర్ణీతమైన పద్ధతిలో తెలుసుకునే హక్కు చట్టం (కొన్నింటికి మినహాయింపు కలదు).

→ విద్యా హక్కు చట్టం : 6 నుండి 14 ఏళ్ళ లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలనే చట్టం

→ స్వేచ్ఛ : ఎవరికి వారు కలిగి ఉండేది, ఇతరులకు లోబడకుండా ఉంచేది.

AP 8th Class Social Notes Chapter 18 హక్కులు – అభివృద్ధి 1