SCERT AP 9th Class Biology Study Material Pdf Download 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Questions and Answers.
AP State Syllabus 9th Class Biology 9th Lesson Questions and Answers వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
జీవులలో అనుకూలనాలు అంటే ఏమిటి? అనుకూలన యొక్క ఆవశ్యకత ఏమిటి? (AS 1)
జవాబు:
- వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.
- అనుకూలనాలు ఒక జనాభాలో కనపడే సాధారణ లక్షణం. ఎందుకంటే ఇవి జీవులకు మనుగడ సాగించడానికి పురోగతి చూపుతాయి.
- ఆవరణ వ్యవస్థలలో జరిగే ప్రస్ఫుట, వైవిధ్య మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలు చూపాలి.
ప్రశ్న 2.
రెందు ఉదాహరణలిస్తూ జీవులు ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు ఎలా ఏర్పరచుకున్నాయో వివరించండి. (AS 1)
జవాబు:
- మడ అడవులు తడి మరియు లవణీయత అధికంగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి.
- వీటి వేర్ల నుండి శ్వాసరంధ్రాలు అనే వింతైన భాగాలు అభివృద్ధి చెందుతాయి.
- ఈ భాగాలు ఉపరితలం దగ్గర పెరిగే పార్శ్వ వేర్ల నుండి, నేల నుండి బయటకు పొడుచుకుని వస్తాయి. ఇవి దాదాపుగా 12 అంగుళాల పొడవు ఉంటాయి.
- నీటి పరిసరాలలో పెరిగే ఈ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి.
- మరియొక ఉదాహరణ కలబంద మొక్కల్లో పత్రాలు ముండ్లుగా మార్పు చెందుటవలన బాష్పోత్సేకం ద్వారా నీరు వృథా కాదు.
- కాండంలోని కణజాలం నీటిని నిలువ చేసి రసభరితంగా ఉంటాయి.
- ఈ మార్పు ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినపుడు మొక్కలు వాటిని తట్టుకొని జీవించగలవు.
- ఇలాంటి పరిస్థితులు ఎడారి ప్రాంతాలలో కనబడతాయి.
ప్రశ్న 3.
క్రింది జీవులలో కనిపించే ప్రత్యేక అనుకూలనాలు ఏవి? (AS 1)
ఎ. మడ అడవుల చెట్లు బి. ఒంటె సి. చేప ది. డాల్సిన్ ఇ. ఫ్లవకాలు
జవాబు:
ఎ. మడ అడవుల చెట్లు:
- మడ అడవులు తడి, ఉప్పు నీటి సమస్యను ఎదుర్కొనడానికి చిత్రమైన మార్గాలు అవలంబిస్తాయి.
- వీటి పార్శ్వపు వేర్లనుండి శ్వాసరంధ్రాలు అనే భాగాలు అభివృద్ధి చెందుతాయి.
- ఈ భాగాలు నేల నుండి దాదాపుగా 12 అంగుళాలు పొడవు ఉంటాయి.
- నీటి పరిసరాలలో పెరిగే ఈ మొక్కలు వేర్ల ద్వారా శ్వాసక్రియ జరుగుటకు మడ అడవుల చెట్లు తోడ్పడతాయని భావిస్తారు.
బి. ఒంటె:
- ఒంటె మోపురం కొవ్వును తదుపరి అవసరాల కోసం నిల్వచేస్తుంది.
- పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక, దుమ్ము నుండి రక్షిస్తాయి.
- నాశికారంధ్రాలు స్వేచ్చాయుతంగా మూసుకోవటం వలన వీచే ఇసుక నుండి రక్షణ పొందుతుంది.
- పొడవైన కాళ్ళు వేడెక్కిన ఇసుకనేల నుండి శరీరాన్ని దూరంగా ఉంచుతాయి.
సి. చేప :
- చేప శరీరం పొలుసులచే కప్పబడి ఉంటుంది.
- చేపలు నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి.
- చేపలలో ఫోటర్స్ అనే గాలితిత్తులు ఉండడం వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగలుగుతున్నాయి.
- మొప్పల ద్వారా చేపలు శ్వాసిస్తాయి.
డి. డాల్ఫిన్ :
- చర్మం క్రింద మందపాటి కొవ్వుపొర, చలి నుండి రక్షిస్తుంది.
- ఈదటానికి ఈత తిత్తి తోడ్పడుతుంది.
- ఫ్లోటర్స్ అనే గాలితిత్తుల వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగల్గును.
ఇ. ప్లవకాలు :
- నీటిపై తేలియాడే మొక్కలు ప్లవకాలు. ఇవి అతి సూక్ష్మమైనవి.
- కిరణజన్య సంయోగక్రియ జరిపే ప్లవకాలు కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలతాయి.
ప్రశ్న 4.
యూఫోటిక్ మండలంలోని జీవి అబైసల్ మండలంలో జీవించాలంటే కావలసిన అనుకూలనాలు ఏవి? (AS 1)
జవాబు:
అబైసల్ మండలంలో జీవించడానికి కావలసిన అనుకూలనాలు :
- భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పళ్ళు ఉండాలి.
- అస్థిపంజరం ఉండకుండా, బల్లపరుపు శరీరాలు ఉండాలి.
- పొట్ట కింద, కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వభాగాలలో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉండాలి.
- జీవులు చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనబడాలి.
ప్రశ్న 5.
సముద్ర నీటి చేపలు మంచినీటి చేపల కన్నా ఎక్కువగా నీరు తీసుకుంటాయి. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు? (AS 1)
జవాబు:
- అవును. సముద్రపు నీటి చేపలు మంచినీటి చేపల కన్నా ఎక్కువగా నీరు తీసుకుంటాయి.
- సముద్రంలోని చేపల శరీరంలోని లవణీయత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువ ఉంటుంది.
- కావున ద్రవాభిసరణం ద్వారా కోల్పోయిన నీటి కొరతను పూరించడానికి అధిక పరిమాణంలో నీరు గ్రహిస్తాయి.
- నీటిలోని లవణాలను మూత్రపిండాలు మరియు మొప్పలలోని ప్రత్యేక కణాల ద్వారా విసర్జిస్తాయి.
ప్రశ్న 6.
కొలను/ సరస్సులోని జీవులపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని, వాటి అనుకూలనాలను పట్టికలో వివరించండి. (AS 1)
జవాబు:
- వేసవిలో లోతైన సరస్సు, కొలనులలో ఉపరితల నీటి భాగం వేడెక్కుతుంది. లోతైన భాగాలు చల్లగా ఉంటాయి.
- అందువలన జీవులు పగటిపూట నీటి లోతునకు,రాత్రి నందు నీటి ఉపరితలానికి వస్తాయి.
- ఉష్ణమండల ప్రాంతాలలో వేసవిలో నీరు వేడెక్కి ఆవిరి అవుతుంది. తద్వారా నీటి యొక్క లవణీయత పెరుగుతుంది.
- ఆక్సిజన్ సాంద్రత మరియు లభ్యమయ్యే ఆహార పరిమాణం తగ్గుతుంది.
- శీతల ప్రాంతాలలో నీటి ఉపరితలం గడ్డకట్టుకుపోతుంది. ఈ కాలంలో జంతువులు సరస్సు నందు నీరు గడ్డకట్టని ప్రదేశంలో జీవిస్తాయి.
- శీతాకాలంలో కొలను మొత్తం గడ్డకట్టుకుపోతుంది. తద్వారా దానిలో ఉండే జీవులన్నీ మరణిస్తాయి.
- నీటిలో నివసించే జీవులు అధిక ఉష్ణోగ్రతను మరియు అధిక శీతలాన్ని తట్టుకోవడానికి గ్రీష్మకాల సుప్తావస్థ మరియు శీతాకాల సుప్తావస్థను అవలంబిస్తాయి.
ప్రశ్న 7.
మడ అడవుల ఆవరణ వ్యవస్థ మీరు చదివిన సముద్ర ఆవరణ వ్యవస్థ కంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది? (AS 1)
జవాబు:
- మన దేశం మడ అడవుల పరిమాణంలో కోరింగ మడ ఆవరణ వ్యవస్థ రెండవ స్థానంలో ఉంది.
- కాకినాడకు 20 కి.మీ. దూరంలో ఉన్న మడ అడవుల ఆవరణ వ్యవస్థ అనేక రకాల మొక్కలకు మరియు జంతువులకు ప్రసిద్ధమైనది.
- మడ అడవులు నివసించే ప్రదేశపు పరిస్థితులకు అనుకూలనాలు చూపిస్తాయి.
- లవణీయతను తట్టుకొని నిలబడగలిగే అనేకమైన మొక్క జాతులు అనగా రైజోపొర, అవిసీనియా, సొన్నరేట ఏజిసిరాకు నిలయం కోరింగ మడ అడవులు.
- అనేకమైన పొదలు మరియు గుల్మములు మడ అడవుల ఆవరణ వ్యవస్థలో ఉంటాయి.
- పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సముద్రతీర ప్రాంతములలో విస్తారమైన మరియు అధిక ఉత్పత్తిని ఇచ్చే అడవులను మడ అడవులు ఏర్పరుస్తాయి.
- ఏ ఇతర ప్రదేశాల్లో నివసించలేని మొక్కలు మరియు జంతు జాతులు మడ అడవులలో ఉంటాయి.
- ఉష్ణమండల మరియు సమశీతోష్ణ మండలములలో లవణీయతను తట్టుకొని నిలబడగలిగే అడవులు మడఅడవులు.
ప్రశ్న 8.
అత్యల్ప చలి, అధిక వేడి నుండి కప్ప ఎలా రక్షించుకుంటుంది? (AS 1)
జవాబు:
- కప్ప లాంటి ఉభయచరాలు కాలాన్ని బట్టి అనుకూలనాలు చూపిస్తాయి.
- అత్యుష్ఠ, అతిశీతల పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి నేలలో లోతైన బొరియలు చేసుకొని వాటిలో గడుపుతాయి.
- అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు కదలక నిశ్చలంగా అందులోనే ఉంటాయి.
- ఈ కాలంలో జీవక్రియల రేటు తగ్గి జంతువు దాదాపుగా స్పృహలేని నిద్రావస్థకు చేరుకుంటుంది.
- దీనినే శీతాకాల సుప్తావస్థ లేదా గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు.
ప్రశ్న 9.
కొర్రమట్ట (మరల్) మరియు రొహూ చేపలు నదుల్లో ఉంటాయి. అవి కోరింగ ఆవరణ వ్యవస్థలో జీవించగలవా? ఎందుకో ఊహించండి. (AS 2)
జవాబు:
- అవును. కొర్రమట్ట మరియు రొహూ చేపలు కోరింగ ఆవరణ వ్యవస్థలో జీవించగలవు.
- ఎందువల్లనంటే కోరింగ ఆవరణ వ్యవస్థలోనికి కోరింగ, గాచేరు మరియు గౌతమి, గోదావరి ఉపనదులు ప్రవహిస్తాయి.
- కోరింగ ఆవరణ వ్యవస్థలో లవణీయత పెరిగినట్లయితే మంచినీటి చేప శరీరములోనికి నీరు ప్రవేశిస్తుంది.
- చేప శరీరములోనికి ప్రవేశించిన నీటిని మూత్రము ద్వారా విసర్జించవచ్చు.
- కానీ శరీరములో లవణ సమతుల్యతను ఉంచడానికి మంచినీటి చేప మూత్రపిండాలు మరియు మొప్పలలో ఉండే లవణగ్రాహక కణాలచే లవణాలను తిరిగి గ్రహిస్తుంది.
ప్రశ్న 10.
కొన్ని నీటి మొక్కలను సేకరించి వాటి కాండాలు, ఆకులు స్లెదు తయారు చేసి సూక్ష్మదర్శినిలో పరిశీలించి మీ పరిశీలనలు నమోదు చేయండి. (ఉదా : గాలి గదులు ఉన్నాయి/లేవు మొదలైనవి) ఇప్పుడు కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. (AS 3)
ఎ) అవి నీటిపై ఎందుకు తేలుతాయి?
బి) అవి తేలడానికి ఏవి సహాయపడతాయి?
సి) సూక్ష్మదర్శినిలో గమనించిన భాగాల పటాలు గీయండి. (AS 5)
జవాబు:
ఎ) శరీర భాగాల్లో గాలి గదులు ఉండుట వలన
బి) తేలడానికి గాలితో నిండిన గాలిగదులు సహాయపడతాయి.
సి) సూక్ష్మదర్శినిలో గమనించిన భాగాల పటాలు
ప్రశ్న 11.
సమీపంలోని చెరువు కుంటను సందర్శించి మీరు గమనించిన జీవులు, వాటిలోని అనుకూలనాల జాబితాను తయారు చేయండి. (AS 4)
జవాబు:
- చెరువు ఒడ్డున తక్కువ లోతుగల భాగాన్ని లిటోరల్ మండలం అంటారు.
- చెరువు ఒడున వెచ్చగా ఉండే పై భాగంలో నత్తలు, చేపలు, ఉభయచరాలు, తూనీగ గుడ్లు, లార్వాలు ఉన్నాయి.
- తాబేళ్ళు, పాములు, బాతులు భక్షకాలుగా జీవిస్తాయి. నాచు, బురద తామర, వాలిస్ నేరియా, హైడ్రిల్లా ఉన్నాయి.
- ఈ మండలంలో అనేక జీవులు అభివృద్ధి చెందిన దృష్టిజ్ఞానం కలిగి ఉంటాయి.
- ఈ మండలంలో వేగంగా ఈదగలిగే జీవులు, తక్కువ రంగు గల బూడిద వర్గం శరీరం గల జీవులు ఉన్నాయి.
- లిమ్నెటిక్ మండలంలో డాప్సియా, సైక్లాప్స్, చిన్ని ప్రింప్ చేపలు ఉన్నాయి. అంతర తామర, గుర్రపుడెక్క, బుడగ తామర, శైవలాలు ఉన్నాయి.
- చేపలు పరిసరాలలో కలసిపోయే విధంగా ప్రకాశవంతంగా ఉండే బూడిద వర్ణం, వెండి – నలుపు రంగు కలిగిన పొలుసులు ఉంటాయి.
- మొక్కలలో గాలి గదులు, ఆకుల పైన మైనం పూత ఉంటుంది.
- ప్రొఫండల్ మండలంలో రొయ్యలు, పీతలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్ళు ఉన్నాయి.
- ఇవి నీటి అడుగు భాగానికి చేరే మృత జంతువులను భక్షించడానికి అనువుగా పెద్దనోరు, వాడియైన దంతాలను కలిగి ఉంటాయి.
ప్రశ్న 12.
ఇంటర్నెట్ నుండి ఒక సరస్సు యొక్క సమాచారాన్ని సేకరించి వివిధ మండలాల్లోని జీవులు, వాటిలో కనబడే అనుకూలనాల పట్టికను తయారుచేయండి. (AS 4)
జవాబు:
మండలం | మండలంలోని జీవులు | అనుకూలనాలు |
లిటోరల్ మండలం | నత్తలు, రొయ్యలు, చేపలు, ఉభయచరాలు, నాచులు, బురద తామరలు,వాలి నేరియా, హైడ్రిల్లా మొక్కలు. భక్షకాలు అయిన తాబేళ్లు, పాములు, బాతులు ఉంటాయి. | అభివృద్ధి చెందిన దృష్టి జ్ఞానం కలవి. వేగంగా ఈదుతాయి. మొక్కలలో గాలిగదులు, ఆకులపై మైనంపూత ఉంటాయి. నేలమీద నీటిలో నివసించగలిగిన జంతువులు ఉంటాయి. |
లిమ్నెటిక్ మండలం | మంచినీటి చేపలు, దాప్నియా, సైక్లాప్స్, చిన్ని ఫ్రింప్ చేపలు, నీటిపై తేలే గుర్రపు డెక్క, అంతర తామర, బుడగ తామర, శైవలాలు. | నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు , నీటిలో వివిధ స్థాయిలలో తేలడానికి ఫోటర్స్ అనే గాలితిత్తులు, గాలిగదులు, ఆకులపై మైనం పూత. |
ప్రొఫండల్ మండలం | రొయ్యలు, పీతలు, ఈల్ వంటి చేపలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్ళు. | మృత జంతువులను భక్షించుటకు వీలుగా అనుకూలనాలు కలిగి ఉంటాయి. |
ప్రశ్న 13.
బంగాళాఖాతంలోని కోరింగ ఆవరణ వ్యవస్థలో ఏవైనా నదులు కలుస్తున్నాయా? వాటి సమాచారం సేకరించండి. (AS 4)
జవాబు:
కోరింగ ఆవరణ వ్యవస్థలోనికి కోరింగ నది, గాదేరు నది మరియు గౌతమి, గోదావరి నదుల ఉపనదులు కలుస్తున్నాయి.
ప్రశ్న 14.
సరస్సు పటం గీచి, వివిధ మండలాలను గుర్తించండి. ఆ మండలాలను అలా ఎందుకు పిలుస్తారో తెల్పండి. (AS 5)
జవాబు:
సరస్సు ఆవరణ వ్యవస్థ మండలాలు :
1. లిట్టోరల్ మండలం 2. లిమ్నెటిక్ మండలం 3. ప్రొఫండల్ మండలం
లిటోరల్ మండలం :
సరస్సు ఒడ్డున తక్కువ లోతుగల భాగం. కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ జరిగే భాగం.
లిమ్నెటిక్ మండలం :
సరస్సు నీటి పై భాగం (ఉపరితలం) లో బయటకు కనిపించే భాగం. ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది.
ప్రొఫండల్ మండలం :
తక్కువ వెలుతురు కలిగి చల్లగా ఉండే ప్రదేశం. ఎక్కువ లోతుగల సరస్సు అడుగుభాగం.
ప్రశ్న 15.
భూమిపై గల అద్భుతమైన జీవులు ఉభయచరాలు. వాటి అనుకూలనాలను మీరు ఎలా ప్రశంసిస్తారు? (AS 6)
జవాబు:
- మెడలేని, నడుము చిన్నదిగా ఉన్న ఉభయచర జీవి శరీర ఆకారం ఈదడానికి అనుకూలమైనది.
- తడిగా ఉన్న పలుచని చర్మము, చర్మ శ్వాసక్రియనందు వాయువుల మార్పిడికి ఎంతో అనుకూలమైనది.
- ముందరి కాళ్ళు శరీరపు ముందు భాగమును, నేలను తాకకుండా చేస్తాయి.
- వెనుకకాళ్ళు ఎక్కువ దూరం గెంతడానికి, దిశ మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.
- తల పై భాగం మీద కళ్ళు అమరియుండుటవలన తన ముందు ఎక్కువ ప్రదేశమును చూడగలుగుట ద్వారా శత్రువు గమనమును అంచనా వేయవచ్చు.
- నోరు వెడల్పుగా, పెద్దదిగా ఉండుట వలన ఆహారమును పట్టుకోవడానికి, తినడానికి అనుకూలం.
- నోటి ముందటి భాగములో నాలుక ఉండుట వలన దాడికి గురైన ఆహారము అతుక్కుంటుంది.
- కప్ప డిపోల్ లార్వాగా నీటిలో జీవనం గడుపుతుంది. మొప్పల సహాయంతో గాలి పీలుస్తుంది.
- లార్వా పెద్దదై కప్పగా మారినప్పుడు మొప్పల స్థానంలో ఊపిరితిత్తులు ఏర్పడి నేలమీద కూడా శ్వాసించడానికి వీలవుతుంది.
- ఈ విధముగా కప్ప యొక్క శరీరము నేల మరియు నీటిలో జీవించడానికి అనువుగా ఉంది. ఉభయచర జీవులకు ఉన్న జీవన సౌలభ్యము మరి ఏ ఇతర జీవులలో మనము చూడము.
ప్రశ్న 16.
‘గులకరాళ్ళ మొక్కలు’ శత్రువుల బారి నుండి తమను తాము రక్షించుకునే విధానాన్ని నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS 6)
జవాబు:
- గులకరాళ్ళ మొక్కలు శత్రువుల బారి నుండి అద్భుతమైన అనుకూలనాలతో తమను తాము రక్షించుకుంటాయి.
- వీటిని జీవం గల రాళ్ళు అంటారు. వాస్తవానికి ఇవి రాళ్ళు కావు.
- ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిలువ చేస్తాయి.
- వాస్తవానికి ప్రతి గులకరాయి ఒక పత్రం. సూర్యరశ్మి పత్రంలోనికి ప్రవేశించడానికి వీలుగా కోసిన కిటికీలాంటి భాగాన్ని కలిగి ఉంటుంది.
- రాతిలా కనబడడం వలన జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలేస్తాయి.
- ఇలా మొక్క రక్షించబడుతుంది. గులకరాళ్ళ మొక్కలు తమను తాము రక్షించుకునే విధము అభినందనీయము.
ప్రశ్న 17.
కొన్ని మొక్కలు, జంతువులు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే జీవిస్తాయి. ఈ రోజుల్లో మానవ చర్యల మూలంగా ఈ పరిస్థితులు నాశనం అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? (AS 7)
జవాబు:
- మానవ కార్యకలాపాల వలన మొక్కలు, జంతువులు నాశనం కావటం వాస్తవం.
- మానవుడు చేసే వివిధ కార్యకలాపాలు అనగా అడవులను నరకడం, పశువులను మేపడం, అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, వేటాడటం, విచక్షణా రహితంగా జంతు పదార్థాల కోసం జంతువులను చంపటం మరియు కాలుష్యము వలన మొక్కల మరియు జంతువుల యొక్క మనుగడ కష్టసాధ్యమవుతున్నది.
- సరియైన నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే భూగోళం నుండి మొక్కలు మరియు జంతువులు అదృశ్యం కావచ్చు.
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook InText Questions and Answers
9th Class Biology Textbook Page No. 137
ప్రశ్న 1.
రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి. ఇవి ఎందుకు ఇలా ఉంటాయి?
జవాబు:
- బయోఫిల్లమ్, కిత్తనారలు, రసభరిత పత్రాలు గల మొక్కలకు ఉదాహరణలు.
- ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, నీటిని జిగురు పదార్థ రూపంలో మొక్క భాగాలలో నిలువ చేస్తాయి.
- దాని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేళ్ళు కండరయుతంగా, రసభరితంగా ఉంటాయి.
- ఈ విధంగా నిలువచేసిన నీటిని నీరు దొరకని సమయంలో పొదుపుగా వాడుకుంటాయి.
ప్రశ్న 2.
ఎడారి మొక్కలకు వెడల్పైన ఆకులు ఉండవు ఎందుకు?
జవాబు:
- ఎడారి మొక్కలు నీటి కొరత బాగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి.
- వెడల్పైన ఆకులు ఉంటే బాష్పోత్సేకము ద్వారా ఎక్కువ మొత్తంలో నీటి నష్టం జరుగుతుంది.
- నీటి నష్టాన్ని నివారించడానికి ఎడారి మొక్కలలో ఆకులు చిన్నవిగా ఉంటాయి.
ప్రశ్న 3.
మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కిత్తనార అనే ఎడారి మొక్కలు పొలాల గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు. నిజానికి ఈ ప్రాంతాలు ఎదారులు కావు. మరి ఈ మొక్కలు అక్కడ ఎలా పెరుగుతాయి?
జవాబు:
- ఎడారులు కానప్పటికీ పొలాల గట్ల మీద వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కిత్తనార అనుకూలనాలు చూపిస్తుంది.
- ఎడారులు కానప్పటికీ ఈ రోజులలో కిత్తనార మన పరిసరాలలో కూడా పెరుగుతుంటాయి.
- ప్రకృతిలోని కిత్తనార వంటి మొక్కలు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులు ఏర్పరచుకుంటాయి.
9th Class Biology Textbook Page No. 138
ప్రశ్న 4.
ఎడారి పరిస్థితుల్లో జీవించే జంతువులన్నీ అనుకూలనాలు కలిగి ఉంటాయా?
జవాబు:
అవును. ఎడారి పరిస్థితుల్లో జీవించే జంతువులన్నీ అనుకూలనాలు కలిగి ఉంటాయి.
9th Class Biology Textbook Page No. 138
ప్రశ్న 5.
కొన్ని జంతువుల శరీరాలపై పొలుసులు ఎందుకు ఉంటాయి?
జవాబు:
- పొలుసులు వాతావరణం నుండి జంతువులను కాపాడతాయి.
- ఎడారి జంతువులలో చర్మం ద్వారా నీటి నష్టం జరగకుండా ఉండడానికి పొలుసులు ఉపయోగపడతాయి.
- పొలుసుల వలన నీటి నష్టం జరుగదు. తద్వారా జంతువుకు తక్కువ నీరు అవసరం అవుతుంది.
9th Class Biology Textbook Page No. 138
ప్రశ్న 6.
బొరియల్లో నివసించే జంతువులు సాధారణంగా రాత్రివేళల్లో ఎందుకు సంచరిస్తాయి?
జవాబు:
- పగటిపూట ఉండే అత్యధిక వేడిమి నుండి రక్షించుకోవడానికి బొరియల్లో నివసించే జంతువులు సాధారణంగా రాత్రి వేళల్లో తిరుగుతాయి.
- సాధారణంగా ఇవి నిశాచర జీవులు.
9th Class Biology Textbook Page No. 145
ప్రశ్న 7.
జెల్లి చేపలు, విచ్ఛిన్నకారులు ఈ రెండింటిలో యూఫోటిక్ మండలంలో ఉండే జీవి ఏది?
జవాబు:
జెల్లి చేపలు.
9th Class Biology Textbook Page No. 145
ప్రశ్న 8.
యూఫోటిక్ జోన్ జీవులలో ఎలాంటి అనుకూలనాలు కనిపిస్తాయి?
జవాబు:
- యూఫోటిక్ జోన్లో నివసించే జీవులు చాలా వరకు తేలేవి, ఈదేవి.
- ఈ మండల జీవులు మెరిసే శరీరాలు కలిగి ఉంటాయి.
- ఇవి కాంతిని పరావర్తనం చెందించి ప్రకాశవంతంగా ఉన్న నీటి ఉపరితలంలో కలిసిపోయే విధంగా చేస్తాయి లేదా పారదర్శకంగా ఉంటాయి.
- స్పష్టమైన దృష్టి కలిగి ఉంటాయి.
9th Class Biology Textbook Page No. 145
ప్రశ్న 9.
అబైసల్ జోన్ జీవులలో కనిపించే అనుకూలనాలు ఏవి?
జవాబు:
- భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పళ్ళు ఉంటాయి.
- ఈ జీవులలో అస్థిపంజరం ఉండక, బల్లపరుపు శరీరాలు ఉంటాయి.
- ఈ జీవులకు పొట్ట కింద, కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వభాగంలో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉంటాయి.
- కళ్ళు పనిచేయవు. మరికొన్ని జీవులకు చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
9th Class Biology Textbook Page No. 145
ప్రశ్న 10.
బెథియల్ జోన్ జీవులను యుఫోటిక్ (వెలుతురు గల) మరియు అబైసల్ (చీకటి) జోన్ జీవులతో పోల్చినపుడు కనపడే భేదాలేవి?
జవాబు:
- బెధియల్ మండలంలో ఎరుపు మరియు గోధుమ వర్ణపు గడ్డిజాతి మొక్కలు, సముద్రపు కలుపు స్పంజికలు ప్రవాళబిత్తికలు ఉంటాయి.
- స్థూపాకార నిర్మాణం గల స్క్విడ్లు, తిమింగలాలు వంటి జంతువులు ఉంటాయి.
- కొన్ని రకాల జంతువుల శరీరాలు బల్లపరుపుగా ఉంటాయి.
- కొన్నింటికి తక్కువ వెలుతురులో చూడడానికి వీలుగా సున్నితంగా ఉండే విశాలమైన పెద్ద కళ్ళు ఉంటాయి.
9th Class Biology Textbook Page No. 145
ప్రశ్న 11.
సముద్ర ఆవరణ వ్యవస్థలో జీవులు ఎందుకు అనుకూలనాలు కలిగి ఉంటాయి?
జవాబు:
- సముద్రములో ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా జీవులు అనుకూలనాలు కలిగి ఉంటాయి.
- సముద్రములో లోతు పెరిగే కొద్ది ఉత్పన్నమయ్యే పీడనాన్ని తట్టుకోవడానికి జీవులు అనుకూలనాలు కలిగి ఉంటాయి. ఊపిరితిత్తులను కుంచింపచేస్తాయి.
- సముద్రచరాలు వాటి శరీరంలో జరిగే మంచినీటి, ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. వీటికొరకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన మూత్రపిండాలు, మొప్పులు వంటి అవయవాలు సహాయపడతాయి.
- సముద్ర ఉపరితల, సముద్ర అడుగున ఉన్న నేలలోని ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తట్టుకోవడానికి అనుకూలనాలను ప్రదర్శిస్తాయి.
- సముద్రలోతుల్లో నివసించే జీవులు అధిక పీడనం, చలి, చీకటి, తక్కువ పోషకాల లభ్యత వంటి పరిస్థితులలో జీవించడానికి రకరకాల అనుకూలనాలు చూపుతాయి.
- జీవులు సముద్ర అలల తాకిడికి, కొట్టుకొనిపోకుండా మరియు ఎక్కువ దూరం ప్రయాణించడానికి, వైవిధ్యమైన వాతావరణంలో జీవించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి.
9th Class Biology Textbook Page No. 136
ప్రశ్న 12.
మనం ఆవాసం అని దేనిని అంటాం?
జవాబు:
జీవులు నివసించే ప్రదేశమును ఆవాసం అంటాం.
ప్రశ్న 13.
చెట్టు కేవలం కాకులకు మాత్రమే ఒక ఆవాసమా?
జవాబు:
కాదు, చెట్టు రకరకాలయిన పక్షులు, కీటకాలకు ఆవాసం.
9th Class Biology Textbook Page No. 136
ప్రశ్న 14.
ఆవాసం, ఆవరణ వ్యవస్థల మధ్య గల తేడా ఏమిటి? జీవులు ఆవాసంలో నివసిస్తాయా ? ఆవరణ వ్యవస్థలో నివసిస్తాయ?
జవాబు:
ఒక జీవి నివసించే ప్రదేశం ఆవాసం. దగ్గర సంబంధం కలిగిన రకరకాల జీవులు, నిర్జీవులు ఉండే ప్రదేశం ఆవరణ వ్యవస్థ. జీవులు ఆవరణ వ్యవస్థలో భాగమైన ఆవాసంలో జీవిస్తాయి.
9th Class Biology Textbook Page No. 137
ప్రశ్న 15.
అనుకూలనం అంటే ఏమిటి? మీ అభిప్రాయాన్ని వివరించండి.
జవాబు:
- వివిధ పరిస్థితులలో జీవించే జీవులు కొంతకాలం తరువాత వాటికి అనుకూలంగా మారతాయి లేదా అభివృద్ధి చెందుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అంటారు.
- ప్రకృతిలోని జీవులు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటాయి.
9th Class Biology Textbook Page No. 140
ప్రశ్న 16.
నీటిలో నివసించే కొన్ని జంతువులు మీకు తెలిసే ఉంటాయి. కొన్నింటిని మీరు రోజూ చూస్తూనే ఉంటారు. వాటికి నీటిలో నివసించడానికి ఏమైనా అనుకూల లక్షణాలు ఉంటాయా?
జవాబు:
- నీటిలో నివసించే జీవులు నీటిలో నివసించడానికి కావలసిన అనుకూల లక్షణాలు కలిగి ఉంటాయి.
- నీటిలో తేలియాడడానికి జీవుల శరీరంలో గాలి గదులు ఉంటాయి. ఇవి ఈదడానికి కూడా ఉపకరిస్తాయి.
- తాబేళ్ళు, చేపలు నీటిలో ఈదడానికి తెడ్ల వంటి వాజాలు అనే ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉన్నాయి.
- చేపలు, తాబేళ్ళ శరీరాల్లో ఫ్లోటర్స్ అనే గాలితిత్తులు ఉండడం వలన నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగలుగుతున్నాయి.
- ప్లవకాలు వంటి సూక్ష్మజీవులు శరీరాలలోని కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలుతాయి.
9th Class Biology Textbook Page No. 140
ప్రశ్న 17.
నీటి మొక్కలలో ఉండే మృదువైన కాండాలు వాటికి ఎలా ఉపయోగపడతాయి?
జవాబు:
- నీటి మొక్కలలో ఉండే మృదువైన కాండాలలో వాయుపూరిత మృదు కణజాలం ఉంటుంది.
- ఈ కణాల మధ్యలో వాయుగదులుంటాయి.
- ఇవి మొక్క నీటి మీద తేలడానికి ఉపయోగపడతాయి.
9th Class Biology Textbook Page No. 142
ప్రశ్న 18.
సహజీవనం, కోమోఫ్లాలను వివరించండి.
జవాబు:
సహజీవనం :
- రెండు వివిధ వర్గాల జీవులు కలిసి జీవిస్తూ పోషకాలను పరస్పరం మార్పిడి చేసుకుంటూ పరస్పరం లాభం చెందే విధానంను సహజీవన పోషణ అంటారు.
- ఇందులో ఒక జీవి తన సహజీవియైన మరియొక జీవికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
- రెండవ జీవి తన సహజీవికి నివాసాన్ని లేక పోషకాలని లేక రెండింటినీ అందిస్తుంది.
ఉదా : లెగ్యుమినేసి (చిక్కుడు జాతి) మొక్కల వేర్ల మీది బుడిపెలు. - ఇందులో మొక్కలు బాక్టీరియాకు ఆవాసాన్ని ఇస్తాయి. బాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు అందచేస్తాయి.
- సహజీవనంలో రెండు జీవులు లాభం పొందవచ్చు లేదా ఏదో ఒక జీవి మాత్రమే లాభం పొందవచ్చు.
కోమోఫ్లాజ్:
- పర్యావరణములోని మార్పులకు అనుగుణంగా జంతువులు వాటి యొక్క శరీరపు రంగును, ఆకారమును మార్చుకొనుటను కోమోప్లాజ్ అంటారు.
- సాధారణంగా భక్షక జీవి నుండి రక్షణ పొందుటకు జంతువులు శరీరపు రంగు, ఆకారమును మార్చుకుంటాయి.
ఉదా : ఊసరవెల్లి.
9th Class Biology Textbook Page No. 143
ప్రశ్న 19.
సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉన్న వివిధ మండలములను పేర్కొనండి. దానిలోని నిర్జీవ అంశాలను, ఉండే వివిధ రకాల జీవులను రాయండి. పట్టిక ఆధారంగా కింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ఎ) పటంలో కాంతి ప్రసారాన్ని బట్టి ఎన్ని మండలాలను చూడవచ్చు?
జవాబు:
మూడు మండలాలు.
బి) పట్టికలోని వివరాలను బట్టి ఎన్ని రకాల నిర్ణీవాంశాలను గురించి తెలుసుకోవచ్చు?
జవాబు:
మూడు నిర్జీవ అంశాలను గురించి తెలుసుకోవచ్చు.
సి) పటంలో చూపిన పరిస్థితులేగాక ఇంకేవైనా సముద్ర జీవుల అనుకూలనాలపై ప్రభావం చూపుతాయా?
జవాబు:
లవణీయత, ఆక్సిజన్, వర్షపాతం, గాలి, నేల, అలల వేగం, పి. హెచ్, పోషక పదార్థాలు, ఆర్థత మొదలైన అంశాలు ప్రభావం చూపుతాయి.
డి) లోతు పెరిగిన కొద్దీ ఉష్ణోగ్రత మరియు పీడనాల ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:
లోతు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. పీడనం పెరుగుతుంది.
ఇ) ఏ జోనులో ఎక్కువ జంతువులున్నాయి? ఎందుకో ఊహించండి.
జవాబు:
బెథియల్ మండలంలో ఎక్కువ జంతువులు ఉన్నాయి.
9th Class Biology Textbook Page No. 145
ప్రశ్న 20.
మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో గల పులికాట్ సరస్సు మంచినీటి ఆవరణ వ్యవస్థకు చెందినదా? అవునో కాదో కారణాలు తెలపండి.
జవాబు:
- నెల్లూరు జిల్లాలో గల పులికాట్ సరస్సు ఉప్పునీటి ఆవరణ వ్యవస్థకు చెందినది.
- సరస్సునందలి నీటి లవణీయత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సోడియమ్, పొటాషియంకు చెందిన లవణాలు అధిక మొత్తంలో ఉంటాయి.
9th Class Biology Textbook Page No. 147
ప్రశ్న 21.
కొలనుల సమీపంలో చుట్టూ నివసించే పక్షులకు కాళ్ళు, వేళ్ళ మధ్య ఒక పలుచని చర్మం ఎందుకు ఉంటుంది?
జవాబు:
కాలి వేళ్ళ మధ్య చర్మం ఉండడం వలన కొలనుల సమీపంలో నివసించే పక్షులు ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడుతుంది.
9th Class Biology Textbook Page No. 147
ప్రశ్న 22.
కొంగలకు పొడవైన కాళ్ళు మరియు పొడవైన ముక్కు ఎందుకుంటాయి?
జవాబు:
- నీటిలో నడిచే కొంగజాతి పక్షులు తమ సన్నని పొడవైన కాళ్ళతో లోతు తక్కువ గల కొలను మట్టిలో కీటకాల కోసం వెదుకుతూ జీవిస్తాయి.
- పొడవైన ముక్కు మట్టిని పెకిలించడానికి ఉపయోగపడుతుంది.
9th Class Biology Textbook Page No. 148
ప్రశ్న 23.
సముద్ర ఆవరణ వ్యవస్థలు మంచినీటి ఆవరణ వ్యవస్థల కంటే ఏ విధంగా భిన్నంగా ఉంటాయి?
జవాబు:
- సముద్ర ఆవరణ వ్యవస్థలందు నీటి లవణీయత 3.5% గా ఉంటుంది.
- సముద్ర ఆవరణ వ్యవస్థలు అతి పెద్దవిగా ఉంటాయి. భూఉపరితలం మీద మూడింట నాలుగు వంతులు ఆక్రమించి ఉంటాయి.
- మంచినీటి ఆవరణ వ్యవస్థల కంటే సముద్ర నీటి ఆవరణ వ్యవస్థలలో నివసించే జీవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటాయి.
9th Class Biology Textbook Page No. 148
ప్రశ్న 24.
సముద్ర ఆవరణ వ్యవస్థ కంటే భిన్నంగా ఉన్న మంచినీటి ఆవరణ వ్యవస్థలో కనిపించే రెండు అనుకూలనాల గురించి చెప్పండి.
జవాబు:
- మంచినీటి లవణీయత ఉప్పునీటి లవణీయత కంటే చాలా తక్కువగా ఉంటుంది.
- మంచినీటి ఆవరణ వ్యవస్థ ద్వారా సకల జీవకోటికి త్రాగటానికి కావలసిన నీరు దొరుకుతుంది.
9th Class Biology Textbook Page No. 148
ప్రశ్న 25.
కాంతి ప్రసారం ఆధారంగా, మంచి నీటి మరియు సముద్ర ఆవరణ వ్యవస్థలో కనబడే పోలికలేమిటి?
జవాబు:
1) కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర ఆవరణ వ్యవస్థను మూడు మండలాలుగా విభజించారు. అవి
- యుఫోటిక్ మండలం
- బెథియల్ మండలం
- అబైసల్ మండలం.
2) కాంతి ప్రసారం ఆధారంగా మంచినీటి ఆవరణ వ్యవస్థను మూడు మండలాలుగా విభజించారు. అవి
- లిటోరల్ మండలం
- లిమ్నెటిక్ మండలం
- ప్రొఫండల్ మండలం.
9th Class Biology Textbook Page No. 148
ప్రశ్న 26.
సముద్ర ఆవరణ వ్యవస్థతో పోల్చినపుడు మంచినీటి ఆవరణ వ్యవస్థలో కనిపించని మండలం ఏది?
జవాబు:
బెథియల్ మండలం సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉంటుంది. మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉండదు.
ప్రశ్న 27.
సముద్ర, మంచినీటి ఆవరణ వ్యవస్థలలో వివిధ రకాల అనుకూలనాలకు దారితీసే ప్రధాన కారకాలేవి?
జవాబు:
కాంతి, లవణీయత, ఆహారం, ఆక్సిజన్, లోతు, ఉష్ణోగ్రత, పీడనం మొదలైనవి సముద్ర, మంచినీటి ఆవరణ వ్యవస్థలలో వివిధ రకాల అనుకూలనాలకు దారితీసే ప్రధాన కారకాలు.
ప్రశ్న 28.
ప్రపంచమంతటా మొక్కలన్నీ ఒకే సమయంలో ఆకులు రాల్చుతాయా?
జవాబు:
- ప్రపంచమంతటా మొక్కలన్నీ ఒకే సమయంలో ఆకులు రాల్చవు.
- సమశీతోష్ణ ప్రాంతంలోని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చుతాయి.
- ఉష్ణమండలాల్లోని కొన్ని మొక్కలు వేసవి మొదలు కాకముందే ఆకులు రాల్చుతాయి.
9th Class Biology Textbook Page No. 149
ప్రశ్న 29.
ముళ్ళు గల పత్రాలు కూడా ఉష్ణోగ్రతలకు అనుకూలనాలేనా?
జవాబు:
కాదు. తమను భక్షించే జీవుల నుండి రక్షణ కొరకు ఎడారి మొక్కలు పత్రాలపై ముళ్ళను ఏర్పరచుకుంటాయి.
ప్రశ్న 30.
మంచు కురిసే సమయంలో వృక్షాలకు వెడల్పైన ఆకులుంటే ఏమవుతుంది?
జవాబు:
మంచు కురిసే సమయంలో వృక్షాలకు వెడల్పైన ఆకులుంటే ఆకులమీద మంచు పేరుకుపోయి ఆకులు, కొన్నిసార్లు శాఖలు కూడా విరుగుతాయి.
ప్రశ్న 31.
ధృవపు ఎలుగు శరీరంపై దళసరిగా బొచ్చు ఎందుకు ఉంటుంది?
జవాబు:
- శీతల ప్రాంతాలలో నివసించే జీవులు దళసరి బొచ్చుతో శరీరాలను కప్పి ఉంచుతాయి.
- బొచ్చు ఉష్ణబంధకంగా పనిచేస్తూ తమ శరీరాల నుండి ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తుంది.
9th Class Biology Textbook Page No. 149
ప్రశ్న 32.
సీల్ జంతువులకు దళసరి కొవ్వు ఉండే చర్మం శీతల వాతావరణం నుండి రక్షించడానికి ఏ విధంగా తోడ్పడుతుంది?
జవాబు:
- సీల్ జంతువులు చర్మాల కింద దళసరి కొవ్వు పొరను నిలువ చేసుకుంటాయి.
- కొవ్వుపొర శరీరానికి ఉష్ణ బంధకంలా సహాయపడుతూ ఉష్ణం, శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది.
9th Class Biology Textbook Page No. 150
ప్రశ్న 33.
వేసవి మరియు శీతాకాలపు సుప్తావస్థకు చెందిన సమాచారం సేకరించండి.
జవాబు:
వేసవికాల సుప్తావస్థ :
బాగా వేడిగా, పొడిగా ఉండే ప్రాంతాలలోని జీవులు అధిక ఉష్టాన్ని తప్పించుకోవటానికి నేలలో బొరియలు చేసుకొని జీవక్రియలను తగ్గించుకొని దీర్ఘకాలంపాటు నిద్రపోతాయి. దీనినే వేసవి నిద్ర లేదా వేసవి సుప్తావస్థ అంటారు.
ఉదా : కప్ప, నత్త.
శీతాకాల సుప్తావస్థ :
బాగా చలిగా ఉండే శీతల పరిస్థితులను తప్పించుకోవటానికి శీతల ప్రాంత జీవులు బొరియలు చేసుకొని దీరకాలంగా నిద్రపోతాయి. దీనినే శీతాకాల సుప్తావస్థ అంటారు. ఈ దశలో జీవక్రియలు కనిష్టస్థాయికి చేరుకుంటాయి. పరిసరాలు అనుకూలించినప్పుడు ఈ జీవులు సుప్తావస్ల నుండి మేల్కొంటాయి.
ఉదా : ధృవపు ఎలుగుబంటి, హెహగ్.
9th Class Biology 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
1. 1) కలబంద, లింగాక్షి మొక్కలను రెండు వేర్వేరు కుండీలలో తీసుకోవాలి.
2) ఒక్కో మొక్కకు 2 చెమ్చాల నీరు పోయాలి.
3) తరువాత రెండు రోజుల వరకు నీరు పోయకూడదు.
4) వారం రోజుల తరువాత మొక్కల పరిస్థితిని పరిశీలించాలి.
పరిశీలనలు
1) పెరుగుదల చూపిన మొక్క ఏది?
కలబంద పెరుగుదల చూపినది.
2. ముందుగా వాడిపోయిన మొక్క వీది? ఎందుకని?
ముందుగా వాడిపోయిన మొక్క లింగాక్షి. కొన్ని రకాల మొక్కలు నీరు లేకపోతే త్వరగా వాడిపోతాయి.
కృత్యం – 2
2. 1) నీటి కుంటలలో పెరిగే ఒక మొక్కను సేకరించాలి. (ఉదా : హైడ్రిల్లా, వాలిస్ నేరియా, డక్ వీడ్)
2) ఇంటికి తీసుకునిపోయి మట్టిలో నాటి నీరు పోయాలి.
పరిశీలనలు :
- మొక్క పెరుగుదలను చూపదు.
- పరిసరాలలోని పరిస్థితులకు అనుగుణంగా నీటి అవసరాలను బట్టి ఒక్కొక్కరకం అనుకూలనాలు చూపుతాయి.
- మొక్కలు ఒక్కొక్క ప్రాంతంలో జీవిస్తూ అక్కడి పరిస్థితులకు అనువుగా మారతాయి.
కృత్యం – 3
3. కొలను సమీపంలో మరియు చుట్టూ ఎన్నో జంతువులు నివసిస్తాయి. వాటిని వీలైతే దగ్గరగా పరిశీలించి శరీరం, కాళ్ళ లక్షణాల వివరాలు తెలిపే ఒక జాబితా తయారు చేయండి.
కొలను సమీపంలో నివసించే జంతువుల జాబితా :
కీటకాలు : దోమలు, డ్రాగన్ ఫ్రై, డామ్ సిప్లై, మేఫిక్స్, స్టోన్ ఫ్రై, డాబ్సోప్లై, కాడిస్ ప్లై, క్రేన్ ఫై, పేడపురుగు మొదలైనవి. |
క్రస్టేషియనులు : కేఫిష్, స్కడ్స్, రొయ్యలు |
మొలస్కా జీవులు : నత్తలు |
అనెలిడ జీవులు : జలగలు |
చేపలు : బ్లుగిల్, బాస్, కేట్ ఫిష్, స్కల్ఫిన్, విన్నో |
సరీసృపాలు : పాములు, తాబేళ్లు |
ఉభయజీవులు : కప్ప, పక్షులు, బాతులు, కొంగలు |
కొలను చుట్టూ సమీపంలో నివసించే కొన్ని జంతువుల శరీర మరియు కాళ్ళ లక్షణాలు :
1. దోమ :
శరీరం ఖండితమైనది. 3 జతల కాళ్ళు కలిగినది.
2. రొయ్యలు :
కొలను అడుగు భాగంలో నివసించేవి. రొమ్ము భాగమున 5 జతల కాళ్లు, ఉదర భాగమున 5 జతల కాళ్ళు ఈదుటకు ఉంటాయి. శరీరము ఖండితమైనది మరియు బాహ్య అస్థిపంజరము కలది.
3. నత్త :
మెత్తని శరీరము చుట్టూ గట్టిదైన రక్షణ కవచము గలది. చదునైన పాదము సహాయంతో నత్త పాకుతుంది.
4. బాతులు :
రెండు కాళ్ళు గలిగిన పక్షులు, కాలివేళ్ళ మధ్య చర్మం ఉండటం వలన ఈ జీవులు ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడతాయి.
5. కేఫిష్ :
నాలుగు కాళ్ళు కలిగిన మంచినీటి క్రస్టేషియన్. శరీరం ఖండితమైనది. తల, రొమ్ము భాగం కలిసి ఉంటుంది. దీనినుండి నాలుగు జతల కాళ్ళు ఏర్పడతాయి. ఉదర భాగమునకు నాలుగు జతల ఉపాంగాలు అతుక్కుని ఉంటాయి.
6. డ్రాగన్ ఫ్రై :
రెండు జతల పారదర్శక రెక్కలు ఉంటాయి. సాగదీయబడిన శరీరము గలది. మూడు జతల కాళ్ళు గలవు.
7. వానపాము :
ఖండితమైన శరీరము గలది. పొడవైన మెత్తటి శరీరము కలది. కాళ్ళులేని జీవి.
8. చేప :
మంచినీటి కొలనులో జీవించేది. మొప్పల సహాయంతో శ్వాసిస్తుంది. వాజాల సహాయంతో ఈదుతుంది.
9. గోల్డ్ ఫిష్ (గండు చేప) :
మంచినీటిలో నివసించే చేప. మొప్పల సహాయంతో శ్వాసిస్తుంది. ఎక్వేరియంలో ఉంచబడే చేప. వాజాల సహాయంతో ఈదుతుంది.
10. గోదురు కప్ప :
చర్మం పొడిగా ఉంటుంది. కాళ్లు పొట్టిగా ఉంటాయి. కాలివ్రేళ్ల మధ్య చర్మం ఉండుట వలన ఈదడానికి, నేలపై నడవడానికి సహాయపడతాయి. ఉభయచర జీవి.
11. జలగ :
శరీరం ఖండితమైనది. సక్కర్ల సహాయంతో రక్తాన్ని పీల్చుతుంది.