These AP 9th Biology Important Questions and Answers 1st Lesson కణ నిర్మాణం – విధులు will help students prepare well for the exams.
AP Board 9th Class Biology 1st Lesson Important Questions and Answers కణ నిర్మాణం – విధులు
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
ఉల్లిపొరలో కణాల ఆకారం?
జవాబు:
ఉల్లిపొరలో కణాల ఆకారం దీర్ఘచతురస్రాకారం.
ప్రశ్న 2.
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం?
జవాబు:
మానవుల బుగ్గనందలి కణముల ఆకారం గుండ్రం.
ప్రశ్న 3.
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని?
జవాబు:
శాస్త్ర పరిశోధన తొలినాళ్ళలో కణాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించిన సూక్ష్మదర్శిని సరళ సూక్ష్మదర్శిని.
ప్రశ్న 4.
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం?
జవాబు:
వృక్ష నమూనా కణంలో తప్పనిసరిగా చూపించవలసిన కణాంగం హరితరేణువు.
ప్రశ్న 5.
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర?
జవాబు:
వృక్ష కణంలో కణత్వచమునకు బయట ఉండే పొర కణకవచము.
ప్రశ్న 6.
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు?
జవాబు:
హరిత రేణువులు ఉండే మొక్క భాగాలు పత్రాలు, లేత కాండాలు.
ప్రశ్న 7.
ప్లాస్మాపొర దేనితో నిర్మితమయినది?
జవాబు:
ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమయినది.
ప్రశ్న 8.
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది?
జవాబు:
కణంలోని కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేసేది ప్లాస్మాపొర.
ప్రశ్న 9.
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది?
జవాబు:
కణం లోపల సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహించేది ప్లాస్నాపొర లేదా కణత్వచం.
ప్రశ్న 10.
ప్లాస్మాపొర యొక్క ప్రత్యేక లక్షణం?
జవాబు:
అన్ని పదార్థాలను తన గుండా ప్రసరింపనీయకపోవడం.
ప్రశ్న 11.
ప్లాస్మాపొరని విచక్షణ త్వచం అని ఎందుకు అంటారు?
జవాబు:
కొన్ని ప్రత్యేకమైన పదార్థాల వినిమయం మాత్రమే ప్లాస్మాపొర ద్వారా జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అంటారు.
ప్రశ్న 12.
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం?
జవాబు:
వృక్ష కణాలలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన భాగం కణకవచం.
ప్రశ్న 13.
కణకవచం ఏ పదార్థంతో తయారవుతుంది?
జవాబు:
కణకవచం సెల్యులోజ్ అనే పదార్థంతో తయారవుతుంది.
ప్రశ్న 14.
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది?
జవాబు:
కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగేటప్పుడు ఇతర కణాలకు నిరంతరంగా సమాచార మార్పిడి చేసేది కణకవచం.
ప్రశ్న 15.
వృక్ష కణాలలో కణకవచం యొక్క ఆవశ్యకత ఏమిటి?
జవాబు:
కణరసం ద్వారా ఏర్పడే బాహ్యపీడనాన్ని నిరోధించడానికి కణకవచం అంతర పీడనాన్ని కలుగచేస్తుంది.
ప్రశ్న 16.
కేంద్రకాన్ని ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు?
జవాబు:
కేంద్రకాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నారు.
ప్రశ్న 17.
కేంద్రకమునకు గల మరియొక పేరు?
జవాబు:
కేంద్రకమునకు గల మరియొక పేరు కణనియంత్రణ గది.
ప్రశ్న 18.
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం?
జవాబు:
కణాంగాలలో అన్నింటికంటే పెద్ద కణాంగం కేంద్రకం.
ప్రశ్న 19.
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ఫ్రీడన్ కేంద్రకమును ఏమని పిలిచాడు?
జవాబు:
కొత్త కణాలు కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని భావించి ప్లీడన్ కేంద్రకమును సైటోబ్లాస్ట్ అని పిలిచాడు.
ప్రశ్న 20.
కణంలో కేంద్రకం ఉందని జీవులు?
జవాబు:
కణంలో కేంద్రకం ఉండని జీవులు క్షీరదాల ఎర్రరక్త కణాలు మరియు పోషక కణజాలంలోని చాలనీ నాళాలు.
ప్రశ్న 21.
కేంద్రకం నిర్వహించు విధులు?
జవాబు:
కణ విధులన్నింటిని నియంత్రించడం, జన్యు సమాచారం కలిగి, జీవుల లక్షణాలను నిర్ధారించడం, కణవిభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర వహిస్తుంది.
ప్రశ్న 22.
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు?
జవాబు:
కేంద్రకమును ఆవరించి యుండే పొర పేరు కేంద్రక త్వచం.
ప్రశ్న 23.
కేంద్రక త్వచం ఆధారంగా కణములు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
కేంద్రక త్వచం ఆధారంగా కణాలు రెండు రకాలు. అవి – కేంద్రకపూర్వకణం మరియు నిజకేంద్రక కణం.
ప్రశ్న 24.
కేంద్రక పూర్వకణాలు అనగానేమి?
జవాబు:
కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వకణాలు అంటారు.
ఉదా : బాక్టీరియా, సయానోబాక్టీరియా
ప్రశ్న 25.
కణద్రవ్యము అనగానేమి?
జవాబు:
కణద్రవ్యము అనగా ప్లాస్మా పొరచే ఆవరించియున్న జిగురు పదార్థము.
ప్రశ్న 26.
కేంద్రకంలోని పదార్ధమును ఏమంటారు?
జవాబు:
కేంద్రకంలోని పదార్ధమును కేంద్రక రసం లేదా కేంద్రక ద్రవ్యం అంటారు.
ప్రశ్న 27.
కణంలోని ముఖ్యమైన కణాంగాలేవి?
జవాబు:
కణంలోని ముఖ్యమైన కణాంగాలు :
అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్టి సంక్లిష్టాలు, లైసోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు మరియు రిక్తికలు కణంలోని ముఖ్య కణాంగాలు.
ప్రశ్న 28.
అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగమేమి?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలము ద్వారా కణంలో ఒక భాగం నుండి మరియొక భాగానికి ప్రోటీన్లు మరియు కొన్ని పదార్థాల రవాణా జరుగుతుంది మరియు కణంలో జరిగే కొన్ని జీవరసాయన చర్యలకు వేదికగా పనిచేస్తుంది.
ప్రశ్న 29.
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను ఏమంటారు?
జవాబు:
అంతర్జీవ ద్రవ్యజాలం ఉపరితలంపై రేణువుల వంటి నిర్మాణాలను రైబోజోములు అంటారు.
ప్రశ్న 30.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు కలిగిన అంతర్జీవ ద్రవ్యజాలంను గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు.
ప్రశ్న 31.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అనగానేమి?
జవాబు:
రైబోజోములు లేని అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము.
ప్రశ్న 32.
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగం?
జవాబు:
గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది.
ప్రశ్న 38.
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము ఉపయోగం?
జవాబు:
నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల సంశ్లేషణ చేస్తుంది.
ప్రశ్న 34.
సకశేరుక కాలేయ కణాలలోని నునుపుతల అంతర్జీవ ద్రవ్యజాలం విధి?
జవాబు:
అనేక విష పదార్థాలు, మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
ప్రశ్న 35.
1898 వ సంవత్సరంలో కణము నందు గాల్టి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు?
జవాబు:
1898 వ సంవత్సరంలో కణము నందు గాలి సంక్లిష్టాన్ని పరిశీలించినవాడు కామిల్లో గాల్లి.
ప్రశ్న 36.
గాల్జిసంక్లిష్టం విధి ఏమిటి?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు వివిధ రకాల పదార్థాలను కణంలోని ఇతర భాగాలకు రవాణా చేసే ముందు తమలో నిల్వ చేసుకొని కొంత మార్పు చెందిస్తాయి.
ప్రశ్న 37.
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?
జవాబు:
గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఎంజైమ్ లేదా హార్మోన్లను స్రవించే కణాలు.
ప్రశ్న 38.
లైసోజోమ్ లను స్వయం విచ్ఛిత్తి సంచులు అని ఎందుకు అంటారు?
జవాబు:
వినాశనం కావలసిన పదార్థాలు లైసోజోమ్స్ కు రవాణా చేయబడతాయి. లైసోజోమ్స్ పగిలి అందులోని ఎంజైమ్స్ విడుదలై వాటిని నాశనం చేస్తాయి. అందువలన లైసోజోమ్ లను స్వయం విచ్చిత్తి సంచులు అంటారు.
ప్రశ్న 39.
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుదు కనబడే కణాంగం?
జవాబు:
జానస్ గ్రీన్-బి ద్రావణంతో రంజనం చేసినపుడు కనబడే కణాంగం మైటోకాండ్రియా.
ప్రశ్న 40.
మైటోకాండ్రియా పొడవు, వ్యాసం ఎంత ఉంటాయి?
జవాబు:
మైటోకాండ్రియా పొడవు 2-8 మైక్రాన్లు మరియు 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటాయి.
ప్రశ్న 41.
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం?
జవాబు:
కేంద్రకం కంటే 150 రెట్లు చిన్నదైన కణాంగం మైటోకాండ్రియా.
ప్రశ్న 42.
ప్రతి కణంలో ఉండే మైటోకాండ్రియాల సంఖ్య?
జవాబు:
ప్రతి కణంలో 100-150 మైటోకాండ్రియాలు ఉంటాయి.
ప్రశ్న 43.
క్రిస్టే అనగానేమి?
జవాబు:
మైటోకాండ్రియా అంతరత్వచం లోపలికి చొచ్చుకొని ముడతలు పడిన నిర్మాణాలను ఏర్పరుస్తుంది. ఈ నిర్మాణాలను క్రిస్టే అంటారు.
ప్రశ్న 44.
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని ఏమంటారు?
జవాబు:
మైటోకాండ్రియా క్రిస్టే మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మాత్రిక అంటారు.
ప్రశ్న 45.
మైటోకాండ్రియాలను కణ శక్త్యాగారాలు అని ఎందుకు అంటారు?
జవాబు:
కణానికి కావల్సిన శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియాలను ‘కణ శక్త్యాగారాలు’ అంటారు.
ప్రశ్న 46.
హరితరేణువులు ఆకుపచ్చగా ఎందుకు ఉంటాయి?
జవాబు:
పత్రహరితం ఉండుట వలన హరితరేణువులు ఆకుపచ్చగా ఉంటాయి.
ప్రశ్న 47.
ప్లాస్టిడ్లు ఎన్ని రకాలు? అవి ఏవి?
జవాబు:
ప్లాస్టిడ్లు రెండు రకాలు. అవి : 1. క్రోమోప్లాన్లు మరియు 2. ల్యూకోప్లాస్టు
ప్రశ్న 48.
మొక్కలలో హరితరేణువుల వ్యాసం ఎంత?
జవాబు:
మొక్కలలో హరితరేణువుల వ్యాసం 4-10 మైక్రాన్లు.
ప్రశ్న 49.
క్లోరోప్లాస్ట్ ముఖ్యమైన విధి ఏది?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనిక శక్తిగా క్లోరోప్లాస్ట్ మార్చుతుంది.
ప్రశ్న 50.
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాన్ల సంఖ్య?
జవాబు:
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో క్లోరోప్లాస్ట సంఖ్య 50-200.
ప్రశ్న 51.
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
జవాబు:
కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు మాధియస్ జాకబ్ ప్లీడన్ మరియు థియోడర్ ష్వాన్.
ప్రశ్న 52.
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు?
జవాబు:
కణాలు విభజన చెంది కొత్త కణాలు ఏర్పడతాయని 1855వ సంవత్సరంలో వివరించినవాడు రోడాల్ఫ్ విర్కో
ప్రశ్న 53.
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు?
జవాబు:
ఆధునీకరించిన కణసిద్ధాంతంలోని అంశాలు :
1. జీవరాసులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి.
2. కణాలన్నీ ముందుతరం కణాల నుండి ఏర్పడతాయి.
ప్రశ్న 54.
కణవ్యవస్థీకరణను ఎలా అభినందిస్తావు?
జవాబు:
జీవులలో కణము చక్కగా వ్యవస్థీకృతమైనది. కణము కణజాలముగాను, కణజాలములు అవయవముగాను, అవయవములు కలిసి అవయవ వ్యవస్థలుగాను, అవయవ వ్యవస్థలు జీవిగాను రూపొందినాయి.
ప్రశ్న 55.
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థీకరణం నాశనమైతే ఏమి జరుగుతుంది?
జవాబు:
భౌతిక మరియు రసాయనిక చర్యల వలన కణ వ్యవస్థ నాశనమైతే జీవక్రియల నిర్వహణ అనగా శ్వాసక్రియ, పోషణ, విసర్జన మొదలగు క్రియల నిర్వహణకు కణ సామర్థ్యము సక్రమముగా ఉండదు.
ప్రశ్న 56.
అతి సూక్ష్మకణం విధిని అతి పెద్దగా ఉండే జీవిలో ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణములు నిర్వహించే విధుల మీద ఆధారపడి ఉంటాయి. కనుక అతిపెద్ద జీవి సక్రమముగా విధులను నిర్వహించుటకు కారణము ఆ జీవిలోని అతిచిన్న కణములు సక్రమముగా విధులు నిర్వహించడమే.
ప్రశ్న 57.
మొక్క కణము నందు ఉండే హరితరేణువు యొక్క పాత్రను ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు:
హరితరేణువు లేకపోతే మొక్క ఆకులలో ఆహారము తయారు కాదు. తద్వారా సమస్త జీవులకు ఆహారం లభ్యమయ్యేది కాదు.
ప్రశ్న 58.
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయన్న భావననను నీకు ఏ విధంగా అన్వయించుకుంటావు?
జవాబు:
కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడడం వలనే పెరుగుదల, అభివృద్ధి జరుగుతుంది.
ప్రశ్న 59.
రంగు రంగుల పండ్లు, పూలకు కారణము ఏమిటి?
జవాబు:
రంగు రంగుల పండ్లు, పూలకు మొక్కలలో మాత్రమే ఉండు క్రోమోప్లాస్టులు కారణం.
ప్రశ్న 60.
కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే ఏమి జరుగును?
జవాబు:
వ్యర్థ పదార్థములు కణమునందు ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంటాయి. కణము నందు లైసోజోములు లేకపోయినట్లయితే తద్వారా కణము తన విధిని సక్రమముగా నిర్వహించలేదు.
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
టమాటాలో కింది రంగు మారడానికి కారణము ఏమనుకుంటున్నారు?
పచ్చని రంగు – తెలుపు – పసుపు – ఎరుపు
జవాబు:
- టమాటా నందు రంగు మారటానికి ప్లాస్టిడ్లు కారణం.
- ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకాలు. అవి : 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
- క్లోరోప్లాస్టులు ఆకుపచ్చ రంగు గల క్రోమోప్లాస్టులు.
- క్రోమోప్లాస్టులు, క్లోరోప్లాస్టులు, ల్యూకోప్లాస్టులు ఒక రంగు నుండి మరియొక రంగునకు మారగల శక్తి కలిగి ఉంటాయి.
- లేత టమాటా పరిపక్వం చెందే క్రమంలో మనము ఆకుపచ్చ, తెలుపు, పసుపుపచ్చ మరియు ఎరుపురంగు గల టమాటాలను చూస్తాము.
ప్రశ్న 2.
సూక్ష్మదర్శిని సహాయముతో కింద ఇవ్వబడిన సైడులను పరిశీలించి బొమ్మలు గీయండి. వాటిలో గల వివిధ కణాంగములను రాయండి.
జవాబు:
A) పారమీసియమ్ నందుగల కణాంగములు :
పూర్వ మరియు పర సంకోచ రిక్తికలు, సూక్ష్మ కేంద్రకము, స్థూలకేంద్రకము, సైటోసోమ్, సైటో పైజ్, ఆహారరిక్తిక మొదలగునవి.
B) అమీబాలోని కణాంగములు :
కేంద్రకము, సంకోచరిక్తికలు, ఆహారరిక్తికలు.
C) యూగ్లీనాలోని కణాంగములు :
కేంద్రకము, క్లోరోప్లాస్టులు, సంకోచరిక్తికలు, రిజర్వాయర్, పారప్లాజెల్లార్ దేహము, ఎండోసోమ్ మొదలగునవి.
ప్రశ్న 3.
నమూనా వృక్ష కణం పటము గీచి, భాగములను గుర్తించుము.
జవాబు:
ప్రశ్న 4.
రైబోజోమ్స్ గురించి రాయండి.
జవాబు:
- కణంలోని కణద్రవ్యంలో చిన్నవిగా రేణువుల రూపంలో కనబడే నిర్మాణాలను రైబోజోమ్స్ అంటారు.
- ఇవి ఆర్.ఎన్.ఎ. మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి.
- ఇవి రెండు రకాలు. కొన్ని కణద్రవ్యంలో స్వేచ్ఛగా చలించే రేణువుల రూపంలో ఉంటాయి.
- రైబోజోములలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది.
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కణజీవశాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తల చిత్రములను సేకరించుము. వారిని గురించి సంక్షిప్తముగా వివరింపుము.
జవాబు:
1) ఆ వాన్ లీవెన్‌హక్ 2) రాబర్ట్ హుక్ 3) రాబర్ట్ బ్రౌన్ 4) రుడాల్ఫ్ విర్కొన్ 5) బ్లేడన్ 6) ష్వాన్ 7) ఎర్నెస్ట్ రుస్కా 8) వాట్సన్ మరియు క్రిక్ 9) లిన్ మారులిస్ 10) ఆల్బర్ట్ క్లాడె
- 1632-1723. ఆస్టవాన్ లీవెన్‌హక్ సాధారణ సూక్ష్మదర్శినిని నిర్మించి దాని సహాయముతో నీటిలో ఉండే ప్రోటోజోవా, వర్టిసెల్లా మరియు నోటిలో ఉండే బాక్టీరియా బొమ్మలను గీచెను.
- 1665-ప్రాథమిక సంయుక్త సూక్ష్మదర్శినిని ఉపయోగించి బెండు ముక్కనందు సజీవ మొక్క కణజాలమునందలి కణములను కనుగొనెను.
- 1831-రాబర్ట్ బ్రౌన్ కేంద్రకమును కనుగొనెను.
- 1838-39-థియొడర్ ష్వాన్ మరియు M.J. ఫ్రీడన్ కణసిద్ధాంతమును ప్రతిపాదించిరి.
- 1885 రుడాల్స్ విర్కొవ్ కణవిభజనను కనుగొనెను.
- 1931-ఎర్నెస్ రుస్కా మొట్టమొదటి ఎలక్ట్రాను మైక్రోస్కోపును నిర్మించెను.
- 1953-వాట్సన్ మరియు క్రిస్టు DNA ద్వికుండలి నిర్మాణమును ప్రకటించెను.
- 1974-కణజీవశాస్త్ర పితామహుడైన ఆల్బర్ట్ క్లాడెనకు శరీర ధర్మశాస్త్రము (మెడిసిన్) నందు నోబెల్ బహుమతి వచ్చినది.
- 1981- కణపరిణామము నందు ఎండోసింబయాటిక్ సిద్ధాంతమును లిన్ మారులిస్ ప్రచురించెను.
ప్రశ్న 2.
ప్లాస్టిడ్ల గురించి రాయండి.
జవాబు:
- ప్లాస్టిడ్లు మొక్క కణములలో మాత్రమే ఉంటాయి.
- ప్లాస్టిడ్లు ప్రధానంగా రెండు రకములు. 1) క్రోమోప్లాస్టులు (రంగు గలవి) మరియు 2) ల్యూకోప్లాస్టులు (రంగులేనివి).
- హరిత రేణువులు (క్లోరోప్లాస్టులు) ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లు.
- కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిలోని సౌరశక్తిని గ్రహించి రసాయనశక్తిగా మార్చడమే క్లోరోప్లాస్టుల ముఖ్య విధి
- క్రోమోప్లాస్టులు రకరకాల పూలు మరియు పండ్ల రంగులకు కారణము.
- ల్యూకోప్లాస్టులు పిండిపదార్థాలను, నూనెలను మరియు ప్రోటీనులను నిల్వ చేస్తాయి.
ప్రశ్న 3.
అంతర్జీవ ద్రవ్యజాలము గురించి వివరించండి.
జవాబు:
- కణద్రవ్యంలో వ్యాపించి ఉన్న వల వంటి నిర్మాణము అంతర్జీవ ద్రవ్యజాలము.
- దీని ద్వారా కణములో ఒక భాగం నుండి మరియొక భాగానికి పదార్థాల రవాణా జరుగుతుంది.
- అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకములు.
1) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం 2) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. - రైబోజోములు కలిగిన గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీనుల సంశ్లేషణకు సహాయపడుతుంది.
- రైబోజోములు లేని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది.
- కణంలో జరిగే కొన్ని జీవ రసాయన చర్యలకు అంతర్జీవ ద్రవ్యజాలం వేదికగా పనిచేస్తుంది.
ప్రశ్న 4.
ప్లాస్మాపొరకు, కణత్వచమునకు మధ్యగల భేదాలు రాయండి.
జవాబు:
ప్లాస్మా పొర | కణత్వచము |
1. ప్రోటీనులు మరియు లిపితో తయారయినది. | 1. సెల్యులోజ్ తో తయారయినది. |
2. సజీవమైనది. | 2. నిర్జీవమైనది. |
3. మొక్క మరియు జంతు కణములలో ఉండును. | 3. కేవలం మొక్క కణములలో ఉంటుంది. |
4. విచక్షణ త్వచంగా పనిచేస్తుంది. | 4. విచక్షణ త్వచంగా పనిచేయదు. |
5. ఈ క్రింది పటములు గీచి, భాగములను గుర్తించండి.
1) కేంద్రకం :
2) అంతర్జీవ ద్రవ్యజాలం :
3) మైటోకాండ్రియా :
4) హరితరేణువు :
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు Important Questions and Answers
ప్రశ్న 1.
నిజకేంద్రక కణాలలో మైటోకాండ్రియా లేకపోతే ఏమవుతుంది?
జవాబు:
కణంలో జరిగే జీవక్రియలకు కావలసిన శక్తి విడుదల జరగదు. అందువల్ల జీవక్రియలు ఆగిపోతాయి కణం మరణిస్తుంది.
ప్రశ్న 2.
జీవపదార్థం, కణ ద్రవ్యముల మధ్య భేదం ఏమిటి?
జవాబు:
చాలాకాలం వరకు కణంలో ఉండే ద్రవ్యం జీవాన్ని కలిగి ఉంటుందని నమ్మేవారు తరువాత జీవపదార్థం అనేది ఒక మాధ్యమం అని దానిలో కణాంగాలు, రేణువులు ఉంటాయని కనుగొన్నారు.
కేంద్రకత్వచం బయట ఉన్న జీవ పదార్థాన్ని కణద్రవ్యం అని, కేంద్రకంలోని జీవపదార్థాన్ని కేంద్రక రసం లేక ద్రవ్యమని అంటున్నారు.
ప్రశ్న 3.
ఎ) పై పటంను గుర్తించి భాగమలు రాయుము.
బి) పై పటంను గురించి క్లుప్తంగా వివరించుము.
జవాబు:
ఎ) 1) మాత్రిక,
2) క్రిస్టే,
3) లోపలిపొర,
4) బయటి పొర
బి) 1) పై పటం చూపబడిన కణాంగము మైటోకాండ్రియా
2) ఇది కణశ్వాసక్రియలోను నిర్వహించి శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
3) వీటిని కణశక్యాగారాలు అంటారు.
4) ఇది వెలుపలి త్వచం మరియు లోపలి త్వచయులచే కప్పబడి ఉంటుంది. లోపల అనేక ముడుతలతో కూడిన నిర్మాణం ఉంటుంది. దీనిని మాత్రిక అంటారు. మాత్రికలో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని క్రిస్టే అంటారు.
ప్రశ్న 4.
కింది కణాంగాలు నిర్వహించే విధులు రాయండి.
జవాబు:
- మైటోకాండ్రియా – కణ శ్వాసక్రియలో పాల్గొంటుంది. శక్తి విడుదలకు తోడ్పడుతుంది.
- హరితరేణువు – సూర్యకాంతిని గ్రహించి కిరణజన్యసంయోగక్రియ జరిపి మొక్కలలో ఆహారాన్ని తయారుచేస్తుంది.
9th Class Biology 1st Lesson కణ నిర్మాణం – విధులు 1 Mark Bits Questions and Answers
లక్ష్యాత్మక నియోజనము
1. కణములను ప్రథమముగా దీనితో పరిశీలిస్తారు.
A) ఆప్టికల్ మైక్రోస్కోపు
B) సంయుక్త సూక్ష్మదర్శిని
C) ఎలక్ట్రాను మైక్రోస్కోపు
D) ఏదీకాదు
జవాబు:
A) ఆప్టికల్ మైక్రోస్కోపు
2. జంతుకణము వెలుపల ఉన్న పొర
A) కణకవచము
B) కణత్వచం
C) కేంద్రకత్వచము
D) కేంద్రకాంశత్వచము
జవాబు:
B) కణత్వచం
3. ప్లాస్మాపొర లేదా కణత్వచం దేనితో నిర్మితమైంది?
A) లిపిడ్లు
B) ప్రోటీనులు
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు
D) సెల్యులోజ్
జవాబు:
C) లిపిడ్లు మరియు ప్రోటీనులు
4. విచక్షణ త్వచంను గుర్తించండి.
A) కణకవచము
B) కణత్వచము
C) టోనోప్లాస్ట్
D) కేంద్రక త్వచము
జవాబు:
B) కణత్వచము
5. కణకవచము వీటిలో ఉంటుంది.
A) జంతువులు
B) మనుష్యులు
C) మొక్కలు
D) జంతుప్లవకాలు
జవాబు:
C) మొక్కలు
6. న్యూక్లియసను కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కొవ్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్
7. కణము నియంత్రణ గదిగా పనిచేయునది
A) కణత్వచము
B) కేంద్రకము
C) మైటోకాండ్రియా
D) కేంద్రకాంశము
జవాబు:
B) కేంద్రకము
8. కణములో ఈ భాగము జన్యుసమాచారము కలిగి ఉంటుంది.
A) కేంద్రకము
B) కేంద్రకాంశము
C) రైబోజోములు
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) కేంద్రకము
9. కేంద్రక పూర్వ కణమును గుర్తించుము.
A) బాక్టీరియమ్
B) సయానో బాక్టీరియా
C) పారమీసియమ్
D) బాక్టీరియమ్ మరియు సయానో బాక్టీరియా
జవాబు:
A) బాక్టీరియమ్
10. కణాంతర రవాణాలో పాల్గొనునది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టము
D) రైబోజోములు
జవాబు:
A) అంతర్జీవ ద్రవ్యజాలం
11. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) లిపిడ్లు
C) పిండిపదార్థములు
D) విటమినులు
జవాబు:
B) లిపిడ్లు
12. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము వీటి తయారీకి సహాయపడుతుంది.
A) ప్రోటీనులు
B) పిండిపదార్థాలు
C) లిపిడ్లు
D) విటమినులు
జవాబు:
C) లిపిడ్లు
13. సకశేరుక కాలేయ కణములందు విషములను మరియు మందులను విషరహితముగా చేయు కణాంగము
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము
B) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము
C) లైసోజోములు
D) రిక్తికలు
జవాబు:
A) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము
14. స్వయం విచ్ఛిత్తి సంచులని వీటిని అంటారు.
A) లైసోజోములు
B) రైబోజోములు
C) న్యూక్లియోజోమ్
D) గాల్టీ సంక్లిష్టము
జవాబు:
A) లైసోజోములు
15. ప్రతి కణమునందు ఉండు మైటోకాండ్రియాల సంఖ్య
A) 100 – 200
B) 150 – 300
C) 100 – 150
D) 100 – 300
జవాబు:
C) 100 – 150
16. కణ శక్త్యాగారాలు అని వీటిని అంటారు.
A) లెసోజోములు
B) మెటోకాండియా
C) రైబోజోములు
D) రిక్తికలు
జవాబు:
B) మెటోకాండియా
17. క్లోరోప్లాస్టులు పాల్గొను జీవక్రియ
A) శ్వాసక్రియ
B) కిరణజన్య సంయోగక్రియ
C) పోషణ
D) రవాణా
జవాబు:
B) కిరణజన్య సంయోగక్రియ
18. కణసిద్ధాంతమును ప్రతిపాదించినవారు
A) ప్లీడన్
B) ష్వాన్
C) ప్లీడన్ మరియు ష్వాన్
D) రుడాల్ఫ్ విర్కొవ్
జవాబు:
C) ప్లీడన్ మరియు ష్వాన్
19. కణవిభజనను మొదటగా గుర్తించినవాడు
A) రుడాల్ఫ్ విర్కొవ్
B) రాబర్ట్ హుక్
C) హూగో డివైస్
D) రాబర్ట్ బ్రౌన్
జవాబు:
A) రుడాల్ఫ్ విర్కొవ్
20. కేంద్రకము లోపల ఉన్న ద్రవపదార్ధము
A) కేంద్రకాంశ పదార్థము
B) కణద్రవ్యము
C) జీవపదార్ధము
D) జర్మ్ ప్లాన్స్
జవాబు:
A) కేంద్రకాంశ పదార్థము
21. జంతు కణంలో కనిపించే కణాంగం
A) హరితరేణువులు
B) రిక్తికలు
C) కణకవచం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా
22. కణం యొక్క సమతాస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర నిర్వహించునది
A) కణకవచం
B) ప్లాస్మాపొర
C) కణద్రవ్యం
D) కేంద్రకం
జవాబు:
B) ప్లాస్మాపొర
23. ప్లాస్మాపొర ద్వారా
A) అన్ని పదార్థాల ప్రసరణ జరుగుతుంది.
B) ద్రవ పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
D) గ్లూకోజ్ ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
జవాబు:
C) కొన్ని పదార్థాల ప్రసరణ మాత్రమే జరుగుతుంది.
24. ప్లాస్మాపొర ………..
A) ఒక విచక్షణా త్వచం
B) భేదక పారగమ్య త్వచం
C) పారగమ్య త్వచం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
25. కణకవచం కల్గించే పీడనం
A) బాహ్యపీడనం
B) అంతరపీడనం
C) స్ఫీతపీడనం
D) పైవేవీ కావు
జవాబు:
B) అంతరపీడనం
26. కేంద్రకాన్ని కనుగొన్నది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) ప్లీడన్
D) ష్వాన్
జవాబు:
B) రాబర్ట్ బ్రౌన్
27. ప్లీషన్ కేంద్రకానికి ఈ విధంగా పేరు పెట్టాడు.
A) సైటోబ్లాస్ట్
B) ఫైటోబ్లాస్ట్
C) క్లోరోప్లాస్ట్
D) న్యూక్లియోబ్లాస్ట్
జవాబు:
A) సైటోబ్లాస్ట్
28. అభివృద్ధి చెందిన ఈ కణాలలో కేంద్రకం ఉండదు.
A) చాలనీకణాలు
B) చాలనీనాళాలు
C) సహకణాలు
D) తంతువులు
జవాబు:
B) చాలనీనాళాలు
29. క్షీరదాలలో ఈ కణాలలో కేంద్రకం కనిపించదు.
A) కండరకణం
B) నాడీకణం
C) తెల్లరక్త కణం
D) ఎర్రరక్త కణం
జవాబు:
D) ఎర్రరక్త కణం
30. కణాలను దేనిని ఆధారం చేసుకుని విభజించారు?
A) కణకవచం
B) కణత్వచం
C) కేంద్రకత్వచం
D) మైటోకాండ్రియా
జవాబు:
C) కేంద్రకత్వచం
31. ఈ క్రింది వానిలో కేంద్రక పూర్వ కణం
A) రక్తకణం
B) బాక్టీరియాకణం
C) సయానోబాక్టీరియా
D) B & C
జవాబు:
D) B & C
32. కేంద్రక పూర్వ కణంలో
A) కేంద్రకం ఉండదు
B) కేంద్రకత్వచం ఉండదు
C) త్వచం కల్గిన కణాంగాలుండవు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
33. రైబోజోమ్ లు ఎక్కడ ఉంటాయి?
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) మైటోకాండ్రియా
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం
34. ఈ క్రింది వానిలో అసత్య వాక్యం
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.
B) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్లను సంశ్లేషణం చేస్తుంది.
C) అంతర్జీవ ద్రవ్యజాలం రవాణా మార్గంగా పనిచేస్తుంది.
D) సకశేరుకాల కాలేయ కణాల నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విషపదార్థాలను నిర్వీర్యం చేస్తుంది.
జవాబు:
A) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం కార్బోహైడ్రేట్లను సంశ్లేషణం చేస్తుంది.
35. ఈ క్రింది వానిలో గాల్జీ సంక్లిష్టానికి సంబంధించిన అసత్య వాక్యం
A) 1898వ సం||లో కెమిల్లో గాల్టీ గాల్టీ సంక్లిష్టాన్ని కనుగొన్నాడు.
B) ఈ కణాంగాలు త్వచాలతో నిర్మితమవుతాయి.
C) పదార్థాలను రవాణా చేసేముందు తమలో నిల్వ చేసుకుంటాయి.
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.
జవాబు:
D) ఎంజైము, హార్మోనులను స్రవించే కణాలలో ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి.
36. ఈ క్రింది వానిలో రెండు త్వచాలు కల్గిన కణాంగం
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) మైటోకాండ్రియా
D) లైసోజోమ్ లు
జవాబు:
C) మైటోకాండ్రియా
37. ఈ క్రింది వానిలో త్వచం లేని కణాంగం
A) రైబోజోమ్ లు
B) లైసోజోమ్ లు
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) గాల్జీ సంక్లిష్టం
జవాబు:
A) రైబోజోమ్ లు
38. ఈ క్రింది వానిలో DNAను కల్గి ఉండునది
A) కేంద్రకం
B) హరితరేణువులు
C) మైటోకాండ్రియా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
39. ఈ క్రింది వానిలో ఒకే త్వచం కల్గిన కణాంగం
A) లైసోజోమ్ లు
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) గాల్జీ సంక్లిష్టం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
40. మైటోకాండ్రియాలో మధ్యగల ఖాళీ ప్రదేశాన్నేమంటారు?
A) కణాంతర ప్రదేశం
B) కణ మధ్య ప్రదేశం
C) క్రిస్టే
D) మాత్రిక
జవాబు:
D) మాత్రిక
41. రైబోజోములు వీటితో నిర్మించబడతాయి.
A) RNA మరియు ప్రోటీన్లు
B) DNA మరియు ప్రోటీన్లు
C) RNA మరియు DNA
D) ప్రోటీన్లు మరియు లిపిడ్లు
జవాబు:
A) RNA మరియు ప్రోటీన్లు
42. పూలల్లో ఇవి ఉంటాయి.
A) క్లోరోప్లాస్టు
B) ల్యూకోప్లాస్టు
C) క్రోమోప్లాన్లు
D) అల్యూరో ప్లాస్టు
జవాబు:
C) క్రోమోప్లాన్లు
49. ఈ క్రింది వానిలో సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్చేది
A) మైటోకాండ్రియా
B) హరితరేణువు
C) గాల్టీ సంక్లిష్టం
D) రైబోజోమ్ లు
జవాబు:
B) హరితరేణువు
44. కిరణజన్య సంయోగక్రియ జరిగే కణాలలో క్లోరోప్లాస్ట్‌ల సంఖ్య సుమారు
A) 50 – 100
B) 50 – 150
C) 50 – 200
D) 50 – 250
జవాబు:
C) 50 – 200
45. కణంలో కుడ్యపీడనాన్ని నియంత్రించి వ్యర్థాలను బయటకు పంపే నిర్మాణాలు
A) ప్లాస్టిడ్లు
B) లైసోజోమ్ లు
C) గాల్జీ సంక్లిష్టం
D) రిక్తిక
జవాబు:
D) రిక్తిక
46. టోనోప్లాస్ట్ దీనిని కప్పి ఉంచే పొర.
A) కేంద్రకం
B) రైబోజోమ్ లు
C) రిక్తిక
D) మైటోకాండ్రియా
జవాబు:
C) రిక్తిక
47. కణాన్ని మొట్ట మొదటిసారిగా పరిశీలించినది
A) రాబర్ట్ హుక్
B) రాబర్ట్ బ్రౌన్
C) రుడాల్ఫ్ విర్కోవ్
D) మార్సెల్లో మాల్ఫీజి
జవాబు:
A) రాబర్ట్ హుక్
48. దీనిని జీవుల యొక్క క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణమంటారు.
A) కణజాలం
B) కణం
C) కండరం
D) ఎముక
జవాబు:
B) కణం
49. ఈ క్రింది ప్రవచనాలను చదవండి.
a) ప్లాస్టిర్లు వృక్షములలో మాత్రమే ఉంటాయి.
b) లైసోజోమ్స్ లో వినాశకరంకాని ఎంజైమ్స్ ఉంటాయి.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు b లు రెండూ అసత్యమే
జవాబు:
A) a మరియు b లు రెండూ సత్యమే
50. క్రింది ప్రవచనాలను చదవండి.
a) గరుకుతలం గల అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది.
b) రాబర్ట్ బ్రౌన్ 1835లో కేంద్రకాన్ని కనుగొన్నాడు.
A) a మరియు b లు రెండూ సత్యమే
B) a సత్యము మరియు b అసత్యము
C) b సత్యము మరియు a అసత్యము
D) a మరియు bలు రెండూ అసత్యమే
జవాబు:
B) a సత్యము మరియు b అసత్యము
51. సరిగా జతపరచబడిన జతను కనుగొనండి.
a) పత్రరంధ్రాలు – వాయువుల మార్పిడి
b) ల్యూకోప్లాస్టు – పిండి పదార్థాల నిల్వ
c) గాల్జీ సంక్లిష్ట పదార్థం – ప్రొటీన్ల నిల్వ
A) a మరియు b
B) b మరియు c
C) a మాత్రమే
D) b మాత్రమే
జవాబు:
D) b మాత్రమే
52. క్రింది ప్రవచనాలను చదవండి.
a) కణ కవచము సెల్యులోజ్ తో నిర్మితమై, నిష్క్రియాత్మకంగా ఉంటుంది.
b) ప్లాస్మాపొర ప్రొటీన్లు, లిపిడ్లతో నిర్మితమై యుండి, క్రియాత్మకంగా ఉంటుంది.
A) a, bలు రెండూ సత్యమే
B) a, b లు రెండూ అసత్యము
C) a అసత్యము b సత్యము
D) b అసత్యము a సత్యము
జవాబు:
C) a అసత్యము b సత్యము
53. క్లోరోప్లాస్లు ఎక్కువగా కలిగిన మొక్కలు
A) ఆల్గే
B) ఫంగి
C) బాక్టీరియా
D) ఏదీకాదు
జవాబు:
A) ఆల్గే
54. రియోపత్రంలోని కణాల అమరిక
A) వృత్తాకారంగా
B) వరుసలలో
C) క్రమరహితంగా
D) లంబాకారంగా
జవాబు:
A) వృత్తాకారంగా
55. బుగ్గ కణాల మధ్య భాగంలో కనబడే భాగం
A) మైటోకాండ్రియా
B) గాల్టీ
C) కేంద్రకం
D) రైబోజోములు
జవాబు:
C) కేంద్రకం
56. బుగ్గ కణాలలో కేంద్రకాన్ని పరిశీలించడానికి ఉపయోగించే రంజకము
A) సాఫనిన్
B) మిథైల్ బ్లూ
C) నల్ల రంజకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
57. మైటోకాండ్రియాను, సూక్ష్మదర్శిని క్రింద పరిశీలించునపుడు ఉపయోగించే ద్రావణం
A) జానస్ గ్రీన్-బి
B) సాఫ్రనిన్
C) గ్లిజరిన్
D) మిథైల్ బ్లూ
జవాబు:
A) జానస్ గ్రీన్-బి
58. కేంద్రకాన్ని పరిశీలించడానికి మీ తరగతి గదిలో వాడేరంజకము
A) ఫినాఫ్తలీన్
B) మిథైల్ బ్లూ
C) ఆల్కహాల్
D) గ్లిజరిన్
జవాబు:
B) మిథైల్ బ్లూ
59. ఎర్ర రక్తకణాల జీవిత కాలం తక్కువగా ఉండటానికి గల కారణం
A) హిమోగ్లోబిన్ ఉండటం వలన
B) కేంద్రకం ఉండటం వలన
C) కేంద్రకం లేకపోవటం వలన
D) కేంద్రకాంశం ఉండటం వలన
D) పైవేవీ కావు
జవాబు:
C) కేంద్రకం లేకపోవటం వలన
60. వివిధ రకాల పదార్థాలు కణం యొక్క ఈ భాగంలో నిల్వ ఉంటాయి.
A) కేంద్రకం
B) మైటోకాండ్రియా
C) గాల్జీ సంక్లిష్టం
D) ప్లాస్టిట్లు
జవాబు:
C) గాల్జీ సంక్లిష్టం
61. శక్తిని ఉత్పత్తి చేసి, నిల్వచేసే కణాంగము
A) గాల్టీ సంక్లిష్టం
B) మైటోకాండ్రియా
C) కేంద్రకం
D) ప్లాస్టిడ్లు
జవాబు:
B) మైటోకాండ్రియా
62. టమోటాలలో రంగు మార్పులకు (ఆకుపచ్చ – తెలుపు – పసుపు – ఎరుపు) కారణమైనది
A) అంతర్జీవ ద్రవ్యజాలం
B) ప్లాస్టిడ్లు
C) కేంద్రకము
D) కణత్వచము
జవాబు:
B) ప్లాస్టిడ్లు
63. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు
a) మాథియస్ జాకబ్ ప్లీడన్
b) థియోడర్ ష్వాన్
c) రూడాల్ఫ్ విర్కోవ్
A) a మరియు b
B) b మరియు c
C) a మరియు c
D) a, b మరియు c
జవాబు:
A) a మరియు b
64. పటంలో గుర్తించిన భాగం
A) హరితరేణువు
B) రంధ్రము
C) కేంద్రకము
D) రక్షక కణం
జవాబు:
D) రక్షక కణం
65. ఇచ్చిన చిత్రం పేరు
A) జంతు కణం
B) వృక్ష కణం
C) హరితరేణువు
D) అంతర్జీవ ద్రవ్యజాలం
జవాబు:
A) జంతు కణం
66. పటంలో సూచించిన కణాంగము పేరు
A) మైటోకాండ్రియా
B) కేంద్రకం
C) గాల్టీ
D) హరితరేణువు
జవాబు:
D) హరితరేణువు
67. చిత్రంలో గుర్తించిన భాగం
A) కేంద్రకం
B) కేంద్రకాంశం
C) DNA
D) RNA
జవాబు:
B) కేంద్రకాంశం
68. పటంలో సూచించిన కణాంగం పేరు
A) హరితరేణువు
B) గాల్జీ సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా
69. ఈ కణాంగాన్ని గుర్తించండి.
A) గాల్జీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
A) గాల్జీ సంక్లిష్టం
70. ఈ కణాంగాన్ని గుర్తించండి.
A) గాలీ సంక్లిష్టం
B) అంతర్జీవ ద్రవ్యజాలం
C) లైసోసోమ్లు
D) కేంద్రకం
జవాబు:
B) అంతర్జీవ ద్రవ్యజాలం
71. సరియైన క్రమంలో అమర్చండి.
A) కణజాలం – జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణములు
B) జీవులు – అవయవము – అవయవ వ్యవస్థ – కణజాలం – కణములు
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు
D) పైవేవీ కావు
జవాబు:
C) కణములు – కణజాలం – అవయవాలు – అవయవ వ్యవస్థ – జీవులు
72. జీవులలో కణం ఒక
A) క్రియాత్మక ప్రమాణం
B) నిర్మాణాత్మక ప్రమాణం
C) స్వతంత్రంగా పనిచేసే నిర్మాణం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
73. నేను పత్రరంధ్రాలను అభినందిస్తాను. ఎందుకంటే అవి ఈ క్రియకు సహాయపడతాయి.
A) కిరణజన్య సంయోగక్రియ
B) శ్వాసక్రియ
C) బాష్పోత్సేకం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
74. వృక్షాలలో కణకవచం యొక్క విధి
A) క్రియాత్మకంగా ఉంటుంది
B) రక్షిస్తుంది
C) పీడనాన్ని కలిగిస్తుంది.
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
75. శక్తిని విడుదల చేయు కణాంగం
A) లైసోజోమ్ లు
B) గాల్జి సంక్లిష్టం
C) అంతర్జీవ ద్రవ్యజాలకం
D) మైటోకాండ్రియా
జవాబు:
D) మైటోకాండ్రియా
76. మైక్రోస్కోప్ ని ఉపయోగించి వృక్ష కణంలో రిక్తికను పరిశీలించాలంటే నీవు చేసే పనులు క్రమాన్ని గుర్తించండి.
1) గాజు స్లెడ్ పై వుంచుట
2) రసభరితమైన మొక్క కాండమును సేకరించుట
3) సజల సాఫ్టనిస్ ద్రావణంతో రంజనం చేయుట
4) సన్నని పొరలుగా చేయుట
A) 2, 4, 3, 1
B) 1, 2, 3, 4
C) 2, 3, 4, 1
D) 4, 3, 1, 2
జవాబు:
A) 2, 4, 3, 1
77. కింది వాటిలో ఏ కణాంగంపై, జీవులన్నీ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆహారం కొరకు ఆధారపడుతాయి.
A) లైసోజోమ్స్
B) మైటోకాండ్రియా
C) రైబోజోమ్స్
D) హరితరేణువులు
జవాబు:
D) హరితరేణువులు
78. క్రింది వానిలో తప్పును గుర్తించండి.
i) ప్రతికణం అదే కణం నుంచి ఏర్పడును.
ii) రిక్తికలు కణశక్త్యాగారాలు
iii) కేంద్రక పూర్వక కణాలలో కేంద్రక త్వచం ఉంటుంది.
A) i, ii
B) ii, iii
C) i, ii, iii
D) i, iii
జవాబు:
B) ii, iii
79. స్వయంపోషకాల విషయంలో సరియైనది
A) సూర్యకాంతిని ఉపయోగించి యాంత్రిక శక్తిని పొందుతాయి
B) ఇతర జీవులలోని గ్లెకోజనను పోషకంగా తీసుకుంటాయి
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి
D) అన్నీ సరైనవే
జవాబు:
C) సూర్యకాంతిని రసాయన శక్తిగా మార్చి ఆహారం పొందుతాయి
80. మైటోకాండ్రియా పరిశీలనకు వాడే రంజకం పేరు
A) సఫ్రానిన్
B) జానస్ గ్రీన్-బి
C) జానస్ గ్రీన్-ఎ
D) క్రిస్టల్ వైలెట్
జవాబు:
B) జానస్ గ్రీన్-బి
మీకు తెలుసా?
కణాలలో కొన్ని కణాంగాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఉదాహరణకి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కణాలలో 50-200 క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి.
పునరాలోచన