AP 8th Class Social Notes Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

Students can go through AP Board 8th Class Social Notes 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు to understand and remember the concept easily.

AP Board 8th Class Social Notes 19th Lesson సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

→ భారతీయులు సంఘసంస్కరణల ద్వారా అన్ని యుగాల్లోనూ తమ మూఢాచారాలను మార్చుకుంటూ వచ్చారు. ప్రపంచం పట్ల తమ అవగాహనను మెరుగుపరుచుకుంటూ వచ్చారు.

→ వివిధ దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చిన రకరకాల అలవాట్లు, భావనల నుంచి వాళ్ళు కొత్త జ్ఞానాన్ని అలవర్చుకోసాగారు.

→ యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి, అనువదించి, పుస్తకాలుగా ప్రచురించారు.

→ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం మొదలైనవి దేశంలో ప్రారంభమయ్యాయి.

→ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఈయన హిందూమతం అన్ని మతాల కంటే గొప్పదని భావించాడు.

→ స్వామి దయానంద సరస్వతి అనుచరులు పంజాబ్ లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు.

→ 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది.

→ ముస్లింలలో సాంఘిక, సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.

→ 1846లో 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్ళి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు.

→ బాల్య వివాహాలకు, బహు భార్యాత్వానికి వ్యతిరేకంగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పోరాడాడు.

→ కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.

AP 8th Class Social Notes Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు

→ 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించాడు.

→ మనుషులందరికీ ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణగురు.

→ సహాయనిరాకరణ, సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసినదిగా మహిళలను గాంధీజీ ప్రోత్సహించాడు.

→ సంస్కరణలు : ఏదేనీ ఒక రంగంలో కొత్త మార్పులను తీసుకుని రావడాన్ని సంస్కరణలు అంటారు.

→ సతి : పూర్వం భర్త చనిపోతే అతని భార్యను, భర్త చితిమీద బలవంతంగా కూర్చోబెట్టి తగులబెట్టేవారు. దీనినే ‘సతి’ అని అంటారు.

→ పరదా : స్త్రీ తన ముఖం పరులకు కనపడకుండా ముసుగును ధరించడం.

→ వితంతు పునర్వివాహం : భర్తలు మరణించిన స్త్రీలకు మరలా వివాహం చేయడం.

→ అంటరానితనం : పూర్వకాలం సమాజంలో కొన్ని కులాల వారిని మిగతావారు ముట్టుకునేవారు కాదు. దాన్ని ‘అంటరానితనం’ అని అనేవారు.

AP 8th Class Social Notes Chapter 19 సాంఘిక, మత సంస్కరణోద్యమాలు 1